7, డిసెంబర్ 2019, శనివారం

చలి కాలం తీసుకోవాలిసిన జాగ్రత్తలు

*చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?జాగ్రత్త లు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

అపుడే చలి కాలం వచ్చేసినట్టుగా ఉంది. ఈ కాలంలో చర్మం  పొడిబారుతుంది. నూనెలు వాడితే జిడ్డుగా అనిపిస్తుంది. మాయిశ్చరైజర్ వాడినా ఫలితం కనిపించడం లేదు. పైపెచ్చు.. దురద వస్తుంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు చిన్నపాటి సలహా పాటించినట్టయితే చాలు.

*- గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం అవసరం. ఈ సీజన్లో అమ్ముతున్నారని ఏవేవో క్రీములు ముఖంపై, శరీరంపై రాసుకుంటే మొదటికే ప్రమాదం వస్తుంది. చర్మతత్వాన్ని బట్టి క్రీమ్‌ని ఎంచుకోవాలి.*
- సాధ్యమైనంత వరకూ చలిలో చర్మాన్ని ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవాలి. దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. పౌడర్ల జోలికి వెళ్లకుండా ఉండడం మేలు.
*- చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవిలోలా నీరు పదే పదే తాగాలనిపించదు. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో నీరు తాగుతుండాలి. దీనికి అదనంగా వ్యాయామూ ఉండాలి. రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేస్తే రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా సాగుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయి.
- గులాబీనీరూ, తేనె సమానంగా తీసుకుని బాగా కలిపి ముఖం, మెడకు రాసుకోవాలి. పదినిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తేనె చర్మానికి తేమనందిస్తుంది. పొడిచర్మతత్వం ఉన్నవారు ఈ చిట్కాను రోజూ ప్రయత్నిస్తే చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
- పెదవులు పొడిబారి, పగిలినట్లు అవుతుంటే. తేనెలో కాస్త గ్లిజరిన్‌ కలిపి రాసుకోవాలి. ఇలా రోజులో రెండుమూడుసార్లు చేస్తుంటే పగుళ్ల సమస్య తగ్గి, పెదవులు తాజాగా కనిపిస్తాయి.
- చర్మం పొడిబారినప్పుడు పాదాలు కూడా పగలడం కొందరిలో కనిపిస్తుంది. ఇలాంటివారు టేబుల్‌స్పూను ఆలివ్‌నూనెకు, అరచెంచా నిమ్మరసాన్ని కలిపి రాత్రిళ్లు పాదాలకు రాసుకుని, సాక్సులు వేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే ఆ సమస్యలు తగ్గుతాయి.
- స్నానానికి ముందు కొబ్బరి లేదా ఆలివ్‌నూనెను ఒంటికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారదు. చెంచా సెనగపిండికి చిటికెడు పసుపూ, అరచెంచా పాలు లేదా పెరుగు కలిపి ముఖం, మెడకు రాసుకుని, బాగా మర్దన చేయాలి. ఆ తరవాత స్నానం చేస్తే ముఖానికి తేమ అందుతుంది

*సాధారణంగా చలి కాలం సూర్యకాంతి ప్రభావం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ కాలంలోనే చర్మం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. అందుకని సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించే క్రీమ్‌లను వినియోగిస్తే మేలు. అలాగే, స్నానం చేయడానికి 10 నిమిషాలు ముందు కొబ్బరినూనెను శరీరమంతా రాసుకుంటే చాలా మంచిది.*

చలి కదా అని మరీ వేడినీళ్లతో స్నానం చేయకూడదు. చర్మంపై ఉండే నూనెలను వేడి మరింతగా ఆవిరి చేస్తుంది. స్నానానికి గోరువెచ్చని నీటిని వాడితే చాలా మంచిది. చర్మాన్ని పొడిబార్చే క్లెన్సర్లు, స్క్రబ్‌లు ఈ కాలం ఉపయోగించకూడదు.

* చలికాలం ఎండ ఒంటికి అంత మంచిది కాదు. బయటికి వచ్చేటప్పుడు సన్‌స్క్రీన్‌లోషన్‌ తప్పక రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. పచ్చికూరలూ పళ్లూ అధికంగా తినాలి.

*ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మారోగ్యాన్ని సంరక్షిస్తాయి. అవి పుష్కలంగా లభ్యమయ్యే పాలు, చేపలు, వాల్‌నట్స్‌, సోయా, అవిసె గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి*.

* పెరుగులో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి ముఖానికి రాయాలి. ఈ మిశ్రమం మంచి బ్లీచింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తుంది
.
* సెనగపిండి, పాలు కలిపి పేస్టులా చేసి రాయండి. పావుగంట తర్వాత కడిగేస్తే చర్మం సరికొత్త కాంతులీనుతుంది
.
* రెండు నిమ్మచెక్కలను తీసుకుని ముఖంపైనా మెడపైనా రుద్ది ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం తేటగా ఉంటుంది.

*మార్కెట్లో రకరకాల సబ్బులూ క్రీములూ దొరుకుతాయి. కానీ వాటి కన్నా చర్మాన్ని శుభ్రపరిచే సహజగుణాలు కలిగిన పసుపు, శనగపిండి, తేనె వంటివి వాడటం వల్ల మరిన్ని లాభాలు ఉన్నాయంటున్నారు నవీన్ నడిమింటి  సౌందర్య నిపుణులు.

* అరకప్పు పాలల్లో అరకప్పు శనగపిండి, చెంచాడు పసుపు కలపండి. తయారైన మిశ్రమాన్ని ముఖానికీ మెడకూ పట్టించండి. ఐదునిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. జిడ్డు చర్మం గలవారికి ఈ ప్యాక్‌ బాగా పనిచేస్తుంది.

* ఒక కప్పు పెరుగులో టేబుల్‌స్పూన్‌ తేనె కలపండి. బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి ఐదునిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. పొడిచర్మం గలవారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.

* అరకప్పు గోరువెచ్చటినీళ్లలో ఒక టేబుల్‌స్పూన్‌ తేనె వేయండి. మందుల షాపులో దొరికే ఎ, ఇ విటమిన్‌ టాబ్లెట్లను ఒక్కొక్కటి తీసుకొని వాటి పొడిని తేనె, నీళ్ల మిశ్రమంలో వేసి బాగా కలపండి. తరచుగా ఈ చిట్కాను పాటిస్తే ముఖంపై ఉండే మచ్చలు క్రమంగా తొలగిపోతాయి.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 

మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు: