3, డిసెంబర్ 2019, మంగళవారం

చిన్న ఏజ్ లో కీళ్ల నొప్పులు రావడానికి కారణం మరియు నివారణ

*కీళ్ళ నొప్పులు(ఆర్థరైటిస్) ఉన్నవాళ్ళు నివారణ  ముట్టకూడని  ఆహారపదార్ధాలు  ఇవేఅవగాహనా కోసం వీడియో లో చుడండి *

By Naveen Nadiminti

          పెరుగుతున్న వయసు దృష్ట్యా, వృద్దాప్యం అనేది జీవితంలో ఒక భాగం అనే విషయాన్ని అందరూ ఆమోదించాలి. ఈ విషయాన్ని సాదరంగా ఆహ్వానించినప్పటికీ, కొన్ని సార్లు వృద్దాప్యాన్ని భరించడం కష్టతరం అవుతుంది దీనికి కారణం కొన్ని వృద్దాప్య సంబంధిత వ్యాధులే. అందులో ప్రముఖంగా చెప్పబడేది ఆర్థరైటిస్(కీళ్ళ నొప్పులు).

రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండడం మూలాన, జీవక్రియ విధానాలు బలంగా ఉన్నందువలన, యుక్తవయసులో ఉన్నప్పుడు రోగాలను ఎదుర్కునే శక్తిని కలిగి ఉండడం సహజం. కాని ఒక వయసుకి వచ్చాక, అదీ 50 పై బడిన వయసుకి వచ్చాక, ఎక్కువ శాతం ప్రజలు అనేక రోగాల బారిన పడడం ప్రారంభిస్తారు. దీనికి ప్రధాన కారణం రోగ నిరోధక వ్యవస్థ తగ్గడమే.

           50 పైబడిన వారిలో ఎక్కువగా అలసట, జాయింట్ పెయిన్, మహిళలలో మెనోపాజ్ సమస్యలు, అధిక రక్తపోటు, ఆర్థరైటిస్, గుండె జబ్బు, అల్జీమర్స్, డిమెన్షియా వంటివి సహజంగా కనిపిస్తూ ఉంటాయి.
ఈ వయసు ఆధారిత వ్యాధులను అంగీకరించడం కష్టంగా ఉంటుంది. కావున వృద్దాప్యాన్ని అంగీకరించలేని పరిస్థితుల్లో ఉండడం సహజమే. కాని కొన్ని సహజ సిద్దమైన ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడం మూలంగా, ఆ వయసు సంబంధిత వ్యాధులను సైతం సమర్ధవంతంగా ఎదుర్కోగల శక్తి సమకూరుతుంది.
అదేవిధంగా కొన్ని ఆహారపదార్ధాలను తక్షణం దూరం చెయ్యడం ద్వారా, ఆర్థరైటిస్ సమస్య రాకుండా నిరోధించవచ్చు. ఇక్కడ వాటిలో కొన్నిటిని పొందుపరచడం జరిగినది.
అసలు ఆర్థరైటిస్ అంటే ఏమిటి?
ఆర్థరైటిస్ అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి. మోకాలు, వెన్ను, మణికట్టు, చేతివేళ్లు మొదలైన అవయవ కండరాలపై, వాటి కీళ్ళ(జాయిoట్స్) పై ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణాన శరీర కదలికలు కష్టతరమవుతాయి. ఈ పరిస్థితి ఎక్కువగా 60 ఏళ్ల వయస్సు ఉన్నవారిలో కనిపిస్తుంది. మరియు రాను రాను తీవ్రమవుతుంది. ఆర్థరైటిస్ నివారించడానికి వదిలివేయవలసిన కొన్ని ఆహార పదార్ధాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.
కీళ్ళ నొప్పుల నివారణకు సూచించబడిన ఆహార పదార్ధాలు:
*1. వేయించిన మాంసం (ఫ్రైడ్ మీట్)*

ఈరోజుల్లో అత్యధికులు ఇష్టపడే ఆహారపదార్ధాలు చిప్స్ , ఫ్రైస్, సమోసాలు, వేయించిన కోడి వంటివి. ఇవి రుచికరంగా ఇష్టపూరితంగా ఉంటాయి. కాని వేయించిన ఆహార పదార్ధాలు, అందులో ముఖ్యంగా వేయించిన మాంసం వలన శరీరంలో కొవ్వు శాతం అధికంగా పెరగడం జరుగుతుంది. తద్వారా ఆర్థరైటిస్ మాత్రమే కాకుండా, మూత్ర పిండాల పని తీరుపై ప్రభావం పడి, రక్తంలో కొవ్వు శాతం పెరగడం మూలంగా గుండె జబ్బుకి కూడా కారణం అవుతుంది. మరియు ఈ వేయించిన మాంసంలో ఉన్న అనారోగ్యకర కొవ్వు ఫలితంగా ఆర్థరైటిస్ ముప్పు పెరిగి కీళ్ళపై ఆ ప్రభావాన్ని చూపుతుంది. కావున వేయించిన మాంసం తగ్గించడం మంచిది.

*2. గ్లూటెన్-రిచ్ ఫుడ్స్*

        ఈరోజుల్లో ఎక్కువ మంది గ్లూటెన్-ఫ్రీ ఆహారాలు తినడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. చపాతీ, బిస్కెట్స్, బ్రెడ్ వంటి గోధుమ సంబంధిత ఆహార పదార్ధాలని గ్లూటెన్-రిచ్ ఆహార పదార్ధాలుగా పిలుస్తారు. గ్లూటెన్ అనేది ఒక విషపూరితమైన సమ్మేళనం , ఇది జీర్ణ సమస్యలు, చర్మ వ్యాధులు, అలర్జీలు మరియ ఆర్థరైటిస్ కు కూడా కారణం కావొచ్చు. కావున వీటిపట్ల జాగ్రత్త వహించడం మంచిదని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు.

*👉🏿కీళ్ళనొప్పులని తగ్గించుకోవటానికి అధ్బుతమైన నవీన్ సలహాలు .

 కీళ్ళనొప్పులు. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని మార్గాలను తెలుసుకుందాం.
• నువ్వులనూనెలో వెల్లుల్లిపాయలు వేయించి పరిగడుపున ఒకటి లేక రెండు తిన్నట్లైతే కీళ్ళనొప్పులు, ఇతర నొప్పులు తగ్గుతాయి.
• వాతపు నొప్పులకు శొంఠి , కరక్కాయ పొడిని ఒక స్పూను మోతాడులో రోజుకు రెండుసార్లు తీసుకుంటే తగ్గుతాయి.
• నడుము నొప్పికి ఆముదపుగింజలు పొట్టుతీసి నూరి పాలతో కలిపి కాచి వడగట్టి రాత్రి తీసుకోవాలి.
• శొంఠిని వేడిచేసి ఒక గ్రాము మోతాదులో నేతిలో కలిపి భోజన సమనములో తింటే కీళ్ళనొప్పులు పోతాయి.
• ఆముదపు పప్పు, శొంఠి, పంచదార సమానంగా కలిపి రోజు ఒక చెంచాడు తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
• నువ్వులనూనె, నిమ్మరసము సమానముగా తీసుకుని బాగా చిలికి పైపూతగా వాడి, వేడి నీటితో కాపడం పెట్టిన కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
ఇంకా చాలకాలము నుండి  కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారు పైన చెప్పిన చిట్కాలతోపాటు యోగా మరియు కొన్ని రకములైన ఆసనములతో దూరము చేసుకొనవచ్చును.
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలోb అవగాహన పెంచడానికి మాత్రమే ..
https://www.facebook.com/1536735689924644/posts/2399634623634742/

కామెంట్‌లు లేవు: