29, డిసెంబర్ 2019, ఆదివారం

ముఖం పై నల్ల ని మచ్చలు పోవాలి అంటే


ముఖం పై  "మంగు -మచ్చలు" & "నల్ల - మచ్చలు" తగ్గడానికి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

చాలామంది నల్లమచ్చలు - మంగుమచ్చలు తో బాధపడుతున్నారు. ప్రతి రోజు అద్దంలో చూసుకొంటూ ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉంటారు. అలాంటివారు బాధపడకండి.
ప్రకృతి లో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మన ఆరోగ్యం - మన చేతుల్లో ఉంటుంది. ఆహరం లో తగిన జాగ్రత్తలు తీసుకొంటూ , తాజా కూరగాయలు , ఆకుకూరలు , పండ్లు ఆహారంలో భాగంగా చేసుకొంటూ , మానసిక ఆందోళన లేకుండా చూసుకోండి. 

మీ ముఖం సౌందర్యం కోసం మీకు కొన్ని చిట్కాలు అందిస్తున్నాను.వీటిని తరచుగా మారుస్తూ ప్రతి రోజు ఒక చిట్కా ఆచరించండి.ఫలితాన్ని పొందుతారు.

 చిట్కాలు  

1) ఒక రెండు స్పూన్ల రోజ్ వాటర్ ఒక గిన్నెలో తీసుకోండి , ఒక నిమ్మకాయను రెండు సగాలు చేయండి.ఇప్పుడు నిమ్మకాయ సగ భాగాన్ని తీసుకొని గిన్నెలో ఉన్న రోజ్ వాటర్ లో ముంచుతూ , ముఖంపై మృదువుగా గుండ్రంగా తిప్పుతూ ముఖం , మెడ భాగాన్ని ఒక 5 నిముషాలు మసాజ్ చేయండి. ఒక 20 నిముషాలు ఆగి గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోండి.

2) కోడిగ్రుడ్డు లోని తెల్ల సొనను తీసుకోండి , దానిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి , ముఖం ,మెడకు పట్టించండి. అరగంట ఆగి గోరువెచ్చని నీటితో కడుక్కోండి.

3) అలోవేర (కలబంద) గుజ్జులో , రెండు స్పూన్ల రోజ్ వాటర్ కలిపి , ముఖం , మెడకి ఒక 5 నిముషాలు వేళ్ళతో గుండ్రంగా తిప్పుతూ మృదువుగా మసాజ్ చేయండి.అరగంట ఆగి గోరువెచ్చని నీటితో కడుక్కోండి.

4) పచ్చిపాలల్లో , ఒక స్పూన్ నిమ్మరసం , ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి , ముఖం ,మెడకు మసాజ్ చేసుకోండి.అరగంట ఆగి గోరువెచ్చని నీటితో కడుక్కోండి.

5) ఒక గిన్నెలో రెండు స్పూన్ల రోజ్ వాటర్ తీసుకొని , ఒక టమాటో ను రెండు సగ భాగాలు చేయండి, ఇప్పుడు సగ భాగాన్ని రోజ్ వాటర్ లో ముంచుతూ , ముఖం పై టమాటో సగ భాగం అయ్యేంతవరకు గుండ్రంగా మసాజ్ చేయండి.అరగంట ఆగి గోరువెచ్చని నీటితో కడుక్కోండి. 

6) ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి ,కొంచెం పెరుగు , ఒక స్పూన్ నిమ్మరసం , ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి , ముఖం మొత్తం ప్యాక్ చేయండి. అరగంట ఆగి గోరువెచ్చని నీటితో కడుక్కోండి.

7) ఒక టేబుల్ స్పూన్ శనగపిండి , కొంచెం పెరుగు , ఒక స్పూన్ నిమ్మరసం , ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి ప్యాక్ చేయండి. అరగంట ఆగి గోరువెచ్చని నీటితో కడుక్కోండి.

8) పైన తెలిపిన చిట్కాలు రోజు ఒకటి చొప్పున చేయండి. అందమైన ముఖం మీ సొంతం అవుతుంది.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

కామెంట్‌లు లేవు: