20, ఏప్రిల్ 2020, సోమవారం

థైరాయిడ్ సమస్య కు పరిష్కారం మార్గం


థైరాయిడ్ 'బరువు' తగ్గే డైట్ ఉందా...?? అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 



       పి.సి.ఓ.డి, థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి. బరువు పెరుగుతున్నాను. మూడు నెలల్లొ కనీసం ముప్పై నుంచి ముప్పై అయిదు కిలోలు తగ్గే ఆహారం చెప్పండి.

మూడు నెలల్లో మీరు ముప్పై కిలోలు పెరగగలరా? అది సాధ్యం కాని పని. అదే విధంగా మూడు నెలల్లో ముప్పై కిలోలు తగ్గాలంటే ఎలా కుదురుతుంది. మన శరీరానికి తగినంత గౌరవం ఇస్తూ , మన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక ప్రణాళిక ప్రకారం ప్రయత్నిస్తే, తప్పనిసరిగా ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. తగ్గిన బరువు తిరిగి రాకుండా చూసుకోగలుగుతారు.

నిజానికి, పి.సి.ఓ.డి, థైరాయిడ్ .. ఈ రెండూ జీవక్రియను చాలా ప్రభావితం చేస్తాయి. రిజల్ట్ ఏమిటంటే అధిక బరువు, రుతుస్రావం క్రమం తప్పడం, బద్ధకం, ఒళ్ళు బరువుగా ఉండడం, జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం, మలబద్ధకం, అతిగా నిద్ర, నీరసం, ఆకలి, ఇలా పలు రకాల సమస్యలు వస్తుంటాయి.

థైరాయిడ్ ఉన్న వారు మీరు తీసుకోవల్సిన జాగ్రత్తలు

* మంచి నీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉదా. మజ్జిగ, పండ్ల రసాలు, సూప్‌లు, రసం లాంటివి.

* పీచు పదార్థం ఉన్న ఆహారాలు ప్రతి పూటా తీసుకోవాలి. ఉదా. పళ్ళు కాయగూరలు, ముఖ్యంగా కాప్సికం, తొక్క తీయని గింజలు, చిరుధాన్యాలు. దీనివల్ల శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. మలబద్ధకం పోతుంది.

* మీ ప్లేట్‌లో సగానికి సగం పళ్లు, కాయగూరలతో నింది ఉండాలి. దీనివల్ల ఆకలితో పాటు బరువు కూడా క్రమేపీ తగ్గుతుంది.

* హార్మోన్ బ్యాలెన్స్ ఉండాలంటే మాంసకృత్తులు చాలా ముఖ్యం. పప్పు దినుసుల్లో, గుడ్డులో ప్రోటీన్లు ఉంటాయి. వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.

* ప్రతి రోజూ వ్యాయామం చెయ్యాలి. ఇది హార్ట్‍బీట్ రేటును పెంచేదిగా ఉండాలి.

* థైరాయిడ్ ఉన్నప్పుడు ఒంట్లో రక్తం శాతం తగ్గే అవకాశం ఉంది. అలాగే కాల్షియం కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంది. దీనితో పాటు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ఖర్జూరాలు, ఆకు కూరలు, హోల్ ఎగ్‌లో రక్తశాతం పెంచే ఖనిజాలు ఉంటాయి. పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం ఉంటుంది. వీటిని ఒక భాగం మీ ఆహారంలొ తీసుకోవాలి. పీచు పదార్థం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాబట్టి, ఏదో విధంగా బరువు తగ్గడం కన్నా మనకున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, తగిన ప్రణాలికను ఎంచుకోవాలి. తద్వారా ఆరోగ్య సమస్యలు, అధిక బరువు నుంచి బయటపడండి.

మీకు ఈ లక్షణాలున్నాయా...? ఒక్కసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోరూ...!


థైరాయిడ్ గ్రంధి మన శరీరంలో జీవ క్రియలకు అత్యంత అవసరమైనది. ఇది బాగుంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. దీని పనితీరు సరిగా లేకుంటే ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. ప్రతి ఒక్కరూ దీని పనితీరు గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో తేడా వస్తే మన శరీరం ఎన్నో లక్షణాల ద్వారా దాన్ని మనకు తెలియజేస్తుంది. అవేంటన్నది తెలుసుకుంటే థైరాయిడ్ ను జాగ్రత్తగా చూసుకుంటూ హెల్దీగా ఉండొచ్చు.


గొంతు ముందు భాగంలో...
థైరాయిడ్ గ్రంధి కేవలం రెండు అంగుళాలంత పరిమాణంలో మన గొంతులో ముందు భాగంలో ఉంటుంది. అచ్చం సీతాకోక చిలుక మాదిరిగా ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే స్వరపేటిక కింద ఉంటుంది. థైరాయిడ్ గ్రంధి తల్లిగర్భంలో ఉన్న శిశువులో 14వ వారం నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది. మనకు ఆక్సిజన్ ఎలా ప్రాణావసరమో, థైరాయిడ్ గ్రంధికి కూడా ఐయోడిన్ అంతే అవసరం. తల్లి గర్భంలోని శిశువులో ఈ గ్రంధి తొలుత నాలుక వెనుక భాగంలో అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత దానంతట అదే బిడ్డ ఎదుగుతున్న కొద్దీ స్వరపేటిక కింది భాగంలోకి వెళ్లిపోతుంది. తల్లి గర్భం నుంచి భూమ్మీదకు వచ్చేనాటికి పూర్తిగా మెడ ముందు భాగంలోకి వచ్చేయాలి. చాలా అరుదైన సందర్భాల్లో ఇది నాలుక వెనుక భాగంలోనే ఆగిపోవడం లేదా మెడ పై భాగంలో నిలిచిపోవడం జరుగుతుంది. అలాగే అరుదుగా ఇది ఛాతీ భాగం వరకూ వెళ్లిపోతుంది.  

పనితీరు ఇలా...
మనం తీసుకునే ఐయోడిన్ ఉప్పు సహా పలు ఆహార పదార్థాల నుంచి అందే అయోడిన్ సాయంతో థైరాయిడ్ గ్రంధి పనిచేస్తుంటుంది. ఇది పనిచేయాలంటే అయోడిన్ తప్పనిసరి. ఈ గ్రంధి ఐయోడిన్ ను గ్రహించి దాన్ని థైరాయిడ్ హార్మోన్లగా మారుస్తుంది. థైరాక్సిన్ (టీ4), ట్రై అయోడోథైరాయిన్ (టీ3) అన్నవి థైరాయిడ్ హార్మోన్లు. మన శరీరంలో థైరాయిడ్ కణాలు ఐయోడిన్ తోపాటు అమైనో యాసిడ్ అయిన టైరోసిన్ సాయంతో టీ3, టీ4ను ఉత్పత్తి చేస్తాయి. ఈ టీ3, టీ4 రక్త ప్రవాహం ద్వారా శరీరమంతటా వ్యాప్తిస్తాయి. దాంతో ఇవి జీవక్రియలను నియంత్రిస్తాయి. కేలరీలను శక్తిగా మార్చేందుకు ఇవి చాలా అవసరం. ప్రొటీన్, ఫ్యాట్, కార్బొహైడ్రేట్లను టీ3, టీ4 నియంత్రిస్తాయి. ఓ కణం ఎంత మేరకు శక్తిని తీసుకోవాలన్నది వీటిపైనే ఆధారపడి ఉంటుంది.  

థైరాయిడ్ హార్మోన్ల స్థాయులను బట్టే కణాలు జీవక్రియలను నియంత్రించడం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా థైరాయిడ్ గ్రంధి 80 శాతం టీ4ను, 20 శాతం టీ3ని ఉత్పత్తి చేస్తుంది. టీ4 కంటే టీ3 నాలుగు రెట్ల అధిక శక్తిమంతం. ఇక పిట్యూటరీ గ్రంధి నియంత్రణలో థైరాయిడ్ గ్రంధి పనిచేస్తుంటుంది. పిట్యూటరీ గ్రంధి వేరుశనగ గింజ పరిమాణంలో మెదడులో ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్లు టీ3, టీ4 మరీ తక్కువ స్థాయికి పడిపోయినప్పుడు పిట్యూటరీ గ్రంధి థైరాయిడ్ ఉత్ప్రేరక హార్మోన్ (టీఎస్ హెచ్) ను విడుదల చేస్తుంది. అప్పుడు థైరాయిడ్ గ్రంధి మరింతగా హార్మోన్లను ఉత్పత్తి చేసేలా టీఎస్ హెచ్ ప్రేరేపిస్తుంది. టీఎస్ హెచ్ ఇచ్చిన బూస్ట్ తో థైరాయిడ్ గ్రంధి టీ3, టీ4 హార్మోన్లను మరింతగా విడుదల చేస్తుంది. థైరాయిడ్ గ్రంధి తిరిగి టీ3, టీ4 హార్మోన్ల ఉత్పత్తిని పెంచిన తర్వాత ఆ విషయాన్ని పిట్యూటరీ గ్రంధి గ్రహించి టీఎస్ హెచ్ విడుదలను తగ్గించేస్తుంది. రక్తంలో టీ3, టీ4 స్తాయులు అధిక స్థాయికి చేరాయని గుర్తిస్తే పిట్యూటరీ గ్రంధి టీఎస్ హెచ్ విడుదలను తగ్గిస్తుంది. ఇక పిట్యూటరీ గ్రంధిని మెదడులోని హైపోథాలమస్ అనే గ్రంధి నియంత్రిస్తుంది. ఇది టీఎస్ హెచ్ ను విడుదల చేయడానికి అవసరమైన టీఆర్ హెచ్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ టీఆర్ హెచ్ సాయంతో పిట్యూటరీ గ్రంధి టీఎస్ హెచ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఏదైనా వ్యాధి లేదా పిట్యూటరీ గ్రంధిలో గడ్డలు ఏర్పడితే అది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తుంది.

జీవ క్రియల్లో కీలకం
శ్వాసతీసుకోవడం, గుండె రేటు, శరీర బరువు, కండరాల బలం, రుతుచక్రం, శరీర ఉష్ణోగ్రత, కొలెస్టరాల్ (కొవ్వు) స్థాయులుు, కేంద్ర నాడీ వ్యవస్థల పనితీరును థైరాయిడ్ గ్రంధి నియంత్రిస్తుంది. టీ3, టీ4 హార్మోన్లు రక్తం ద్వారా శరీరంలోని ప్రతీ కణాన్ని చేరతాయి. తద్వారా జీవక్రియల వేగాన్ని నియంత్రిస్తాయి. ఉదాహరణకు గుండె ఎంత వేగంతో కొట్టుకోవాలి, తీసుకున్న ఆహారాన్ని జీర్ణవ్యవస్థ ఎంత వేగంగా ప్రాసెస్ చేయాలి అనేవి థైరాయిడ్ హార్మోన్లు అయిన టీ3, టీ4 పైనే ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఈ జంట థైరాయిడ్ హార్మోన్ల స్థాయులు తగ్గాయనుకోండి... గుండె రేటు కూడా సాధారణం కంటే తక్కువకు పడిపోతుంది. మలబద్దకం, బరువు పెరగడం ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. అదే టీ3, టీ4 అధిక స్థాయులకు చేరితే గుండె రేటు పెరిగిపోతుంది. డయోరియా, బరువు కోల్పోతారు. కేలరీలు ఏ స్థాయిలో ఖర్చవ్వాలన్నది ఇవే నిర్ణయిస్తాయి. కేలరీల వినియోగాన్ని బట్టే బరువు పెరగడం, తరగడం ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. మన దేశంలో ప్రతీ 10 మందిలో ఒకరు థైరాయిడ్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.

టీ3, టీ4 పెరిగితే (హైపర్ థైరాయిడిజం)
ఆందోళన, చిరాకు, మూడీగా ఉండడం, అధికంగా చెమట పట్టడం, గుండె స్పందనల వేగం పెరిగిపోవడం (పాల్పిటేషన్స్), అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేని సున్నితత్వం, చేయి వణకడం, బరువు తగ్గడం, జుట్టు రాలడం, నెలసరి క్రమం తప్పడం లేదా రుతుచక్రాలు చిన్నవిగా మారడం వంటివి థైరాయిడ్ హార్మోన్లు తగ్గితే కనిపిస్తాయి. థైరాయిడ్, కార్డియో వాస్కులర్ వ్యవస్థలకు సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే థైరాయిడ్ హార్మోన్ల వ్యవస్థ గతితప్పితే వెంటనే గుండెపై ప్రభావం చూపిస్తుంది. హైపర్ థైరాయిడిజం సమస్యను నివారించేందుకు థైరాయిడ్ అధిక ఉత్పత్తిని నివారించే మందులను వైద్యులు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ కేన్సర్, గొంతు కేన్సర్లలో రేడియేషన్ థెరపీ కారణంగా థైరాయిడ్ గ్రంధిని పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. సర్జరీ ద్వారా థైరాయిడ్ గ్రంధిని పాక్షికంగా, లేదా పూర్తిగా తొలగించే అవకాశం లేకపోలేదు.

టీ3, టీ4 స్థాయులు తగ్గితే (హైపో థైరాయిడిజం)
నిద్రకు సంబంధించిన సమస్యలు, అలసిపోవడం, ఏకాగ్రత లోపించడం లేదా దృష్టి నిలపలేకపోవడం, డ్రై స్కిన్ లేదా హెయిర్, ఒత్తిడి, శీతల వాతావరణం పడకపోవడం, తరచుగా, అధిక రక్తస్రావంతో కూడిన రుతుచక్రాలు, కీళ్ల, కండరాలలో నొప్పులు సమస్యలు ఎదురవుతాయి. అలాగే, జుట్టు రాలడం, జ్ఞాపకశక్తి క్షీణించడం, గుండె రేటు తగ్గడం, మలబద్దకం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీనికి చికిత్సగా థైరాక్సిన్ హార్మోన్ సింథటిక్ డ్రగ్ ను వైద్యులు సూచించొచ్చు. ఇలా మందులు సూచిస్తే జీవిత కాలం పాటు వాడాల్సి ఉంటుంది. సాధారణంగా పురుషుల కంటే మహిళలపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య ఇది. ఐయోడిన్ లోపం వల్ల రావచ్చు. లేదా రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించి హషిమోటోస్ థైరాయిడైటిస్ వల్ల కూడా కావచ్చు. ఇందులో బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పించాల్సిన యాంటీబాడీలు థైరాయిడ్ గ్రంధిని బయటి శక్తిగా పొరపడి దానిపై దాడి చేయడం వల్ల పనితీరు దెబ్బతింటుంది.

గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి
శిశువుకు కావాల్సిన ఐయోడిన్ తల్లి నుంచే వెళ్లాలి. శిశువు మెదడు సాధారణంగా అభివృద్ధి చెందాలంటే అందుకు థైరాయిడ్ హార్మోన్లు అవసరం. అందుకే గర్భిణులు తమ ఆహారంలో నిర్ణీత పరిమాణం మేర అయోడిన్ అందేలా చూసుకోవాలి. అప్పుడే శిశువులో థైరాయిడ్ హార్మోన్ పరంగా సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. ఒక్క థైరాయిడ్ హార్మోన్ ఎన్నో రకాల ఎదుగుదలకు కీలకం. గర్భిణుల్లో థైరాయిడ్ హార్మోన్లు తగ్గితే అంటే హైపోథైరాయిడిజం కారణంగా శిశువుకు ఐక్యూ సమస్యలతోపాటు మానసిక ఎదుగుదల లోపం కూడా ఎదురుకావచ్చని పలు వైద్య పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే గర్భంతో ఉన్నవారు తన కోసం, తన గర్భంలోని శిశువు కోసం తగినంత మోతాదులో ఐయోడిన్ అందేలా చూసుకోవాలి. శిశువు ప్రసవించిన తర్వాత మొదటి 30 నిమిషాల్లోపలే వారిలో టీఎస్ హెచ్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అయినప్పటికీ తల్లిలోని థైరాయిడ్ హర్మోన్ వారికి రక్షణనిస్తుంది. కానీ ప్రతీ 4000 మందిలో ఒక శిశువు కంజెన్షియల్ హైపోథైరాయిడిజం (పుట్టుకతో) సమస్యతో జన్మిస్తారు. థైరాయిడ్ గ్రంధి డెవలప్ కాకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీంతో థైరాయిడ్ హర్మోన్లు ఉత్పత్తి కాకపోవడం లేదా ఐయోడిన్ లోపం వల్ల ఇలా జరగడానికి అవకాశం ఉంది. చికిత్స ద్వారా దీన్ని నయం చేయవచ్చు. దీన్ని గుర్తించకుండా, చికిత్స చేయకుండా వదిలేస్తే హైపో థైరాయిడిజం వల్ల చిన్నారిలో ఎదుగుదల లోపం, శాశ్వత మేధోపరమైన సామర్థ్యలోపానికి దారితీస్తుంది. అందుకే నేడు ఆస్పత్రుల్లో ప్రసవానంతరం ప్రతీ శిశువుకు టీఎస్ హెచ్ టెస్ట్ చేయడం తప్పనిసరిగా అమలు చేస్తున్నారు.

యుక్తవయసుపై
థైరాయిడ్ సమస్య ఉంటే యక్తవయసు రాక ఆలస్యమవుతుంది. మన శరీరంలో వయసుకు తగ్గ మార్పులు వస్తుంటాయని తెలుసు. ఉదాహరణకు యవ్వన దశలో స్త్రీలలో రుతుచక్రం ప్రారంభం అవుతుంది. పునరుత్పత్తి వ్యవస్థ తన పనితీరును ప్రారంభించేది ఈ దశలోనే. దానికి తగ్గట్టు శరీరంలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. మరి వీటన్నింటికీ థైరాయిడే కీలకం. ఇది లోపిస్తే యవ్వనదశ ప్రారంభం ఆలస్యం అవుతుంది. లేదా బలహీనంగా ఆలస్యంగా మొదలవుతుంది. ఇది తదుపరి శారీరక నిర్మాణం, సామర్థ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. నెలసరి క్రమ పద్ధతి లోపించడం, అధిక రక్తస్రావం కావడం వంటివి కనిపిస్తాయి.

పెద్ద వయసులో
60 ఏళ్లు దాటిన వారిలో థైరాయిడ్ సమస్యలు కనిపిస్తుంటాయి. పెద్ద వయసు కావడంతో హార్మోన్ ఉత్పత్తిలో తేడా రావడం, పలు మందుల దుష్ప్రభావాలు, గుండె, గ్యాస్ట్రోఇంటెస్టినల్, నరాల సంబంధిత సమస్యల వల్ల కూడా ఇలా జరుగుతుంది. అయితే, పెద్ద వయసు వారిలో థైరాయిడ్ సమస్య ఉందని గుర్తించడం మామూలుగా కష్టం. 

*థైరాయిడ్ సమస్య ఉందా..? వీటిని తీసుకోండి ఆహారం .*

*థైరాయిడ్ వ్యాధి.*:-. 

 *థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇది ఇస్తుంది.* 

❇ *ఇందులో రెండు రకాలు ఉన్నాయి. హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని వీటిని పిలుస్తారు.* 

❇ *థైరాక్సిన్ తక్కువగా ఉత్పత్తి అయితే వారికి హైపో థైరాయిడిజం వస్తుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. జీవక్రియలు నెమ్మదిగా జరుగుతాయి. బద్దకంగా ఉంటారు.* 

❇ *ఇక థైరాక్సిన్ అవసరానికి మించి ఉత్పత్తి అయితే అలాంటి వారికి హైపర్ థైరాయిడిజం వస్తుంది. దీని వల్ల బరువు త్వరగా తగ్గుతారు. విపరీతమైన ఆకలి వేస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటంది. ఎప్పుడూ కంగారుగా, ఆందోళనగా ఉంటారు.* 

❇ *అయితే ఏ రకమైన థైరాయిడ్ వచ్చినప్పటికీ డాక్టర్ వద్దకు కచ్చితంగా వెళ్లాల్సిందే. దాంతో డాక్టర్ పరీక్ష చేసి అందుకు అనుగుణంగా మందులు రాస్తారు.*

❇ *దాంతోపాటు కింద ఇచ్చిన పలు ఆహారాలను తరచూ తింటుంటే థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా*..!

🔳 *1. అయోడిన్*:-...

🔷 *థైరాయిడ్ సమస్య రావడానికి ముఖ్య కారణం అయోడిన్ లోపం. అయోడిన్ లోపం కారణంగా థైరాయిడ్ వస్తుంది. కాబట్టి అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. ముఖ్యంగా అయోడిన్ ఉప్పునే వాడాలి. దీంతోపాటు సముద్రపు చేపలు, రొయ్యలు తినాలి. ఆలుగడ్డలు, అరటిపండ్లను తిన్నా అయోడిన్ శరీరానికి అందుతుంది.*

🔳 *2. అల్లం*:-...

🔷 *థైరాయిడ్ సమస్య ఉన్న వారు అల్లంను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ అల్లం రసం తేనెతో సేవించాలి. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది.*

🔳 *3. అవిసె గింజలు*:-...

🔷 *వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగు పరుస్తాయి. థైరాక్సిన్ కావల్సినంత మాత్రమే ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. నిత్యం అవిసె గింజలను లేదా పొడిని ఏదో ఒక రూపంలో ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుంటే చాలు, ఫలితం కనిపిస్తుంది.*

🔳 *4. వాల్‌నట్స్*:-..

🔷 *వీటిలో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. అది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో థైరాక్సిన్ అవసరం ఉన్నంత మేర శరీరానికి అంది థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.*

🔳🌴 *5. కొబ్బరినూనె*:-..

🔷 *ఇందులో మన శరీరానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియలను క్రమబద్దీకరిస్తాయి. దీంతో థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.*

🔳 *🐟6. ఫిష్ ఆయిల్*:-..

🔷 *మార్కెట్‌లో మనకు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. అయితే వీటిని డాక్టర్ సలహా మేరకు వాడుకోవాలి. వీటిని వాడితే మన శరీరానికి అవసరం ఉన్న ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. ముఖ్యంగా విటమిన్ డి3 అందుతుంది. దీంతో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది.*

🔳 *🍎7. యాపిల్ సైడర్ వెనిగర్*:-

🔷 *యాపిల్ పండ్లతో తయారు చేసే ఈ వెనిగర్‌ను నిత్యం తీసుకున్నా చాలు దాంతో థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఒక గ్లాస్ వేడి నీటిలో రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి రోజుకు ఒకసారి ఏదో ఒక సమయంలో తీసుకుంటే ఫలితం ఉంటుంది.*

🔳 *8. బి విటమిన్స్*:-...

🔷 *థైరాయిడ్ గ్రంథి పనితీరును బి విటమిన్స్ ప్రభావితం చేస్తాయి. కనుక బి విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు.*

🔳 *9. అశ్వగంధ*:-...

🔷 *అశ్వగంధ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి. దీంతో థైరాయిడ్ పనితీరు మెరుగు పడుతుంది.*మి నవీన్ నడిమింటి

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

9703706660

DISCLAIMER:The opinions expressed in this post are the personal views of the author. They do not necessarily reflect the views of Momspresso.com. Any omissions or errors are the author's and Momspresso does not assume any liability or responsibility for them.
Share Your Story
This article was posted in the below categories
Follow them to read similar posts.

కామెంట్‌లు లేవు: