శీఘ్రస్ఖలన సమస్యకు పరిష్కారాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
ఇటీవలి కాలంలో లైంగికపరమైన సమస్యలతో వైద్యులను కలిసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలాంటి వాటిలో శీఘ్ర స్ఖలన సమస్య ప్రధానమైనది. శృంగారంలో పాల్గొన్న 3 నిమిషాల్లోలేదా భాగస్వామికి భావప్రాప్తి కలగకముందే వీర్యస్ఖలనం జరగటాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. మెజారిటీ కేసుల్లో మానసిక సమస్యలు, మారుతున్న జీవనవిధానం, దంపతుల అవగాహనలేమి వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ఈ సమస్య కారణంగా పురుషులు తీవ్ర ఆత్మన్యూనతకు గురై జీవిత భాగస్వామితో దాంపత్య జీవితాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. ఒక్కోసారి ఈసమస్య దంపతుల మధ్య గొడవలకు, విడాకులకు కూడా దారితీస్తోంది. తగిన అవగాహనతో ఈ సమస్యను అధిగమించవచ్చు.
కారణాలు
- రతి అంటే కంగారు, భయం, ఒత్తిడికి గురికావటం వంటి ఇబ్బందులున్న వారిలో ఈ సమస్య ఉంటుంది.
- డిప్రెషన్ బాధితులు,హార్మోన్ల లోపం ఉన్నవారిలో శీఘ్రస్ఖలనం సమస్య ఎదురయ్యే ముప్పు ఎక్కువ.
- నాడీ సంబంధ వ్యాధులు, మెదడు సంబంధ వ్యాధుల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
- ప్రొస్టేట్ గ్రంథి, మూత్రనాళాలలో వాపు, ఇన్‌ఫెక్షన్లు కూడా ఈసమస్యకు దారితీస్తాయి.
- వారాల తరబడి శృంగారంలో పాల్గొనకపోవడం, భాగస్వామి సహకారం సరిగ్గా లేకపోవడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు.
- యవ్వనపు తొలిరోజుల్లో హస్తప్రయోగం చేసుకొనే సమయంలో ఎవరైనా వస్తారని, చూస్తారనే భయంతో తొందరగా చేయడం అలవాటుగా మారి తరువాతి రోజుల్లో శీఘ్ర స్ఖలన సమస్యకు దారితీయవచ్చు.
- సంతానం వద్దనుకున్న నూతన దంపతులు గర్భం వస్తుందేమోనన్న భయంతో రతిలో పాల్గొనటం కూడా సమస్యకు దారితీయవచ్చు.
పరిష్కారాలు
- స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ( రతిలో పాల్గొంటూ, ఇక.. వీర్యం విడుదల అవుతుంది అనిపించగానే స్ట్రోక్స్ ఆపి 1 నిమిషం తర్వాత మళ్ళీ మొదలు పెట్టటం) , స్క్వీజ్ టెక్నిక్ ( వీర్యం విడుదల అవుతుంది అనిపించగానే స్ట్రోక్స్ ఆపి అంగపు ముందుభాగాన్ని కొన్ని సెకన్ల పాటు వేళ్ళతో నొక్కి పెట్టి మళ్ళీ రతిలో పాల్గొనటం) లను అనుసరించడం వల్ల ఉపయోగం ఉంటుంది.
- శృంగారంలో పాల్గొనే భంగిమను మార్చుకోవటం, భాగస్వామిసహకారం తీసుకోవటం ద్వారా కూడా ఇబ్బందిని తొలగించుకోవచ్చు.
- వైద్యులను కలిసి కౌన్సెలింగ్ తీసుకొని వారు సూచించిన మందులు వాడుకోవాలి. సమస్యను నిర్లక్ష్యంచేస్తే ఒక్కోసారి అంగస్తంభన సమస్యకు దారితీసే అవకాశం కూడా ఉంది.
గమనిక:కొంతమందిలో మద్యం సేవించినపుడు ఈ సమస్య ఉండదు. కాని మద్యం ప్రభావం దీర్ఘకాలం లో సెక్స్ పవర్ తగ్గుతుంది గమనించగలరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి