నరాల వాపు (ఏంజియోడెమా)అంటే ఏమిటి?
నరాల వాపు లేదా నరాల నొప్పి (అంజియోడెమా) అనేది చర్మం క్రింద లేదా చర్మం కణజాలంలో, లోపలి చర్మము క్రింద (dermis) వాపుతో కూడి ఉన్న ఒక విపత్కర పరిస్థితి. సాధారణంగా మందులు, ఆహారం, పుప్పొడి లేదా పుష్ప రజస్సు, పర్యావరణ విషపదార్థాల (టాక్సిన్స్) వల్ల కలిగే దుష్ప్రభావాలకు (అలెర్జీలకు) నరాలవాపు (Angioedema) ఓ నిరోధక ప్రతిస్పందన. నరాల వాపు కారణంగా రక్తనాళాల నుండి ద్రవం స్రవించి పరిసర కండర కణజాలాల్లోకి వ్యాపిస్తుంది, తద్వారానే నరాల్లో వాపు ఏర్పడుతుంది.
నరాల వాపు ప్రధాన చిహ్నాలు మరియు లక్షణాలు ఏమిటి?
పెదవులు, చేతులు, కాళ్ళు, నాలుక, మరియు కళ్ళ చుట్టూ వాపు సంభవించవచ్చు. అప్పుడప్పుడు, దురద లేదా ఉబ్బేక్కిన దద్దుర్లు (urticaria) ఏర్పడతాయి. నొప్పితో పాటు తేలికపాటి దురద ఉంటుంది. దద్దుర్ల చోట్లలో చర్మం ఎరుపుదేలడం, ఆ చోట్లలో చర్మం వెచ్చదనంగా మారడం వంటివి సాధారణంగా కనిపించే ఇతర లక్షణాలు. ఉబ్బురోగం (ఎడెమా) లేదా శ్వాసకోశంలో వాపు శ్వాస సమస్యలకు దారితీస్తుంది. జీర్ణాశయాంతర ప్రేగులలో వచ్చే ఉబ్బురోగం (Oedema) వికారం, వాంతులు, అతిసారం, లేదా నొప్పిని కలుగజేస్తుంది.
నరాల వాపు ప్రధాన కారణాలు ఏమిటి?
నరాల వాపు యొక్క ఖచ్చితమైన కారణం తెలియదు. ఇది సాధారణంగా ఒక ఔషధం వల్ల కల్గిన దుష్ప్రభావం యొక్క ప్రతిచర్య, పురుగు కాటు, లేటెక్స్ రబ్బరు, పెంపుడు జంతువు బొచ్చు, లేదా ఆహారసేవనం వల్ల వాటిల్లిన దుష్ప్రభావం ద్వారా ప్రేరేపించబడుతుంది.
కొన్ని మందులు సాధారణంగా దద్దుర్ల వాపుకు కారణమవుతాయి. ఆ మందులేవంటే యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్, స్టెరాయిడ్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, మరియు యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్.
కొందరు వ్యక్తులకు నరాల వాపు (ఆంజియోడెమా) వారసత్వంగా వస్తూండవచ్చు. ఇది జన్యు మార్పులు కారణంగా సంభవించవచ్చు.
అంటురోగం లేదా లుకేమియా వంటి కొన్ని ప్రాథమిక వైద్య పరిస్థితులు కూడా నరాలవాపు (ఆంజియోడెమా)కు కారణం కావచ్చు.
నరాలవాపును నిర్ధారణ చేసేదెలా, దీనికి చికిత్స ఏమిటి?
ప్రారంభంలో, వైద్యులు శారీరకంగా కనబడే లక్షణాల ఆధారంగా మిమ్మల్ని పరీక్షించడం జరుగుతుంది. నరవాపు ప్రభావిత ప్రాంతాన్ని డాక్టర్ తనిఖీ చేస్తారు మరియు ఏదైనా అలెర్జీ కావడంవల్ల లేదా వైద్య చరిత్రవల్లనా, లేదా ఏదైనా దుష్ప్రభావానికి గురై నరాలవాపు దాపురించిందా అని డాక్టర్ మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాడు. ఈ తనిఖీ ద్వారా నరాలవాపుకు కారణం ఏమిటో డాక్టర్ నిర్ణయిస్తారు. వైద్యులు చర్మ ప్రతిచర్య పరీక్ష లేదా రక్త పరీక్ష వంటి కొన్నిఅలెర్జీల పరీక్షలను కూడా నిర్వహించవచ్చు. C1 esterase నిరోధకం కోసం ప్రత్యేకంగా రక్త పరీక్ష నిర్వహిస్తారు. ఈ పదార్ధం యొక్క తక్కువ స్థాయిలు సమస్య వారసత్వంగా ఉందని సూచిస్తున్నాయి. C2 లేదా C4 వంటి పూర్తి పరీక్షలలో తేలే అసాధారణ ఫలితాలు, ఏదో అగోచర పరిస్థితి కారణంగానే అని సూచిస్తాయి.
నరాల వాపు (ఆంజియోడెమా) కారణం ఆధారంగా, వైద్యులు మందులను సూచించగలరు. కొన్నిసార్లు, ఈ పరిస్థితికి అంటే నరాల వాపు సమస్యకు మందులు అవసరం లేదు, దానంతటదే నయమైపోతుంది. అయితే, ఈ నరాల వాపుల్లో ఉగ్రమైన రూపు దాల్చిన (అంటే విపరీతమైన దద్దుర్లుతో కూడిన నరాల వాపు) నరాల వాపు సమస్యకు నిర్దిష్టమైన వైద్య చికిత్స చాలా అవసరం. ఈ చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం వాపు, దురద, మరియు నొప్పిని తగ్గించడం.
సాధారణంగా నరాల వాపు రుగ్మతకు ఉపయోగించే మందులు దురదను పోగొట్టేందుకు ఇచ్చే మందులు, నొప్పి, వాపు నివారణకు వాడే మందులు, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు), రోగనిరోధక వ్యవస్థను అణచివేసే మందులు, నొప్పి మరియు వాపును తగ్గించే మందులు అయి ఉంటాయి.
ఒక ప్రతిచర్య వలన నరాలవాపు (ఆంజియోడెమా) దాపురించినట్లయితే, ఆ ప్రతిచర్యను కల్గించిన దాన్నినివారించడంతో సరిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో యాంటీ-హిస్టామిక్ మరియు స్టెరాయిడ్ మందులను ఉపయోగించవచ్చు.
కొన్ని ఔషధాల వాడకం వలన నరాల్లో వాపు, నొప్పి (ఆంజియోడెమా) మీకు దాపురించి ఉంటే, అలాంటి పరిస్థితిలో మీ వైద్యుడిని సందర్శించి మీరు తీసుకుంటున్న ఔషధాల్ని ఆపడం గురించి మాట్లాడండి, ఇపుడు తీసుకుంటున్న మందులకు బదులు మీరు బాగా తట్టుకోగలిగిన ఔషధాల్ని సూచించమని డాక్టర్ ని అడగండి.
వంశపారంపర్య నరాల వాపు రుగ్మతకు (ఆంజియోడెమా) చికిత్స చేయలేము, కానీ C1 ఎస్టేటేస్ ఇన్హిబిటర్ యొక్క స్థాయిని పెంచే మందులను ఉపయోగించి నరాలవాపు నొప్పిని, లక్షణాలను తగ్గించే చికిత్స చేయవచ్చు.
నరాల వాపు (నొప్పి) మందులు
నరాల వాపు (నొప్పి) కొన్న మందులు మీ డాక్టర్ సలహాలు మేరకు వాడాలి
Medicine Name | Pack Size | Price (Rs.) |
---|---|---|
Dexoren S | Dexoren S Eye/Ear Drops | 16 |
Practin | Practin Syrup | 87 |
Low Dex | Low Dex Eye/Ear Drops | 8 |
Dexacort | Dexacort Eye Drop | 13 |
Dexacort (Klar Sheen) | Dexacort (Klar Sheen) 0.1% Eye Drop | 14 |
4 Quin Dx | 4 Quin Dx Eye Drop | 13 |
Solodex | Solodex 0.1% Eye/Ear Drops | 5 |
Apdrops Dm | Apdrops Dm 0.5% W/V/1% W/V Eye Drop | 103 |
Hungree Syrup | Hungree Syrup | 58 |
Normatone | NORMATONE SYRUP 210ML | 55 |
Lupidexa C | Lupidexa C Eye Drop | 7 |
Dexcin M | Dexcin M Eye Drop | 59 |
Ocugate Dx | Ocugate Dx Eye Drop | 8 |
Mfc D | Mfc D Eye Drop | 84 |
Hysin | HYSIN SYRUP 200ML | 62 |
Mflotas Dx | Mflotas Dx 0.5%W/V/0.1%W/V Eye Drop | 78 |
Mo 4 Dx | Mo 4 Dx Eye Drop | 64 |
Moxifax Dx | Moxifax Dx Eye Drop | 52 |
Moxitak Dm | Moxitak Dm Eye Drops | 16 |
Myticom | Myticom Eye Drop | 72 |
Occumox Dm | Occumox Dm 0.5%/0.1% Eye Drop | 0 |
Mflotas D | Mflotas D Eye Drop | 0 |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి