25, మే 2020, సోమవారం

సర్పగంథ ఆకు రసం తీసుకోవడం వలన ఉపయోగం తెలుసు కోవాలి అంటే లింక్స్ లో చుడండి .


సర్పగంధ నిటారుగా పేరిగే బహువార్షిక పొద. ఇది సుమారు 75 సెం.మీ. నుండి ఒక మీటరు వరకు పెరుగుతుంది.
దుంపల వంతి వేర్లు నేలలో శాఖోపశాఖలుగా 0.5 నుండి 2.5 మీటర్ల వ్యాసార్ధం వరకు విస్తరించి వుంటాయి. ఇవి నేలలోపల 40-60 సెం.మీ. లోతు వరకు చొచ్చుకొనిపోతాయి. వేర్లలో క్షారగుణం అధికంగా వుంటుంది.

ఉపయోగాలు
గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో ప్రసవం సులభంగా జరగడానికి దీనిని వాదాతారు.
మానసిక అసమతుల్యాన్ని ఇది చక్కగా తగ్గిస్తుంది. దీనినే హిందీలో "పాగల్ కీ దవా" అని పిలుస్తారు. సర్పగంథ వేర్ల పౌడర్ 1 గ్రాము గ్లాస్ మేకపాలలో పంచదారతొ కలిపి తీసుకుంటే మానసిక స్థితి మామూలుగా వస్తుంది. మరీ పిచ్చిపట్టినట్లు ప్రవర్తించే వాళ్ళకు, హిస్టీరియాతో బాధపడే వాళ్ళకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
నిద్రపట్టని వారికి సర్పగంధ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే నిద్రపట్టించే గుణం వుండటం దీనికి కారణం . బీహారలో పిల్లలు ఏడవకుండా ఉండడానికి దీనిని వాడి నిద్రపుచ్చుతారు. సర్పగంధ వేరు విరేచనకారిగా, ఉష్ణజననిగా, మూత్రబంధ నివారిణిగా పనిచేస్తుంది. వీటికి మత్తు కలిగించే గుణం ఉన్నాట్లు పరిశోధనల్లో తేలింది. రక్తపోటు నివారణకు ఇది దివ్యౌషధం. జ్వరం, గాయాలు, శూలనొప్పి, నిద్రలేమి, మూర్ఛ, తలతిరగడం, అజీర్తి వంటి వాధలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని వేరును నూరి డికాక్షన్ చేసుకొని తాగితే గర్భాశయ వ్యాధలను నివారిస్తుంది. దీని ఆకుల రసాన్ని సేవించడం వల్ల కళ్ల మసక దూరమౌతుంది.

సర్పగంధ మొక్క వేరునుంది నిష్కర్షచేసి తీసిన రసాన్ని జీర్ణసంబంధ వ్యాధుల్లో ముఖ్యంగా డయేరియా, డిసెంట్రి (నీళ్ల వేరేచానాలు) తగ్గించడానికి వినియోగిస్తారు. ఇది మన పేగుల్లో పెరిగే నట్టులను బాగా నిర్మూలించుతుంది. యింకా ఇతర మొక్కల రసాలతో కలిపి కలరా, పేగుల్లో వచ్చే వ్యాధుల నివారణలో వాడతారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ మొక్క రక్తపోటు (Hypertension) ను అదుపులో ఉంచడంలో బాగా ఉయోపడుతుంది. దీని పేరుకు తగ్గట్టే పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. మానసిక వ్యాధులు తగ్గించడంలో కూడా సర్పగంధ ప్రధానపాత్ర పోషిస్తుంది. దీనికి మత్తుగుణాలు ఉండటం వలన మానసిక ఉద్రేకాలను తగ్గించి మానసిక వ్యాధుల చికిత్సలో వాడతారు.

దీని వేరు పొడిని ఒక చెంచా కప్పు వేడి పాలతో కలుపుకొని పడుకునే ముందు తాగితే నిద్రలేమి నుండి ఉపశమనం కలుగుతుంది . తేనే తో కలిపి దీని వేరు పొడిని ప్రతి రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే మానసిక ఆందోళనలనుండి మంచి ఉపశమనం కలగుతుంది.

సర్పగంధ : ఈ మొక్క వేర్లు తీసుకోవడం వలన అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. మానసిక రుగ్మతలను నయం చేయడంలోనూ ఉపకరిస్తుంది.
గమనిక... వైద్యుడు సలహా తప్పనిసరిగా తీసుకోవాలి
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
 

కామెంట్‌లు లేవు: