Unwanted Hair, Hypertricosis,అవాంఛిత రోమాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
-Unwanted Hair, Hypertricosis,అవాంఛిత రోమాలు,హైపర్‌ట్రైకోసిస్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
అవాంఛిత రోమాలు ఉంటే వాటిని తొలగించడం... శ్రమ అవుతుంది. తెల్లగా, నునుపుగా, పట్టుకుంటే జారిపోయేలా చర్మం ఉండాలనుకుంటారు అమ్మాయిలు. తలపై తప్ప శరీరంపై ఎక్కడ రోమం కనిపించినా బాధే. హెయిర్ రిమూవల్ క్రీములు, త్రెడింగ్, వ్యాక్సింగ్, ప్లకింగ్, లేజర్... అంటూ రకరకాల పద్ధతుల ద్వారా వాటిని తొలగించుకునే పనిలో పడుతున్నారు. అసలు అమ్మాయిల్లో అవాంఛిత రోమాల సమస్య ఎందుకు వస్తాయి? వాటిని తొలగించడానికి అతివలు పడరాని పాట్లు ఎందుకు పడతారు. ఆ రోమాలను కొండంత శ్రమతో కాకుండా... తేలిగ్గా వదిలించుకోడం ఎలా...?
కారణాలు :
హార్మోన్ల అసమతుల్యం - స్ర్తీలలో ఉండే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల ముఖం మీద నూనూగు వెంట్రుకలలా కనిపిస్తుంటాయి. మెనోపాజ్ దశలో శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ నిల్వలు తగ్గిపోవడంతో శరీరంలో ఉండే టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ హార్లోన్ల అసమతుల్యం ఏర్పడి రోమాలు దట్టంగా రావడం మొదలవుతుంది. వీరిలో పురుష హార్మోన్లు వృద్ధి చెందడం ఈ సమస్యకు ప్రధాన కారణం.
జీవనశైలి
క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు పాటించకపోవడం వల్ల చాలామంది ఆరోగ్య పరిస్థితులు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. అంతర్గతంగా కనిపించకుండా వచ్చే మార్పులు కొన్నైతే, బహిరంగంగా ఇబ్బందిపెట్టే సమస్యలు మరికొన్ని. సవ్యంగా లేని జీవనశైలి, ఊబకాయం... ఈ సమస్యను మరింతగా పెంచుతున్నాయి. ఈ విషయాలేవీ తెలియకపోవడం, సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. కొందరు జీవితంపై ఆశ వదులుకుంటున్నారు.
హిర్సుటిజం, హెపర్‌ట్రైకోసిస్... కారణాలు :
మహిళల శరీరంపై సాధారణంగా ఉండాల్సిన వెంట్రుకలకు బదులు అవాంఛితమైన రోమాలు విపరీతంగా, పురుషుల్లాగా ఉండటాన్ని హిర్సుటిజం అంటారు. హైపర్‌ట్రైకోసిస్ ఉన్న సందర్భాల్లో కూడా మహిళల్లో రోమాలు ఇలాగే ఉంటాయి. అయితే హిర్సుటిజానికీ, హైపర్ ట్రైకోసిస్‌కు తేడా ఉంది. హిర్సుటిజం ఉన్న కేసుల్లో పురుషుల్లో లాగా వెంట్రుకలు ఉంటే... హైపర్ ట్రైకోసిస్ కేసుల్లో అవాంఛిత రోమాలు
ఉన్నా అవి పురుషుల్లో మాదిరిగా ఉండవు. హిర్సుటిజంలో హార్మోన్ల లోపాల వల్ల వెంట్రుకలు విపరీతంగా పెరుగుతాయి. హైపర్ ట్రైకోసిస్ మాత్రం జన్యుపరమైన కారణాలతో వస్తుంటాయి. అందుకే కుటుంబంలో ఎవరికైనా ఉంటే హైపర్ ట్రైకోసిస్ రావడం చాలా సాధారణం.
పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ :
హిర్సుటిజానికి ఒక ప్రధాన కారణం పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్). అంటే... ఓవరీ (అండాశయం)లో నీటితిత్తులు ఉండటం అన్నమాట. హిర్సుటిజంతో బాధపడే మహిళలను పరిశీలించినప్పుడు వాళ్లలో దాదాపు 70 శాతం మందికి పీసీవోఎస్ ఉన్నట్లు తేలింది. పీసీఓఎస్ ఉన్న మహిళల్లోని అండాశయాల్లో పురుషుల్లో ఉండే హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ సాధారణ స్థాయి కంటే ఎక్కువగా స్రవిస్తుంది. దాంతో మహిళలకు వెంట్రుకలు విపరీతంగా పెరగడంతో పాటు, మొటిమలు రావడం కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా ముఖం మీద ఎక్కువగా వస్తాయి. సాధారణంగా యువతుల్లో యుక్తవయసులో మొటిమలు రావడం సహజమే. అయితే ఇవి మామూలుగా మొటిమలకు తీసుకునే చికిత్సతో తగ్గనప్పుడు వారిలో పీసీఓఎస్ ఉందేమో అని అనుమానించాలి. స్థూలకాయం ఉన్న చాలామంది మహిళల్లో మెడ దగ్గర, బాహుమూలల్లో చర్మం బాగా నల్లబడి, కాస్త ముడతలు పడి, దళసరిగా మారుతుంది. ఈ కండిషన్‌ను ‘అకాంథోసిస్ నెగ్రికాన్స్’ అంటారు. మహిళల్లో రక్తంలోని చక్కెర పాళ్లను అదుపులో ఉంచడానికి అవసరమైన దాని కంటే మరింత ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతోందని భావించడానికి దీన్ని ఒక సూచనగా భావించాలి. అలాంటివారిని ఇన్సులిన్ రెసిస్టెంట్‌గా పరిగణిస్తారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించినవారికి భవిష్యత్తులో షుగర్ వచ్చే అవకాశం (రిస్క్) ఉందని అనుమానించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నివారణ పద్దతులు :
అవాంఛిత రోమాలను పూర్తిగా తొలగించి, మళ్లీ రాకుండా చేయడానికి లేజర్ చికిత్స, పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా హార్మోన్లు సవ్యంగా పనిచేయడానికి వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ, జీవనశైలిని మార్చుకుంటే సమస్య పూర్తిగా తీరిపోతుంది.
శాశ్వత పద్ధతులు
అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించడానికి ముఖ్యమైన రెండు పద్ధతులున్నాయి. అవి ఎలక్ట్రాలిసిస్, లేజర్.
ఎలక్ట్రాలిసిస్: ఈ చికిత్స నిపుణుల పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంటుంది. చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పిగ్మెంటేషన్ ఉన్నా ఈ పద్ధతి ద్వారా రోమాలను తొలగించవచ్చు. ముఖ్యంగా తెల్లని రోమాలను తొలగించడంలో ఈ పద్ధతి మేలైనది. అయితే ఈ పద్ధతిలో కూడా ముఖంపై మచ్చలు, గుంటలు పడే అవకాశం ఉంటుంది. ఈ చికిత్సలో ఉపయోగించే నీడిల్స్ సురక్షితం కానివైతే ఎయిడ్స్ వంటి రోగాలు సంక్రమించే ప్రమాదం ఉంది. కనుక ఈ పద్ధతులను ఉపయోగించే నిపుణులు కచ్చితమైన ప్రమాణాలను పాటించాలి.
లేజర్: అవాంఛిత రోమాలకు ఈ ముడతలు, అవాంఛిత రోమాలు పోగొట్టి ముఖం కాంతివంతంగా ఉంచే చిట్కాలు........
కోడి గుడ్డు సొన తీసుకుని అందులో తేనె కలిపి బాగా గిలకొట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ముఖం మృదువుగా తయారవడమేకాక క్రమంగా ముఖం పై ఉన్న ముడతలూ తగ్గుతాయి.
పచ్చి పాలలో పచ్చి పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మృదువుగా తయారవుతుంది, ఎండలో తిరగడం వలన నల్ల బడిన చర్మం తిరిగి తెల్లబడుతుంది. అంతేకాక ఇందులో పసుపు ఉండడం వలన ముఖం పై ఉండే అవాంచిత రోమాలను ఇది తొలగిస్తుంది.
తాత్కాలిక పద్ధతులు...
అవాంఛిత రోమాలను తీసేయడానికి షేవింగ్, త్రెడింగ్, ప్లకింగ్, వ్యాక్సింగ్, బ్లీచింగ్... లాంటివి చేస్తుంటారు. ఈ పద్ధతులలో రోమాలను తొలగించిన చోట నొప్పి, దురద రావడం, స్వేదరంధ్రాలలో పస్ ఏర్పడం వంటివి ఎక్కువగా గమనిస్తుంటాం. కొందరిలో స్కిన్ పిగ్మెంటేషన్ కూడా రావచ్చు. ఇలాంటప్పుడు త్రెడ్డింగ్ చేస్తే పిగ్మెంటేషన్ ఇతరచోట్లకు కూడా వ్యాపించవచ్చు. అందుకని ఎలాంటి చర్మ సమస్యలు లేనప్పుడు మాత్రమే ఈ పద్ధతులను ఫాలో అవడం మంచిది.
ఆయుర్వేదం: 10 బ్యూటీ టిప్స్ ఇవిగోండి!
బ్యూటీపార్లర్ల చుట్టూ తిరగకుండా, ఇంట్లోనే కొన్ని చిట్కాల ద్వారా సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. అవేంటంటే.. ఈ 20 టిప్స్ చదవండి.
కొబ్బరి: కొబ్బరి నూనెలో పసుపు పొడి కలిపి పేస్ట్‌లా చేసుకుని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
2. ఆరెంజ్ ఫ్రూట్‌ను రెండుగా కట్ చేసి ముఖానిక మర్దన చేసి పది నిమిషాల పాటు సబ్బుతో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే ముఖసౌందర్యం పెంపొందుతుంది.
3. ముఖంపై గల అవాంఛిత రోమాలను తొలగించాలంటే అప్పుడప్పుడు నిమ్మరసాన్ని అప్లై చేయాలి. రోజూ ఇలా చేయడం ద్వారా అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.
4. ఒబిసిటీని దూరం చేసుకోవాలంటే.. రోజూ హాట్ వాటర్‌తో రెండు స్పూన్ల నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే సరిపోతుంది.
5. గోళ్లను కత్తిరించేందుకు నూనె రాసుకుని కాసేపయ్యాక కట్ చేస్తే గోళ్ల షేప్ బాగుంటాయి.
6. జుట్టు ఆయిలీగా వుంటే కోడిగుడ్డిలోని తెల్లసొన, పంచదారను ప్యాక్‌లా వేసుకుని మాడుకు పట్టించి తలస్నానం చేయాలి.
7. టీ వడగట్టిన తర్వాత మిగిలిన తేయాకులో నిమ్మరసం చేర్చి తలకు పట్టిస్తే జుట్టు సాఫ్ట్ అండ్ షైనీగా తయారవుతాయి.
8. వేపాకు, పుదీనా, మెహందీని ఎండబెట్టి పౌడర్‌లా చేసుకోవాలి. అప్పడప్పుడు ఈ మిశ్రమాన్ని పాలతో పేస్ట్‌లా కలుపుకుని ఫేస్ ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖ సౌందర్యం పెంపొందుతుంది.
9. గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల ఉప్పును కలిపి కంటిని శుభ్రం చేస్తే కంటికి ప్రత్యేక ఆకర్షణ లభిస్తుంది.
10. మోకాళ్లపై గల నల్లటి వలయాలు పోవాలంటే ఆ ప్రాంతాల్లో నిమ్మరసాన్ని అప్లై చేసి, సబ్బుతో కడిగేస్తే ఫలితం ఉంటుంది. అలాగే ముడతలు తొలగిపోవాలంటే.. ఆలివ్ ఆయిల్‌ను రాసుకుని పది నిమిషాల తర్వాత స్నానం చేయాలి.
హెయిర్ రిమూవల్ క్రీములు
అవాంఛిత రోమాలు ఉన్న వారికి హెయిర్ రిమూవల్ క్రీములు సురక్షితమైనవి. అయితే ఈ క్రీములను వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అంటే కొద్దిగా క్రీమ్‌ని అరచేయి వెనకభాగంలో రాసుకొని ఎలాంటి అలర్జీ లేదనిపిస్తే అప్పుడు పూర్తిగా ఉపయోగించుకోవచ్చు.
షేవింగ్ - అపోహ...
షేవింగ్ చేస్తే కేవలం చర్మంపై ఉన్న రోమం మాత్రమే కట్ అవుతుందని, ఆ రోమం మందం అవుతుందనే అపోహ ఉంది. అందుకే అవాంఛిత రోమాలను తొలగించడానికి షేవింగ్ మంచి ప్రక్రియ కాదని స్ర్తీలందరూ భావిస్తారు. షేవింగ్ ద్వారా కట్ అయిన హెయిర్ త్వరగా పెరగడం, మందంగా రావడం అనేది నిజం కాదు. షేవింగ్ చేసిన రెండు రోజుల తర్వాత కనిపించే హెయిర్ స్పాటికల్స్ చూసి ఇంకా ఎక్కువ రోమాలు
వస్తున్నాయని భయపడతారు. షేవింగ్ సరైన విధంగా చేయకపోవడం వల్ల హెయిర్ ఫాలికల్స్ దెబ్బతింటాయి. ఈ ఫాలికల్‌లో నుంచి బయటకు వచ్చిన వెంట్రుకను తీసేయడానికి మళ్లీ షేవ్ చేయడంతో అప్పటికే దెబ్బతిన్న చర్మం వద్ద రోమం మొదలయ్యే భాగం (హెయిర్ బంప్) దురద పెట్టడం,
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
970 370 666 0
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి