28, డిసెంబర్ 2019, శనివారం

కంటి వాపు నొప్పి నివారణకు నవీన్ సలహాలు



కళ్ళతో ఎన్నో హావభావాలు చేస్తుంటారు. అందమైన కళ్ళు మీద ఎన్నో కవితలు, పాటలు కూడా వ్రాసిని కవులు, రచయితలున్నారు. మనలోని ఎమోషన్స్ ను ఎంత దాచాలనుకున్నా కళ్ళు మాత్రం దాచలేవు . మన గురించి మన కళ్ళు చెప్పేస్తాయి. అంతట పవర్ ఫుల్ శక్తి మన కళ్ళకున్నాయి.

మీకు ఇష్టమైన వారికి లవ్ ప్రపోజ్ చేయాలన్నా లేదా మీలోని భావనలు వ్యక్తపరచాలన్నా.. వెంటనే చేయడం అనేది కష్టం కదూ? అదే కళ్ళ కాస్తా ఎరుపెక్కాయనుకోండి. మీలోని ఫీలింగ్స్ ను ఎదుటి వారు ఇట్టే పసిగట్టేస్తారు. అలా అని ఆమెకు మీరు ప్రపోజ్ చేయాలనుకుంటే ఆమె కళ్ళు ఇదివరికే ఎరుపెక్కి వుండటం వల్ల అదీ జరగదు. ఎందుకంటే మీ ఫీలింగ్స్ ను ఆమె చూడలేదు కాబట్టి.

మంచి కంటి చూపు కోసం 20 పవర్ ఫుల్ చిట్కాలు

కళ్ళు ఎరుపెక్కినా, కళ్ళు ఉబ్బినా చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. ముఖ్యంగా కళ్ళ నొప్పి చాలా బాధిస్తుంది. ఎందుకంటే కళ్ళు చాలా సున్నితమైనవి అందుకే త్వరగా నొప్పి లేదా వాపుకు గురిఅవుతుంటాయి. కళ్ళ నొప్పికి వివిధ రకాల మెడిసిన్స్ మెడికల్ స్టోర్లో అందుబాటులో ఉన్నా అవి వెంటనే ఉపశమనం కలిగించకపోవచ్చు. సాధారణంగా కళ్ళ నొప్పిని రెండు క్యాటగెరీలుగా చెప్పవచ్చు . కంటి వద్ద (ఆక్యులార్ పెయిన్) అంటారు. అదే కళ్ళలోపలి వైపు వచ్చే నొప్పి చాలా ప్రమాధకరమైనది . ఈ కంటి సమస్యను ఆప్తాల్మాగియా అంటారు. కళ్ళు దురద, కళ్ళు రెడ్ గా మారడం, కళ్ళు నరాలు బటయకు కనబడుట వంటి లక్షణాలను మనం గమనించవచ్చు.

కంటి చూపును మెరుగుపరిచే ఉత్తమ హోం రెమెడీలు

అంతే కాదు కళ్ళ ఇన్ఫెక్షన్స్ వల్ల కంటి చూపులో కూడా సమస్యలుంటాయి . ఇటువంటి పరిస్థితిని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించాలి . కళ్ళ నొప్పిని వెంటనే గుర్తించినట్లైతే ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ లేకుండానే కంటినొప్పి తగ్గించుకోవచ్చు . అలా జరగనప్పుడు సమయం వ్రుదా చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి . మరియు కంటి నొప్పికి ముఖ్యమైన లక్షణాలను గుర్తించాలి. కళ్ళ నొప్పి మరియు కళ్ళు ఉబ్బడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం...

గ్లూకోమా:

ఆర్బిటాల్ పెయిన్ కు గ్లూకోమా ఒక ముఖ్య కారణం. గ్లూకోమాతో బాధపడే వారు, కళ్ళలోని ఇట్రూసివ్ ప్రెజర్ పెరుగుతుంది . అందువల్ల ఆమె లేదా అతడు ఇంటెన్స్ పెయిన్ తో బాధపడుతుంటారు . దీని వల్ల కొన్ని సందర్బాల్లో కంటి చూపు కోల్పోవడం లేదా తలనొప్పితో బాధపడుతుంటారు.

సైనసిటిస్:

సైనస్ సమస్య ఉన్నట్లైతే?అయితే ఎడమ వైపు భాగంలో ఎక్కువగా నొప్పి వస్తుంటుంది. ఇది కూడా ఒక రకమైన ఆర్బిటల్ నొప్పే. దాంతో తలనొప్పి మరియు ఫేషియల్ మజిల్ పెయిన్ ను ఎదుర్కొంటారు.

ఆప్టిక్ న్యూరిటిస్:

కళ్ళ నొప్పికి మరియు వాపుకు కారణం ఆప్టిక్ న్యూరిటిస్ . బ్యాక్టీరియల్ లేదా వైరల్ అటాక్ వల్ల ఆప్టిక్ నర్వ్స్ లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది . ఈ రకమైన నొప్పి వల్ల కంటి చూపును కూడా కోల్పోతారు. కాబట్టి ఆలస్యం చేయకుండా త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి.

ఐరిటిస్:

సమస్య అంత పెద్దగా తెలియకపోయినా, ఈ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు . ఈ సమస్య ఉన్న వారిలో కంట్లో చాలా చురుకుగా నొప్పిని కలిగి ఉంటారు. ఇది ఇన్ఫెక్షన్స్ మరియు ఇన్ఫ్లమేషన్ వల్ల జరుగుతుంది.

కంజెక్టివిటీస్:

కళ్ళు చాలా పింక్ కలర్లో ఉంటాయి . ఇది కంజెక్టివిటీకి ఇది మరోక పేరు . అదే అక్యులర్ పెయిన్ . అలర్జీ వల్ల కళ్ల యొక్క కంజెక్టివిటి ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంది . కళ్ళ ఇన్ఫ్లమేషన్ మరియు కళ్ళలో నీరు కారడం, కళ్ళు అలర్జీకి గురవ్వడం, ఇన్ల్ఫమేషన్ , దురద వంటి లక్షణాలు కనబడుతాయి.

కార్నియల్ అబ్రేషన్:

కళ్ల నొప్పి వల్ల కార్నియల్ అబ్రేషన్ వల్ల కంటి నొప్పి మరియు వాపు ఉంటుంది. దీన్ని మీరు నిర్లక్ష్యం చేయడానికి లేదు. కంటి నొప్పి, మరియు వాపుతో బాధపడుతున్నట్లైతే కంట్లో ఏదో స్టిక్ అయినట్లు గుర్తించాలి.

కాంట్రాక్ట్ లెన్స్ వల్ల ఇరిటేషన్ :

ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది . కాంట్రాక్ట్ లెన్స్ అడ్జెస్ట్ చేసుకోవడానికి సమయం పడుతుంది. దాని వల్ల నొప్పి మరియు సాధారణ ఇరిటేషన్ కలిగి ఉంటుంది. కాంటాక్ట్ లెన్స్ అమర్చే విధానం కూడా చాలా కష్టం కాబట్టి కళ్ళ నొప్పి మరియు వాపు సహజం. కాంటాక్ట్లెన్స్ తోనే రాత్రి నిద్రపోవడం వల్ల కళ్ళ నొప్పి మరియు ఇన్ఫెక్షన్ కు గురి కావల్సి వస్తుంది.

ఫారిన్ ఆబ్జెక్ట్స్:

కళ్ళ నొప్పికి మరియు వాపుకు ఇది ఒక మెయిన్ రీజన్ . డస్ట్, మేకప్ ైటమ్స్, సోప్ వంటి మొదలగు వాటి వల్ల కూడా కళ్ళ మంటలు, నొప్పి, వాపు ఉంటుంది . అలాంటప్పుడు వెంటనే చల్లటి నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి . అయినా కూడా కళ్ళ నొప్పి బాధిస్తుంటే వెంటనే డాక్టర్ ను కలవాలి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

కామెంట్‌లు లేవు: