2, ఏప్రిల్ 2020, గురువారం

సైకిల్ తొక్కడం వల్ల ఉపయోగం ఏమిటే


cycling as exercise -సైకిల్ తొక్కడము వల్ల ఉపయోగం ఏమిటి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -cycling as exercise -సైకిల్ తొక్కడము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వ్యాయామం మంచి ఆరోగ్య పరిరక్షణ కోసం చాలా అవసరం. ఇది ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను ధృఢపరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి ఉపయోగిస్తారు. దైనందిక వ్యాయామం వలన అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చును.

ప్రయాణ సాధనాల్లో అన్నిటికన్నా అద్భుతమైనది బైసికిల్ అంటే అతిశయోక్తి కాదు. అది కేవలం ప్రయాణ సాధనమే కాదు అతి తక్కువ ఖర్చుతో శరీరానికి అవసరమైన వ్యాయామాన్ని అందించే సాధనం కూడా! రక్తపోటు, నరాలు లాగడం, వెన్ను నొప్పి, పాదాలు, మడమల నొప్పి, కీళ్ల నొప్పులు, మెడనొప్పి, మానసిక వ్యాకులత లాంటి లెక్కలేనన్ని శారీరక, మానసిక వ్యాధులను అడ్రసు లేకుండా తరిమి కొట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చే దివ్యౌషధం ఈ వాహనం. ఇది అత్యంత సురక్షితమైనది కూడా.
సురక్షితంగా లేని సైకిల్ తొక్కే పరిస్థితులు :

  • ప్రతికూల వాతావరణం-గాలి ,వాన , దూళి , దుమ్మి .,
  • వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం-ప్రమాదాలు సంభవించే అవకాశాలు ,
  • ఎత్తుపల్లాలు-,
  • గోతులతో ఉండే రోడ్లు,
  • ఇరుకైన వీధులు,
  • అపాయకారి గల్లీలు,
  • స్టార్‌లయితే జనం పెట్టే ఇబ్బందులు ,
  • ముప్ఫై ఏళ్ల పైబడిన గృహిణులు సైకిల్ తొక్కడాన్ని వంకర దృష్టితో చూసే వాళ్లు ,
  • కారు ఉండే సంపన్నులు సైకిల్ తొక్కాలంటే నామోషీగా ఫీలవడం..................................ఇలాంటి వాటిలో కొన్ని.

హెల్త్ బైసికిల్ :
అయితే సైకిల్ తొక్కడం చక్కటి వ్యాయామమే కాక సర్వరోగ నివారణి కూడా. వ్యాయామం కోసమో, లేదా ఆరోగ్య దృష్టితోనో, బాడీ ఫిట్‌నెస్‌కోసమో సైకిల్‌ను ఉపయోగించే వారు బయట తొక్కే సైకిల్‌నే వాడాల్సిన పని లేదు. ఇలాంటి వారికోసం ఇంట్లోనే కదలకుండా ఉంచి సైకిల్‌లాగా తొక్కే బైసికిల్ వచ్చింది. అదే హెల్త్ బైసికిల్. దీన్ని సులభంగా ఇంటి గదిలోపల ఉంచి ఎలాంటి ఇబ్బందీ లేకుండా తొక్కవచ్చు.ఎలా మొదలెట్టాలి?...ఈ హెల్త్ బైసికిల్‌ను ప్రారంభంలో నెమ్మదిగా తొక్కడం ప్రారంభించి క్రమంగా వేగం పెంచుకోవచ్చు. అయితే దీన్ని ఉపయోగించడానికి ముందు ఎవరైనా వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం తప్పనిసరి. వ్యాధులు, వాంతులు, జలుబు, విరేచనాలు, జ్వరం, మూలశంక లాంటి వ్యాధులతో బాధపడే వారు సైక్లింగ్ చేయరాదు. సైకిల్ తొక్కడానికి ముందు తేలికగా టిఫిన్ చేయాలి. డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి కావలినంతగా నీళ్లు తాగవచ్చు. ఫ్యాన్ వేసుకోవచ్చు కానీ ఎసి వద్దు. ఎదురుగా టీవీ ఉంటే బోర్ కొట్టకుండా ఉంటుంది.

సైకిల్ తొక్కడానికి ముందు జాగ్రత్తలు /సూచనలు :

  • ఎలాంటి మానసిక ఒత్తిడి, ఆదుర్దా లేకుండా ప్రశాంతంగా సైకిల్ తొక్కడం ప్రారంభించాలి.
  • ఇరవై నిమిషాల సైక్లింగ్ చాలు. గంటకు 15 కిలోమీటర్ల వేగం ఉంటే సరిపోతుంది.
  • ఒకే సారి సైకిల్ తొక్కడాన్ని నిలిపివేయరాదు. నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ రావాలి.
  • లూజ్‌గా ఉండే దుస్తులు వేసుకోవాలి.
  • నాలుగు రోజులు చేసి వదిలిపెట్టి మళ్లీ ప్రారంభించడం లాంటివి చేయకూడదు.
  • క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
  • మనసుకు ఆహ్లాదంగా ఉండే మ్యూజిక్ లేదా సినిమా పాటలు లాంటివి వింటూ కూడా సైక్లింగ్ చేయవచ్చు.
  • ఇక సైక్లింగ్ ప్రారంభించడానికి ముందు మీ ఎత్తుకు తగినట్లుగా సీట్‌ను అడ్జెస్ట్ చేసుకోండి.
  • 15 నిమిషాల పాటు ఆపకుండా సైక్లింగ్ చేయాలి. చెమట ఎక్కువగా ఉంటే ఆపి చెమట తుడుచుకుని మళ్లీ ప్రారంభించవచ్చు.
  • హ్యాండిల్ బార్‌పై చెయ్యి ఉంచి వంగరాదు.
  • వీపు, నడుము నిటారుగా ఉంచాలి.
  • ప్రతిసారీ పెడల్ తొక్కేటప్పుడు కాళ్లను నేరుగా చేస్తుండాలి.

ఉపయోగాలు
  • గుండె కొట్టుకోవడాన్ని సక్రమంగా ఉంచడంతో పాటు హృద్రోగాలకు దూరంగా ఉంచుతుంది.
  • రక్తపు పోటు, బిపిలను అదుపులో ఉంచడంలో జాగింగ్‌కన్నా కూడా ఎక్కువ పరిణామకారి. దీనివల్ల కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడదు.
  • పొట్ట సైజు, కొవ్వును తగ్గించుకోవడానికి, బరువు తగ్గించుకోవడానికి మంచి సాధనం.
  • శరీరం కింది భాగానికి ఎక్కువ వ్యాయామం లభించి కాళ్లు దృఢంగా తయారవుతాయి.
  • ఈ సైక్లింగ్ వల్ల అరగంటలో 330 కేలరీలు ఖర్చవుతాయి. అందువల్ల నడకకన్నా కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది.
  • దీని వల్ల కూర్చోవడం, లేవడం, నడవడం, నిలబడ్డం లాంటి అనేక శారీరక ప్రక్రియలు సులభమవుతాయి.
  • అజీర్ణం లాంటి సమస్యలు దూరమవుతాయి.
  • మనిషిలో నిరాశను తొలగించి నూతన ఉత్సాహాన్ని నింపుతుంది.
  • స్ర్తిలలో బహిష్టుకు ముందు వచ్చే నొప్పి, ఇబ్బందులను దూరం చేస్తుంది.
  • ఉత్తమ ఆరోగ్యం, ఆకర్షణీయమైన శరీరాకృతి ఇచ్చే ఈ హెల్త్ బైసికిల్ 30 ఏళ్లకే లావుగా తయారయి పోతున్న నేటి ఆధునిక మధ్య వయసు మహిళలకు అద్భుత వ్యాయామ సాధనం .
  • వెన్నెముక సక్రమంగా ఉంటుంది.
  • బాడీ షేప్ కూడా ఆకర్షణీయంగా తయారవుతుంది.

నష్టాలు /కష్టాలు :
  • మధుమేహం సమస్య ఉన్న వారికి ఈ సైక్లింగ్ నిషిద్ధం-వీరికి నడక వ్యాయామము మంచిది .
  • ఒకే చోట సైక్లింగ్ చేయడం బోర్ కొట్టవచ్చు.
  • శరీరం పైభాగానికి వ్యాయామం లేక పోవడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.
  • హెల్త్ బైసికిల్ ధర ఎక్కువ అయినందున దిగువ, మధ్యతరగతి వారికి భారం కావచ్చు.
  • తెల్లవారుజామునే లేచి వాకింగ్, జాగింగ్ లాంటివి చేయలేని వారు, బిజీ రోడ్లపై న, గతుకుల రోడ్లపైన సైకిల్ తొక్కడం కష్టం.
  • అన్ని వయసుల వారూ సీటుపై కూర్చుని ఎలాంటి కష్టమూ లేకుండా సైక్లింగ్ చేసే వీలుండదు .
  • ధన్యవాదములు 
  • మీ నవీన్ నడిమింటి 
  • 970 370 666 0
  • ==============================
  • *సభ్యులకు విజ్ఞప్తి* 
  • ******************
  • ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
  • https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: