బరువు తక్కువగానున్న పపి పిల్లలకు ఆరోగ్యకరమైన డైట్ నవీన్ నడిమింటి సలహాలు
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు సరైన బరువును కలిగి ఉన్నారో లేదో నన్న సందేహంతో ఆందోళన చెందుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన గ్రోత్ చార్ట్ కాలిక్యులేటర్ ని ఆధారితం చేసుకుని పిల్లల బరువుపై ఒక అంచనాకి రావచ్చు. అయితే, తల్లిదండ్రులకు ఈ తమ పిల్లల బరువుపై ఆందోళన అనవసరం. పిల్లలు తమకేం కావాలో వారు తీసుకుంటారు.
రెండేళ్ళు దాటిన పిల్లలు ఏడాదికి దాదాపు ఒకటిన్నర నుంచి మూడున్నర కిలోలవరకు బరువు పెరుగుతారు. కాబట్టి అంతకు మించి పిల్లలు బరువు పెరగాలని ఆశించకూడదు. ఒకవేళ, మీ పిల్లల్లో ఈటింగ్ డిసార్డర్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి.
కొంత మంది పిల్లలు అత్యంత చురుగ్గా ఉంటారు. వారిలో మెటబాలిజం రేట్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. వారు ఆహారాన్ని సరిగ్గా తీసుకున్నా గణనీయమైన బరువు పెరిగే అవకాశాలు తక్కువ. పిల్లలు త్వరగా బరువు పెరగాలని తీపి ఎక్కువగానున్న, కొవ్వు కలిగిన ఆహారాలను పిల్లలకు పెట్టడం చాలా మంది తల్లితండ్రులు చేసే పొరపాటు. వీటి వల్ల పిల్లల్లో ఆకలి మందగిస్తుంది. ఇది సరైన ఆప్షన్ కాదు. వీటి బదులు, పిల్లలకు అదనపు కేలరీలు కలిగిన ఆహారాన్ని అందించాలి.
మీ పిల్లలు చక్కగా బరువు పెరిగేందుకు ఈ సలహాలను పాటించండి
పూర్తి కొవ్వు కలిగిన పాలనే మీ పిల్లలకు ఇవ్వాలి. పాల నుంచి వెన్న తొలగించకండి. పెరిగే పిల్లలకి అదనపు కొవ్వు ఎంతో మంచిది.
పిల్లలకు పెట్టే పప్పు, కూరగాయలలో కొద్దిగా నెయ్యి, వెన్న లేదా ఆలివ్ ఆయిల్ ను కలపాలి.
పిజ్జా, పాస్తా, శాండ్ విచ్ లలో కొద్దిగా ఛీజ్ ను కలపండి.
సూప్స్, జామ్ శాండ్ విచ్, మ్యాష్ చేసిన పొటాటోలకు కాస్త క్రీమ్ ను జోడించండి.
పిల్లల డైట్ లో నట్స్ కు చోటివ్వండి. ఆల్మండ్, జీడిపప్పులను పిల్లల భోజనానికి జత చేయండి.
ఖీర్ లేదా క్యారట్ హల్వా ను ఫుల్ ఫాట్ క్రీమ్ తో కలిపి హెల్తీ డిజర్ట్ తయారుచేయండి.
పిల్లలు ఎదిగే కొద్ది స్నాక్స్ ను ఇవ్వచ్చు. ఇడ్లీ, దోసలతో పల్లీ లేదా కొబ్బరి చట్నీలను జత చేయవచ్చు.
అయినప్పటికీ పిల్లలకు నట్స్ ను కూడా ఇవ్వాలి. నట్స్ ను పొడి చేసి లేదా చిన్నగా తరిగి పిల్లలకు తరచూ ఇవ్వాలి.
పొటాటోలను అలాగే మరికొన్ని స్టార్చీ వెజిటబుల్స్ ను పిల్లల ఆహారంలో కలపండి.
మీరు నాన్ వెజిటేరియన్ అయితే గుడ్లు, చికెన్ లను పిల్లలకు అలవాటు చేయండి.
మీ పిల్లలకి నచ్చే విధంగా ఆహారాన్ని వెరైటీగా అందించండి. ఒకే ఆహారాన్ని రోజూ పెట్టకండి. పిల్లలకు విసుగుకలగవచ్చు .
వీటితో పాటు, ఆహారాన్ని పిల్లలకు నచ్చే విధంగా తాయారు చేయడం వల్ల భోజన సమయంలో పిల్లలకు మీకు ఇబ్బంది ఎదురవదు. ప్లేట్ లో వడ్డించినదంతా తినాలని వారిని బలవంత పెట్టవద్దు. మీ పిల్లలకు తగినన్ని పోషకాలు, కేలరీస్ ఆహారం ద్వారా చేరుతున్నాయో లేదో తప్పకుండ గమనించాలి.
మరికొన్ని చిట్కాలు
ఆహారం తరువాత గాని ఆహారం తీసుకుంటున్న సమయంలో నీళ్ళని ఎక్కువగా త్రాగాకూడదు. దీని వల్ల కడుపు నిండుగా కలిగిన భావన కలిగి పిల్లలు ఆహారాన్ని సరిగ్గా తేసుకోరు. మిల్క్, పళ్ళరసాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఘనాహారం తీసుకోవడానికి పిల్లలు మక్కువ చూపారు. వారికి ఆకలి వేసినట్టు అనిపించదు.
మీల్స్ కి స్నాక్స్ కి సమయాన్ని విధించండి. పిల్లలకు భోజన సమయమని కచ్చితంగా తెలియాలి. హడావిడిగా తినడాన్ని అలవాటు చేస్తే పిల్లలకు ఆహారం తినడం ముఖ్యమనే భావన కలగదు. పిల్లల కోసం కార్ లో సిద్ధంగా ఉంచే స్నాక్ ఫుడ్స్ వల్ల కూడా పిల్లలకు సరైన పోషకాలు కలిగిన ఆహారం లభించదు.
పిల్లలతో కలిసి భోజనం చేయండి. పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులనే అనుసరిస్తారు కాబట్టి మీరు హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే వారు కూడా ఆరోగ్యకరమైన ఆహారానికి అలవాటు పడతారు.
సాధారణంగా, భోజనం చేసే సమయంలో పెద్దలు టీవీ చూడడానికి ఇష్టపడారు. అయితే, పిల్లల కోసం ఈ అలవాటు నుంచి బయటపడాలి. లేదంటే, పిల్లలు కూడా ఇదే అలవాటుకు గురై తామేమి తింటున్నారో పట్టించుకోలేరు.
పిల్లలు వ్యాయామం చేస్తున్నారో లేదో గమనించండి. వారికి వ్యాయామం వలన కలిగే బెనిఫిట్స్ ను వివరించండి. వ్యాయామం చేయడం వల్ల అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. ఆకలి కూడా వేస్తుంది. తగినంత పోషకాహారం తీసుకుంటారు.
భోజనానికి, భోజనానికి మధ్య హెల్తీ స్నాక్స్ ఉండేలా ప్లాన్ చేయండి. పిల్లల పొట్ట చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి మీల్స్ టైం లో వారు సరిగ్గా తింటారని అనుకోలేము. కాబట్టి మధ్య మధ్యలో ఆరోగ్యకరమైన స్నాక్స్ ను అందించండి. హెల్తీ స్నాక్స్ వల్ల వారు ఉత్సాహంగా ఉంటారు.
బెడ్ టైం కు ముందు స్నాక్స్ ను ఇవ్వండి. ఆరోగ్యకరమైన ఫాట్స్ కలిగి, తగినన్ని పోషకాలు కలిగిన స్నాక్స్ ను పిల్లలకు అందించడం వల్ల వారు నిదురించే సమయంలో టిష్యూ నిర్మాణం జరుగుతుంది. అయితే, ఆ స్నాక్స్ లో షుగర్ ను మాత్రం అవాయిడ్ చేయండి. పిల్లల నిద్ర డిస్టర్బ్ కాకుండా ఉండేలా స్నాక్స్ ఉండాలి. ఈ విధానం పిల్లలందరికీ ఉపయోగపడుతుంది.
ఆరోగ్యకరమైన కేలరీస్ పుష్కలంగా ఉండే రేసిపీస్ కోసం ఈ ఎనర్జీ బాల్స్ ను ట్రై చేయండి. మా పిల్లల స్నేహితులు తరచూ ఈ రడిష్ కోసం మా ఇంటికి వస్తూ ఫ్రిడ్జ్ ను చేక్క్ చేస్తారు. మరొక మాటలో చెప్పాలంటే, ఎక్కువ మందికి నచ్చేవివి అలాగే పోషకాలు పుష్కలంగా ఉండేవి.
ధన్యవాదములు
మీ నవీన్ రోయ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి