2, డిసెంబర్ 2019, సోమవారం

మోకాలు నొప్పులు తగ్గాలి అంటే అవగాహనా కోసం

Sunday, March 6, 2011

ఆస్టియో ఆర్థరైటిస్‌ ,Osteo-Arthritis



  • image : courtesy with Vaartha News paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఆస్టియో ఆర్థరైటిస్‌ ,Osteo-Arthritis- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏమిటి?
-శరీరంలోని కీళ్లు (జాయింట్లు) వ్యాధిగ్రస్తం కావడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్‌ అని అంటారు. కీళ్ల ఉపరితలం గరుకుగా తయారవడం, దానిని ఆవరించి ఉండే ఎముకలు ఎగుడు దిగుడుగా పెరగడం వంటివి జరుగుతాయి.

ఆస్టియో అంటే ఎముక, ఆర్తరైటిస్‌ అంటే వాపు లేదా ఇన్‌ఫ్లమేషన్‌ అని అర్థం. జాయింట్లు వాచిపోయి పాడైపోయినప్పుడు నొప్పి రావడం, కదలికలు బాగా తగ్గడం జరుగుతాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌ను ఆస్టియో ఆర్థ్రోసిస్‌, డీజెనరేటివ్‌ జాయింట్‌ డిసీజ్‌ అని కూడా వ్యవహరిస్తారు.
చేతి వేళ్ల కణుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటన వేళ్లు తదితర ప్రదేశాలలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ, మోకాళ్లలోనే ఆస్టియో ఆర్థరైటిస్‌ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్లు ఎక్కువగా అరుగుదలకు గురి కావడమే.
ఈ వ్యాధి మోకాలులో ఎలా మొదలవుతుందో తెలుసుకోవాలంటే, ముందుగా సాధారణ జాయింట్‌ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలి.

జాయింటు లేదా సంధి అంటే రెండు ఎముకల కలయిక. మన శరీరంలో ఉండే అనేక రకాల జాయింట్లు వివిధ ఎముకలను వివిధ భంగిమలలో కదిలిస్తూ ఉంటాయి. మోకాలు జాయింటు మన శరీరంలో అన్నిటికంటే పెద్దది కావడమే కాకుండా, అనేక రకాల క్లిష్టమైన పనులను ఏకకాలంలో చేస్తుంది. అంతే కాకుండా, గొళ్లెంలాగా పని చేస్తూ మనం నడవడానికి తోడ్పడుతుంది. పరుగెత్తేప్పుడూ, దుమికేప్పుడూ, ఆటలాడేప్పుడూ అదురునూ, ఒత్తిడినీ తనలో ఇముడ్చుకుని శరీరాన్ని రక్షిస్తుంది.

మోకాలు జాయింటులో తొడ ఎముక (ఫీమర్‌), దిగువ కాలు ఎముక (టిబియా) అనేవి రెండూ కలుస్తాయి. ఈ రెండు ఎముకల చివరి భాగాలు మృదువైన పదార్థంతో (కార్టిలేజ్‌ లేదా మృదులాస్థి)తో తాపడం చేసినట్లు ఉంటాయి.
ఈ కార్టిలేజ్‌ చాలా నునుపుగా ఉండటం వలన రెండు ఎముకలూ ఒకదాని మీద మరొకటి ఒరిపిడి లేకుండా తేలికగా కదలగలుగుతాయి. అలాగే అదురును, లేదా షాక్‌ను గ్రహించగలుగుతాయి. అదురును నిరోధించడానికి మోకాలు జాయింటులో అదనంగా రెండు మినిస్కల్‌ కార్టిలేజ్‌లు ఉంటాయి.

జాయింటును చుడుతూ సైనోవియం అనే పొర ఉంటుంది. ఇది జారుడుగా ఉండే సైనోవియల్‌ ఫ్లూయిడ్‌ అనే ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రవం కార్టిలేజ్‌కు పోషక తత్వాలను అందించడమే కాకుండా, కార్టిలేజ్‌ను నునుపుగా ఉంచుతుంది.
సైనోవియం పొరను కప్పుతూ, కేప్సూల్‌ అనే గట్టిపొర ఒకటి ఉంటుంది. ఇది జాయింటును స్థిరంగా ఉంచుతుంది.
మోకాలు జాయింటులో ఉండే మరొక ముఖ్యమైన భాగం పేరు మోచిప్ప లేదా పటెల్లా. ఈ మోచిప్ప దిగువ కాలు ప్రారంభంలో మోకాలు జాయింటుకు కొంచెం కింది భాగాన్ని కూడా మృదులాస్థి కప్పి ఉంచుతుంది. మోచిప్పనూ, తొడ కండరాలనూ ఒక బలమైన రజ్జువు (టెండాన్‌) కలుపుతుంది.

టెండాన్లు అనేవి కండరాలను, ఎముకలను కలిపి ఉంచే నిర్మాణాలు. ఇవి జాయింట్లకు ఇరుపక్కలా ఉంటూ, వాటిని సరైన స్థానంలో అమర్చి ఉంచుతాయి. కండరం సంకోచిం చినప్పుడు ఈ టెండాన్‌ కురచగా మారి ఎముకను లాగుతుంది. దీనితో జాయింటులో కదలిక వస్తుంది.
రెండు ఎముకలను కలిపే నిర్మాణాలను లిగమెంట్‌ అంటారు. మోకాలు జాయింటును స్థానభ్రంశం చెందనివ్వకుండా నాలుగు పెద్ద లిగమెంట్లు సహాయపడుతుంటాయి. కేప్సూల్‌తో సహా ఈ లిగమెంట్లు ఎముకలను ఎటుపడితే అటు కదలనివ్వకుండా నిరోధిస్తుంటాయి.
ఈ లిగమెంట్లు కేప్సూల్‌కు బైటవైపున రెండు, లోపలి వైపున రెండు ఉంటాయి. తొడ లోపల ఉండే క్వాడ్రిసెప్స్‌ అనే కండరం కూడా మోకాలు స్వస్థానంలో ఉండటానికి సహాయపడుతుంది.

మోకాలు జాయింటులో ఆస్టియో ఆర్థరైటిస్‌ మొదలైన ప్పుడు కార్టిలేజ్‌ క్రమంగా గరుకుగా తయారై పలుచగా మారుతుంది. ఇలా ఎముకపైన, మోచిప్ప లోపల ఉండే లైనింగులలో ఎక్కడైనా జరుగవచ్చు. దీనికి ప్రతిచర్యగా ఎముకలోని కణజాలం ప్రభావితమవుతుంది.
ఎముకల తాలూకు చివరి భాగాలు అదనంగా పెరిగి ఆస్టియోఫైట్స్‌ మారుతాయి. ఈ పెరుగుదలల ప్రభావం తొడ ఎముక, దిగువ కాలులోని ఎముక, మోచిప్పల మీద పడుతుంది. దీనిలో భాగంగా సైనోవియం కొంచెం ఉబ్బి అదనపు ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఫలితంగా జాయింటులో వాపు కనిపిస్తుంది.

ఇంత జరుగుతున్నప్పుడు జాయింటులోని ఇతర నిర్మాణాలు ప్రతిచర్యలను ప్రారంభి స్తాయి. కేప్సూలు, లిగమెంట్లూ నెమ్మదిగా లావుగా మారి ముడుచుకుపోతాయి. మోకాలు కీలును కదిలించే కండరాలు బలహీనపడి ఆర్చుకుపోతాయి. ఈ పరిణా మాల పర్యవసానంగా కీలులో పటుత్వం తప్పి బరువు పడిన ప్పుడల్లా కీలు బెణుకుతున్నట్లు అనిపిస్తుంది.
  •  
ఆస్టియో ఆర్థ్రైటిస్ లక్షణాలు :
  • కీళ్ళు వాచి , బిగుసుకుపోయి బాధిస్తాయి. ,
  • వ్యాయామము చే్సినపుడు ఆ కీళ్ళు బాధ మరింత పెరుగుతుంది. 
  • కీలు భాగాన్ని గతములో కదిలించినంత సులభం గా కదిలించలేరు .
  • కీళ్ళ దగ్గర రాపిడి శబ్దాలు వస్తాయి, 
  • ఆస్టియో ఆర్థ్రైటిస్ పెరిగినకొద్దీ కీళ్ళభాగాలు ఉబ్బుతాయి. ఆ వాపు కూడా వస్తూ పోతూ ఉంటుంది . 
  • కొన్ని సందర్భాలలో భాద తీవ్రమవుతుంది ..అందుకు ప్రత్యేకమైన కారణము కనిపించదు  . 
  • వాతావరణ మార్పులు , శారీరక కదలికలను బట్టి  భాద పెరుగుతుందని చెప్పవచ్చు. 
  • చేతులు : బొటనవేళ్ళు , వేళ్ళ చివరి మెటికల భాగాలు వాచి వేళ్ళు వంగవు . కీలు వెనుక భాగము లో ఉబ్బెత్తుగా తయారవుతుంది . దానిని ''హెబర్దీన్‌ కనుపు '' అంటారు. 
  • మెడ ,వీపు : (స్పాండిలైసిస్ ) వెన్నుపూసల మధ్య ఉన్న మృదులాస్థి అరిగిపోయి వెన్నుపూసల ఎడమ తగ్గిపోయి , వెన్నుపూస అంచుల దగ్గర ఏర్పడే అదనపు ఎదుగుదల తెచ్చే ఒత్తిడి వల్ల చేతులు లాగేస్తున్నట్లు , చేయి చచ్చుబడినట్లు అవుతుంది . 
  • పాదాలు : కాలిబొటనవేలు ఆధారభాగము లో వచ్చే ఆస్టియో ఆర్థ్రైటిస్ వల్ల ఆభాగము బిగుసుకుపోయి నడవడం చాలా కష్టమవుతుంది . కీళ్ళదగ్గర ఉబ్బినట్లయి బాధిస్తుంది . 
  • మోకాలు : మోకాలు ముందుభాగము ప్రక్క భాగము బాధిస్తాయి . ఈ వ్యాధి తీవ్రమయినపుడు మూకాలు వంగినట్లు అవుతుంది . 
  • తుంటి : గజ్జల భాగములో నొప్పి లేదా తొడ ముందు పక్కభాలాలలో బాధ , తుంటినుండి  మోకాలు వరకూ తీవ్రమైన బాధ . దీనివలన  కాలు కొంచము కురచ(పొట్టి) అవుతుంది
ఆస్టియో ఆర్థ్రైటిస్ ఎందుకు వస్తుంది ?:
  •  ఆస్టియో ఆర్థ్రైటిస్ వ్యాధి ఎందుకు వస్తుందో స్పష్టం గా తెలియదు . ఐతే ఎలాంటి సందర్భాలలో వస్తుందో తెలిసింది . 
  • వయసు 40 సం.దాటితే,
  • మహిళల్లొ ఎక్కువ గా , 
  • భారీ కాయము కలవారిలో తరచుగా , 
  • వంశములో ఈ వ్యాధి ఉన్నపుడు , 
  • ఆటల్లో కీలుకు దెబ్బతగిలినపుడు , 
  • ఏదైనా ఇతర కారణాలువల్ల కీళుకు ఆపరేషన్‌ అయినపుడూ, 
  • రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ ప్రారంభమయినపుడు .. అది ఆస్టియో ఆర్థరైటిస్‌ దారితీయవచ్చు ,
గుర్తించడము ఎలా?:
  • ఆస్టియో ఆర్థరైటిస్‌ ఎదోఒక పరీక్షతో గుర్తించడము సాధ్యము కాదు . అందుకే వైద్యులు బాధ లక్షణాలు అడుగుతారు . ప్రత్యక్షముగా పరీక్షలు(physical examinatio) చేస్తారు . రోగ చరిత్ర తెలుసుకుంటారు . ఎముకల వాపు , అదనపు ఎదుగుదల , ఎకుకల శబ్ధాలు , కీళ్ళ బలహీనత , కీళ్ళ కదలికలలో మార్పులు , ఉదయము లేచిన వెంటనే అరగంట వరకు కీళ్ళు స్వాదీనములోకి రాకపోవడము వంటి లక్షణాలు వైద్యులు అడిగి తెలుసుకుంటారు . 
 ఆస్టియో ఆర్థరైటిస్‌ చికిత్స : 
  • చికిత్స కు స్పష్టమైన లక్ష్యము పెట్టుకుంటారు వైద్యులు . బాధను , ఇతర తోగ లక్షణాలను తగ్గించడము , కీళ్ళ పనితీరు మరింత దిగజారకుండా చూడడము లేదా మెరుగుపరచడము , కీళ్ళ వంకరలు తగ్గించడము . ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్సకు అమెరికన్‌ కాలేజ్ ఆఫ్ రుమటాలజీ(A.C.R) కొన్ని మార్గ దర్శకాలు విడుదల చేసింది . అయితే చికిత్సా పరమైన నిర్ణయము మీద వైద్యుడు , రోగి (patient) దే తుదినిర్ణయమని ఎ.సి.ఆర్. స్పష్టము చేసింది . వారి చికిత్స సూచనలో మందులను వినియోగించి , మందులు వినియోగించకుండా చేసే చికిత్సా విధానాలలో ఒకదానిని రోగి ఎంపిక చేసుకోవచ్చును. 
మందుల అవసరము లేకుండా చికిత్స :
  •  ముందుగా ఈ విధానపు చికిత్స చేయించడము మంచిది . ఈ విధానములో మందులు వల్ల వచ్చే సైడు ఎఫెక్ట్సు సమస్య ఉండదు . రోగికి అవగాహం పెంచి తనకు తానుగా జాగ్రత్తలు పాటించేలా చేయడము . భారీకాయుల బరువు తగ్గించడము , కండరాలకు బలమిచ్చేలా వ్యాయామము ,-ఎయిరోబిక్ కండిషన్‌ వ్యాయామము , పరికరాల ద్వారా కీళ్ళ పనితనము మెరుగుపరచడము . టాపింగ్ మరియు బ్రేసింగ్ . కీళ్ళ నొప్పులకు ఆక్యుపేషనల్ థెరపీ .  . రక్తప్రసరణ ఎక్కువ చేసే వేడినీళ్ళ సంచితో కాపడము ...మున్నగునవి చేయాలి.
మాత్రలు :
  • నొప్పినివారణ మందు --- ఎసిటమైనోఫెన్‌, ఓపియాడ్ అనాల్జెసిక్స్ (ఆల్ట్రామ్‌). NSAIDS --ఐబుప్రొఫెన్‌ , నెఫ్రాక్షిన్‌ , డైక్లోఫెనాక్  మున్నగునవి . cocks 2 inhibitors (selbreks) , Non acetylated salcilates  , కొన్ని ఉదాహరణకు మాత్రమే 
  • ఆస్టియో ఆర్థరైటిస్‌ ఆపరేషన్‌ : చికిత్సలో చివరిగా ఆశ్రయించేది ఆపరేషన్‌ . తీవ్రమైన బాధ అనుభవించే వారికి , కీలు కదలిక తగ్గిపోతున్నపుడు , మందులకు స్పందించనపుడు ఆపరేషన్‌ తప్పదు . సాదారణము " ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ , ఆస్టియోటమీ , టోటల్ జాయింట్ రిప్లేస్ మెం

కామెంట్‌లు లేవు: