గురక సమస్య—ఆయుర్వేద చికిత్స….నవీన్ నడిమింటి సలహాలు 

(ఈఎన్ఎస్ నెట్వర్క్ ఆరోగ్యవిభాగం)
👉🏿గ్లాసు నీటిలో 1—2 పిప్పర్ మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు బాగా పుక్కిలించాలి.

👉🏿కొద్దిగా పిప్పర్ మెంట్ ఆయిల్ ను చేతివేళ్ళకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గిపోతుంది.

👉🏿1/2 టీ స్పూను ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూను తేనె కలిపి రాత్రి నిదురపోయేముందు తాగాలి.

👉🏿మరిగే నీటిలో 4లేదా5 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిదురపోయే ముందు 10ని” పాటు ముక్కుద్వారా ఆవిరి పీల్చాలి.

👉🏿ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడిచేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కురంధ్రాలలో పోసి పీల్చుతుంటే గురక తగ్గుతుంది.

👉🏿1/2టీ స్పూను యాలకుల చూర్ణంను ఒక గ్లాసు వేడీనీటిలో కలిపి రాత్రి నిదురపోయే ముందు తాగాలి.

👉🏿రెండు టీ స్పూనుల పసుపుపొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిదురపోయే ముందు తాగాలి.