మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవటం వల్ల ఏమవుతుందో మీకు తెలుసా..?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
మూత్రం క్లియర్ గా ఉంటె మన ఆరోగ్యం బాగున్నట్లు.. మన వయసును బట్టి మూత్రశయం పనితీరు మారుతూ ఉంటుంది. మూత్రశయ కణజాలం సాగే గుణం తగ్గిపోవటం వల్ల మునపటిలా మూత్రాన్ని ఆపుకోవటం సాధ్యం కాదు.. దీంతో ఎక్కువసార్లు మూత్రవిసర్జనకి వెళ్లడం జరుగుతుంది.. మూత్రశయగోడ, కటి కండరాలు బలహీనం కావటం వల్ల విసర్జన అనంతరం ఇంకా కొంత మూత్రం లోపలే ఉన్నట్టు అనిపించవచ్చు. బొట్లు బొట్లుగా మూత్రం లీక్ కావచ్చు. ఇలా మూత్రశయాన్ని దెబ్బతీసే అన్ని అంశాలను మనం నియంత్రించలేకపోయినా కొన్ని జాగ్రత్తలతో వీటి ఆరోగ్యం సజావుగా ఉండేటట్లు చూసుకోవచ్చు.
1. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవటం వల్ల మూత్రశయ కండరాలు బలహీనమవుతాయి. ఇన్‌ఫెక్షన్లు తలెత్తే అవకాశము పెరుగుతుంది. కాబట్టి కనీసం 3-4 గంటలకు ఒకసారైనా మూత్రవిసర్జన చేయాలి. అలాగే కాస్త సమయం పట్టినా పూర్తిగా మూత్ర విసజర్జన అయ్యేలా చూసుకోవాలి. మూత్రం పోసేటప్పుడు కండరాలు వదులుగా ఉండేలా చూసుకుంటే సాఫీగా విసర్జన అవుతుంది.
2. మద్యం, కాఫీ, టీ వంటి పానీయాలు ఒంట్లో నీటి శాతం తగ్గేలా చేస్తాయి. కాబట్టి వీటిని మితంగానే తీసుకోవాలి. అలాగే దూమపానం అలవాటుంటే వెంటనే మానేయాలి.
3. మూత్రాశయ ఆరోగ్యానికి నీరు ఎంతో మేలు చేస్తుంది. అందువల్ల రోజూ తీసుకునే ద్రవాల్లో కనీసం సగం వరకు నీరు ఉండేలా చూసుకోవాలి. రోజుకు 6-8 గ్లాసుల నీరు తాగటం మంచిది. అయితే కిడ్నీ ఫెయిల్, గుండె జబ్బు సమస్యతో బాధపడే వారు మాత్రం డాక్టర్ సూచనల మేరకే నీరు తాగాలి.
4. సెక్స్ లో పాల్గొన్న కొంతసేపటి తర్వాత స్త్రీలు-పురుషులు మూత్ర విసర్జన చేయటం చాల మంచిది. దీంతో సంభోగ సమయంలో మూత్రమార్గంలోకి ఏదైన బ్యాక్టీరియా ప్రవేశిస్తే అది బయటకు వెళ్లిపోతుంది.
5. వదులైన కాటన్ లోదుస్తులు ధరిస్తే మూత్రమార్గం చుట్టుపక్కల భాగాలు పొడిగా ఉంటాయి. అదే బిగుతుగా ఉండే జీన్స్ నైలాన్ లోదుస్తులతో తేమ అలాగే ఉండిపోయి అక్కడ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఎవరికీ వ్యక్తిగతంగా మందులు సూచించడం జరగదు..దయచేసి గమనించండి.
"మీ ఫేమిలీ డాక్టరుని గాని..దగ్గరలో డాక్టరుని గాని సంప్రదించండి..ఇంకాఏదైనా వ్యాధి వివరాలు కావాలంటే ఈ గ్రూపులో నేను ముందు పెట్టిన పోస్టులు చూడండి..అవగాహన పెంచుకోండి... *ఎవరికీ మందులు సూచించడం ఈ గ్రూపులో సాధ్యం కాదు*"
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి