నిద్ర కలతలు అంటే ఏమిటి?
విశ్రాంతి లేని నిద్ర, మారిపోయిన ప్రశాంత నిద్రవిధానం (altered sleep rhythm) లేక అసలు నిద్రే కరువవడానికి (sleep dysfunction) దారితీసే పరిస్థితుల్ని “నిద్ర కలతలు” గా u. రాత్రిపూట విశ్రాంతినివ్వని నిద్రకు మరియు పగటిపూట నిద్ర ముంచుకొచ్చే పరిస్థితికి నిద్రకలతలు కారణం కావచ్చు. ఈ లక్షణాలు కొన్నిసార్లు తీవ్రమైన అంతర్లీన వైద్య పరిస్థితికి ప్రాతినిధ్యసూచకంగా నిలుస్తాయి.
నిద్ర కలతల ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అంతర్లీన కారణం మీద ఆధారపడి ఉండే నిద్ర కలతలు (స్లీప్ డిజార్డర్స్) విస్తృత శ్రేణి వ్యాధి లక్షణాలను కలిగి ఉంటాయి; ఇంకా, నిద్ర కలతలకు కొన్ని సాధారణ వ్యాధి లక్షణాలు ఉన్నాయి, అవి కిందివిధంగా ఉంటాయి:
- నిద్ర రావటమే కష్టమైన పరిస్థితి
- రాత్రిళ్ళలో తరచుగా నిద్ర చెడి లేవడం, మళ్ళీ నిద్రపోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం
- అలసట లేదా పగటిపూట నిద్ర ముంచుకురావడం
కారణాలు ఏమిటి?
నిద్రకలతల (స్లీప్ డిజార్డర్స్)కు అనేక వ్యాధులు కారణమవుతాయి, ఆ వ్యాధుల్లో ఇవి ఉన్నాయి:
- మానసిక రుగ్మతలు
- ఆందోళన
- కుంగుబాటు (డిప్రెషన్)
- బైపోలార్ డిజార్డర్ (ద్విధ్రువీయ రుగ్మతలు)
- అసహనీయతా రుగ్మతలు (అలెర్జీ పరిస్థితులు)
- రినైటిస్- అలెర్జీ లేదా సంక్రమణ వలన విపరీతమైన జలుబు, ముక్కు కారడం
- అడెనాయిడ్స్ - మెడలో లింఫోడ్ కణజాలం వాపురావడం
- అలర్జీ దగ్గు
- నొక్టురియా (Nocturia)-మధుమేహం లేదా ప్రోస్టేట్ సమస్యల కారణంగా నొక్టురియా (రాత్రి సమయంలో అధికంగా మూత్రవిసర్జన, ఇది నిద్రావస్థను భంగపరుస్తుంది)
- నొప్పి - కీళ్లనొప్పి (ఆర్థరైటిస్), ఫైబ్రోమైయాల్జియా మొదలైనవాటివల్ల దీర్ఘకాలికమైన నొప్పి లేదా తీవ్ర నొప్పి
- నిద్రలో ఊపిరిలేమి (స్లీప్ అప్నియా) (నిద్రలో శ్వాస ఆడటం కష్టమవుతుంది లేక శ్వాస పూర్తిగా ఆడకుండా నిలిపివేయబడుతుంది)
నిద్ర కలతల రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
సాధారణంగా, పూర్తిస్థాయి వైద్య చరిత్ర నిద్ర రుగ్మతల యొక్క మూల కారణాన్ని సూచిస్తుంది. భౌతిక పరీక్ష, దాంతోపాటు, కొన్ని పరిశోధనలు అంతర్లీన భౌతిక వ్యాధిని నిర్ధారణ చేయడానికి సహాయపడతాయి. ఆ పరిశోధనలు ఏవంటే:
- పూర్తి రక్త గణన (CBC) వంటి రక్త పరిశోధనలు, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేటు (ESR) పరీక్ష, సి-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) పరీక్ష, ప్రోస్టేట్-నిర్దిష్ట యాంటీజెన్ (PSA) పరీక్ష (మగవాళ్ళలో), బ్లడ్-షుగర్ మూల్యాంకనం తదితరాలు భౌతిక రోగాల నిర్ధారణకు ఉపయోగించడం జరుగుతుంది .
- ఎలక్ట్రోఎన్సుఫలోగ్రఫీ (EEG) మెదడులోని విద్యుత్ కార్యకలాపాన్ని మూల్యాంకనం చేయడంలో మరియు మెదడు తరంగాలను అంచనా వేయడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది.
- పాలీసోమ్నోగ్రఫీ (నిద్ర అధ్యయనం) నిద్రలో శరీర చర్య, మెదడు తరంగాలను మరియు ఆక్సిజన్ స్థాయిలను అంచనా వేయడంలో ఇది సహాయపడుతుంది.
వ్యాధికి అంతర్లీనంగా ఉండే రుగ్మతకు చికిత్స చేయడం వ్యాధిలక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. కొన్ని మందులసేవనం మరియు పద్ధతుల అనుసరణ కూడా నిద్ర రుగ్మతల నుండి ఉపశమనం పొందటానికి సయాయపడతాయి. ఈ చికిత్స ఎంపికలు కిందివిధంగా ఉంటాయి:
- మందులు - నిద్ర మాత్రలు, ఆందోళన నివారణా మాత్రలు, అలెర్జీనివారణా మందులు వంటి కొన్ని మందులు నిద్రను ప్రేరేపించగలవు.
- సలహా సంప్రదింపుల సమావేశం (కౌన్సెలింగ్) - కౌన్సెలింగ్, దానితోబాటు, మందులసేవనం సహాయపడవచ్చు, ముఖ్యంగా నిద్ర కలతలు మానసిక ఒత్తిడి లేదా మానసిక అనారోగ్యం కారణంగా అయినట్లయితే.
- జీవనశైలి మార్పులు - పీచు (ఫైబర్) మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల్ని తీసుకోవడం వంటి కొన్ని ఆహార మార్పులు మరియు చక్కెర తినడాన్ని తగ్గించడం సహాయపడుతుంది. రాత్రి సమయంలో మూత్రవిసర్జన సమస్య నివారణకు రాత్రి పడుకునేముందు మంచినీళ్లను తక్కుగా తాగడం సహాయపడుతుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో కెఫీన్ మరియు మద్యం (ఆల్కహాల్) వంటి ఉత్తేజకాలజీవనాన్ని నివారించడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది
Medicine Name | Pack Si | ) |
---|---|---|
Schwabe Melissa MT | Schwabe Melissa MT | |
Bjain Santoninum Dilution | Bjain Santoninum Dilution 1000 CH | |
Schwabe Cornus alternifolia CH | Schwabe Cornus alternifolia 1000 CH | |
SBL Melissa Dilution | SBL Melissa Dilution 1000 CH | |
Bioclock | Bioclock 0.25 Mg Tablet | |
Lamonin | Lamonin 0.25 Mg Tablet | |
Dr. Reckeweg Absinthium Q | Dr. Reckeweg Absinthium Q | |
Macugold tablet | MACUGOLD TABLET 10S | |
Schwabe Ocimum basilicum MT | Schwabe Ocimum basilicum MT | |
Meloset | Meloset Tablet | |
Tricomax M | Tricomax M Scalp 60 Ml Lotion | |
Zytonin | Zytonin Tablet | |
Ovares Plus | Ovares Plus Capsule | |
Coedhea | COEDHEA FORTE CAPSULE 10S | |
Schwabe Apomorphinum muriaticum CH | Schwabe Apomorphinum muriaticum 12 CH | |
Melokalm | MELOKALM TABLET | |
Bjain Lupulinum Dilution | Bjain Lupulinum Dilution 1000 CH | |
Schwabe Lupulinum CH | Schwabe Lupulinum 1000 CH | |
Schwabe Santoninum CH | Schwabe Santoninum 1000 CH | |
Bjain Origanum majorana Dilution | Bjain Origanum majorana Dilution 1000 CH | |
ADEL Absinthium Dilution | ADEL Absinthium Dilution 200 CH | |
Dr. Reckeweg Absinthium Dilution | Dr. Reckeweg Absinthium Dilution 1000 CH | |
Schwabe Origanum majorana CH | Schwabe Origanum majorana 1000 CH | |
Bjain Melissa Dilution | Bjain Melissa Dilution 1000 CH |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి