12, మే 2020, మంగళవారం

గర్భాశయం లో పిండం పెరుగు దల తగ్గడం తెలుసు కోవడం ఎలా



గర్భాశయం లోపల పిండం పెరుగుదల తగ్గిపోవడం అంటే ఏమిటి?

కొన్నిసార్లు, గర్భధారణ సమయంలో పిండం / శిశువు ఊహించిన స్థాయిలో పెరుగడంలో విఫలమవుతుంది. పెరుగుదలలో ఈ ఆలస్యం గర్భాశయం లోపల పిండం పెరుగుదల తగ్గిపోవడం లేదా ఇంట్రాయుటిరైన్ గ్రోత్  రిటార్డెషన్ (ఐయూజిఆర్, IUGR) గా పిలువబడుతుంది. ఈ పరిస్థితి రెండు రకాలగా ఉంటుంది: గర్భస్థ శిశువు శరీరం చిన్నగా ఉండడం, దీనిని సిమ్మెట్రీకల్ ఐయూజిఆర్ (symmetrical IUGR) అని పిలుస్తారు, మరియు శిశువు యొక్క తల మరియు మెదడు పరిమాణం సాధారణంగా ఉండి శరీరం చిన్నగా ఉండడం, దీనిని ఆన్ సిమ్మెట్రీకల్ ఐయూజిఆర్ (unsymmetrical IUGR) అని పిలుస్తారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

గర్భస్థ శిశువు యొక్క కొన్ని లేదా అన్ని భాగాల పెరుగుదలలో ఆలస్యం అల్ట్రాసౌండ్ స్కాన్లో గమనించబడుతుంది అది ఐయూజిఆర్ (IUGR) ను సూచిస్తుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఐయూజిఆర్ (IUGR) యొక్క కారక కారణాలు ఫీటోప్లేసెంటల్ (foetoplacental, పిండం మరియు ప్లాసెంటాకు సంబందించినవి) లేదా మాటర్నల్ (maternal, తల్లికి సంబందించినవి) కారకాలు కావచ్చు. కొన్నిసాధారణ కారణాలు:

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

పూర్తి ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం, క్షుణ్ణమైన శారీరక పరీక్షలు నిర్వహించడం మరియు ఈ క్రింది పరీక్షల ద్వారా విశ్లేషించిన తర్వాత వైద్యులు ఐయూజిఆర్ (IUGR) యొక్క నిర్ధారణను చేస్తారు:

  • పూర్తి రక్త గణన (CBC) మరియు బ్లడ్ కెమిస్ట్రీ ప్యానెల్ (blood chemistry panel)
  • అంటువ్యాధుల కోసం పరీక్షలు: మాటర్నల్ యాంటీబాడీ టైటర్స్  (IgM, IgG)(Maternal antibody titres) లేదా TORCH (టార్చ్) దీనిలో టొక్లోప్లాస్మా గొండై (Toxoplasma gondii), రుబెల్లా (rubella), సైటోమెగలోవైరస్ మరియు HSV-1 మరియు HSV-2 టైటర్స్ ఉంటాయి
  • అమ్నియోసెంటెసిస్ (Amniocentesis, పిండం యొక్క పెరుగుదల ఈ ప్రక్రియ ఉపయోగించి తనిఖీ చేయబడుతుంది)
  • యుటిరైన్ ఫండల్ హెయిట్ (uterine fundal height, తల్లి కడుపు యొక్క పెల్విక్ ఎముక పై నుండి గర్భాశయం వరకు) కొలవడం
  • అల్ట్రాసౌండ్ పరీక్ష
  • బయోఫిజికల్ ప్రొఫైల్ (Biophysical profile)
  • డోప్లర్ వెలోసిమెట్రీ (Doppler velocimetry)

ఐయూజిఆర్ (IUGR) చికిత్స వీటిని కలిగి ఉంటుంది:

  • ప్రసూతి ముందు నిర్వహణ
    • అనుబంధక (Supplemental) ఆక్సిజన్  గర్భధారణ సమయాన్ని స్వల్ప-కాలం వరకు పొడిగిస్తుంది
    • పిండానికి రక్త ప్రవాహాన్ని/ప్రసరణని పెంచడానికి అధిక విశ్రాంతి తీసుకోవడం
    • తల్లి యొక్క అనారోగ్య నిర్వహణ మరియు ఆరోగ్యకరమైన మరియు పోషకరమైన ఆహారం అందించడం
    • పిండ ఊపిరితిత్తుల పెరుగుదలను పెంచేందుకు స్టెరాయిడ్లు సహాయం చేస్తాయి
    • IUGR యొక్క ప్రమాదం ఉన్నవారికి తక్కువ మోతాదులో ఆస్పిరిన్ థెరపీ (aspirin therapy) మంచి ఎంపిక
  • డెలివరీ మరియు ప్రసూతి నొప్పులు వచ్చే సమయంలో నిర్వహణ
  1. ప్రసూతి సమయం అంతా పిండం హృదయ స్పందన యొక్క ఖచ్చితమైన పర్యవేక్షణ
  2. అమ్నియాన్ ఫ్యూషన్ (Amnion fusion) సూచించబడుతుంది
  3. సిజేరియన్ (Caesarean) సిఫార్సు చేయబడుతుంది
  4. గర్భాశయ హైపోక్సియా (hypoxia) మరియు హైపోథర్మియా (hypothermia) కారణంగా శిశువులో అభివృద్ధి చెందిన హైపోగ్లైకేమియా (hypoglycaemia) మరియు పాలీసిథెమియా (polycythaemia) వంటి అనేక పరిస్థితులను పర్యవేక్షించడం మరియు అంచనా వేయడం
  5. పర్యవేక్షణలో ఏవైనా సమస్యలు కనిపిస్తే, ముందుగానే డెలివరీ చెయ్య

గర్భాశయం లోపల పిండం పెరుగుదల తగ్గిపోవడం కొరకు మందులు

గర్భాశయం లోపల పిండం పెరుగుదల తగ్గిపోవడం 

Medicine NamePack Size
Gzltin TabletGzltin Tablet
AstanolAstanol 5 Mg Tablet
Dubnil (Alchemist)Dubnil 5 Mg Tablet
GestinGestin Tablet
GravionGravion 5 Mg Tablet
LutaninLutanin 5 Mg Tablet
NidagestNidagest 5 Mg Tablet
NidanolNidanol 5 Mg Tablet
PregularPregular 5 Mg Tablet
ProfarProfar 25 Mg Tablet
Prolin AProlin A 5 Mg Tablet
FetugardFetugard Tablet
GyanaetoneGyanaetone 5 Mg Tablet
SolzarSolzar 5 Mg Tablet

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: