15, ఏప్రిల్ 2020, బుధవారం

పిల్లల్లో నిద్ర సమస్యలు, పక్క తడపడం మొదలైవి మామూలే. కాని వీటికి గల కారణాలు, పరిష్కారాలను గురింఛి తెలుసుకోండి

పిల్లల్లో నిద్ర సమస్యలు, పక్క తడపడం మొదలైవి మామూలే. కాని వీటికి గల కారణాలు, పరిష్కారాలను గురింఛి తెలుసుకుందాం. అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
వివరాలు కు లింక్ చుడండి 

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

                నిద్రలో పక్క తడపటం (Enuresis) చంటి పిల్లల లక్షణం. పుట్టకతో అనేక అంశాలపై బిడ్డలకు అదుపు ఉండదు.వయసు పెరిగే కొద్ది ఒక్కొక్క దానిమీదే అదుపు సాధిస్తారు. ఈ క్రమంలో ఎక్కడ లోపం జరిగినా ఎదుగుదలకు సంబంధించి సమస్యలు తలెత్తుతాయి. పిల్లల్లో వయసు మీరాక నిద్రలో పక్క తడపటం కూడా ఎదుగుదలలో లోపంవల్ల కనబడే జబ్బు.
     సాధారణంగా పిల్లలు 4, 5 ఏళ్ళ మధ్య కాలంలో పక్క తడపటం ఆపేస్తారు. కొద్దిమంది ఒక వయసు వచ్చాక కూడా రాత్రి పూట పక్క తడుపుతుంటారు. ఇలా తడపటాన్ని వైద్య పరిభాషలో ‘ఎనూరిసిస్’ అంటారు. నిద్రలో పక్క తడిపే పిల్లలందిరిని ఎనూరిసిసు కింద పరిగణించ కూడదు. 4 ఏళ్ళ లోపు పిల్లలు అలా తడపటం సహజ లక్షణమే కాదు, హక్కు కూడా. ఆరు సంవత్సరాల వయసు దాటాక వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పక్క తడిపితే జబ్బుగా గుర్తించాలి. ఇది రెండు రకాలుగా ఉంటుంది.
     మూత్ర వ్యవస్థలో లోపాలు ఏమీ లేకుండా కేవలం ఎదుగుదలలో లోపం వల్ల ఈ సమస్య వస్తే దాన్ని ‘తొలిరకం’ (ప్రైమరి)గా వ్యవహరిస్తారు. మామూలుగా అయితే ఒంటేలు సంచి నిండాక ‘నేను నిండాను త్వరగా ఖాళీ చేయండోచ్’ అని సైగలు (సిగ్నళ్ళు) ద్వారా మెదడుకు సమాచారాన్ని పంపుతుంది. ఈ సైగల రాయబారం నడిపేది ‘వాసోప్రెసిన్’ అనే హార్మోను. మెదడుకు సమాచారం అందగానే ఒంటేలు వచ్చిన ‘అనిపింపు’ (ఫీలింగు) కలిగి ఆ పనికి ఉపక్రమిస్తారు. ఇదంతా మెలకువగా ఉన్నప్పుడు జరిగే తతంగం. అదే నిద్రలో ఉన్నప్పుడు ఈ సైగలు ఒంటేలు వచ్చిన అనిపింపుతో పాటు లేచి పోసుకోవడానికి వీలుగా నిద్రపోతున్న మెలకువ వ్యవస్థను తట్టి లేపాలి. అలా లేపితే నిద్ర మేలుకొని ఒంటేలు పోసుకుంటారు. పక్క తడిపే జబ్బు ఉన్న వారిలో సంచి నిండినట్లు వచ్చే సైగలకు మెదడుకు అందించే వాసోప్రెసిను హార్మోను బాగా తగ్గిపోయి ఉంటుంది కాబట్టి మెలకువ వ్యవస్థకు సమాచారం అందదు. దాంతో నిద్రలోనే పని కానిచ్చేస్తారు. మరికొంతమందిలో వయసుకు తగ్గట్టు మొదట ఒంటేలుమీద అదుపు వచ్చి కొంతకాలం బాగున్నా తరువాత పక్క తడపటం మొదలు పెడతారు.
     ఒత్తిడి, మూత్ర సంచిలో సమస్యలు, నరాలకు సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు ఆ జబ్బులో ఒక లక్షణంగా పక్క తడుపుతారు. ఈ తరహా పక్క తడపటాన్ని ‘మలిరకం’ (సెకండరీ)గా గుర్తిస్తారు. తొలిరకం పుట్టినప్పటి నుంచి ఉంటుంది. మలిరకం మధ్యలో వస్తుంది. పక్కతడిపే అలవాటు ఉన్న పిల్లలకు ఎక్కువ భాగం తొలి రకానికి చెందినదే అయి ఉంటుంది. మలిరకం చాల అరుదుగా ఉంటుంది. ఇలా విడదీయటానికి కారణం ఏమిటంటే వాటికి చికిత్సా విధానంలో తేడా ఉంటుంది.
     ఏ కారణంవల్ల పక్క తడుపుతున్నా దానివల్ల పిల్లలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నిద్రపరమైన సమస్య కూడా పిల్లలకు ఉండదు. పక్త డిపిన విషయం నిద్ర లేచాక కాని వారికి తెలియదు. మరీ చిన్న పిల్లలకు అయితే తల్లిదండ్రులు చెబితే తప్ప తెలియదు. ఈ జబ్బు ప్రత్యేకత ఏమిటంటే జబ్బు పిల్లలది అయినా ఆందోళన పడేదంతా తల్లిదండ్రులు. ప్రతిరోజూ అదనపు పనితో తల్లులకు విసుగు పుడుతుంది. ఆ విసుగు అంతా పిల్లలమీద చూపిస్తారు. దీనికితోడు ఎవరి ఇంటికైనా పోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అవగాహన లేని తల్లిదండ్రులు పిల్లల్ని నిందించటం, ఎగతాళి చేయటం, కొన్నిసార్లు కొట్టటం కూడా చేస్తుంటారు. దీనివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బ తినటం, చిన్నబుచ్చుకోవటం చేస్తారు. ఇదంతా తిరిగి వారి మానసిక ఎదుగుదల మీద ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.
     పక్క తడపటం అనే జబ్బువల్ల పక్కవారికి ఎబ్బెట్టుగా ఉండటం తప్ప పిల్లలు ఇతరత్రా ఎదుగుదలకు ఏ రకమైన హానీ ఉండదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తిస్తే ముందువారి ఆందోళన తగ్గుతుంది. పిల్లల్ని తిట్టటం, కొట్టటం, అవహేళనగా మాట్లాడటం లాంటివి చేయకూడదు. దానివల్ల ఉపయోగం కంటే జరిగే నష్టం చాలా ఎక్కువ. కాస్త వయసు వచ్చిన పిల్లలు తమ సమస్యను గుర్తించి మదన పడుతుంటే వారిని తేలిక పరిచేటట్టు ఓదార్చాలి. ప్రయత్నం చేస్తే సమస్య నుండి బైట పడవచ్చన్న భరోసా పిల్లలకు ఇవ్వాలి. చేయించే వైద్యంలో పిల్లలు తమకు తాముగా ఇమిడిపోయే విధంగా తర్ఫీదు ఇవ్వాలి. ఏదో మందులు వేస్తున్నాం అనే ధోరణిలో ఉండకూడదు.

ప్రవర్తన చికిత్స: రాత్రిపూట పడుకోబోయే ముందు పిల్లలకు నీళ్ళు తక్కువగా తాగించాలి. ఐసుక్రీములు లాంటివి తినటాన్ని కట్టడి చేయాలి. ఇంట్లో ఎవరూ చివర పడుకుంటారో వారు పిల్లల్ని లేపి ఒంటేలు పోయించి పడుకోవాలి. అలాగే మధ్యలో పెద్దవారికి ఎవరికి మెలకువ వచ్చినా వారు ఆ పని చేయించాలి. ఒంటేలు బుడ్డ కండరాలను పటిష్ట పరచటానికి పిల్లలచేత కొన్ని రకాల అలవాట్లు, వ్యాయామాలు చేయించాలి. మెలకువగా ఉండేటప్పుడు ఒంటేలు వచ్చినప్పుడు వెంటనే పోసేయకుండా సాధ్యమైనంత సేపు బిగబట్టుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఉచ్చబుడ్డ ఓర్పు పెరుగుతుంది. చేయించదగ్గ మరో వ్యాయామం ఏమిటంటే ఒంటేలు పోసేటప్పుడు త్వరగా ఒకే ధారగా పోయకుండా ఆపి ఆపి ఎక్కువ పోసే అలవాటు చేయాలి. దీనివల్ల ఉచ్చ ఆ ప్రాంతపు కండరాలు గట్టిపడి పక్క తడిపే అలవాటుకు అవకాశం తగ్గుతుంది. పిల్లలకు ప్రవర్తనా పరమైన చికిత్సను మొదలు పెట్టాలి. ముందుగా సమస్యతో ఇబ్బంది పడుతున్న బిడ్డని దాని నుండి బైటపడే విధంగా సమాయత్త పరచాలి. అందుకు పిల్లలతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. నెలలో పక్క తడిపే రోజులు తగ్గే కొద్ది దానికి తగ్గట్టు వారికి బహుమానాలు ఊరించాలి. ఊరించటమే కాదు, సరిగ్గా అమలయ్యే కొద్దీ నిజంగా తీసి ఇవ్వాలి. ఏరోజు అయినా పడక తడపక పోతే ఆ రోజు పిల్లల్ని పదే పదే అభినందించాలి. అలాంటి రోజులు వారిచేతే కాలెండరులో గుర్తు పెట్టించండి. ఆ నెలలో పక్క తడపని రోజులు పెరిగే కొద్ది ఒప్పందం ప్రకారం వారికి బహుమతులు ఇవ్వాలి.
   పక్కతడి అయిన వెంటనే గణగణ మోగే ‘పాడ్ బెల్’ పరికరాలు కూడా మార్కెట్టులో దొరుకుతున్నాయి.చాలామంది పిల్లలకు అవి బాగా పనిచేస్తాయి. క్లినికలు సైకాలజిస్టు పర్యవేక్షణలో దాన్ని ఉపయోగించవచ్చు.

మందులతో చికిత్స : దీనికి విడివిడిగా అనేక చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అయితే వీటన్నింటిని రంగరించి సమగ్ర పరిచే చికిత్స ఉపయోగకరంగా ఉంటుంది. ఎదుగుదల లోపంగా వచ్చే సమస్యకు మానసు వైద్య నిపుణులచేత వైద్యం చేయించాలి. దీనికోసం వాడే మందులు మాత్రల రూపంలోనే కాకుండా ఇప్పుడు సులభంగా ముక్కులోకి పీల్చుకొనే ‘నాసల్ స్ప్రే’లు కూడా దొరుకుతున్నాయి. అయితే వీటిని మైండు ఫిజీషియను పర్యవేక్షణలోనే వాడాలి. మందులు వాడకంతోపాటు ప్రవర్తనా సంబంధమైన ఈ పద్ధతుల్ని నిరంతరం పాటిస్తే ఫలితం బాగుంటుంది

ఆయుర్వేదం లో ఎలా అంతే 

ఇది తరచుగా మూత్రాశయ పరిపక్వత ఆలస్యం, అధిక మూత్ర ఉత్పత్తి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, చిన్న మూత్రాశయం, ఒత్తిడి, దీర్ఘకాల మలబద్ధకం, లేదా హార్మోన్ అసమతుల్యత కారణంగా ఏర్పడుతుంది.
కొంతమంది పిల్లలు గాఢ నిద్రలో ఉండి, వారి మెదడుకు మూత్రాశయం నిండినట్లు హెచ్చరిక దొరకదు. అలాగే, మెజారిటీ కేసుల్లో, పక్క తడపడం వారసత్వంగా వచ్చే సమస్య. వయసు పెరిగే పిల్లలలో తరచుగా పక్క తడపడం ఇబ్బందికరమై, పిల్లలు సిగ్గుపడి పార్టీలు, సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండడానికి కారణమవుతుంది. కొన్ని సులభమైన మరియు సాధారణ సహజ నివారణలు తో పక్క తడిపే సమస్యను ఆపడానికి మీరు మీ బిడ్డకు సహాయపడవచ్చు.
1. దాల్చిన
మీ పిల్లలు పక్క తడపడం ఆపడానికి సరళమైన గృహ నివారణలలో దాల్చిన  ఒకటి. దాల్చిన శరీరాన్ని వేడిగా ఉంచుతుందని నమ్మకం.
• మీ పిల్లలు రోజూ ఒకసారి దాల్చిన ముక్కను పూర్తిగా చప్పరించేలా చెయ్యండి.
• చక్కెర, దాల్చిన పొడితో కలిపి, వెన్న రాసిన బ్రెడ్ పై చల్లి అల్పాహారంగా మీ పిల్లలతో తినిపింవచ్చు.
2. ఉసిరి పొడి
ఉసిరి, పక్క తడపడం తప్పించుటకు ఒక అద్భుతమైన ఆయుర్వేద నివారణ మార్గంగా చెప్పవచ్చు.
• ఒక టీ స్పూను ఉసిరి పొడితో, ఒక టేబుల్ స్పూను తేనె  మరియు ఒక చిటికెడు పసుపు  జోడించండి. ప్రతి ఉదయం మీ పిల్లలకు ఈ మిశ్రమం ఇవ్వండి.
• మరొక ఎంపికగా మీ పిల్లలకు ఒక చిటికెడు నల్ల మిరియాలు పొడితో, ఒక టీస్పూన్ ఉసిరి గుజ్జు కలిపి తినిపించండి.
3. మసాజ్
పక్క తడపడం ఆపుటకు ఉదర మసాజ్ ప్రయత్నించండి. పక్క తడపడం నివారించుటకు ఒక సులభమైన చికిత్సగా, ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు.
• కేవలం కొంత ఆలివ్ నూనె వేడి చేసి మరియు వెచ్చదనం హాయిగా ఉన్నప్పుడు, అనేక నిమిషాల పాటు మీ పిల్లల యొక్క పొత్తి కడుపు ప్రాంతంలో నెమ్మదిగా మసాజ్ చెయ్యండి. 
• సంతృప్తి ఫలితాలు దొరికే వరకు రోజువారీ ఈ పరిహారం అనుసరించండి.
4. వాక్కాయ జ్యూస్
వాక్కాయ జ్యూస్ మూత్రాశయం మరియు మూత్ర మార్గమునకు మంచిది. పక్క తడపే పిల్లల సమస్య కోసం అత్యంతంగా సిఫార్సు చేయబడింది.

• నిదుర పోయే ముందు ద్రవాలు సేవన తప్పించవలసినప్పటికీ, మీ పిల్లలకు ఒక కప్పు తాజా వాక్కాయరసం నిదుర పోయే ఒక గంట ముందు ఇవ్వవచ్చును. 
• రోజువారీ కనీసం కొన్ని వారాలపాటు  ఈ పరిష్కారాన్ని పునరుక్తి చేయండి.
• పక్క తడపడం మూత్ర సంక్రమణ వలన అయితే, రోజువారి మూడు సార్లు సగం కప్పు వాక్కాయజ్యూస్ మీ పిల్లలకు ఇవ్వండి.
6. తేనె
పక్క తడపడం తొలగించే మరొక ప్రముఖ గృహ వైద్యం తేనె.  ఈ సులభమైన పరిహారం, తేనె తీపి రుచి వలన పిల్లలు ఇష్టపడతారు ప్రయత్నించండి.
• కేవలం నిద్రించే ముందు మీ పిల్లలకు ముడి తేనె ఒక టీ స్పూను ఇవ్వండి.
• ప్రత్యమ్నాయంగా, మీ పిల్లలకు అల్పాహారంలో ఒక స్పూన్ ముడి తేనె పాలలో కలిపి ఇవ్వండి.
7. ఆపిల్ సైడర్ వినెగార్
ఆపిల్ సైడర్ వెనీగర్ శరీరం యొక్క pH కి సంతులనం కలిగించి,  ఆమ్ల స్థాయిలను తగ్గిస్తుంది, దీని వలన సమస్య నివారింపబడవచ్చు. ఇది కూడా నిర్విషీకరణ లో సాయంచేసి, మలబద్ధకమునకు చికిత్స చేస్తుంది.
• ఒక గ్లాసు నీటిలో రెండు టీ స్పూనులు ఆపిల్ సైడర్ వెనీగర్  కలిపి, ఐచ్ఛికంగా, కొద్దిగా ముడి తేనె జోడించి ఇవ్వవచ్చును.
• మీ పిల్లల ప్రతి భోజనం తో ఈ పరిష్కారం త్రాగటానికి ఇవ్వవచ్చును.
8. ఆవాలు
పక్క తడపే సమస్యకు ఆవాలు ఒక మంచి పరిహారంగా ఉంది. ఆవాలు మూత్ర మార్గ సంక్రమణలతో బాధపడే వారికి గొప్ప సహాయం అందిస్తుంది.
• ఒక కప్పు వెచ్చని పాలలో, సగం టీ స్పూను ఆవపొడి వేసి కలపండి.
• రాత్రి నిదురించడానికి ఒక గంట ముందు మీ పిల్లలకు ఈ పానీయం ఇవ్వండి.
9. బెల్లం
బెల్లం శరీరంపై వేడి ప్రభావం కలిగి ఉంటుంది. శరీరం లోపల వెచ్చగా ఉన్నప్పుడు, పక్క తడపడం సమస్య త్వరలోనే అంతరిస్తుంది.
ప్రతి ఉదయం ఒక కప్పు వెచ్చని పాలతో పాటు మీ పిల్లలకు ఒక చిన్న ముక్క బెల్లం ఇవ్వండి. ఆపై ఒక గంట తర్వాత,  ఒక చిటికెడు సైంధవ లవణంతో సమాన మొత్తాల్లో వేయించిన సెలరీ విత్తనాలు మరియు వేయించిన నువ్వుల విత్తనాలు మీ పిల్లలకు ఇవ్వండి.
 ఈ పరిహారం రోజువారీ రెండు నెలలపాటు పుననరావృతం చెయ్యండి.
అదనపు చిట్కాలు
• ఆందోళన మరియు ఒత్తిడి అధ్వాన్నంగా పక్క తడపడాన్ని ప్రోత్సాహిస్తాయి. కాబట్టి, మీ పిల్లలను నిందించడం లేదా శిక్షించడం బదులుగా,  మీ పిల్లలతో ప్రేమగా  వ్యవహరించి మరియు వారి ఇబ్బందులకు లాలనతో ఉపశమనం కలిగించండి (Avoid Child abuse).
• కేవలం నిదరించే ముందు మీ పిల్లలను మూత్ర విసర్జనకు ప్రోత్సహించండి.
• రాత్రి బెడ్ ల్యాంపులు పెట్టి మీ పిల్లల రాత్రి బాత్రూమ్ కు సులభంగా వెళ్ళగలిగేలా నిర్ధారించుకోండి.
• చిన్న గిప్టలను ఇస్తామని లేదా ప్రోత్సాహల ద్వారా పొడి రాత్రులు అనుభవంలోకి రావచ్చును.
• పగటి సమయంలో మరింత ద్రవాలు త్రాగడానికి కానీ సాయంత్రం ద్రవాలు తీసుకోవడం పరిమితం చేయడానికి మీ పిల్లలను ప్రోత్సహించండి.
• మలబద్ధకాన్ని ఉపశమింపజేయాలి. మూత్ర నియంత్రణ మరియు మలం తొలగింపులో సరైన సహాయం అవసరం. కాని దీర్ఘకాలిక మలబద్ధకం వలన కండరాలు పనిచేయక పక్క తడపడానికి దోహదకారి అవుతుంది.
• పరపులను రక్షించుకోడానికి జలనిరోధిత షీట్లు ఉపయోగించండి.
• పక్క తడపడం ఒక సమస్య కాదు. ఒకటి లేదా రెండు రోజులలో పరిష్కరించవచ్చు. ఈ నివారణలు పనిచేయడానికి సమయం ఇవ్వండి.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: