22, డిసెంబర్ 2019, ఆదివారం

షుగర్ ఉన్న వారికీ జాగ్రత్తలు

మధుమేహం (షుగర్) తో బాధపడేవారు తీసుకోవాలిసిన జాగ్రత్తలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
ఉదయం పరగడుపున గుప్పెడు లేత వేపాకులను నీటిలో మరిగించి కషాయంలా తీసుకొంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది. చర్మం పై పుండ్లు , ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.
• ఎందుకొచ్చిన మధుపాట్లు..???

తెలియక చేస్తే పొరపాటు. మరి తెలిసి చేస్తే? మధుమేహం విషయంలో ఎంతోమంది చేస్తున్నదిదే! ప్రస్తుతం మధుమేహం గురించి మనకు అంతో, ఇంతో బాగానే తెలుసు. ఇది ఒకసారి వచ్చిందంటే పూర్తిగా నయమయ్యే సమస్య కాదనే సంగతి తెలుసు. మందులతో, జీవనశైలి మార్పులతో దీన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి మరో మార్గం లేదని తెలుసు. దీర్ఘకాలంగా రక్తంలో గ్లూకోజు నియంత్రణలో లేకపోతే చూపు పోవటం, నాడులు దెబ్బతినటం, పాదాల మీద పుండ్లు పడటం వంటి తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తుందని తెలుసు. వీటి మూలంగా ఎంతో ఖర్చు భరించాల్సి వస్తుందని, ఎన్నెన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుసు. కొన్నిసార్లు ప్రాణాపాయం సంభవించొచ్చనీ తెలుసు. అయినా కూడా ఎంతోమంది ఎన్నెన్నో పొరపాట్లు చేస్తుండటం గమనార్హం. మందులు వేసుకోవటం దగ్గర్నుంచి, పరీక్షల వరకూ ఎన్నో తప్పులు దొర్లుతుండటం చూస్తూనే ఉన్నాం. ఎందుకిలా? తెలిసి తెలిసీ పొరపాట్లు ఎందుకు చేస్తున్నాం? మనమంతా తక్షణం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.

మధుమేహం నివారణ కొరకు కొన్ని రహస్య మూలికా యోగములు  -

 *  ఉసిరిక వలుపు , పసుపు సమంగా కలిపి ఉదయం , సాయంకాలం నందు రెండు నుంచి మూడు గ్రాములు సేవించుచుండిన యెడల మధుమేహం శమించును .

 *  పొడపత్రి ఆకు , తంగేడు పువ్వులు సమానంగా తీసుకుని నీడలో ఎండించి చూర్ణం చేసుకుని నిలువచేసుకొని ఉదయం మరియు సాయంత్రం మూడు గ్రాముల చూర్ణం మంచినీళ్ల అనుపానంతో సేవించుచున్న మధుమేహం హరించును .

 *  మెంతులు మొలకెత్తించి నీడలో ఎండించి చూర్ణం సిద్ధం చేసుకుని రోజు రెండుపూటలా ఐదు నుంచి ఆరు గ్రాముల నుండి మధుమేహం స్థాయిని బట్టి పది నుంచి పన్నెండు గ్రాముల వరకు తీసుకుని సేవించుచున్న మధుమేహం శమించును .

 *  నేరేడు విత్తనములు దోరగా వేయించి పొడి చేసి నీళ్లను చేర్చి కషాయం చేసుకుని ఉదయం ఒక కప్పు ప్రమాణం సేవించుచున్న మదుమేహం నందు అద్బుతముగా  పనిచేయును .

 *  మర్రిపండ్లలో ఉండు సన్నటి గింజలను నీడలో ఆరబెట్టి చూర్ణం చేసుకుని రెండు నుంచి మూడు గ్రాముల మోతాదు ఉదయం మరియు రాత్రివేళ యందు సేవించుచున్న యెడల మధుమేహ రోగులకు వచ్చు అతిమూత్ర సమస్య తగ్గును.

 *  రాగిజావలో మజ్జిగ పోసుకొని ప్రతిరోజూ ఉదయం పూట తాగుచున్న ఎడల మధుమేహం , అతిమూత్ర సమస్య తగ్గును.

 *  తిప్పతీగ రసం నిత్యము ప్రాతఃకాలం నందు అరవై నుంచి తొంబై మిల్లి లీటర్ల కషాయం నిత్యం ప్రాతఃకాలం నందు సేవించుచుండిన ఎడల మధుమేహం హరించును .

 మధుమేహరోగులు పాటించవలసిన ఆహార నియమాలు  -

 తీసుకోవలసిన ఆహారపదార్థాలు  -

    యావలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యం , పెసలు , చేదు గల ఆహారపదార్దాలు , కాకర, చేదుపోట్ల , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉశిరికపండు , పసుపు , వ్యాయమం ఆచరించవలెను .

  తీసుకోకూడని ఆహారపదార్థాలు  -

      నెయ్యి , బెల్లం , తీపిపదార్థాలు , మద్యము , గంజి , చెరుకు రసం , పుల్లటి ద్రవ్యములు , కొత్తబియ్యముతో చేసిన అన్నం , పెరుగు , పాలపదార్థాలు , దుంపకూరలు , కొవ్వులు అధికంగా ఉండే పదార్దములు బాగుగా తగ్గించవలెను .

      పగటినిద్ర , పొగతాగటం , మలమూత్ర వేగాలను నిరోధించరాదు.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి



కామెంట్‌లు లేవు: