కీళ్ళ నొప్పి (Joint Pain)అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
Joint Pain (కీళ్ళ నొప్పి) |
- కరక్కాయ పొడి, శొంఠిపొడి, వామును వేయించి చేసిన పొడి ఒక్కొక్కటి 5౦గ్రాములు మరియు 15౦ గ్రాములు బెల్లం అన్ని కలిపి దంచి గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ నిల్వ ఉంచిన పొడిని ఉదయం మరియు సాయత్రం పూటకు గచ్చకాయంత పరిమాణంలో చప్పరించి మింగాలి. తర్వాత 1౦౦ మి.లీ.ల గోరువెచ్చని నీరు లేదా పాలు త్రాగాలి. రోజూ ఈ విధంగా చేయడం వలన కీళ్ళనొప్పులు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
కావలసిన పదార్థాలు:- ఆముదము చెట్టు వేర్లు 1 కిలో, ఆముదము 5౦౦ గ్రా., నీరు 4 రెట్లు.
చేసె విధానం: ఆముదం తోలు 5౦౦ గ్రా. ఒక పాత్రలో వేసి అందులో నాలుగు రెట్లు నీరు అనగా 2 కి.గ్రా. వేయాలి. దానిని పొయ్యి మీద సన్నటి సెగ మీద పెట్టి, అర కిలో నీరు మిగిలె వరకు మరిగించి, దానిని దించి, వడపోయాలి. దీనిని మళ్ళి పొయ్యి మీద పెట్టి అర కిలో ఆముదము పోసి,సన్నట్టి సెగ మీద మరిగించి, నీరు అంత ఆవిరి అయ్యి పోయక ఆముదము మాత్రమే మిగలాలి, తరవాత దానిని దించి, వడపోసుకొని దానిలో మిరియాల పొడి 10 గ్రాములు, పిప్పళ్ళ పొడి 10 గ్రాములు, ముద్ద కర్పూరం 30 గ్రాములు, కాచిన ఆముదములో వేసి బాగా కలిపి, చల్లార్చి గాజు సీసాలో నిల్వచేసుకోవాలి.
ఉపయోగించే విధానం: దీనిని గోరు వెచ్చగ చేసుకొని ఎక్కువగ కీళ్ళ నొప్పులు వున్న చోట నెమ్మదిగ మర్ధన చేసి తరువాత పాత ఇటుక రాయి ని దంచి పొడి చేసి బాండిలో వేయించి, దానిని ఒక గుడ్డలో చుట్టి, మసాజ్ చేసిన చోట కాపడం పెట్టాలి. ఆ తరవాత చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యాలి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్
కీళ్లను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి రుమటాయిడ్ ఆర్థరైటిస్. దీనివల్ల కీళ్లు వాచి, గట్టిపడి నొప్పి పెడతాయి. ఈ వ్యాధి పురుషుల్లో కంటే స్త్రీలలో సాధారణంగా కనిపిస్తుంది. 30 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సులో ఎక్కువగా వస్తుంది.
కారణాలు :
దీనికి సరైన కారణం తెలియదు. కాని ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే శరీరంలోని సహజ రక్షక వ్యవస్థ కీళ్లపైన దాడి చేస్తుంది.
లక్షణాలు :
చేతులు, ముఖ్యంగా చేతి వేళ్లు, మణికట్లు, మోచేతులు, కాలి మడమ, మోకాళ్లు, మెడ భాగంలోని కీళ్లలో నొప్పి, కీళ్లు గట్టిగా ఉండటం, వాచిపోవడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. ఎక్కువ సమయం పడుకుని, కూర్చుని లేచిన తరువాత కీళ్లు గట్టిపడటం ఎక్కువ అవుతుంది. ఇది తగగ్డానికి గంటనుంచి కొన్ని గంటల సమయం పట్టవచ్చు. కీళ్ల సమస్యలు మాత్రమే కాకుండా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల నీరసం, బరువు తగ్గిపోవడం, జ్వరం, ఆకలి లేకపోవడంలాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు స్థిరంగా ఉండవు. కీళ్ల నొప్పులు వాటికవే తగ్గిపోవచ్చు. దీనిని రెమిషన్ అంటారు.
కీళ్ల నొప్పులకు ఇతర కారణాలు :
ఆస్టియో ఆర్థరైటిస్ : కీళ్ల రాపిడి, గాయాలు కావడం వల్ల ఎముకలపై ఉండే మృదువైన కార్టిలేజ్ పొర దెబ్బ తింటుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లాగా అన్ని భాగాల్లో కాకుండా, ఏదో ఒక భాగంలో మాత్రమే జరుగుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాత్రం వేలి కొసలనుంచి మోకాళ్లు, తుంటి భాగాల కీళ్ల వరకూ ప్రభావం చూపిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లాగా ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధులైన
ల్యూపస్ జోగ్రెన్స్ సిండ్రోమ్,
సొరియాటిక్ ఆర్థరైటిస్,
ఆస్టియో ఆర్థరైటిస్ :
అంకైలోసింగ్ స్పాండిలైటిస్--------లాంటి వ్యాధులు కూడా కీళ్లపై దాడి చేస్తాయి.
ఇతర భాగాలపై ప్రభావం :
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కీళ్లు మాత్రమే కాకుండా, చర్మం, ఊపిరితిత్తులు, రక్తనాళాలు కూడా ప్రభావితమవుతాయి. గుండె,మెదడు, రోగ నిరోధక కణాలపై కూడా ప్రభావం పడవచ్చు.
నిర్ధారణ :
శారీరక పరీక్షలు, ఎక్స్‌రే, ఆర్‌ఎ, ఇఎస్‌ఆర్, యాంటి సిపిసి, సిబిపిలాంటి రక్త పరీక్షల ద్వారా గుర్తిస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను తొలిదశలోనే గుర్తుపట్టడానికి కీళ్లకు హెచ్‌ఆర్‌యుయస్ వంటి ఆధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి.
చికిత్స :
ఈ వ్యాధికి జీవితాంతం చికిత్స తీసుకోవాలి. మందులతోపాటు వ్యాయామం, జీవనశైలి మార్పులు అవసరమవుతాయి. తొందరగా చికిత్స తీసుకుంటే పరిస్థితి విషమించకుండా ఉంటుంది. రుమటాలజిస్ట్ పర్యవేక్షణలోనే చికిత్స జరగాలి. మెథట్రెక్సేట్, హైడ్రాక్సీక్లోరోక్విన్, సల్ఫాసలజైన్, స్టిరాయిడ్స్‌ను వాడాల్సి వస్తుంది. ఈ మందులకు లొంగకపోతే బయలాజిక్స్‌లాంటి ఆధునిక చికిత్సలు ఇవ్వాలి.
జాగ్రత్తలు :
- అలసిపోగానే విశ్రాంతి తీసుకోవాలి.
- వంటగదిలో వస్తువుల ద్వారాకాని, తలపు గొళ్లేల వ్లకాని ఎటువంటి గాయాలు తగలకుండా చూసుకోవాలి.
- లక్షణాలు తీవ్రతంగా ఉంటే చేతి కర్ర సహాయంతో కాని, వాకర్స్ ద్వారా కాని నడవాలి.
- సమతులాహారం తీసుకోవాలి.
- ఆరోగ్యకరమైన బరువు కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
శస్త్ర చికిత్స ఎప్పుడు అవసరం?--
మందులు, ఫిజికల్ థెరపీకి లొంగనప్పుడు మాత్రమే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సర్జరీ అవసరమ వుతుంది. శరీరంలోని కొన్ని కీళ్లకు టోటల్ జాయింట్ రిప్లేస్‌మెంట్ చేయాల్సి వస్తుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పటికీ చాలామంది స్త్రీలు గర్భం దాల్చగలరు. ఆరోగ్యకరమైన బిడ్డలను పొందగలరు. గర్భం దాల్చిన సమయంలో ఈ వ్యాధికి వాడే కొన్ని మందులను ఆపవలసి ఉంటుంది. ప్రసవం తరువాత చాలామందిలో మొదటి మూడు నెలలలోపు వ్యాధి తీవ్రత ఎక్కువవుతుంది. ఇలాంటప్పుడు మందులు మళ్లి వాడాలి.
పోషకాహారం :
చేపనూనె వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది. ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండటానికి తగినంత కాల్షియం, విటమిన్ డి అందేలా చూసుకోవాలి. సాచురేటెడ్ కొవ్వు, కొలెస్టరాల్, ఉప్పు తక్కువగా ఉండే సమతులాహారం తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే ముడి గింజలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
ఇప్పుడు మీరు మీ నడుము నొప్పి , మెడ నొప్పి, సయాటికా , రుమటాయిడ్ ఆర్థరైటిస్ . ఆస్టియో ఆర్థరైటిస్ వంటి కీళ్ళ జబ్బులకు ఒక మంచి మందును గురించి తెలుసుకోబోతున్నారు .
.
దీనికి మీరు చెయ్యవలసినది “పారిజాతం” ఆకులు అయిదు లేక ఆరు తీసుకోండి . వాటిని ముద్దగా నూరండి . ఆ ముద్దను గ్లాసుడు నీళ్ళల్లో వేసి మరిగించండి . ఎంత సేపు మరిగించాలి అంటే అందులో నీళ్ళు అరగ్లాసు అయ్యేవరకూ మరిగించండి . చల్లార నివ్వండి . ఆ నీటిని త్రాగేయ్యండి .
.
మీరు అలాగే తాగేస్తే మంచిది . ఆకులు కూడా వెళ్ళడం మంచిదే !
.
మీరు ఒక్క వారం రోజులు ఇలా చేస్తే భయంకరమైన గౌట్ నుండి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది . వంకర తిరిగిపోయిన కీళ్ళు కూడా సామాన్య స్థితికి రావడం మొదలు అవుతుంది . నొప్పి మటుమాయం అవుతుంది .
.
చికెన్ గున్యా వలన కలిగే నొప్పులు అల్లోపతీ మందులతో ఆరు నెలలు అయినా తగ్గవు కానీ పారిజాత కషాయం తో మూడు రోజులలో తగ్గిపోతాయి .
.
అలాగే వృద్ధులకు వచ్చే మూత్ర సంబంధ వ్యాధులు కూడా పూర్తిగా తగ్గుతాయి.
ధన్యవాదములు
నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి