పిల్లల మతి మరుపు తగ్గడానికి సింపుల్ ట్రిక్స్ |అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
*మతి మరుపు (LOSS OF REMEMBRANCE) ఎందు వలన కలుగుతుంది ? దీనిని అధిగమించడం ఎలా ? అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
ప్ర : మతి మ రుపు (LOSS OF REMEMBRANCE) అంటే ఏమిటి ? మతి మ రుపు ఎందు వలన కలుగుతుంది ? దీనిని అధిగమించడం ఎలా ?
మతి మ రుపు (LOSS OF REMEMBRANCE) అంటే ఏమిటి ?
జ : మతి మరుపు (LOSS OF REMEMBRANCE) అనగా జరిగిన, జరుగ బోయే సంఘటనలు , చేసిన , చేయ బోయే పనులు మరియు పేర్లు , వస్తువులు గుర్తు లేక పోవడం , బంధు మిత్రులను గుర్తు పట్టలేక పోవడం , మరిచి పోవడం మొదలైన వాటిని మతి మరుపు అంటారు . ఒక్కోసారి మన మైండు , అనుకోకుండానే ఆన్ క్యాన్సియస్ లోకి వెళ్లి పోతుంది . ఎంతటి తెలివి గల వారైనా , క్షణ క్షణం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా , ఒక్కో సారి మతి మరుపు బారినుండి ఎవ్వరూ తప్పించుకోలేరు . ఎవ్వరూ ఎదో ఒకటి పోగొట్టుకో కుండా , మరిచి పోకుండా ఉండ లేరు . ఇది నగ్న సత్యం . అంత మాత్రాన వీరిని తెలివి తక్కువ వారు అని గాని, ఎందుకు పనికి రాని వారు అని గాని అనడం , నిందించడం తగదు. ఒక సారి గొప్ప శాస్త్ర వేత్త ' ఆల్బర్ట్ ఐనస్టీన్' డబ్బులు డిపాజిట్ చేద్దామని బ్యాంకుకు వెళ్ళాడట . గొప్ప శాస్త్ర వేత్త కాబట్టి , తెలిసిన వారు దగ్గర వచ్చి పలకరించడం , నమస్కరించడం చేస్తున్నారు . డబ్బులు డిపాజిట్ చేద్దామని వచ్చాక తన పేరునే మరిచిపోయాడు . అప్పుడు అతను తన ప్రక్కనున్న వారిని తన పేరు ఏమిటో చెప్పమన్నా డట . వారు ముందుగా ఆశర్యపోయినా చెప్పక తప్పలేదు . మీ పేరు ' ఆల్బర్ట్ ఐనస్టీన్' అని చెప్పారట . దీని బట్టి మనకు ఏమి అర్ధమవుతుంది . మాటి మాటికీ పిల్లలను గాని , పెద్దలను గాని , మతి మరుపు అని అనడం వలన , నిందించడం వలన మతి మరుపు అనేది మరింత పెరిగే అవకాశం ఉంది. మతి మరుపు అనేది ఒక జబ్బు కాదు . ఇది దీర్ఘ కాలం ఉండదు .
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
👉🏾మతి మరుపు ఎందు వలన కలుగుతుంది ?
మతి మరుపు కలగడానికి అనేక మైన కారణాలను చెప్పుకోవచ్చు . అందులో ముఖ్యమైన కారణాలు :
01. పుట్టుకతోనే , జన్యు పరమైన మానసిక లోపాలుండటం వలన మతి మరుపు ఏర్పడవచ్చు .
02. అనారోగ్యం బారిన పడటం . ఉదా : తీవ్ర జ్వరం , హై బి . పి , టైపు 2 షుగర్ వ్యాధి , క్యాన్సర్ , మూర్ఛ , హార్ట్ అటాక్ , దీర్ఘ కా ల వ్యాధులు మొ. లైన వాటి వలన మతి మరుపు ఏర్పడవచ్చు .
03. ఒక్కో సారి కొన్ని కుటుంభ సమస్యల వలన లేదా బయటి సమస్యల వలన మతి మరుపు ఏర్పడవచ్చు .
04. కొన్ని అనుకోని సంఘటనల వలన మనసు కంట్రోల్ తప్పి మతి మరుపు ఏర్పడవచ్చు .
05. ఆర్ధిక , సామజిక , రాజకీయ , శారీరక బాధల వలన , ఆందోలనల వలన మతి మరుపు ఏర్పడవచ్చు .
06. ఆహార లోపం వలన మతి మరుపు ఏర్పడవచ్చు .
07. చుట్ట , బీడీ , సిగరెట్లు త్రాగడం వలన మరియు పొగాకు , తంబాకు నమలడం వలన , మత్తు పదార్ధాలు , డ్రగ్స్ వాడటం వలన మతి మరుపు ఏర్పడవచ్చు .
08. రెగ్యులర్ గా మాంసాహారం తీసుకోవడం వలన మతి మరుపు ఏర్పడవచ్చు .
09. ఇష్టం లేని వ్యక్తులు తారస పడినా , ఇబ్బంది అనిపించే వ్యక్తులు ఇంటికి వచ్చినా , ఇష్టం లేని వ్యక్తుల తో ప్రయాణం చేసినా , షాపింగ్ చేసిన మైండు కంట్రోల్ తప్పి , మైండ్ ఆన్ క్యాన్సియస్ లోకి వెళ్లి పోతుంది . అప్పుడు ఏమి జరిగింది , జరుగా బోయేదేదో గుర్తుండదు . మన పంచేంద్రియాలు అచేతనంగా ఉంది పోతాయి . ఆ విధంగా చేతిలోని స్టీరింగ్ చేయి సడలి ఆక్సిడెంట్లు కావచ్చు . చేతిలోని వస్తువులను మరిచి పోవచ్చు . అందువలన మతి మరుపు ఏర్పడవచ్చు .
10. అత్యంత ఇష్టమైన వ్యక్తులు చూసినా , కలిసినా , మాట్లాడినా ఆ సంతోషంలో , ఆ మైకంలో పడి , మన పంచేంద్రియాలు గాడి తప్పి నష్టాల బారిన లేదా కష్టాల బారిన పద వచ్చు .
11. ఆయాసం , అలసట , గాయాల పాలవడం , నిద్రలేమి మొదలగునవి కూడా మతి మరుపుకు దరి తీయవచ్చు .
12. వయస్సు మీద పడుతున్న కొలది మన పంచేంద్రియాల శక్తి తగ్గి పోతుంది . సుమారుగా 50 - 60 సం . రాలు దాటా మంటే వినికిడి శక్తి తగ్గి పోతుంది . కంటి చూపు మందగిస్తుంది , స్పర్శ జ్ఞ్యానం కోల్పోతాం . రుచి వాసన గుర్తించ లేక పోవచ్చు . మతి మరుపు ఏర్పడవచ్చు .
13. ఒంటరి తనం గా జీవించడం వలన మతి మరుపు పెరుగుతుంది . అలానే ఆయుస్సు కూడా తగ్గిపోతుంది .
👉🏾మతి మ రుపు ను అధిగమించడం ఎలా ?
మతి మరుపు బారిన పడకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు . అయినా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వలన మతి మరుపు బారిన పడకుండా కొంత వరకు తగ్గించు కోవచ్చు . అవి ,
01. జన్యు పర లోపాలు జరుగకుండా రక్త సంబంధీకులైన , దగ్గరి మేన రికాలతో వివాహాలు జరుప కూడదు .
02. ముందు జాగ్రత్తగా ఆరోగ్య పరమైన చర్యలు తీసుకోవడం వలన , జన్యులోపాలు లేకుండా , మెంటల్ డిజార్డర్ లోపాలు లేని పిల్లలు జన్మించడానికి అవకాశముంటుంది .
03. రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకుని సరియయిన మందులు వాడటం వలన మతి మరుపును నివారించవచ్చు .
04. రెగ్యులర్ గా సమతుల్య ఆహారం , పాలు, పండ్లు , గ్రుడ్లు తీసుకోవడం వలన మతి మరుపును దూరం చేయవచ్చు .
05. రెగ్యులర్ గా మెడిటేషన్ , వ్యాయామం చేయడం వలన మతి మరుపును తగ్గించ వచ్చు .
06. ఎల్లప్పుడూ మానసికంగా , శారీరకంగా ఉత్సహంగా , ఉల్లాసంగా ఉండే విధంగా ప్లానింగ్ చేసుకోవాలి .
07. కనీసం రోజుకు 6 గంటలు ( వీలు కాకా పోతే ఏ సమయమైనా కావచ్చు ) నిద్రించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి .
08. క్రమ బద్దంగా భోజనం చేయడం అలవరచు కోవాలి .
09. చుట్ట , బీడీ , సిగరెట్లు త్రాగడం వలన మరియు పొగాకు , తంబాకు నమలడం , మత్తు పదార్ధాలు , డ్రగ్స్ వాడటం మొదలైన వాటిని తగ్గించాలి .
10. రెగ్యులర్ గా మాంసాహారం తీసుకోవడం తగ్గించి , శాకాహారులు గా మారాలి .
11. ప్రతి వ్యక్తికి నిత్యం ఏర్పడే సమస్యలకు , బాధలకు , నష్టాలకు వేంటనే భీతి చెంద కూడదు . ఆందోళనకు గురి కాకూడదు .
12. అందరిలో కలిసి జీవించడం , ఆడటం , పాడటం , ఆహ్లాద కర వాతావరణంలో నివసించడం వలన మతి మరుపు ను నివారించ వచ్చు .
మతిమరుపు పెరిగిపోతుందా? చదివింది గుర్తుండడం లేదా? ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం క్యాండిల్ ట్రిక్.!
ఉదయం నిద్ర లేవగానే….. పద్మాసనం లో కూర్చొని, కొద్ది దూరంలో సరిగ్గా మన కంటికి సమానమైన దిశలో ఓ వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తూ ఉండాలి…. మారుతున్న దాని మంట రంగు, గాలికి కదులుతూ తన షేప్ ను మార్చుకుంటున్న తీరును కూడా ఓ 5 నిమిషాల పాటు తదేకంగా పరిశీలిస్తూ ఉండాలి…అటు తర్వాత… ఆ వెలుగుతున్న కొవ్వొత్తిని ఆర్పివేసి…ఇప్పుడు కళ్లు మూసుకొని ఇంతకు ముందులా కొవ్వొత్తి వెలుగుతున్నట్టు ….మనో నేత్రంతో చూడాలి (ఊహించుకోవాలి).
ఇలా ప్రతిరోజు..చూస్తూ ఉండాలి…. అయితే మొదటి రోజు 5 నిమిషాల పాటు వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తే…క్రమంగా ఆ సమయాన్ని తగ్గించుకుంటూ పోవాలి. ఇలా చేయడం వల్ల జ్ఞాపకశక్తితో పాటు ఊహాశక్తి కూడా అమాంతం పెరుగుతుంది. మీరు ట్రై చేసి మీ అనుభవాన్ని మాతో పంచుకోండి
• జ్ఞాపకశక్తిని నిలబెట్టండి!
మన జీవితంలో జ్ఞాపకశక్తి కీలకపాత్ర పోషిస్తుంది. మనం చేసే అన్ని పనులకూ ఇదే మూలం. కాబట్టి జ్ఞాపకశక్తి తగ్గకుండా చూసుకోవటం చాలా అవసరం. రోజూ కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని కాపాడుకోవచ్చు.
* రోజువారీ పనుల ఒత్తిళ్లో.. లేనిపోని వాగ్వాదాలో.. ఇలాంటివన్నీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తాయి. నిజానికివి కొద్దిరోజుల్లో సర్దుకుపోతాయి గానీ దీర్ఘకాలంగా కొనసాగితే జ్ఞాపకశక్తిపై విపరీత ప్రభావం చూపొచ్చు. కాబట్టి ఒత్తిడిని నియంత్రించుకోవటం, తగ్గించుకోవటం అత్యవసరం. గాఢంగా శ్వాస తీసుకోవటం, యోగా, ఒక అంశం మీద దృష్టి నిలపటం వంటి పద్ధతులతో ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు.
* కంటి నిండా నిద్రపట్టకపోతే ఆ రోజంతా చికాకుగా ఉండటం తెలిసిందే. ఏ విషయాలూ చప్పున గుర్తుకురావు కూడా. జ్ఞాపకశక్తికి నిద్ర ఎంత అవసరమో దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. నిద్రలోనే మనం నేర్చుకున్న విషయాలు జ్ఞాపకాలుగా స్థిరపడతాయి. కాబట్టి రాత్రిపూట కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలి. కొందరు నిద్రలేమికి మాత్రలు వేసుకుంటుంటారు గానీ ఇవి మెదడు పనితీరుకు ఆటంకం కలిగించి జ్ఞాపకశక్తి తగ్గేలా చేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి ముందుగా రోజూ సమయానికి నిద్రపోవటం, లేవటం.. పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవటం.. సాయంత్రం తర్వాత కాఫీ, టీలు తాగకపోవటం వంటి పద్ధతులను పాటించటం మంచిది.
* పొగ అలవాటు గుండె, ఊపిరితిత్తులకే కాదు.. మెదడుకూ చేటే. వయసుతో పాటు వచ్చే మతిమరుపు, ఇతర జ్ఞాపకశక్తి సమస్యలు పొగ తాగేవారిలోనే ఎక్కువ. పొగతాగనివారితో పోలిస్తే.. మధ్యవయసులో రోజుకు 2 పెట్టెల కన్నా ఎక్కువ సిగరెట్లు కాల్చేవారికి వృద్ధాప్యంలో డిమెన్షియా ముప్పు రెట్టింపు అవుతుంది.
* మద్యం మితిమీరినా మతిమరుపు, డిమెన్షియా ముప్పు పెరుగుతుంది. మద్యం అలవాటు గలవారు సరకులను గుర్తుంచుకోలేకపోవటం వంటి పనులను సరిగా చేయలేరు. ఇక దీర్ఘకాలంగా విటమిన్ బి1 లోపం గలవారికి మద్యం దుష్ప్రభావాలు కూడా తోడైతే హఠాత్తుగా మతిమరుపు తలెత్తే ప్రమాదమూ ఉంది.
ఆయుస్సును కూడా పెంచుకోవచ్చు .
ధన్యవాదములు 🙏🏼
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి