16, మే 2020, శనివారం

ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్ లార్జ్ మెంట్ (మూత్రం బొట్టు బొట్టులుగా పడిన అప్ప్పుడు తీసుకోని కోవలిసిన జాగ్రత్తలు పరిష్కారం మార్గం


ప్రోస్టటైటీస్ అనేది ఒక సాధారణ రుగ్మత, ఇది ఎక్కువగా సంక్రమణ కారణంగా  ప్రోస్టేట్ గ్రంధి వాపు (మంట) వల్ల సంభవిస్తుంది. అనారోగ్య పరిసరాల వల్ల ఏ వయస్సు పురుషులకైనా ప్రోస్టేటిటీస్ సంభవించవచ్చు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ప్రోస్టటైటీస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు తరచూ ప్రోస్టేట్ క్యాన్సర్ లేదా ప్రోస్టేట్ విస్తారణ సమానంగా ఉంటాయి, కానీ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు:

  • మూత్రవిసర్జనలో కష్టాలు, మూత్రం యొక్క బాధాకరమైన లేదా ఆటంకపరిచే ప్రవాహం.
  • కటి (పెల్విక్) ప్రాంతంలో నొప్పి లేదా ప్రోస్టేట్ యొక్క ప్రాంతం చుట్టూ, పురీషనాళం భాగంలో నొప్పి .
  • తరచూ వ్యవధుల్లో మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన అత్యవసర పరిస్థితి, మూత్రంలో రక్తం అప్పుడప్పుడు పడవచ్చు.
  • బాక్టీరియల్ సంక్రమణ విషయంలో, జ్వరంవికారం మరియు ఇతర ఫ్లూ-వంటి లక్షణాలు కూడా సంభవించవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ప్రోస్టటైటీస్ దాని కారణాన్ని బట్టి వివిధ వర్గాలలో విభజించబడింది. అవి:

  • దీర్ఘకాల ప్రోస్టటైటిస్
    ఈ సందర్భంలో, లక్షణాలు నెమ్మదిగా వృద్ధి చెందుతాయి, మరియు గణనీయమైన కాలవ్యవధిలో కొనసాగుతాయి. దీర్ఘకాలిక ప్రోస్టేటిస్ అనేది సంక్రమణ వలన సంభవించదు మరియు తరచూ దీనికి సులభంగా చికిత్స చేయవచ్చు. దీర్ఘకాలిక ప్రోస్టేటిస్ యొక్క ముఖ్య కారణాలు:
    • ప్రోస్టాటిస్ యొక్క చరిత్ర.
    • దీర్ఘకాలిక ప్రోస్టటైటీస్ మధ్య వయస్కుల్లో నుండి వయస్సు పైబడిన పురుషుల్లో  సాధారణం.
    • మంటతో కూడిన ప్రేగు రుగ్మత
    • శస్త్రచికిత్స సమయంలో జరిగిన నష్టం.
  • తీవ్రమైన ప్రోస్టేటిటిస్తీ
    వ్రమైన ప్రోస్టటైటీస్ అకస్మాత్తుగా మరియు తీవ్రమైన వైద్యకేసు, ఇది  సంక్రమణవల్ల సంభవిస్తుంది. దీనికి వెంటనే వైద్యరక్షణ అవసరం. ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు:
    • లైంగిక చర్య దురుపయోగంవల్ల ప్రోస్టేట్ యొక్క సంక్రమణ.
    • ప్రోస్టేట్ లేదా మూత్ర నాళంలో ఏదైనా రకమైన సంక్రమణ చరిత్ర, మూత్ర నాళాల సంక్రమణ (UTI) లేదా లైంగికంగా సంక్రమించే సంక్రమణ (STI) లేదా హెచ్ఐవి (HIV) సంక్రమణం లేదా AIDS.
    • కొన్ని సందర్భాల్లో, ప్రోస్టేట్ బయాప్సీ తరువాత సంక్రమణం అభివృద్ధి చెందుతుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ప్రోస్టేటిటీస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలను చూసిన తరువాత, వైద్యుడు కొన్ని పరీక్షలను ఆదేశించవచ్చు. వ్యక్తికి సంభవించిన వ్యాధి ప్రోస్టేటిటీస్ అయితే ఆ వ్యాధిని నిర్ణయించడంలో ఈ పరీక్షలు సహాయపడతాయి. ప్రొస్టటిటిస్కు అత్యంత సాధారణ మరియు ఖచ్చితమైన పరీక్షలు క్రింది విధంగా ఉన్నాయి:

  • ఒక డిజిటల్ పురీషనాళం పరీక్షతో సహా భౌతిక పరీక్ష.
  • మూత్ర నాళాల అంటురోగాల తనిఖీకి మూత్ర పరిశీలన (urinalysis)
  • ట్రాన్సరెక్టల్ ఆల్ట్రాసౌండ్ను ప్రొస్టేట్ లో ఏదైనా వాపు లేదా అసాధారణ పెరుగుదలలు ఉంటే గుర్తించడం కోసం.
  • ప్రతి డిచ్ఛార్జ్ లో స్పెర్మ్ మరియు వీర్యం మొత్తాన్ని తనిఖీ చేయడానికి మరియు రక్తం లేదా సంక్రమణ సంకేతాలను పరిశీలించడానికి యూరాలజిస్టులు వీర్యం విశ్లేషణ పరీక్ష చేయవచ్చు.
  • మూత్రాశయ దర్శిని (సిస్టోస్కోపిక్) బయాప్సీ పరీక్ష: మూత్రాశయం పరిశీలనకు మరియు ప్రోస్టేట్ నుండి కణజాల నమూనా సేకరించడం కోసం, ఏవైనా వాపుల పరిశీలనకు ఈ జీవాణు పరీక్ష చేస్తారు..

ప్రారంభ దశల్లోనే నిర్ధారణ అయితే ప్రోస్టటైటీస్ కు సాధారణంగా సులభంగా చికిత్స చేయవచ్చు. బ్యాక్టీరియా సంక్రమణలకు చికిత్స చేయడానికి యాంటీబయాటిక్ మందులు అవసరం. వ్యక్తికి  పెయిన్కిల్లర్లు మరియు శోథ నిరోధక మందులు సూచించబడతాయి. సాధారణమైన తేలికపాటి కేసులకు పారాసెటమాల్ మరియు ఇబుప్రోఫెన్ మందులు సూచింపబడతాయి. అయినప్పటికీ, వ్యాధి పరిస్థితి తీవ్రంగా ఉంటే లేదా నొప్పి ఘోరంగా పెరిగి ఉంటే, అమిట్రిప్ట్ టీలైన్ (amitriptyline) వంటి బలమైన నొప్పి నివారణలు కూడా సూచించబడతాయి. సూచించిన ఇతర మందుల్లో కండరాల సడలింపుల మందులను కలిగి ఉంటాయి. నొప్పి ఉపశమనం కోసం బాధిత ప్రాంతంలో వేడి నీటి బాగ్లను అద్దడం లేదా వేడినీటి స్నానాలను వైద్యులు సూచిస్తా

ప్రోస్టటైటీస్ కొరకు మందులు

Medicine NamePack Size
CiploxCiplox 100 Tablet
CifranCIFRAN IV INFUSION 100ML
L CinL Cin 0.50% Eye/Ear Drops
NorfloxNORFLOX EYE /EAR DROP
MerifloxMeriflox 400 Mg Table
GigaquinGigaquin 500 Mg Tablet
NeocipNEOCIP SUSPENSION 60ML
Heal UpHeal Up 500 Mg Tablet
NeofloxNeoflox 500 Mg Capsule
HinlevoHinlevo 500 Mg Tablet
NewcipNewcip 500 Mg Tablet
InfaxInfax 500 Mg Tablet
NircipNircip 500 Mg Infusion
Nflox BNflox B 400 Mg Tablet
JetfloxJetflox 500 Mg Tablet
Nucipro (Numed)Nucipro 250 Mg Tablet
JoycinJoycin 500 Mg Tablet
OlbidOlbid 250 Mg Tablet
NogitNogit 400 Mg Tablet
L250L250 250 Mg Tablet
OmnifloxOmniflox 250 Mg Tablet
L500L500 500 Mg Tablet
PerifloxPeriflox 500 Mg Tablet
NorNor 400 Mg Suspension
 

ప్రొస్టేట్‌ గ్రంధి వాపు తగ్గాలంటే ఆయుర్వేదం లో ..

A

ప్రొస్టేట్‌ గ్రంధి వాపు వల్ల మూత్ర విసర్జన చేసే సమయంలో నొప్పి రావటం, మూత్రం కొద్ది కొద్దిగా పడుతుంది. మూత్రకోశంలోనే మూత్రం బయటకు పోకుండా మూత్రం అక్కడే మిగిలిపోతుంది. అనేక సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఈ సమస్యలను ఆయుర్వేదంలో అష్టీల వ్యాధి అంటారు. ఈ వ్యాధిని తగ్గించే సులభ చికిత్సలు చూద్దాం.

  •  50 మిల్లీ లీటర్ల సొరకాయ రసంలో ఒక గ్రాము యవక్షారం,12 గ్రాముల పటిక బెల్లం కలిపి తాగుతుంటే ప్రొస్టేట్‌ గ్రంథి వాపు తగ్గి శుభ్రంగా మూత్రవిసర్జన జరుగుతుంది.
  •  మేక పెంటికలు, మట్టి, మేక మూత్రం, సూరేకారం సమభాగాలుగా కలిపి నూరి పొత్తి కడుపు కింది భాగంలో పట్టు వేస్తే వెంటనే మూత్రం సులభంగా వస్తుంది.
  •  దళసరిగా ఉండే ఉన్ని రగ్గును తీసుకొని వేడి చేసిన ఆవు మూత్రంలో ముంచి పొత్తి కడుపు కింది భాగంలో కాపడం పెడితే మూత్ర విసర్జన సాఫీగా అవుతుంది.
  •  20 గ్రాముల దోస గింజల చూర్ణం, ఒక గ్రాము ఉప్పు కలిపి 200 గ్రాముల క్యారెట్‌ గంజిలో కలిపి తాగటం మంచిది. 
  •  రోజూ కప్పు నేల పల్లేరు కషాయంలో 500 మిల్లీ గ్రాముల యవక్షారాన్ని కలిపి మూడు పూటలా తాగుతుంటే మూత్రం మంట తగ్గుతుంది.
  •  కప్పు అరటి దుంప రసంలో పంచదార కలిపి తాగితే మూత్రం ఏ బాధ లేకుండా బయటకు పోతుంది. 
  •  తామర దుంపలను ముక్కలుగా చేసి నువ్వుల నూనెలో వేయించి చూర్ణించాలి. ఆ మిశ్రమాన్ని గోమూత్రంలో కలిపి తాగితే ప్రోస్టేట్‌ గ్రంధి వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది.
ప్రోస్టేట్ ఎన్లార్జ్ మెంట్-ఆయుర్వేదం (Prostate enlargement or benign prostate hyperplasia (BPH) ).

ప్రొస్టేట్ గ్రంధి కేవలం పురుషులలో మాత్రమే ఉండే ముఖ్యమైన గ్రంథి. వృషనాలలో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు ఈ ప్రొస్టేట్‌ గ్రంథిలో తయారయ్యే స్రావము తో కలిసి వీర్యం రూపంలో బయటికి వస్తుంది. 

ఈ మధ్య కాలం లో ప్రోస్టేట్ గ్రంధి వాపు తో బాధ పడేవాళ్ళు సంఖ్య క్రమేపి పెరుగుతూఉంది. జీవనశైలిలో  మార్పులు,ఆహారంలో మార్పులు, ప్రోస్టేటైటిస్ లాంటి రకరకాల ఇతర జబ్బులు కారణాలుగా చెప్పుకోవచ్చు.

*లక్షణాలు:-
 మాటి మాటికి మూత్రవిసర్జన చేయాల్సి రావడం,మూత్రవిసర్జన చేయాల్సివస్తే ఆపుకోలేకపోవడం,మూత్రణాలంలో మంట,కష్టంగా రావటం,
రాత్రిపూట మాటి మాటికి మూత్రవిసర్జన చేయాల్సి రావటం, మూత్రం చుక్కలు చుక్కలు గా రావటం,మూత్రవిసర్జన చేసిన తరువాత కూడా .మరలా మూత్రము వచ్చినట్టు ఉండటం మొదలగు లక్షణాలు ఉంటాయి.

*ఇతర సమస్యలు:-*
ప్రొస్టేట్‌ గ్రంథి పెద్దదవుతున్న క్రమంలో మూత్రసంచి (urinary bladder) భారం పడుతుంది. దీనివల్ల మూత్ర ప్రవాహానికి అవరోధం ఏర్పడుతుంది. ప్రొస్టేట్‌ వృద్ధి వల్ల, మూత్రనాళం సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి . ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరగడం వల్ల రోగ లక్షణాలు ఆలస్యంగా బయటపడతాయి. దీని కారణంగా ఎన్నో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది, మొట్టమొదటగా మూత్రపిండాల మీద ఒత్తిడి పెరిగి, అవి రోగ గ్రస్తం అవుతాయి కొంతమంది లో డయాలసిస్‌ చేయాల్సి వస్తుంది. మరి కొందరిలో ఇది క్యాన్సర్‌కూ దారితీసే ప్రమాదం ఉంది. మరి కొందరిలో మూత్ర విసర్జన పూర్తిగా ఆగిపోయినప్పుడు అవయవాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా డయాబెటీస్‌ వ్యాధిగ్రస్తులు దీనివల్ల తరుచూ మూత్రంలో ఇన్ఫెక్షన్‌, మంట లాంటి లక్షణాలు ఉంటాయి.

*పరీక్షలు:-*
వైద్యులు శరీర పరీక్ష తో పాటు 
కొన్ని ల్యాబోరటరీ పరీక్షలు,స్కానింగ్ మొదలగు పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స చేస్తారు.

నివారణ:

టమోటాలు విరివిగా సేవించాలి.
గుమ్మడి గింజలు,గుమ్మడి కాయ ఆహారం లో విశేషంగా ఉపయోగ చాలి.

కాఫీలు,మద్యపానం వదిలిపెట్టాలి.
 
శనగ పప్పు, కందిపప్పు సేవించవచ్చు.

క్యాబేజీ, కాలిఫ్లవర్ ఉపయోగించే వచ్చు.

చేపలు, గ్రుడ్లు సేవించవచ్చు.

పాలు వాడకం తగ్గించాలి.

మాంసాహారం ముఖ్యంగా ఎర్రటి మాంసము పూర్తిగా మానివేయాలి.

దానిమ్మ,పుచ్చకాయ లు సేవించవచ్చు

 ఆల్కహాల్, పొగాకు వాడకం పూర్తిగా తగ్గించాలి.

రాత్రి పూత  ఆహారం త్వరగా సేవించాలి.

మంచినీళ్లు ఒకేసారి ఎక్కువగా త్రాగకుండా 1 గంట -2 గంటల వ్యవధిలో సేవించడం మంచిది.

పొత్తి కడుపు పై వత్తిడి కలిగించే విధంగా కూర్చొని డ్రైవింగ్ చేయటం చేయరాదు.

రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మూత్రవిసర్జన చేసి నిద్రించాలి దీనివల్ల రాత్రి లేసే అవసరం ఉండదు.

ఆయుర్వేద చికిత్స:-
ఆయుర్వేదం లో ప్రోస్టేట్ గ్రంధి ఎన్లార్జ్ మెంట్ కు మంచి చికిత్స అందుబాటులో ఉంది.
కాంచనార గుగ్గులు,
పునర్నవ మొదలగు అనేక ఆయుర్వేద ఔషధాలు మరియు పంచకర్మ చికిత్సల ద్వారా ప్రోస్టేట్ గ్రంధి వాపు తగ్గించవచ్చు.
వివరాలకు సంప్రదించండి:
ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.

కామెంట్‌లు లేవు: