9. ప్రమాదాలు మరియు గాయాలు అరికట్టడం అవగాహనా కోసం నవీన్ నడిమింటి
పిల్లలు నేర్చుకోడానికి మరియు పంచుకోటానికి 100 ఆరోగ్య సందేశాలు, చాలా సింపుల్ గా, ఉపయోగపడే అవగాహన సందేశాలు. ఇవి 8-14 సంవత్సరాల మధ్య పిల్లలకోసం ఉద్దేశించబడినవి. అంటే ఇందులో టీనేజ్ కి రాబోతున్న 10-14 ఏళ్ల పిల్లలు కూడా ఉంటారు. మా ఉద్దేశంలో 10-14 సంవత్సరాల పిల్లలకి ఈ సమాచారం తెలియటం ఉపయోగకరం ఇంకా ముఖ్యం, ఎందుకంటే సాధారణంగా కుటుంబాలలో చిన్న చెల్లెళ్ళని, తమ్ముళ్ళని వీరే చూసుకుంటూ ఉంటారు. ఇంకా, వారు ఈ విధంగా కుటుంబానికి చేస్తున్న సాయానికి వారిని గుర్తించి మెచ్చుకోవటం ముఖ్యం.
ఈ 100 సందేశాలు 10 ముఖ్యమైన ఆరోగ్య టాపిక్ లకి ఒక్కోదాంట్లో 10 సందేశాలుగా ఇవ్వబడ్డాయి, ఆ ఆరోగ్య విషయాలు ; మలేరియా, డయేరియా, పోషణ, దగ్గు-జలుబులు మరియు జబ్బులు, పేగుల్లో పురుగులు, నీరు మరియు పరిశుభ్రత, హెచ్ ఐవి మరియు ఎయిడ్స్ ఇంకా ప్రమాదాలు,గాయాలు మరియు బాల్యంలో ఎదుగుదల. ఈ సింపుల్ ఆరోగ్య సందేశాలను తల్లిదండ్రులు,ఆరోగ్య కార్యకర్తలు ఇంట్లో, స్కూళ్ళల్లో,క్లబ్స్ లో మరియు క్లినిక్స్ లోని పిల్లలకోసం వాడాలి.
అంశం 9 : ప్రమాదాలు మరియు గాయాలు అరికట్టడం
- వంట శాలలు పిల్లలకు చాలా ప్రమాదకరం. వారిని నిప్పు నుండి, మొనదేరిన వస్తువులనుండి, బరువైన వస్తువులనుండి దూరంగా ఉంచండి
- పిల్లలు నిప్పులకు ఊదడం చేయకూడదు. అది అనారోగ్యం పాలు చేస్తుంది
- విషపదార్థాలను పిల్లలకు దూరంగా ఉంచండి. ఖాళీ శీతల పానీయాల సీసాలలో విష పదార్ధాలు ఉంచకండి
- పిల్లలకు కాలినపుడు, చల్లని నీటిని కాలిన చోట నొప్పి తగ్గేవరకు పోయండి (సుమారుగా 10 నిముషాల పైన)
- వాహనాలు, సైకిళ్ళు పిల్లల గాయాలకు, మరణాలకు కారణమవుతాయి. వీటి నుండి జాగ్రత్తగా వుండండి మరియు ఇతరులకు కూడా చూపండి
- చిన్న పిల్లలకు ప్రమాద వస్తువులైన కత్తులు, గాజు ముక్కలు, విద్యుత్తు తీగలు, మేకులు, పిన్నులు మొదలగు వాటిని గమనించండి
- చిన్న పిల్లలు మన్ను తినకుండా చూడండి మరియు వారు నాణేలు, బత్తాయిలు వంటి చిన్న చిన్న వస్తువులు నోటికి దగ్గరగా పెట్టుకోకుండా చూడండి. ఇవి ఊపిరిని అడ్డుకుంటాయి
- చిన్న పిల్లలు నీటి దగ్గర ఆడుకోకుండా చూడండి . లేదంటే వీరు వాటిలో (చెరువులు, సరస్సులు,బావులు) పడిపోయే ప్రమాదముంది
- ప్రధమ చికిత్స డబ్బాను ఇంటిలో పాఠశాలలో ఏర్పాటు చేయండి (సబ్బు, కత్తెర, జబ్బుల వ్యాప్తిని అరికట్టే మందు, దూది, ఉష్ణమాని, కట్టు, ఓఆర్ఎస్)
- ఏదైనా ప్రదేశానికి చిన్న పిల్లలతో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చిన్న పిల్లలకు ఏమైనా ప్రమాదముందేమో తెలుసుకోండి, చూడండి
- https://m.facebook.com/story.php?story_fbid=2282051895393016&id=1536735689924644
ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు.
ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ప్రమాదాలు మరియు గాయాలు అరికట్టడం – పిల్లలు చేయగలిగినది ఏమిటి
- మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి ప్రమాదాలు మరియు గాయాలు అరికట్టడంపైన మన సొంత సందేశాలను తయారు చేయండి
- ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
- ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
- విష పదార్ధాలను సురక్షితంగా ఉంచడంపై పత్రాలను తయారు చేయండి . ఎలా భద్రపరచాలి, ఎలా గుర్తించాలి, పిల్లలకు ఎలా దూరంగా ఉంచాలి
- ఎవరైనా గాయపడితే ఉపయోగించడానికి ప్రధమ చికిత్స డబ్బాను తయారుచేయండి
- పిల్లలు ఆడుకోవటానికి సురక్షితమైన బొమ్మలను తయారుచేయండి
- చెరువు, సరస్సుల దగ్గర అత్యవసర సమయాలలో ఉపయోగించడానికి తాడు, తెలియుండే పదార్ధం తయారుచేసుకోండి
- ప్రధమ చికిత్స ప్రదేశాన్ని పాఠశాలలో తయారుచేసుకోండి
- పిల్లల భద్రత పై అవగాహన పెరగటానికి భద్రతా ప్రచారం చేయండి
- మన ప్రాంతంలో ఏ ఏ ప్రదేశాలలో పిల్లలకు ప్రమాదం కలిగించే స్థాయిలో నీరు ఉందొ, వాటినుండి పిల్లలను ఏ రకంగా భద్రంగా వుంచాలో తెలుసుకోండి
- “కానీ ఎందుకు” ప్రమాదాల గురించి ఆటను ఇళ్లల్లో ఆడండి
- మన ఇంటిని మరింత భద్రమైన ప్రదేశంగా తీర్చిదిద్దటానికి కావాల్సిన నాటికలు, పాటలు, పత్రికలు గూర్చి ఆలోచించండి
- ఇంటి లోనూ, పాఠశాలలోనూ ఉంచే ప్రధమ చికిత్స డబ్బాలో ఏమేమి ఉంచాలో ఆరోగ్య కార్మికులను తెలుసుకోండి
- పత్రిక లేదా చిత్రం లో వున్న అన్ని ప్రమాదాలను గుర్తించే ఆటలను తయారు చేసి ఆడండి
- రహదారులపై పిల్లల భద్రత గూర్చి అవగాహన పెంచడానికి ప్రచారం చేయండి
- పిల్లలను చూసుకునేటప్పుడు భద్రత గూర్చి అవసరమైన జాగ్రత్తలను తెల్పుతూ ఆడి చూపండి
- అత్యవసర పరిస్థితులలో సహాయపడటానికి వీలుగా ప్రధమ చికిత్స పద్దతులను నేర్చుకోండి. మన నైపుణ్యాన్ని అభివృద్ధి పరుచుకునే దిశగా ఈ పద్దతులను వల్లె వేస్తూ మన స్నేహితులతోను, కుటుంబ సభ్యులతోను ఆడి చూడండి
- పిల్లలకు ఏమైనా ప్రమాదకర పరిస్థితులు మన ఇంటిలో ఉన్నాయేమో చూడండి
- చిన్న పిల్లలకు గాయాలు తగిలే అవకాశాలేమేమి ఉన్నాయో పెద్దవారితో చర్చించండి
- చిన్న పిల్లలకు ఊపిరి ఆడనపుడు ఏమి చెయ్యాలో తెలుసుకుని, ఆ పద్ధతులను తల్లి దండ్రులతో, అన్న దమ్ములతో, తాతలతో పంచుకోండి
- కాలడానికి, పడిపోవడానికి, మునిగిపోవడానికి, రద్దీ వున్న రహదారుల మీద గాయపడటానికి ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో గమనించండి
- ఇంటిలో కాలడానికి అవకాశమెంత? ఎవరికైనా కాలినపుడు ఏమి చేయాలి? పిల్లలను వేడి వస్తువులు, వేడి ద్రవాలనుండి దూరంగా ఎలా ఉంచాలి? మన సంఘంలో పెద్దలు పిల్లలను ప్రమాదాలకు దూరంగా ఉంచుతున్నారా? ఎలా ఉంచుతున్నారు? పెద్దవారు లేదా ఎదిగిన పిల్లలకంటే చిన్న పిల్లలలో ఊపిరి ఆడకుండా ఉండటానికి ఎందుకు అవకాశం ఎక్కువ? మనం ప్రమాదంలో పడకుండా నీటిలో మునిగిన వారికి ఏ విధంగా సహాయం అందించగలము?
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి