15, ఏప్రిల్ 2020, బుధవారం

బరువు పెరగాలి అంతే నవీన్ నడిమింటి డైట్ ప్లాన్

సన్నగా ఉన్నారా ? కాస్త లావు పెరగండి ఇలా !అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

ప్రపంచంలో ఎక్కువ మంది లావుగా ఉండి, అదనం గా ఉన్న బరువును ఎలా తగ్గించు కోవాలో అర్ధం కాక తలలు బాదుకుంటుంటే అందుకు భిన్నంగా మేము లావు కాలేక పోతున్నాము అని బావురు మనే వారికి కూడా కొదవ లేదు .

          "పిల్ల ముఖం కళగానే ఉంది కాని గాలి కొడితే లేచి పోయేలా ఉంది "

         "ఎముకల గుడుకు తోలు తోదిగినట్టు ఉంది " పెళ్లి చూపులకు కూర్చున్న ప్రతిసారి ఇలాంటి కామెంట్లు తప్పటం లేదు            శిరీష కు 

        "ఆ బక్క నాయాలు లంచానికి లొంగటం లేదురా"  నిజాయితీ తో పాటు పాపం సన్నగా ఉన్న్నందుకు  ఇంజినీరు                 మురళి పై  కాంట్రాక్టరు కాంతారావు కామెంటు.

       

           సన్నగా ఉండే వారికి వారి సన్న దానాన్ని బట్టి బక్కది, బక్కామే, బక్కోడు. బక్క పినుగా, బక్క పిచు, రివట లాంటి పేర్లతో నేరుగానో చతుగానో అనుకోవటం కద్దు. ఎలాగయినా లావు అయ్యి ఈ పిలుపులకు దూరం కావాలని పాపం ఈ బక్క జీవులు పడరాని పాట్లు పడుతుంటారు. తిన రాని చెత్తంతా తింటుంటారు. అయినా పాపం కాస్తంత కండ  పెట్టటం గగనం అవుతుంది. కాని ఒక పద్దతి ప్రకారం నడుచుకుంటే వీళ్ళు కుడా "కండ కలవాడే మనిషే నోయ్" అని నిరూపిచు కోవచ్చు.    

   సన్నగా ఉన్నాము అనుకొనేవారు ముందుగా అసలు తాము సన్నగా ఉన్నామా? లేదా? ఉంటే ఎంత సన్నగా ఉన్నారు? అన్న సంగతి తెలుసుకోవాలి.  మీరు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఆ సంగతి 'ఒంటి కట్టుబడి తీరు' ను (బాడి మాసు ఇండెక్సు లేదా బి.ఎం.ఐ) అంచనా వేయటం ద్వారా కనుక్కోవచ్చును. దీన్ని తెలుసుకోవటానికి ముందుగా మీరు ఎన్ని కేజీలు బరువు ఉన్నారో చూసుకోండి. తరువాత మీ ఎత్తును మీటర్లలో  కొలవండి. మీటర్లలో ఉన్న ఎత్తు విలువని అదే విలువతో పెంచి (స్కొయర్) ఆ విలువ ఎంతో కనుక్కోవాలి. ఇపుడు కేజీలలో ఉన్న మీ బరువును ఎత్తుకు కనుగొన్న స్కొయరు విలువతో భాగిస్తే వచ్చే విలువే మీ ఒంటి కట్టుబడి తీరు లేదా బి.ఎం.ఐ.

                             (BMI) బి.ఎం.ఐ = బరువు (కేజీలలో) / ఎత్తు 2 (మీటర్లలో)

మచ్చుకు           మీ బరువు        =  42 కేజీలు, 

ఎత్తు              =  1.7 మీటర్లు అయితే, 

బి.ఎం.ఐ        = 42  x 1.7x 1.7 = 15.6 అవుతుంది. 

ఒంటి కట్టుబడి మామూలుగా ఉన్నవారికి ఈ విలువ 18-25 నడుమ ఉంటుంది. 18 కన్నా తక్కువ ఉంటే ఉండాల్సినంత బరువు లేనట్టే. విలువ ఎంత తక్కువగా ఉంటే వారు ఆ మేరకు బక్క పీచులు అన్నమాట.
వివరాలు link చూడాలి 

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కారణాలు :

కుటుంబ సాలు

తిండి లేక పోవటము లేదా ఉన్నా తినక పోవటము

సామాజిక వరవడులు (జీరో సైజు మోజు)

ఒంటిలో థయిరాయిడు హార్మోను ఎక్కువగా ఊరటము

నిడివి కాలం పాటు ఉండే టీబీ కిడ్ని, ఎయిడ్సు, కాన్సరు లాంటి రోగాలు ఉన్న వారు

లావు అయ్యే కిటుకు :
ముందుగా మీ ఒంటి కట్టుబడి తీరును బట్టి మీరు ఎంత సన్నగా ఉన్నారో ఒక అంచనాకు వచ్చాక ఒకసారి డాక్టరును కలిసి సన్నగా ఉండటానికి వైద్యపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఒక వేళ ఉంటే అందుకు వైద్యం చేయించు కోవాలి.

తినే కేలరీలు (తిండి) ఖర్చు పెట్టే కేలరీలు (పని) సమానం అయినప్పుడు బరువులో మార్పు ఉండదు.

తినే కాలరీల కన్నా ఖర్చుపెట్టే కాలరీలు ఎక్కువ అయితే బరువు తగ్గుతారు.

ఖర్చుపెట్టే కేలరీల కన్నా ఎక్కువ తింటే లావు అవుతారు.

మీ బరువును, తిండి అలవాట్లను పర్యవేక్షించే కేంద్రము మెదడులో ఉంటుంది. దాని సమ్మతి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు బరువు తగ్గినా, పెరిగినా అది ఒప్పుకోదు. మీకు తెలియకుండానే అది మీ ప్రవర్తనలో మార్పు చేయటం ద్వారా వెంటనే తగ్గినా లేదా పెరిగిన బరును మునుపటి స్థాయి తెస్తుంది. మచ్చుకు రోజువారీగా తేలిక పని చేసే మగవారి అయితే 2,200 కేలరీలు, ఆడ వారికి అయితే 1900 కేలరీలు అవసరం. వీరు లావు పెరగాలంటే రోజుకు అదనంగా 1,000 కేలరీల తిండి తింటే వారానికి అరకేజీ (కంటే కాస్త తక్కువే) పెరుగుతారు.

తిండిలో మార్పులు :

తిండి పద్ధతికి వచ్చే సరికి రోజుకు మూడు పూటలా కాకుండా కనీసం రోజుకు ఐదు పూటలు తినాల్సి ఉంటుంది. అవి కాక మధ్య మధ్యలో చిరు తిండి తినాల్సి ఉంటుంది. అంటే చెత్త తిండి (fast  foods or junk foods)  కాదు.

పరిమాణం తక్కువగా ఉండి, దానిలో ఎక్కువ కేలరీలు ఉన్న తిండి తినాలి. బాదం, పిస్తా, జీడిపప్పు, కర్జూరం, ఎండు ద్రాక్ష లాంటి వాటిలో శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వేరుసెనగ, సెనగ, బఠాని, చిక్కుడు, అలసంద లాంటి విత్తనాలు చూపుకు చిన్నవే అయినా అవి శక్తి స్వరూపాలు. పైగా తక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి కడుపు నిండదు. మనకు కావాల్సింది అదే. కనుక వీటిని తీసుకోవచ్చు.

తక్షణం శక్తిని ప్రసాదించే వాటిలో పిండి పదార్థాలు ముఖ్యమయినవి. అందులో సులభంగా, త్వరగా అరిగే ‘సరళ’మయినవి, ఆలస్యంగా అరుగుతూ ఎక్కువ శక్తిని ఇచ్చే ‘చిక్కు’ (కాంప్లెక్సు) పదార్థాలు అని రెండు రకాలు ఉంటాయి. లావు కావాలనుకునే వారు వీలున్నంత వరకు ఈ రెండో రకపు పిండి పదార్థాలు తినాలి. అంటే పాలిష్ చెయ్యని బియ్యపు అన్నము, పొట్టు తియ్యని గోధుమలతో తయారైన పదార్థాలు, ఓట్లు, అరటి పండ్లు, బంగాళా దుంప, బీన్స్ మొదలైనవి.

పండ్ల రసాలలో కొన్ని ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. పైనాపిల్, దానిమ్మ ఇందుకు మంచి మచ్చులు. పాలు, అరటి పండుతో చేసిన మిల్కుషేకు కూడా ఎక్కువ కాలరీలను కలిగి ఉంటుంది.

నూనెలు, కొవ్వులు శక్తికి నిలయాలని తెలిసిందే. ఇళ్ళలోవాడే రోజు వారీ నూనెలకు తోడు కొద్దిగా ఆలీవు నూనె, ఫిష్‌ లివరు నూనె (మాత్రల రూపంలో) కలిపితే అవి ఎక్కువ శక్తిని ఇవ్వటమే కాక, ఆరోగ్య పరిరక్షణలో ఉపయోగపడే ఓమేగా ఫాటీ యాసిడ్లను కూడా కలిగి ఉంటాయి. ఇక నెయ్యి, వెన్న, పాలు, పెరుగు కూడా ఎక్కువ శక్తిని ఇస్తాయి. అయితే ఇక్కడ జాగర్తగా ఉండాలి. మీరు తినే తిండిలో నేరుగా వాడే కొవ్వు 30 % కి  మించి లేకుండా జాగర్త తీసుకోవాలి.

గుడ్డులో అత్యంత స్వచ్ఛమైన మాంసకృతులు ఉంటాయి. ఇవి మీ కండరాల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగ పడతాయి. వీలున్నంత వరకూ ప్రతి రోజు గుడ్లను ఆహారంలో భాగంగా చేయాలి.

వ్యాయామం :

తిండి తోపాటు వ్యాయామం తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది. ఏరోబిక్సు, నడక ఆరోగ్యానికి మంచిదే కానీ కండరాల పెరుగుదలకు ఉపయోగ పడవు. కండరాల మీద ఒత్తిడిని పెంచే గుంజిళ్ళు, బస్కీలు, డంబెలుతో చేసే వ్యాయామం చాలా అవసరం. ఇలాంటి వ్యాయామం అలవాటు లేకుండా కొత్తగా మొదలు పెట్టే వారు క్రమంగా పెంచు కోవాలి తప్ప ఒక్క సారిగా భారీ స్థాయిలో చెయ్యకూడదు. అలా చేస్తే మూత్రపిండాలు పాడయ
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: