విటమిన్-డి లేకుండా కాల్షియం వృదా
ముందుగా కాల్షియం దొరికే ఆహారం గురించి తెలుసుకుందాం. రాగులు, సజ్జలు, జొన్నలు, కొబ్బరి, నువ్వులు, కరివేపాకు, ఆకుకూరలు, బాదం పప్పులు, తాలింపు గింజలు, పప్పులు-గింజలు వీటన్నింటిలో కాల్షియం దొరుకుతుంది. ముఖ్యంగా మునగాకులో పాలకంటే నాలుగు రెట్లు కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల్లో 440 ళీవీ కాల్షియం ఉంటుంది. పాలు, పెరుగు, జున్ను (బీనీలిలిరీలి), చేపలు – ముఖ్యంగా చిన్న చేపలలో కాల్షియం సమృద్ధిగా దొరుకుతుంది. మనం తినే ఆహారంలో కాల్షియం ఒక్కటే ఉంటే సరిపోదు. దానితో పాటు డి-విటమిను ఉండాల్సిందే. ఇది కొవ్వులో కరిగే విటమిను, ఈ విటమిను ఒక్క కాల్షియం వంటబట్టడానికే కాక ఇంకా చాలా ఉపయోగాలున్నాయి.
డి-విటమిను సరయిన మోతాదులో శరీరానికి అందుతూ ఉంటే-
* మన వ్యాధినిరోధక శక్తి బలంగా ఉంటుంది.
* నరాలు-కండరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండి పనిచేసుకోడంలో ఇబ్బంది ఉండదు. మాటిమాటికి పడిపోకుండా కాపాడుతుంది.
* మంచి మూడ్‌లో ఉంచుతుంది.
* విషపు రసాయనాల నుంచి మెదడును కాపాడుతుంది.
* నొప్పి నివారణలో తోడ్పడుతుంది.
* ఫాస్ఫరస్ వంటబట్టడానికి సాయపడుతుంది.
* డి-విటమిను తగ్గితే జరిగే నష్టాలు ఎక్కువే
* ఎముకలు బలహీనంగా తయారవుతాయి. పెద్దల్లో ఆస్టియో పరోసిస్, పిల్లల్లో రికెట్సు వ్యాధులు వస్తాయి.
* పెద్దల్లో గుండె వ్యాధులు, డిప్రెషన్ రావచ్చు.
* చిన్న పిల్లల్లో అస్తమా ఉధృతంగా వచ్చి తరచూ ఆసుపత్రి పాలవుతారు.
* రొమ్ము, ప్రోస్టేట్, పేగు కేన్సరు వచ్చే అవకాశం ఎక్కువ.
* ఊబకాయం వచ్చే అవకాశం.
* ప్సొరియసిడ్, ఫైబ్రొమయాల్జియా, మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం వుంది.
* ఎప్పుడూ ఏదో నిస్సత్తువగా (బీనీజీళిదీరిబీ తీబిశిరివీతిలి రీగిదీఖిజీళిళీలి) ఉంటుంది.
* రక్తపోటు అధికమయ్యే అవకాశం ఉంది.
* జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. అల్జిమీర్స్ వ్యాధి కూడ రావచ్చు.
* పిల్లల్లో టైపు-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువ.
మరి ఏ మోతాదులో డి-విటమిను తీసుకోవాలి?
పిల్లలు 0-12 నెలలు – 400 |ఏ
పెద్దలు 50 సం|| లోపు – 600 |ఏ / 51-70 సం|| – 600 / 71 సం|| ఆపైన – 800 |ఏ
గర్భవతులు, పాలిచ్చే తల్లులు – 600 |ఏ
డి-విటమిను లభించే ఆహారం :
చేపలు (కొవ్వుతో ఉండే వంజరం, పండుగొప్ప, మాగచిప్పలు, బాంగడా చేపలు), పుట్టగొడుగులు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్డులోని పసుపు సొన, బీఫ్ లివర్, మార్గరీవ్, పెరుగు, చీజ్. ఈ ఆహార పదార్థాలు తినడమే కాదు, వారానికి కొన్ని రోజులు చర్మానికి ఎండ తగిలేలా చేయాలి. 15-30 ని|| ఎండ తగిలితే 10,000-15,000|ఏ డి-విటమిను మన చర్మం కింద తయారవుతుంది. నలుపు చర్మం ఉన్నవారికి డి-విటమిను తయారవడం కొంచెం కష్టం. అసలు ఎండే లేని చలిప్రదేశాల్లో కూడా ఇదే సమస్య. కొన్ని మందులు శరీరంలోని డి-విటమిన్‌ని తగ్గిస్తాయి. స్టిరాయిడ్ మందులు, కొలెస్ట్రాల్ తగ్గడానికి వేసే మందులు, ఫిట్స్‌కి, టిబికి వాడే మందులు డి-విటమిన్ తగ్గిస్తాయి. డి-విటమిను 10,000 |ఏ కి మించి తీసుకుంటే మూత్రపిండాలు చెడిపోయే అవకాశముంది ఈ విటమిను ఈ2, ఈ3 రకాలుగా దొరుకుతుంది. ఈ3 ఎక్కువ ఉపయోగకరి.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి