10, మే 2020, ఆదివారం

అమ్మాయి లో నెలసరి సమస్య పరిష్కారం. మార్గం


అమ్మాయిలని నెల నెల పలకరించేది పీరియడ్స్. ఈ టైమ్‌లో మహిళలు అనేక సమ్యలు ఎదుర్కొంటారు. కొంతమందికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. కానీ, కొంతమందికి మాత్రం కడుపునొప్పి, నడుము నొప్పులు భరించలేనంతగా వస్తుంటాయి. ఇలాంటి సమస్యలని కొన్ని చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి..

periods (times of india) 3

   
రుతుక్రమం మొదలైనప్పట్నుంచీ ప్రతి నెల అమ్మాయిలని నెలసరి వస్తుంటాయి. హార్మోన్స్ కారణంగా.. ఈ సమయంలో కొంతమందికి ఎక్కువ ఇబ్బందులు ఉంటే.. మరికొంతమందికి అసలు ఇబ్బందులు ఉండవు. వాటిని స్త్రీలు కచ్చితంగా అనుభవిస్తూనే ఉంటారు. నెలసరి సమయంలో సాధారణంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా కడుపు నొప్పి అధికంగా ఉంటుంది. వీటిని తగ్గించుకునేందుకు అమ్మాయిలు మాత్రలు వాడుతుంటారు.

samayam telugu

అయితే.. పీరియడ్స్ టైమ్‌లో వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మందులు వాడడం అంత మంచిది కాదు. దీనివల్ల భవిష్యత్‌లో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరి మనల్ని వేధించే కడుపునొప్పి, ఇతర సమస్యలను ఎలా తగ్గించుకోవాలంటే.. దీనికి పరిష్కారం ఉందని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే.. ముందుగా తులసి ఆకులని తీసుకోవాలి.. వాటిని శుభ్రంగా కడుక్కుని ఓ రెండు కప్పుల నీటిలో ఈ ఆకులని వేసి మరిగించుకోవాలి. ఈ రసాన్ని రోజంతా కొద్దిగా తాగుతుండండి.. దీని వల్ల పీరియడ్స్ టైమ్‌లో వచ్చే కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు ఇతర సమస్యలు తగ్గుతాయి. ఇలా మూడురోజుల పాటు చేస్తూ ఉండండి.. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే త్వరిత ఉపశమనం ఉంటుంది.

అలాగే.. అరటి ఆకుని తీసుకోవాలి.. దానిని కొద్దిసేపు నూనెలో వేసి ఉడికించండి.. తర్వాత దీనికి పెరుగు కలిపి మిక్సీ పట్టాలి. దీనిని రోజంతా కొద్దికొద్దిగా తీసుకోవాలి. ఇలా తీసుకుంటుంటే సమస్య చాలా వరకూ తగ్గుతుంది.

వీటితో పాటు బెల్లంని నములుతూ ఉండాలి. ఇలా చేస్తుంటే మంచి ఉపశమనం ఉంటుంది. అదే విధంగా మెంతులని రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగుతుండాలి. వీలైనంతగా ఎక్కువగా నీటిని తాగుతుండండి..

వీటికి దూరంగా ఉండండి..

ఆయిలీ ఫుడ్, బేకరీ ఫుడ్, ఇన్‌స్టంట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌ ఐటెమ్స్‌కి దూరంగా ఉండండి. వీటి వల్ల మీకు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, వాటికి దూరంగా ఉండడం మంచిది.

samayam telugu



ఇవి తినండి..

వీటితో పాటు తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అవకాడో, పీనట్ బటర్, శనగలు, అరటిపండ్లు ఎక్కువగా తీసుకోవాలి. లెట్యూస్, సెలరీ, దోసకాయలు, కర్బూజ, బెర్రీస్ ఎక్కువగా తీసుకోండి. వీటి వల్ల అన్ని సమస్యలు దూరమవుతాయి. కాల్షియం కోసం పాలు, పాల పదార్థాలు తీసుకోవచ్చు. వీటితో పాటు నువ్వులు, బాదం తీసుకుంటుండాలి.

వేడినీటితో స్నానం..

ఇక పీరియడ్స్ టైమ్‌లో వేడినీటిని ఉపయోగించడం మంచిది. శరీరంలోకి తీసుకోవడమైనా.. స్నానానికి వేడినీటిని వాడడం మంచిది. దీని వల్ల బాడీపెయిన్స్ తగ్గిపోతాయి. ఒత్తిడి కూడా దూరమవుతుంది. అదే విధంగా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండడం, ప్యాడ్స్‌ని మారుస్తుండడం చేస్తుండాలి.

కొద్దిగా వ్యాయామం..

అదే విధంగా.. ఈ సమయంలో చేయాల్సిన వ్యాయామాలు కొన్ని చేయాలి. ముఖ్యంగా ఈ టైమ్‌లో కొన్ని యోగాసనాలు మంచి రిలీఫ్‌ని ఇస్తాయి.

వాకింగ్..

నడక అనేది సున్నితమైన మరియు తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామం. మీరు హార్డ్‌వర్క్ ఏమీ చేయకూడదనుకుంటే, నడక చాలా మంచిది. ఇది మీ మానసిక స్థితిని పెంపొందించడానికి సాయపడుతుంది. అదే విధంగా, మీరు కొన్ని కేలరీలను బర్న్ చేయగలరు. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిర్లు లేకపోతె పరుగు కోసం వెళ్ళవచ్చు.

పైలేట్స్..

పైలేట్స్ వ్యాయామం నెలసరి సమయంలో సహాయపడుతుంది. మీ శారీరక స్థితి ప్రకారం మీరు వ్యాయామాలు చేయొచ్చు. ఒకవేళ మీరు తక్కువ వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతుంటే, కొన్ని నిర్దిష్ట పైలేట్స్ కదలిక నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.

యోగా..

యోగా స్ట్రెచ్బుల్ మరియు శ్వాస వ్యాయామాల కలయిక, ఇది నెలసరి సమయంలో యోగా చేయటం చాల మంచుడి. కొన్ని యోగా ఆసనాలు వల్ల శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి మరియు నెలసరి సమయంలో వచ్చే లక్షణాల నుండి తేలికగా బయటపడటానికి సహాయపడుతుంది.

ఇలాంటి చిన్న నియమాలు పాటిస్తే పీరియడ్స్‌లో ఎదురయ్యే అనేక సమస్యలు దూరం అవుతాయి..

యోగ నెలసరి సమస్యలు...ఇకసరి!

నెలలో ఆ మూడు రోజులూ చెప్పలేని బాధ. నెలసరి సమయంలో.. అధిక రక్తస్రావం, పొత్తికడుపులో భరించలేని నొప్పీ, కడుపుబ్బరంగా అనిపించడం, కాళ్లూ చేతులూ లాగడం... ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆమూడురోజుల్లోనూ చేయదగ్గ ఆసనాలివి..!

పాలిసిస్టిక్‌ ఓవరీన్‌ సిండ్రోమ్ (పిసిఒఎస్):
మహిళల జీవన విధానం సరిగ్గా లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగి వారిలో హార్మోన్ల సమ తుల్యత లోపిస్తుంది. దీనితో ఈ వ్యాధి వస్తుంది. 
ఈ వ్యాధిగ్రస్థులు పొట్ట, నడుము, కింది భాగంలో ఎక్కువ లావుగా ఉంటారు. ఛాతి, భుజాలు, కాళ్లు సన్నగానే ఉంటాయి. వీళ్లు బరువు తగ్గడానికి చాలా ఇబ్బంది పడుతారు. 

వ్యాయామాలు చేస్తే బరువు తగ్గినా మాని వేయగానే వెంటనే పెరిగిపోతారు. పాలిసిస్టిక్‌ ఓవరీన్‌ డిసీజ్‌ వ్యాధిగ్రస్థులు ప్రతిరోజు వ్యాయామం తప్ప నిసరిగా చేయాలి. వాకింగ్‌, రన్నింగ్‌, యోగా, ఏరోబిక్స్‌ చేయాలి. తీసు కునే ఆహారం విషయంలో ఎంతో శ్రద్ద వహించాలి. ఆహారంలో ప్రోటీ న్లు, విటమిన్లు అవసరమైన మేరకు ఉండేటట్టు చూసుకోవాలి.
లోగ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కూడా చాలా మేలు చేస్తాయి. అవి : సాల్మన్, లెట్యూస్,బార్లీ,చెక్క,బ్రొకోలీ,మష్రుమ్,తున,టమోటో,స్వీట్ పొటాటో,గుడ్డు, పాలు, పెరుగు, ఆకుకూరలు, లికోరైస్ రూట్స్,హాజల్ నట్స్ తీసుకోవాలి. 
మరియు రోజు వ్యాయామం, 45 నిమషాలు బ్రిస్క్ వాకింగ్ , యోగా వ్యాయామాలు చేయాలి. 


ఋతు నొప్పి నివారణలు నవీన్ నడిమింటి సలహాలు 

ఋతుస్రావం స్త్రీ జీవితం లో సహజ భాగం, కానీ బాధాకరమైన ఋతు నొప్పి అనేక మందికి చాలా బాధించే సమస్యగా ఉంటుంది. ఋతు నొప్పి అరుదుగా ఆందోళనకు కారణ మైనప్పటికీ, తీవ్రమైనదిగా ఉంటే వారి సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. బహిష్టు సమయంలో ప్రోస్టాగ్లాండిన్ (prostaglandin) అనే హార్మోన్ వంటి పదార్ధం, గర్భాశయ కండరాలను సంకోచింపజేసి ఋతు నొప్పిని కలిగిస్తుంది.
ఋతు నొప్పి పొత్తి కడుపు లో తక్కువ స్థాయి లేదా తీవ్రమైన నొప్పికి కారణ మవుతుంది, ఆపై నడుము క్రింద భాగం మరియు తొడల వరకు నొప్పి వ్యాపించవచ్చు. సాధారణంగా ఋతు నొప్పి మొదటి రెండు మూడు రోజుల తర్వాత తగ్గవచ్చు. కొందరి మహిళలలో కేవలం వారి ఋతు చక్రం ముందు నొప్పి కలుగవచ్చును.
ఋతు నొప్పికి కొన్ని కారణాలుగా చిన్నవయసులోనే ఋతుస్రావం ప్రారంభమవటం, జన్యు పరంగా, ఋతు సమయంలో భారీ రక్తస్రావం, అనారోగ్య అలవాట్లుగా ధూమపానం, అధిక మద్యపానం, మాదక ద్రవ్యాల సేవన, మరియు ఎక్కువగా కదలికలు లేకుండాకూర్చునే ఒక నిశ్చల జీవనశైలి పరిగణలోకి వస్తాయి. కొందరి మహిళలలో, ఋతు నొప్పి ప్రసవానంతరం తగ్గవచ్చు లేదా పూర్తిగా నివారింపబడవచ్చును.
1. వేడి కాపడం
ఋతు నొప్పిని నియంత్రించడానికి పొత్తి కడుపు మీద వేడి వర్తింప చేయటం ఒక సులభమయిన మార్గం. వేడి గర్భాశయం లో సంకోంచించ బడిన కండరాలకు విశ్రాంతిని ఇచ్చుటలో సహాయపడుతుంది.
• పొత్తి కడుపు మీద, నడుము క్రింది భాగంలో ఒక వేడి ప్యాడ్ ఉంచండి. వేడి నీటితో నింపిన సాధారణ ప్లాస్టిక్ సీసాను కూడా ఉపయోగించవచ్చు. మీరు మరింత సుఖమైన అనుభూతి పొందే వరకు వేడిని వర్తించండి.
• ప్రత్యామ్నాయంగా, వేడి నీటిలో ఒక టవల్ ముంచి, అదనపు నీటిని బయటకు పిండి, లేదా తడి టవలును మెలిపెట్టి అదనపు నీటిని బయటకు పిండి మైక్రో ఓవన్లో ఒక నిమిషం పాటు వేడి చేయవచ్చును. ఆపై వేడి టవలును పొత్తి కడుపు మీద, నడుము క్రింది బాగంలోను టవల్ చల్లబడే వరకు ఉంచండి . కొన్ని నిమిషాల పాటు నొప్పి తగ్గేంత వరకు పునరావృతం చెయ్యండి.
• వేడి షవర్ కూడా నొప్పి నుంచి ఉపశమనం కలిగించవచ్చు.
2.  అల్లం
అల్లం సమర్థవంతంగా ఋతు నోప్పిని నివారించే ఒక అద్భుతమైన మూలిక. ఈ మూలిక నొప్పి కలిగించే  ప్రోస్టాగ్లాండిన్స్ (prostaglandins) స్థాయిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కూడా బహిష్టుకు పూర్వ లక్షణంతో ముడిపడిన అలసటతో పోరాడటానికి మరియు అపక్రమ ఋతు చక్రాలను సాధారణంగా చేయడానికి సహాయపడుతుంది.
• 2 అంగుళాలు పొడవుగల అల్లం తీసుకొని, చిన్న చక్రాలుగా తురమండి. ఐదు నిమిషాల పాటు ఒక కప్పు నీటిలో మరిగించండి. ఆపై వడకట్టి, కొద్దిగా తేనె మరియు నిమ్మ రసం జోడించండి. మీ ఋతుసమయంలో ఈ టీని రోజువారి మూడు సార్లు 
• మీ వంటలలో, ఆహారంలో అల్లం జోడించడానికి ప్రయత్నించండి లేదా కొన్ని అల్లం కాండీలను చప్పరించటం చేయవచ్చు.
3. తులసి
తులసి ఋతు నొప్పి తగ్గించే మరొక చాలా ప్రభావవంతమైన హెర్బ్. తులసి లోని కేఫిక్ ఆమ్లము (Caffeic Acid) నకు అనాల్జేసిక్, లేదా నొప్పి నివారించే లక్షణాలున్నాయి.
• ఒక కప్పు మరుగుతున్న నీటికి ఒక టేబుల్ స్పూను తులసి ఆకులు జోడించి, మూత పెట్టండి, 3-5 ని మరిగిన పిమ్మట చల్లబరచండి.  ఈ పానీయం ప్రతి కొన్ని గంటలకు నొప్పి సులభం తగ్గటానికి సేవించండి.
• ప్రత్యామ్నాయంగా, గుప్పెడు తులసి ఆకులు రసం తీసి, ఒక కప్పు వెచ్చని నీటిలో రెండు టీ స్పూను జోడించి, మరిగించి చల్లార్చండి. నొప్పిగా ఉన్నప్పుడు ఈ పానీయం రోజువారీ మూడు సార్లు సేవించండి.
• మీ ఆహారం లో తాజా తులసి ఆకులు జోడించవచ్చు.
4. దాల్చిన
దాల్చిన వ్యతిరేక అనియంత్రిత వ్యాకోచం (antispasmodic), వ్యతిరేక గడ్డకట్టు (anticlotting) మరియు  శోథ నిరోధక (anti-inflammatory) లక్షణాలు కలిగి ఋతు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. అదనంగా, దాల్చిన ఆహార ఫైబర్, కాల్షియం, ఇనుము మరియు మాంగనీస్ లకు ఒక అద్భుతమైన మూలం.
• ఒక కప్పు వేడి నీటికి నాలుగో వంతు టీస్పూను దాల్చిన చెక్క పొడి కలిపి, మూత పెట్టి, ఐదు నిమిషాలపాటు మరిగించండి. చల్లార్చి కొద్దిగా తేనె జోడించండి. ఆపై ఋతు నొప్పి నివారించడానికి ఋతువు మొదలయ్యే రెండు రోజుల ముందు నెమ్మదిగా గుటకలతో ఈ  దాల్చిన టీ, రెండు మూడు కప్పులు, రెండు రోజులు త్రాగండి.
• ఒక గ్లాసు గోరు వెచ్చని నీటికి అర టీస్పూను దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూను తేనె జోడించండి. నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు, ఋతు కాలం మొదటి రోజు  మూడు సార్లు ఈ పానీయం సేవించండి.
5. సోపు (Fennel)
సోపు వ్యతిరేక అనియంత్రిత వ్యాకోచం (antispasmodic), ఫైటోఈస్ట్రోజెన్  (phytoestrogen) మరియు  శోథ నిరోధక (anti-inflammatory) లక్షణాలు కలిగి గర్భాశయం లోని కండరాలకు విశ్రాంతిని ఇచ్చి, క్రమంగా ఋతు నొప్పి, తిమ్మిరి మరియు అసౌకర్యం నుంచి ఉపశమనం ఇస్తుంది. 
ఒక కప్పు వేడి నీటికి ఒక టీ స్పూను సోపు గింజలు జోడించండి.
ఐదు నిమిషాలపాటు తక్కువ మంటలో (Simmer) మూత పెట్టి మరిగించండి.
మంట నుండి తొలగించి, చల్లార్చి మరియు వడకట్టండి.
ఒక టీ స్పూను తేనె వేసి బాగా కలపండి.
ఈ మూలికా టీని రోజువారీ రెండు సార్లు  ఋతుచక్రం ప్రారంభమయ్యే మూడు రోజుల ముందు నుంచి సేవించండి. సేవన తరువాత ఋతువులో నొప్పి కొనసాగితే ఈ మూలికా టీని త్రాగటం కొనసాగించండి. ఉత్తమ ఫలితాల కోసం ఈ పానీయం వేడిగా గుటకలతో త్రాగాలని గుర్తుంచుకొనండి.
6. చెరుకు మడ్డి (Blackstrap Molasses)
ఋతు నొప్పి నివారణకు పరీక్షించిన పరిహారాలలో చెరుకు మడ్డి కూడా ఉంది.
కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ B6 మరియు సెలీనియం పుష్కలంగా ఉండటం వలన, చెరుకు మడ్డి రక్తం గడ్డకట్టడం తగ్గించడానికి మరియు గర్భాశయ గోడల కండరాల ఉపశమనానికి సహాయపడుతుంది. ఇందు వలన బహిష్టు సమయంలో నొప్పి తగ్గుతుంది.
ఒక కప్పు వెచ్చని పాలలో ఒకటి - రెండు టీస్పూన్ల చెరుకు మడ్డి (Blackstrap Molasses) జోడించండి.  నొప్పి మొదలయిన వెంటనే తగ్గేవరకు త్రాగండి. మరియు అవసరమైనంత వరకు (నొప్పి తగ్గేవరకు) త్రాగడం కొనసాగించండి. 
7. అవిసె గింజలు (flaxseeds) 
అవిసె గింజలు (flaxseeds) ఋతు నొప్పి తీవ్రత తగ్గించడంలో శ్రేష్ఠమయినది. అవిసె గింజల లోని అవసరమైన కొవ్వు ఆమ్లాలు, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని స్థిరీకరించేందుకు సహాయం చేస్తాయి. అవిసె గింజలు గర్భాశయ పనితీరును మెరుగుపరిచేందుకు మరియు సంతానోత్పత్తి సమస్యల పరిష్కరానికి సహాయపడతాయి.
ఋతు నొప్పి ఉపశమనానికి రోజువారీ ఒకటి రెండు టేబుల్ స్పూనుల అవిసె గింజలను తినాలి. సలాడ్లలో లేదా కాయధాన్యాలతో (గోధుమ, బార్లీ, ఓట్లు, మొక్కజొన్న మొదలైనవి) లేదా పెరుగుతో లేదా స్మూతీ లో అవిసె గింజల పొడిని చల్లి తినవచ్చు.
8. బొప్పాయి
బొప్పాయి ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్, ఋతు నొప్పి చికిత్సలో చాలా సహాయకారిగా ఉంటుంది. దీని లోని కెరోటిన్, ఇనుము, కాల్షియం, విటమిన్లు A మరియు C, గర్భాశయ గోడల ఉపశమనంలో మరియు కండర సంకోచాలను సులభతరం చేయడంలో సహాయం అందిస్తాయి.
ఋతు చక్రానికి ముందు, ఋతు కాలంలోను, నొప్పి తగ్గించడానికి లేదా తొలగించడానికి మీ ఆహారంలో బొప్పాయిని జోడించండి.
9. వ్యాయామము:
ఈ నివారణలతోబాటు, ఋతు నోప్పిని తొలగించుకోవటంలో సహాయంగా యోగా మరియు హృదయ వ్యాయామాలు చేయవచ్చు. అలాగే, నీరు పుష్కలంగా త్రాగడం మర్చిపోరాదు. పీరియడ్స్ సమయంలో సున్నితమైన వ్యాయామం కొనసాగించటం ముఖ్యం. అంతర్గత నల్లమందు (Opioids) (బీటా-ఎండోర్ఫిన్స్) విడుదలకు సహాయపడుతుంది. అంతర్గత నల్లమందు (Opioids) శరీరంలో ఉత్పత్తి  చేయబడే మీ సొంత 'మానవ మార్ఫిన్'. 
మీ ఋతు కాలము ముందు ఉబ్బరం కలగటం సహజమైనది. మీ ఋతు కాలమునకు కొన్ని రోజుల ముందు ఉప్పు తీసుకోవడం తగ్గించినట్లయితే మీ మూత్రపిండాలు అదనపు నీటిని శరీరం నుండి తొలగించటంలో సహాయం చేస్తుంది. మీరు ఋతు కాలంలో ఈ 4 యోగ భంగిమలు నొప్పిని నివారించటానికి ప్రయత్నించవచ్చు. 

10. అదనంగా మరిన్ని చిట్కాలు.
• కొంత ముందు జాగ్రత్తగా ముఖ్యంగా నడుము వద్ద బిగుతుగా ఉన్న బట్టలు ధరించకండి.
• మీ అల్పాహారం లోపాలు ఒక గ్లాసు చేర్చండి. కాల్షియం ఋతు నొప్పికి ఒక మంచి నివారణ.
• క్యారెట్లు మీ కళ్ళు కోసం మాత్రమే కాకుండా; అవి కూడా ఋతుస్రావం నియంత్రించటంలో సహకరిస్తాయి.ఒక పొడవైన గ్లాసు క్యారట్ రసం మీకు చాలా మంచి అనుభూతి నిస్తుంది.
• తేనె తో అలోయి వెరా రసం కూడా ఋతు స్రావాన్ని నియంత్రించగలదు మరియు నొప్పి తగ్గించే సులభం మార్గం అంటారు.
• రెడ్ మాంసం (మేక, గొర్రె…) మరియు కెఫిన్ను నివారించండి. అవి నొప్పిని మరింత ఉధృతం చేస్తాయి.
• కేవలం 10 నుండి 15 నిమిషాలలో ఉపశమనం కలగటానికి మీ ఉదరం చుట్టూ లావెండర్ నూనె రాయండి.
• విశ్రాంతి, ఒక పుస్తకం చదవండి, మృదవైన సంగీతం వినండి లేదా స్నేహితులతో మాట్లాడండి. మీరు సంతోషంగా ఉంటే, మీ మనస్సు మీరు భౌతిక నొప్పితో పోరాడటానికి సహాయం చేస్తుంది.
ముఖ్య గమనిక: మీరు ముందు అనుభవించిన నొప్పి లాగ లేకుంటే, కటి వలయములో, ఫైబ్రాయిడ్లు, పాలీసెస్టిక్ గర్భాశయ సిండ్రోమ్ (PCOS / PCOD), కటి సోకు, బహిష్టుకు పూర్వ లక్షణంతో కూడిన ఏ కారణం కాదని నిర్ధారించుటకు నిశితంగా పర్యవేక్షించడానికి డాక్టరు సలహా అత్యవసరం.  
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 

మరింత సమాచారం తెలుసుకోండి

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

nice msz sir