10, మే 2020, ఆదివారం

అధిక చెమటలు నివారణకు పరిష్కారం మార్గం



అధిక చెమట లేక హైపర్ హైడ్రోసిస్ అంటే ఏమిటి?

మానవ శరీరం యొక్క ప్రధాన స్వేద గ్రంధుల మీది గ్రాహకాలు అధికంగా ప్రేరేపణ కావడంవల్ల “అధిక చెమట” (hyperhidrosis) పడుతుంది. ఈ రుగ్మతనే ‘హైపర్ హైడ్రోసిస్ అని కూడా పిలుస్తారు. శరీరంలో ఎక్కడెక్కడ ఈ అధిక ప్రేరేపణతో కూడిన చెమట గ్రంథులు ఉంటాయో ఆయా భాగాల్లో అధిక చెమట పట్టే ఈ రుగ్మతవల్ల వ్యక్తి బాధింపబడడం జరుగుతుంది.

అధిక చెమట రుగ్మత (హైపర్ హైడ్రోసిస్)లో రెండు రకాలు ఉన్నాయి, అవి,

  • ప్రాధమిక హైపర్ హైడ్రోసిస్ - ఇది స్వయంగా వైద్య స్థితిలో సంభవిస్తుంది.
  • సెకండరీ హైపెర్ హైడ్రోసిస్ - ఇది కొన్ని ఇతర అంతర్లీన పరిస్థితుల ఫలితంగా సంభవిస్తుంది.

అధిక చెమట రుగ్మత యొక్క సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అధికంగా చెమట పట్టడంవల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరియు ఇది సామాజిక ఆందోళన (అంటే ఈ రుగ్మతతో వ్యక్తి నలుగురిలో కలిసినపుడు) ను పెంచుతుంది.

ప్రాధమిక హైపర్ హైడ్రోసిస్ తో సంబంధం ఉన్న సంకేతాలు మరియు లక్షణాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • ఎడమ మరియు కుడి చంకలు (axillae), అరచేతులు, అరికాళ్ళు (soles), మరియు ముఖం వంటి చిన్న చిన్నభాగాల్లో చెమట పట్టడం జరుగుతుంది.
  • రెండు చేతుల్లో మరియు రెండు అరిపాదాల్లో(అడుగులు) సమానరీతిలో అధిక చెమట పట్టడం సంభవించవచ్చు.
  • నిద్రపోతున్నప్పుడు చెమట;పట్టడం జరగదు.
  • ఈ అధికచెమట రుగ్మత సాధారణంగా కౌమారదశలో లేదా 25 ఏళ్ల వయసుకు ముందు ప్రారంభమవుతుంది.

ద్వితీయ రకం అధిక చెమట రుగ్మతతో (సెకండరీ హైపర్ హైడ్రోసిస్) సంబంధం ఉన్న సంకేతాలు మరియు లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:

  • నిర్దిష్ట ప్రాంతాల్లో చెమట పట్టదు కానీ ఎక్కువగా సాధారణీకరించబడింది.
  • ఇది సాధారణంగా అంతర్లీన వైద్య పరిస్థితితో సంభవిస్తుంది.
  • నిద్రపోతున్నప్పుడు కూడా అధికమైన చెమట పడుతూ ఉంటుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

అధిక చెమటకు కారణం స్పష్టంగా ఇంకా తెలియరాలేదు. ప్రాధమిక అధిక చెమట రుగ్మతకు జన్యుపరమైన కారకాలు పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. హైపర్ హైడ్రోసిస్ యొక్క యంత్రాంగం కిందివిధంగా ఉంటుంది.

  • శరీరంలోని ప్రధాన స్వేద గ్రంధుల యొక్క అధిక ప్రేరేపణ
  • హార్మోన్ ప్రతిపుష్టి (feedback) యంత్రాంగం పనిచేయకపోవడం

క్రింద తెలిపిన కొన్ని ప్రాథమిక వైద్య పరిస్థితులు రెండోరకం అధిక చెమట రుగ్మతకు (ద్వితీయ హైపర్ హైడ్రోసిస్కు) కారణమవుతాయి:

ఈ అధిక చెమట రుగ్మత ఇన్సులిన్ మరియు యాంటిసైకోటిక్స్ వంటి కొన్ని మందులతో  కూడా సంబంధం కలిగి ఉంటుంది.

అధిక చెమట రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

రుగ్మత యొక్క పూర్తి చరిత్ర మరియు దృశ్య అంచనా, అంటే వైద్యుడు నేరుగా అధిక చెమట రుగ్మత స్థితిని చూడ్డం రోగనిర్ధారణకు చాలా ముఖ్యమైనది.

  • వైద్యపరిశోధనలు ఇలా ఉంటాయి
    • అయోడిన్-స్టార్చ్ పరీక్ష
    • థర్మోరెగులేటరీ చెమట పరీక్ష
    • పూర్తి రక్త గణన పరీక్ష
    • ఛాతీ ఎక్స్-రే
    • హీమోగ్లోబిన్ A1C
    • థైరాయిడ్ హార్మోన్ పరీక్ష

అధిక చెమట (హైపర్ హైడ్రోసిస్) యొక్క చికిత్స అంతర్లీన స్థితి మరియు దాని చికిత్సపై దృష్టి పెడుతుంది.

ప్రాధమిక అధిక చెమట (హైపర్ హైడ్రోసిస్) రుగ్మత విషయంలో, సంబంధిత లక్షణాలను గుర్తించడమనేది చికిత్సలో ఉంటుంది. వైద్యుడు చెమట నివారణ మందులు (antiperspirants), గ్లైకోపైర్రోట్లున్న (glycopyrrolate) క్రీమ్లు, నరాలను (రక్తప్రసరణను) అడ్డుకునే మందులు, లేదా కుంగుబాటు నివారణా మందులు (యాంటీ-డిప్రెసెంట్స్) ను సూచించవచ్చు.

ప్రాథమిక చికిత్సలో ప్రధానంగా 15-25% అల్యూమినియం క్లోరైడ్ హెక్సాహైడ్రేట్తో పాటు చెమట నివారణ మందులు (యాంటిపెర్స్పిరెంట్స్) ఉంటాయి. రోగి ఈ చికిత్సకు అనుకూలంగా స్పందించకపోతే, వైద్యుడు స్వేద గ్రంథుల గ్రాహకాలను నిరోధించడానికి మందులను సూఛిస్తాడు. అవసరమైతే, అధిక చెమటను తగ్గించడానికి అదనపు బోటులినమ్ సూది మందులు లేదా (విద్యుత్ సహాయంతో ఇచ్చే) ఇఒంటోఫోరేసిస్ (iontophoresis) నిర్వహిస్తారు.

శస్త్రచికిత్సా ఎంపికల్లో స్వేద గ్రంథి తొలగింపు లేదా నరాల శస్త్రచికిత్సను ఈ రుగ్మతకు లభ్యతలో కలిగి ఉంటాయి

అధిక చెమటలు (హైపర్ హైడ్రోసిస్) కొరకు మందులు


Medicine NamePack Size
Schwabe Chininum purum LATTSchwabe Chininum purum Trituration Tablet 3X
SBL Chininum purum DilutionSBL Chininum purum Dilution 1000 CH
Botox InjectionBotox 200 IU Injection
NeuronoxNeuronox 100 Iu Injection
Schwabe Chininum purum CHSchwabe Chininum purum 100g


  మాది  చిన్నప్పుడు మేము మట్టిలోనే ఆడుకునేవాళ్ళము. ఎంతగా ఆడుకునేవాళ్ళమంటే ఒళ్ళంతా చెమటలు పట్టేలా. అయితే కొంచం పెద్దయాక స్కూల్ లో మాకు చెప్పారు, మట్టిలో క్రిములు ఉంటాయి, మట్టికి దూరంగా ఉండాలి, మట్టి ముట్టుకుంటే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి అని. నిజానికి అలా పుస్తకాల్లో ఉంది, అదే టీచర్లు చెప్పారు.

చాలామంది అంటారు, మట్టిలో నడిస్తే కాళ్ళు పగులుతాయని. కానీ అది పెద్ద అపోహ. కాళ్ళు పగిలేది మట్టిలో నడిస్తే కాదు, దుమ్ములో నడిస్తే. మట్టికి, దుమ్ముకు చాలా తేడా ఉంది. మట్టికి ఎంతో హీలంగ్ పవర్ ఉంది. సారవంతమైన మట్టిలో నడిస్తే, కాళ్ళ పగుళ్ళు కూడా వేగంగా, ఏ మందు రాయకుండానే మానిపోతాయి. చాలామంది ఉదయం వ్యహాళికని వెళతారు, వెళ్ళడం మంచిదే కానీ, వేలకు వేలు పెట్టి దాని కోసం ప్రత్యేక బూట్లు కొని, అవి వేసుకుని వెళతారు. అప్పుడేమీ లాభం లేదు. ఏదైనా చేయాలనుకుంటే గాజుముక్కలు లాంటివి లేని చోట, మట్టిలో ఒట్టి కాళ్ళతో నడిచి చూడండి, ఎంతో మార్పు కనిపిస్తుంది, శరీరం తనంతట తానే రోగాలను నయం (Healing) చేసుకుంటుంది. అది మట్టికి ఉన్న శక్తి. కానీ మట్టి సారవంతమై ఉండాలి, పవిత్రంగా, కాలుష్యరహితంగా ఉండాలి. మనం మరమనుషులుగా కాక, మట్టి మనుషులుగా బ్రతకాలి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: