యోగ లో మగాడు ఆసనాలతో ఒత్తిడికి చెక్
- మరీ ముఖ్యంగా 5 ఆసనాలతో చెక్
పురుషుల్లో వచ్చే అంగస్తంభన సమస్యను రోజూ యోగా చేయడం ద్వారా నివారించుకోవచ్చట! కర్ణాటకలోని శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర కాలేజ్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హాస్పిటల్ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వివరాలతో వారు రాసిన వ్యాసం ‘జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్సె్‌స’లో ప్రచురితమైంది. అంగస్తంభన వైఫల్యానికి చాలా వరకూ.. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలే కారణమవుతాయని వివరించారు. యోగా వల్ల స్ట్రెస్, డిప్రెషన్ వంటివి తగ్గి శృంగారపరంగా చురుగ్గా ఉంటారని పేర్కొన్నారు. వారు చేసిన సిఫారసుల ఆధారంగా.. పెన్సిల్వేనియాకు చెందిన డేనియల్ బుబ్నిస్ అనే యోగా శిక్షకుడు అంగస్తంభన వైఫల్యానికి 5 ఆసనాలు చెక్ పెడతాయని వివరించారు. ఆయన చెబుతున్న ఆ ప్రత్యేక ఆసనాలు ఏంటంటే...
తస్మాత్ జాగ్రత్త
యోగాసనాలతో అంగస్తంభన వైఫల్యం తగ్గుతుందో లేదోగానీ.. భవిష్యత్తులో రాబోయే హృద్రోగాలకు అది ముందస్తు సూచన కూడా కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, రక్తం గడ్డకట్టడం వంటివాటివల్ల కూడా అంగస్తంభన సమస్య ఏర్పడవచ్చని, కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నిపుణులైన వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
పవనముక్తాసనం
ఈ ఆసనం గ్యాస్, మలబద్ధకం సమస్యను పోగొట్టడమే కాక.. పొత్తికడుపు భాగంలోని కండరాలను, పునరుత్పత్తి అవయవాలను ఉత్తేజితం చేస్తుంది.
గరుడాసనం
ఈ ఆసనం కూడా పొత్తికడుపు భాగానికి రక్తసరఫరాను పెంచుతుంది.
సిద్ధాసనం
అంతర్జాతీయంగా యోగా శిక్షకులు దీన్ని ‘పర్‌ఫెక్ట్ పోజ్’గా వ్యవహరిస్తుంటారు. ఈ ఆసనం వల్ల పొత్తికడుపు భాగం ఉత్తేజితమవుతుంది.
శవాసనం
నేరుగా అంగస్తంభన సమస్యకు ఈ ఆసనంతో సంబంధం లేదుగానీ.. ఒత్తిడిని తొలగించే ఆసనమిది.
అర్ధ మత్స్యేంద్రాసనం
ఈ ఆసనం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. కాలేయం, ప్లీహం, క్లోమం, పొత్తికడుపు భాగం సహా పలు ప్రధాన అవయవాలకు రక్త సరఫరా మెరుగవుతుంది.
ఆరోగ్యవంతమైన యువకుడి వీర్యం
15 మిలియన్ల కంటే తగ్గకూడదు
ఆరోగ్యవంతమైన 70 కిలోల యువకుడి వీర్యంలో ప్రతి మిల్లీలీటర్‌కీ 39 మిలియన్ల శుక్రకణాలుంటాయి. ఈ సంఖ్య 15 మిలియన్ల కంటే తగ్గకూడదు. ఒక వేళ తగ్గితే ‘లో స్పెర్మ్ కౌంట్’ అంటారు. ఈ లక్షణాలున్న యువకుడికి త్వరగా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. స్పెర్మ్ ఎనాలసిస్, స్కోట్రల్ అల్ట్రా సౌండ్ పరీక్షలతో ఈ సమస్యను వైద్యులు గుర్తిస్తారు. ఈ మధ్యకాలంలో ఖాసా పరీక్ష ద్వారా కూడా స్పెర్మ్ కౌంట్‌ను గుర్తిస్తున్నారు. సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. వృషణాల (బీజాలు)కు ఇంతకన్నా ఒకట్రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉండాలి. ఒకవేళ ఏదేని కారణంతో బీజాల దగ్గర వేడి పెరిగితే అందులో ఉండే శుక్రకణాల సంఖ్య తగ్గడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి