30, డిసెంబర్ 2019, సోమవారం

యువత మద్యం అతిగా త్రాగడం వాళ్ళు వచ్చే ఆరోగ్యం సమస్యలు


*మద్యం సేవించడం మరియు ధూమపానం ఆరోగ్యానికి హానికరం &అని తెలిసి కూడా మద్యం మనాలి అనుకొంటే ఎలా &రోజులు మద్యం త్రాగడం వాళ్ళు వచ్చి సమస్య అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహలు*

    యువత డిసెంబర్ 31 అని పేరు చెప్పి మితిమీరిన మద్యం కు ఎందుకు బానిస అవుతారంటే అది తాగగానే మనకు అది ఇచ్చే ఆహ్లాద భావన. ఆ ఆహ్లాదభావనను అలాగే కొనసాగించడం కోసం. కానీ ఆ ఆహ్లాద భావనే ప్రధాన సైడ్‌ఎఫెక్ట్‌గా మారి మనను అనేక రకాలుగా దెబ్బతీస్తుంది. తాగినవారికి తాత్కాలికంగానే హుషారు. ఆ తర్వాత వారి ఆరోగ్యం బేజారు. ఆల్కహాల్‌తో కలిగే అనర్థాల గురించి అవగాహన కోసమే ఈ కథనం.

మనం ఏదైనా ఆహారం తీసుకుంటే అది కడుపులోకి వెళ్లాక జీర్ణమయ్యాక రక్తంలో కలుస్తుంది. కానీ ఆల్కహాల్‌ తాగగానే మన నోటిలోని మ్యూకస్‌ పొరల నుంచే నేరుగా రక్తంలో కలవడం మొదలైపోతుంది. కడుపులోకి చేరిన మద్యం కూడా జీర్ణం కాదు. కడుపులోంచి 20 శాతం, మిగతా 80 శాతం చిన్నపేగుల నుంచి రక్తంలో కలవడం మొదలవుతుంది.

మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే...
మనం ఆల్కహాల్‌ తాగినప్పుడు అది కేవలం సెకన్ల వ్యవధిలో మెదడుకు చేరడం మొదలవుతుంది. మద్యం తాగడం మొదలుపెట్టాక కేవలం ఆరు నిమిషాల్లో మెదడు కణాల్లోకి వెళ్తుంది.

ఇక మద్యం ఏదైనప్పటికీ పులిసే క్రమంలో కొన్ని పదార్థాలు వెలువడతాయి. వాటిని ‘కంజీనర్స్‌’ అంటారు. ఆల్కహాల్‌ తాగినప్పుడు మనం ఒక పదార్థం తాలూకు అసలు రుచినీ, వాసననూ పసిగట్టలేం. రంగును
గుర్తించలేం. ఈ కంజీనర్స్‌ అనేవి రంగు, రుచి, వాసనలతో పాటు ఇంకా అనేక అంశాలను పసిగట్టనివ్వని విధంగా ఫిల్టర్స్‌లా పనిచేస్తాయి. దాంతో మనం స్పృహలో ఉన్నప్పుడు ఏమాత్రం ఇష్టపడనివీ, మనకు హాని చేసే పదార్థాలనూ తాగినప్పుడు నిస్సంకోచంగా తీసుకుంటూ ఉంటాం.

ఏయే మోతాదుల్లో ఏయే మార్పులు
హుషారుగా ఉండటానికి చేసే మద్యపానంతో అనేక అనర్థాలు సంభవిస్తాయి. మద్యం తాగినప్పుడు మొదటి 20 ఎం.ఎల్‌. పరిమాణం మెదడులో కలిగించే రసాయన మార్పులు మరింత మద్యం తీసుకునేలా ప్రేరేపిస్తాయి. ఎందుకంటే తొలి 20 ఎంఎల్‌.తో ఉద్వేగం, హుషారుగా అనిపించడం కాస్త దుడుకుతనం కలుగుతాయి. అదే హుషారును కొనసాగించడానికి వ్యక్తులు మద్యపానాన్ని కొనసాగిస్తారు. అయితే తొలుత చురుకుదనాన్ని కలిగించినట్లు అనిపించే అదే మద్యం కాస్తా 80 ఎం.ఎల్‌. మించగానే శరీరంలో కొన్ని మార్పులు కలిగిస్తుంది. అవి..

ఎన్ని విధాలా నష్టం అంటే  
మద్యం శరీరంలోని అన్ని అవయవాలపై తన దుష్ప్రభావం చూపుతుందని చెప్పుకున్నాం కదా. మన ఒంట్లో దాని వల్ల నష్టపోని వ్యవస్థలు, కీలక భాగాలు ఉండవంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు కొన్ని వాస్తవాలు
♦ జీర్ణకోశ వ్యవస్థ: మద్యం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. గ్యాస్ట్రయిటిస్, కడుపులో పేగులో పుండ్లు (అల్సర్స్‌), అరుగుదలలో లోపాలు, జీర్ణమైన ఆహారం ఒంటికి పట్టడంలో లోపాలు (మాల్‌ అబ్జార్‌ప్షన్‌ సిండ్రోమ్‌), క్యాన్సర్లు, హీమరాయిడ్స్, కాలేయం దెబ్బతినడం, పాంక్రియాస్‌ గ్రంథి సమస్యలు కనిపిస్తాయి. 75% ఈసోఫేజియల్‌ క్యాన్సర్లకు కారణం మద్యం తాగడమే.
♦ గుండె: ఆల్కహాల్‌ కార్డియోమయోపతి (గుండె కండరం పెరగడం), గుండె స్పందన, లయల్లో మార్పులు. గుండెపోటు, అథెరోస్లీ్కరోసిస్‌ సమస్యలు.
♦ నాడీ వ్యవస్థలో లోపాలు: జ్ఞాపకశక్తిలోపం, అనేక మానసిక వ్యాధులకు లోనుకావడం, స్పర్శ కోల్పోవడం, తిమ్మిర్లు, పక్షవాతం వంటి సమస్యలు రావచ్చు.
♦ సెక్స్‌ సమస్యలు: సామర్థ్యం తగ్గడం, అంగస్తంభన సమస్యలు రావచ్చు.
♦ గర్భిణులు ఆల్కహాల్‌ తాగడం వల్ల పుట్టబోయే పిల్లలకు బుద్ధిమాంద్యం, అవయవాలు సరిగ్గా ఎదగకపోవడంతో అనేక వైకల్యాలు కనిపించవచ్చు.
♦ మద్యం తాగినప్పుడు ఆకలి మందగించడంతో సరిగ్గా ఆహారం తీసుకోరు. అది అనేక విటమిన్‌ లోపాలకు కారణం అవుతుంది.
♦ ప్రమాదాలు: మద్యం వల్ల వ్యక్తి విచక్షణ, అంచనావేసే శక్తిని కోల్పోతాడు. అది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. వాహన ప్రమాదాల్లో దాదాపు 90 శాతం మద్యం తాగి డ్రైవ్‌ చేసినప్పుడు అయ్యేవే. మద్యం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువే కాకుండా, ప్రాణాపాయ అవకాశాలు కూడా ఎక్కువ. ఈ ప్రమాదాల్లో బతికినప్పటికీ ఒక్కోసారి తలకు తీవ్రమైన గాయాల వల్ల జీవితాంతం వైకల్యంతోనే జీవించాల్సి వచ్చే అవకాశాలే ఎక్కువ.

మానేసిన వెంటనే ఆరోగ్య ప్రయోజనాలు
ఇంతటి నష్టాన్ని కలిగించే మద్యం మానేయగానే మన శరీరం బాగుపడటం మొదలవుతుంది. మద్యం మానేయగానే కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే కాలేయం పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. భవిష్యత్తులో కాలేయ వ్యాధుల ముప్పు తొలగిపోతుంది. రక్తపోటు తగ్గుతుంది. డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 3.5% క్యాన్సర్లు మద్యం కారణంగానే వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక పేర్కొంటోంది. అందుకే దాన్ని గ్రూప్‌–1 కార్సినోజెన్‌గా చెబుతోంది. అంటే మద్యం మానేయడం వల్ల దాదాపు 10 రకాల క్యాన్సర్ల ముప్పు తొలగిపోతుందని అర్థం. అంతేకాదు.. ఆల్కహాల్‌ మానేసి, బరువును అదుపులో పెట్టుకొని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంటే క్యాన్సర్లు వచ్చే ముప్పు 30 శాతానికి పైగా తగ్గుతుంది. అయితే దీర్ఘకాలికంగా మద్యం అలవాటు ఉన్నవారు అకస్మాత్తుగా ఆపేసినప్పుడు ఆల్కహాల్‌ విత్‌డ్రావల్‌ సిండ్రోమ్‌ అనే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇందులో పొంతనలేకుండా మాట్లాడటం, గుండె వేగంలో మార్పులు, భయం, వణుకు, ఆందోళనతో పాటు కొన్ని సార్లు ఫిట్స్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి తాత్కాలికమే. ఒకటి నుంచి రెండు వారాల్లో మామూలైపోతారు.

మద్యం సరదాగా తాగే అలవాటు ఉన్నా సరే... దాన్ని తక్షణం మానేయండి. ఇక దీర్ఘకాలిక మద్యపాన ప్రియులు కూడా పైన పేర్కొన్న నష్టాలను దృష్టిలో ఉంచుకొని మానేయడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది. దీర్ఘకాలికంగా మద్యం అలవాటు ఉన్నవారిలో మానేయాలనే దృఢసంకల్పం ఉన్నప్పుడు అలాంటి వారికి డాక్టర్ల ఆధ్వర్యంలో కొద్దిపాటి చికిత్సతో మద్యాన్ని మాన్పించడం సులువే.

మద్యం గురించి అవీ ఇవీ...

♦ కొందరైతే తమ గ్లాసు ఖాళీ అవ్వగానే ఆ ఖాళీ గ్లాసును చూసి కూడా భయపడతారూ, ఆందోళనపడతారు. ఆ భయాన్నే ‘సీనోసిలికఫోబియా’ అంటారు. ఆ భయాన్ని అధిగమించడం కోసం వెంటనే తమ ఖాళీగ్లాసు నింపేస్తుంటారు.

♦ ఒక రోజు అలగ్జాండర్‌ తన సైనికులకు మద్యం తాగే పోటీని నిర్వహించాడు. పోటీ ముగిసే సమయానికి పటాలంలోని 42 మంది సైనికులు మద్యం విషప్రభావం కారణంగా (ఆల్కహాల్‌ పాయిజనింగ్‌తో) చనిపోయారు.

♦ లేత రంగు మద్యాల్లో కంటే ముదురు రంగు (డార్క్‌) మద్యాల్లో ఆల్కహాల్‌ మోతాదులు చాలా ఎక్కువ. ఇక మన ఆసియా దేశాల వారిలోని 50% మందిలో ఆల్కహాల్‌ తాగితే దాన్ని తట్టుకొని ప్రాసెస్‌ చేయగల జన్యువు లేదు. అందుకే పాశ్చాత్య దేశాల కంటే మన ఆసియా దేశాల వారిలో మద్యంతో మరింత ముప్పు.

మెదడుపై దుష్ప్రభావం ఇలా...
ప్రధానమైన దెబ్బ కాలేయంపైనా... ఆ తర్వాత మెదడుపైన పడుతుంది. మద్యం మెదడును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ఎక్కువ మోతాదుల్లో మద్యం తీసుకున్నప్పుడు అది మెదడులోని ప్రీ–ఫ్రంటల్‌ కార్టెక్స్‌ అనే భాగాన్ని దెబ్బతీయడం మొదలుపెడుతుంది. మనలో లాజిక్‌తో కూడిన ఆలోచనలకు, ప్లానింగ్‌కూ, అంచనావేయడానికి ఆ భాగమే తోడ్పడుతుంది. అదే సరిగా పనిచేయకపోవడంతో మనం మెల్లగా మన భావోద్వేగాలపై అదుపు కోల్పోతాం. ఎలాంటి ముప్పునైనా తేలిగ్గా  తప్పించుకోగలమనే అతివిశ్వాసం పెరగడంతో రిస్క్‌ తీసుకునే పనులకు పాల్పడుతుంటాం. దాంతో అనేక అనర్థాలు జరుగుతాయి. అటు తర్వాత మెదడులోని  టెంపోరల్‌ లోబ్‌ ప్రభావితమవుతుంది. ఫలితంగా మరచిపోవడం, చెప్పే మాటలకు చేతలకు పొంతన లేకపోవడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. చివరకు చిరాకు, కోపం కలుగుతాయి. నిజానికి ఆల్కహాల్‌ అనేది  డిప్రెషన్‌లోకి నెట్టే ఒక డిప్రెస్సెంట్‌. అది మనిషిని కుంగిపోయేలా చేస్తుంది. అంతేకాదు... మెదడు పనితీరు, చురుకుదనం తగ్గుతాయి. అలాగే మితిమీరి తాగుతూ ఉంటే ఆ తర్వాతి దశ కోమాయే. ఎంత మోతదులో ఎలాంటి మార్పులు కలుగుతాయో విపులంగా చెప్పుకుందాం.

ఏయే మోతాదులు... ఎలాంటి పరిణామాలు /లక్షణాలు

 ఆనందమయిన శృంగార లక్షణాలు ఆవిరి అయిపోతాయి. పురుషత్వ హార్మోన్లు వినాశనమవుతాయి. టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయి మద్యపానం వల్ల తగ్గిపోవడంతో లైంగిక శక్తి తగ్గడం, గుండెజబ్బులు రావడం, ఎముకలు బలహీనం కావడం వంటి పరిస్థితులు దాపురిస్తాయి. 

*👉🏿మూడు వారాల పాటు రోజూ మితంగా మద్యం తీసుకున్న వ్యక్తిలో* టెస్టోస్టీరాన్ స్థాయి ఏడు శాతం తగ్గిందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మద్యపానాన్ని ఒకటి రెండు గ్లాసులకు పరిమితం చేసుకుంటే టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయి పడిపోకుండా నివారించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

*👉🏿యువత అతి మద్యం తీసుకోవడం వల్ల* లివర్  (కాలేయం)మన శరీరంలోని అది పెద్ద అవయవం. మన శరీరంలోని జీవక్రియల్లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరంలో ఉదరంలో కుడివైపున ఉంటుంది. లివర్ జబ్బుపడినా కూడా తనను తాను బాగు చేసుకోగల సామర్థ్యం కలది . శరీరానికి కావల్సిన శక్తిని తయారుచేసుకోగలదు. జీర్ణక్రియలో అత్యంత కీలకమైన పాత్ర నిర్వర్తించే అవయం, శరీరంలోని అతి పెద్ద గ్రంథి. ఇది పెద్దగ్రంధి మాత్రమే కాదు, బరువైన అవయవం కూడా . కాలేయం... మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరంలోని కొవ్వు, చక్కెర (గ్లూకోజ్), ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, శరీరం జబ్బు బారిన పడకుండా భద్రత కల్పించడం (శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడం), రక్తశుద్ధి చేయడం, శరీరంలోని విషాలను హరించడం, మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించడం, జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్‌ను ఉత్పత్తి చేయడం, విటమిన్లు-ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికీ, గాయాలు తొందరగా మానడానికీ కావాల్సిన ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడం వంటి కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తుంది. ఇన్నిరకాలుగా బాధ్యతలు నిర్వహించే కాలేయం ధూమపానం, మద్యం వల్ల త్వరగా జబ్బునపడుతుంది

మద్యపానంతో మెదడుకు దెబ్బ

 *👉🏿కౌమార ప్రాయంలో అతిగా మద్యం సేవించడం వల్ల* మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావం పడుతుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. దీంతోపాటు భవిష్యత్తులో సబ్‌స్టాన్స్‌ యూజ్‌ డిజార్డర్‌(ఎ్‌సయూడీ) బారినపడే ప్రమాదం కూడా పెరుగుతుందట! 13 నుంచి 18 ఏళ్ల వయసున్న వారిపై పదేళ్ల పాటు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని యూనివర్సిటీ ఆఫ్‌ ఫిన్లాండ్‌ పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో క్యూపియో యూనివర్సిటీ హాస్పిటల్‌ పరిశోధకులు కూడా పాల్గొన్నారు. మెదడు పరిపక్వత చెందే దశ(20ఏళ్ల దాకా)లో అదేపనిగా మద్యం తాగడంవల్ల మెదడు ఎదుగుదల మందగిస్తుందని వారు వివరించారు. పదేళ్ల అధ్యయనంలో భాగంగా.. వలంటీర్ల మెదడును ఎంఆర్‌ఐ స్కాన్‌ ద్వారా మూడుసార్లు పరీక్షించి చూశామని చెప్పారు. ఇందులో మద్యం తాగే అలవాటు లేనివారితో పోలిస్తే అతిగా తాగే వారి మెదడు ఎదగక పోవడం గమనించామని ఈ పరిశోధనలో పాల్గొన్న నూరా హెకినెన్‌ వివరించారు.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
 
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఎవరికీ వ్యక్తిగతంగా మందులు సూచించడం జరగదు..దయచేసి గమనించండి.

"మీ ఫేమిలీ డాక్టరుని గాని..దగ్గరలో డాక్టరుని గాని సంప్రదించండి..ఇంకాఏదైనా వ్యాధి వివరాలు కావాలంటే ఈ గ్రూపులో నేను ముందు పెట్టిన పోస్టులు చూడండి..అవగాహన పెంచుకోండి... *ఎవరికీ మందులు సూచించడం ఈ గ్రూపులో సాధ్యం కాదు*"

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: