28, ఏప్రిల్ 2020, మంగళవారం

అమ్మాయి లో యోని మంట నివారణ మార్గం

యోనిలో మంట చికిత్సలో ఇన్ఫెక్షన్లకు మందులు, హార్మోన్ల చికిత్స మరియు ఉపశమనం కలిగించే సాధారణ స్వీయ-సంరక్షణ పద్ధతులు ఉంటాయి వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపరచడం అంటే రసాయనిక సువాసనలు కలిగిన ఉత్పత్తుల వినియోగాన్ని నివారించడం, యోనిని సున్నితంగా కడగడం, సింథటిక్ దుస్తులను నివారించడం మరియు పుష్కలంగా నీరు త్రాగటం వంటివి చెయ్యాలి. హెచ్‌ఐవి బారిన పడే అవకాశాలు, గర్భిణీ స్త్రీల నుండి శిశివుకి ఇన్ఫెక్షన్ వ్యాపించడం మరియు లైంగిక సంక్రమణ వ్యాధులు (ఎస్‌టిడిలు) సంక్రమించేటువంటి ప్రమాదాలు యోనిమంట వల

యోని మంట మహిళలు సాధారణంగా అనుభవించే అసౌకర్యాలలో ఒకటి. యోనిలో వివిధ రకాల అసౌకర్యాలు ఉండవచ్చు - వాటిలో కొన్ని చికాకు (ఇర్రిటేషన్), నొప్పి మరియు సలుపు. యోని మంట తీవ్రమైన మంట సంచలనంగా ఉండవచ్చు లేదా యోనిలో లేదా ఉల్వలో మరియు యోని పెదవులలో పొడిచినట్టు ఉండే నొప్పిలా ఉండవచ్చు. ఇది కొన్నిసార్లు దురద కూడా ఉంటుంది. ఇది ఒక్కోసారి సంభవించి మళ్ళి ఆకస్మికంగా తగ్గిపోతుంది. అయినప్పటికీ, మంట భావన కొనసాగితే, అంతర్లీన పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంటుంది కాబట్టి వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.

యోని మంట అనేదే  ఒక నిర్దిష్ట లక్షణం, కొన్నిసార్లు అది మరింత సంక్లిష్టమైన రుగ్మతను సూచించవచ్చు, మంట సంచలనాన్ని అనుభవింస్తూనప్పుడు మరియు కారణం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా దానితో పాటు కొన్ని గమనించదగిన సంకేతాలు ఉంటాయి. కేవలం మంట మాత్రమే కలిగినా, మీరు గమనించదగిన ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు, అవి:

  • ఎరుపుదనం, వాపు లేదా ఒరిసిపోవడం.
  • యోని నుండి అసాధారణ స్రావాలు స్రవించడం.
  • యోని మరియు దాని స్రావాల నుండి ఒక ప్రత్యేకమైన వాసన.
  • యోని ప్రాంతంలో నొప్పి లేదా తిమ్మిరి.
  • బాధాకరమైన మూత్రవిసర్జన.
  • ఋతుచక్రాల మధ్యలో రక్తస్రావం లేదా రక్త చుక్కలు (స్పాటింగ్).
  • సాధారణంగా సెక్స్ తర్వాత చేపలు వంటి (నీచు) వాసన అనుభవించబడుతుంది.

కారణాలు

కొన్ని సందర్భాల్లో, యోని మంట కేవలం హైడ్రేషన్ లేకపోవడం లేదా లోదుస్తుల ఫాబ్రిక్ పట్ల సున్నితత్వం (sensitiveness) ఉండడం వల్ల కావచ్చు. అయితే, కొన్నిసార్లు ఈ లక్షణం ద్వారా వాటి ఉనికి సూచించే మరింత తీవ్రమైన సమస్యలు కూడా కావచ్చు. యోనిలో మంట యొక్క కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి.

  • చికాకు (Irritation)
    కొన్నిసార్లు యోని మంట అనేది ఏదైనా రకమైన చికాకు కలిగించే పరదార్థం పట్ల యోని యొక్క ప్రతిచర్య కారణంగా కావచ్చు. అది సింథటిక్ లేదా బిగుతుగా ఉండే బట్టలు మరియు లోదుస్తులు, పెర్ఫ్యూమ్‌లు మరియు సబ్బులోని ఇతర రసాయనాలు, రాపిడి లేదా ఒక ఒరుసుకుపోవడం లేదా చిన్న గాయం వంటి వాటి వలన కావచ్చు. యోనిలో లేదా చుట్టుపక్కల మిగిలి ఉండిపోయిన  శానిటరీ న్యాప్‌కిన్‌ల లేదా టాంపోన్లు లేదా టిష్యూల యొక్క అవశేషాల వల్ల కూడా దీనిని అనుభవించవచ్చు.
  • బాక్టీరియా
    యోనిలోని కొన్ని రకాల బ్యాక్టీరియా చికాకు మరియు దురదకు కారణం కావచ్చు. మహిళలందరి యోనిలో హానిచేయని బ్యాక్టీరియా ఉంటుంది, ఇది సహజమైనది మరియు యోని యొక్క pH ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఆ ప్రాంతంలో హానికరమైన బ్యాక్టీరియా పెరిగినప్పుడు, లేదా యోనిలో ఉన్న సహజ బ్యాక్టీరియా అసాధారణంగా అధిక సంఖ్యలో పెరిగినప్పుడు, మంట సంచలనం అభివృద్ధి చెందుతుంది. ఇది లైంగిక సంక్రమణ వ్యాధులకు కారణమవుతుంది కాబట్టి దీనికి వెంటనే చికిత్స చేయటం చాలా ముఖ్యం. 15 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా అనుభవించబడతాయి.
  • ఈస్ట్
    యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ దాని చాలా లక్షణాలలో ఒకటిగా మంటను కూడా కలిగించవచ్చు. ఈ పరిస్థితిని సాధారణంగా థ్రష్ అని అంటారు. గర్భిణీ స్త్రీలలో, యాంటీబయాటిక్స్ లేదా ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) గర్భనిరోధక మాత్రలు తీసుకునేవారిలో మరియు డయాబెటిస్ ఉన్న మహిళల్లో థ్రష్ సంక్రమించవచ్చు.
  • యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (యుటిఐలు)
    యుటిఐలు  ఉన్నవారిలో మంట అనేది సాధారణంగా అనుభవింపబడే లక్షణం. దీనికి చికిత్స చేయడం సులభం అయితే, పునరావృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • ట్రైకోమోనియాసిస్ (Trichomoniasis)
    ట్రైకోమోనాస్ అనే ఒక పరాన్నజీవి, సాధారణంగా లైంగిక చర్య ద్వారా భాగస్వామికి వ్యాపిస్తుంది, ఇది ట్రైకోమోనియాసిస్ అనే సాధారణ సంక్రమణకు కారణమవుతుంది మరియు యోనిలో అసౌకర్యం మరియు దురదతో పాటు మంట సంచలనానికి కారణం అవుతుంది.
  • గనేరియా
    గనోరియా అనేది సాధారణంగా 15 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో సంక్రమించే అంటువ్యాధి. బ్యాక్టీరియా సంక్రమణ సాధారణంగా గర్భాశయం, ఫెలోపియన్ గొట్టాలు మరియు గర్భాశయ ద్వారంలోకి  వ్యాపిస్తుంది.
  • క్లమిడియా
    క్లమిడియా లైంగికంగా సంక్రమించే అంటువ్యాధి, దీనిలో మంట మరియు దురద చాలా స్పష్టమైన లక్షణాలుగా  ఉంటాయి; అలా కాకపోతే ఇది నిబ్బరంగా ఉంటుంది మరియు ఎటువంటి ఇతర సంకేతాలను చూపించదు.
  • జనైటల్ హెర్పెస్
    ఈ వ్యాధి సోకిన వ్యక్తి ద్వారా ఇది వ్యాపించబడుతుంది. హెర్పెస్ ఎక్కువ శాతం స్త్రీలను ప్రభావితం చేస్తుంది మరియు యోని మంట కలగడానికి అత్యంత సాధారణ కారణాలలో ఇది ఒకటి.
  • మెనోపాజ్
    రుతువిరతికి (మెనోపాజ్) దగ్గరలో ఉన్న లేదా ఇప్పటికే దానిని చేరుకున్న మహిళలు హార్మోన్ల అసమతుల్యత కారణంగా  యోని మంటను అనుభవించవచ్చు. రుతువిరతి చెందిన ప్రతీ స్త్రీ మంటను అనుభవించకపోవచ్చు, కానీ రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలు అనుభవించే సాధారణ లక్షణాలలో ఇది ఒకటి.

ప్రమాద కారకాలు

ఒక స్త్రీకి యోని మంట కలగడానికి కారణమయ్యే కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

  • చికిత్స చేయని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు.
  • చికిత్స చేయకుండా వదిలివేస్తే మూత్రపిండాలు, మూత్రాశయం మరియు మూత్రానాళానికి వ్యాప్తి చెందిన యుటిఐలు.
  • పేలవమైన వ్యక్తిగత పరిశుభ్రత.

పరిశుభ్రత పాటించడం మరియు మరికొన్ని విషయాలను నిర్వహించడం అనేవి అసౌకర్యాన్ని తగ్గించడం కోసం మరియు యోని మంటను నివారించడం కోసం సహాయపడతాయి. అవి:

  • యోని ప్రాంతం చుట్టూ సువాసన లేని క్రీములు, న్యాప్‌కిన్లు, మరియు స్ప్రేలను ఉపయోగించండి. సువాసన కలిగిన ఉత్పత్తులలో ఎక్కువ మొత్తంలో రసాయనాలు ఉంటాయి, అవి చర్మాన్ని చికాకుపెడతాయి.
  • జననేంద్రియ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవడానికి ఉత్తమ మార్గం శుభ్రమైన మరియు చల్లటి నీటిని ఉపయోగించడం. ఎక్కువ వాణిజ్యపరమైన ఉత్పత్తులను వాడటం లేదా చాలా తరచుగా కడగడం మానుకోండి ఎందుకంటే అది యోని ప్రాంతాన్ని పొడిబారేలా చేసి మరియు మంటను కలిగిస్తుంది. శరీరానికి దాని స్వంత లూబ్రికేటింగ్ విధానం ఉంటుంది  మరియు అంతర్గత సంరక్షణ ఉత్పత్తులను అధికంగా ఉపయోగించడం వల్ల యోనిలో pH (పిహెచ్) మరియు యోనిలో నివసించే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా యొక్క సమతుల్యత దెబ్బతింటుంది.
  • అంతర్గత అవయవాలను శుభ్రం చేయడానికి సబ్బులు మరియు రసాయనాలను ఉపయోగించడం మానుకోండి. ఆ భాగాలను శుభ్రం చేయడానికి సాధారణ సబ్బులు మరియు జెల్లను ఉపయోగించకూడదు.
  • అంతర్గత ప్రాంతాలను శుభ్రపరిచేటప్పుడు టాయిలెట్ పేపర్‌ను ఎల్లప్పుడూ ముందు నుండి వెనుకకు వాడాలి.
  • సింథటిక్ లోదుస్తులను ఉపయోగించడం మానుకోండి మరియు మీరు మీ లోదుస్తులను తరచూ మార్చుకుంటూ ఉన్నారని నిర్ధారించుకోండి. మీ లోదుస్తులను ఉతికేటప్పుడు, తేలికపాటి సువాసన లేని డిటర్జెంట్ మాత్రమే వాడండి.
  • లైంగిక సంక్రమణ వ్యాధులను నివారించడానికి సంభోగ సమయంలో మీ భాగస్వామి కండోమ్‌లను ఉపయోగించాలని గుర్తుంచుకోండి.
  • మీరు తక్కువ మంటను అనుభవిస్తున్నా కూడా లైంగిక చర్యకు దూరంగా ఉండండి.
  • మీ యోని భాగం పొడిబారినట్లయితే, దాని వెంటనే మంట సంచలనం అనుసరించవచ్చు. యోనిని హైడ్రేట్ గా ఉంచడానికి తేలికపాటి యోని మాయిశ్చరైజర్ ను వాడండి మరియు సెక్స్ చేసే ముందు లూబ్రికెంట్ను వాడండి.
  • పొడిదనాన్ని మరియు చికాకును నివారించడానికి రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి, లేకపోతే అవి మంటను కలిగిస్తాయి.
  • యుటిఐల పునరావృత్తాన్ని నివారించడం కోసం శరీరాన్ని శుభ్రంగా మరియు హైడ్రేటెడ్ గా ఉంచడం మరియు పరిశుభ్రతను పాటించడం వంటివి చెయ్యాలి.

ఒక వైద్యులు సాధారణంగా కటి పరీక్షను నిర్వహిస్తారు. రోగ నిర్ధారణను ధృవీకరించడానికి దాని తర్వాత కొన్ని సాధారణ రక్త లేదా మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. ఇన్ఫెక్షన్ల అనుమాన విషయంలో పరీక్ష కోసం యోని స్రావాలు యొక్క నమూనా కూడా తీసుకోవచ్చు. చికిత్స సంతృప్తికరమైన ఫలితాలను ఇవ్వకపోతే తప్ప సాధారణంగా యోని మంట యొక్క కారణాన్ని నిర్ధారించడానికి ఇమేజింగ్ పరీక్షలు అవసరం ఉండదు.

సమస్య ఎలా ఏర్పడిందో మరియు దానితో పాటు వచ్చే లక్షణాలు లేదా పరిస్థితులను బట్టి చికిత్స కోసం అనేక రకాలు ఉంటాయి. మంట సుదీర్ఘకాలం కొనసాగితే మరియు ఇంటి నివారణలను ఉపయోగింస్తూనప్పటికీ సమస్య తగ్గకపోతే మహిళలు వైద్య సహాయం తీసుకోవాలి. చికిత్స యొక్క కోర్సులు/రకాలు వీటిని కలిగి ఉండవచ్చు:

  • క్లమిడియా లేదా గనోరియా వంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి యాంటీబయాటిక్స్ యొక్క కోర్సు.
  • థ్రష్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు యాంటీ ఫంగల్ క్రీమ్ మరియు ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) మందులు.
  • యుటిఐల విషయంలో యాంటీబయాటిక్స్ మరియు పురావృత్త పరీక్షలు.
  • ట్రైకోమోనియాసిస్ కోసం ఓరల్ మెట్రోనిడాజోల్ (metronidazole) లేదా టినిడజోల్ (tinidazole).
  • హెర్పెస్ కోసం యాంటీ-వైరల్ మందులు.
  • రుతుక్రమం ఆగిన మహిళల్లో హార్మోన్ పునస్థాపన (రీప్లేస్మెంట్) చికిత్స.

జీవనశైలి నిర్వహణ

యోని మంటను నిర్వహించడానికి సలహాలు:

  • మంట అనుభవిస్తున్న చోట తాకడం లేదా గోకడం మానుకోండి. ఇది గాయం త్వరగా నయం కావడానికి సహాయపడుతుంది.
  • మంట ఉన్న ప్రాంతానికి ఉపశమనం కలిగించడానికి ఐస్ ప్యాక్‌లను ఉపయోగించడం.
  • పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం కూడా ఆ ప్రాంతానికి ఉపశమనం కలిగించడానికి మరియు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.

రోగ సూచన 

చాలా సందర్భాల్లో, యోనిలో మంట సంచలనం కొన్ని సాధారణ స్వీయ సంరక్షణ చర్యలతో పోతుంది లేదా తగ్గుతుంది. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే వైద్య సహాయం అవసరం అవుతుంది. మంచి స్వీయ-సంరక్షణ చర్యలను పాటించేవారు మరియు అధిక ప్రమాణాలతో పరిశుభ్రత కలిగి ఉన్నవారు ఈ పరిస్థితితో బాధపడే అవకాశం తక్కువ. అంతర్లీన కారణానికి చికిత్స చేయడం ద్వారా మంట సంచలనాలను వెంటనే తగ్గించవచ్చు.

సమస్యలు

యోని మంట కలిగించే అంతర్లీన కారణానికి చికిత్స చేయనప్పుడు కొన్ని సమస్యలు కలుగవచ్చు. వీటిలో ఇవి ఉండవచ్చు:

  • ఎస్టీడీలు (లైంగిక సంక్రమణ వ్యాధులు) మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలు.
  • గర్భిణీ తల్లి నుండి శిశువుకి సంక్రమణ వ్యాప్తి చెందడం.
  • ట్రైకోమోనియాసిస్, గోనోరియా మరియు క్లామిడియాతో బాధపడుతున్న వారిలో హెచ్ఐవి సంక్రమించే ప్రమాదం అధికంగా ఉండవచ్చు

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: