22, డిసెంబర్ 2019, ఆదివారం

అమీబియాసిస్ నివారణ కీ సలహాలు

*Amoebiasiscan also be asymptomatic and show no symptoms, but if you notice these symptoms, visit your nearest doctor.*
*అమీబియాసిస్ నివారణకు ఎలా చేయాలి అంటే*

సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి సాధారణ వ్యాధుల్లో అమీబియాసిస్ ఒకటి. ఈ వ్యాధి హిస్టలిటికా అనే క్రిమి వల్ల ఒకరి నుంచి మరొకరికి అపరిశుభ్రమైన తాగునీటి ద్వారా, సరిగా ఉడకని కలుషితమైన ఆహార పదార్థాల వల్ల సంక్రమిస్తుంది.

ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది.

*అమీబియాసిస్‌ను కలగజేసే క్రిమి సిస్ట్ రూపంలోనూ, ట్రోఫో జువాయిట్ రూపంలోనూ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. పేగుల్లోని కొన్ని ఎంజైమ్‌ల వల్ల సిస్ట్ చుట్టూ ఉన్న పొర పలచబారుతుంది. తద్వారా ట్రోఫోజువాయిట్‌లు బయటకు వెలువడుతాయి. ఇవి మలం ద్వారా వెలుపలికి వచ్చిన తర్వాత జీవించలేవు. ఇవి ప్రధానంగా ద్రవరూపంలో ఉన్న మలం ద్వారా బయటకు వస్తాయి. మలం ద్వారా బయటకు వచ్చి సిస్ట్‌లు నీటిలోనూ, మట్టిలో చాలాకాలం సజీవంగా ఉండి, అనుకూల పరిస్థితుల కోసం ఎదురుచూస్తుంటాయి. ఈ వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు రెండు వారాల నుంచి రెండు నెలల లోపు బహిర్గతమవుతాయి. ఈ క్రిములు పేగుల్లో ఉండి, వ్యాధి లక్షణాలను బహిర్గతం చేస్తుంటే ఇంటస్టినల్ అమీబియాసిస్ అని, ఇతర భాగాల్లో వ్యాపించి ఉండి వ్యాధి లక్షణాలను బహిర్గత పరుస్తుంటే ఎక్స్‌ట్రా ఇంటెస్టినల్ అమీబియాసిస్ అని అంటారు.*

 ఇన్ఫెక్షన్ ఎక్కువై వ్యాధి తీవ్రరూపం దాల్చినప్పుడు దుర్వాసనతో కూడిన ద్రవరూప మలం వెలువడుతుంది. రక్తం, జిగురులతో కలిసి  రోజూ ఎక్కువసార్లు విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. తీవ్రత మరింత ఎక్కువైనప్పుడు 105 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకూ జ్వరం వస్తుంది.

*కారణాలు*:  కలుషితమైన నీరు, ఆహారపదార్థాల వల్ల  ఇన్ఫెక్షన్స్ వల్ల  దీర్ఘకాలికంగా నీరసంగా ఉండడం వల్ల  కొన్నిసార్లు వ్యాధి క్రిములున్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వారి వల్ల ఇతరులకు వ్యాధి సోకుతుంది. ఇలా తమలో వ్యాధి కారక క్రిములను కలిగి ఉన్నవారిని ‘క్యారియర్స్’ అంటారు.

*లక్షణాలు:*  కడుపునొప్పి, కడుపు ఉబ్బరం  దీర్ఘకాలికంగా విపరీతమైన నీరసం బరువు కోల్పోవడం, మలబద్ధకం  జ్వరం, దగ్గు, ఆకలి లేకపోవడం

పిల్లల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి జిగటవిరేచనాలు  ఎమోభా అనే ఏక కణజీవి వలన అమీబియాసిస్ వస్తుంది. ఇది ఎక్కువ సార్లు వస్తే ఊపిరితిత్తుల లో చీము చేరుతుంది.

బొటానికల్ నేం : Bnincasa Hispida Telugu : boodida gummadi
Sanskri : kooshmaanda Hindi : petaa

" బూడిద గుమ్మడి -- సైజులోనే కాదు -- వుపయోగాలలో కూడా పెద్దదే ...!! "

* జెనెరల్ -- తరుచుగా మూత్ర విసర్జన లో మంట, మూత్రంలో ఆల్బ్యుమిన్‌ పోతుండడం (మగవాళ్ళలో కూడా), ఎదో ఒకరకమైన మూత్రాశయ సంబంధిత అనారోగ్యం

* లేడీస్ -- తరుచుగా తెల్లబట్టతో బాధపడటటం, మెన్‌సస్ టైమ్ లో ఓవర్ బ్లీడింగ్, నొప్పి ( ఎక్కువ మేహం తో బాధ పడేవారికి ఈ నొప్పి ఇంకా విపరీతంగా వుంటుంది., అటువంటి కేసులలో ... అద్భుతంగా పని చేస్తుంది.

* అమీబియాసిస్ (లేదా) ఎప్పుడూ ఇబ్బంది పెట్టే భేదులు :
ఎక్కువ రొజులనుండి అమీబియాసిస్ తో బాదపడుతున్న వారికి జెనెరల్ గా పేగుల లోపల సున్నితమైన పొరలు ( మ్యుకస్‌ లేయర్స్‌ ) రప్చర్ ఐయి బ్లీడింగ్ కావటం, దీని కారణంగా కడుపు నొప్పి, మంట రావటం జరుగుతుంటుంది. బూడిద గుమ్మడికి ఈ మ్యుకస్ లేయర్స్ ని తిరిగి ఏర్పరిచే గుణం వుంది. అమీబియాసిస్ అనే కాదు, తరుచుగా బేదులతో బాధపడేవారికి బూడిద గుమ్మడి ఈ మ్యుకస్ లేయర్స్ ని బలపరచటం ద్వారా నయం చేసే గుణం వుంది.

* అసిడిటి -- పరగడుపున తీసుకుంటే అసిడిటీ ని కంట్రొల్ల్ చేయడమే కాదు, మంటను తగ్గించి జీర్ణాశయ పేగులను బలపరుస్తుంది.

* షుగర్ పేషంట్స్‌ -- షుగర్‌ పేషంట్స్‌ ఎస్పెషల్లి యంగ్ స్టర్స్‌ లైంగిక శక్తి లోపంతో కానీ, అంగానికి సంబంధించిన సమస్యలతో కానీ బాదపడుతుంటారు. బూడిద గుమ్మడి మీకో మంచి పరిష్కారం.

* మేహ తత్వంతో బాదపడే చాలా జబ్బులలో బూడిద గుమ్మడి ఓ మంచి పరిష్కారమనడంలో సందేహం లేదు. ఏ రూపం లో తీసుకున్నా మంచిదే.

పైన చెప్పిన వుపయొగాలన్ని ఓవర్ నైట్‌ వచ్చేయాలని ఎక్స్‌పెక్ట్‌ చెయ్యకండి. వారం,పది రొజులు రెగ్యులర్ బేసిస్‌ మీద తీసుకుంటే తప్పకుండా పొందవచ్చు.

బూడిద గుమ్మడిని ఆహారంలో ఒక భాగం చేసుకోండి. మిగతా కూర గాయల మాదిరిగానే ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలైన వంటలు ప్రాచుర్యం పొంది వుంటాయి; పురాతన కాలం నుండి, పెద్దవారిని అడిగి తెలుసుకోండి.

* బూడిద గుమ్మడి తో చేసిన లేహ్యం "కూష్మాండ లేహ్యం" పేరుతో అన్ని రకాల ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది.
* " కుష్మాండరసాయనం " పేరుతో కూడా దొరుకుతుంది.
* కానీ లేహ్యం మోస్ట్ ఎఫెక్టివ్‌.
* ఒకటి లేదా రెండు చెంచాల లేహ్యాన్ని పాలతో ఐనా తీసుకోవచ్చు, లేదా నీటితో ఐనా తీసుకొవచ్చు.***
*
*వ్యాధి నిర్ధారణ*:
రక్త పరీక్షలు,
మలపరీక్ష ,
ఎక్స్‌రే,
సిగ్మాయిడోస్కోపీ

*చికిత్స*:
హోమియోపతిలో అమీబియాసిస్‌ను తగ్గించడానికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను విశ్లేషించి మందులను సూచిస్తారు. హోమియోలో దీనికి అకోనైట్, ఆర్సినికమ్ ఆల్బమ్, లకెసిస్, సల్ఫర్ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాటిని వాడాల్సి ఉంటుంది.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*

          *సభ్యులకు సూచన*
         ****************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..

మా హెల్త్ సమాచారం కోశము ఇంకా కావాలి అంటే below link లైక్ చేయండి
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: