16, ఏప్రిల్ 2020, గురువారం

పిషర్ నొప్పి నివారణ హోమియో మందులు

ఫిషర్స్‌కు ఆసిడ్ నైట్రికమ్ హోమియో మందులు పరిష్కారం మార్గం 

మలద్వారము దగ్గర చీలిక ఏర్పడడాన్ని ఆనల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల అల్సర్ తయారై దురద, నొప్పి, రక్తంకారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కారణాలు
- ఎక్కువ కాలం మలబద్దకం లేక విరేచనాలు ఉండటం వల్ల నరాల మీద ఒత్తిడి పెరిగి మలద్వారం చీరుకుపోయి అల్సర్ తయారవుతుంది.

- మలబద్దకం ఉన్నప్పుడు మలవిసర్జన గట్టిగా జరగడం వల్ల చీలికవచ్చే అవకాశం ఉంది. విరేచనాల వల్ల ఎక్కువసార్లు కడగటం వల్ల మలద్వారం ఉబ్బిపోతుంది.

- ఆనల్ క్రిప్ట్‌లో సూక్ష్మజీవులు ప్రవేశించడం వల్ల క్రిప్టైటిస్ వచ్చి చీలిక ఏర్పడి అల్సర్‌గా మారుతుంది.

- కొంతమందిలో ఆనల్ ఫిషర్ నయం కాకుండా చాలా సార్లు దెబ్బతినడం వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది.

- మల విసర్జనలో సరిగా అరగని పదార్థాలు ఉండటం వల్ల మలద్వారం దగ్గర ఉన్న చర్మం చీలుకుపోతుంది.

- ఆనోరెక్టల్ సర్జరీ, ప్రొక్టైటిస్, క్షయ, క్యాన్సర్ వల్ల కూడా ఆనల్ ఫిషర్ వచ్చే అవకాశాలున్నాయి.

లక్షణాలు
మలద్వారంలో చీలిక

- దురద, నొప్పి, రక్తంకారటం.

- మల విసర్జన తరువాత నొప్పి గంట వరకు ఉండటం.

-ఎర్రటి రక్తం మలంతో కలిసి గానీ, తురువాత గానీ రావటం.

-మలవిసర్జన సమయంలో నొప్పిగా ఉండటం.

- ఆనల్ ఫిషర్ రావడానికి ఆనల్్ ఆబ్సిస్(చీముగడ్డ)కూడా కారణమే.


నిర్ధారణ
మలద్వారం దగ్గర చర్మం వేలాడుతూ ఉంటుంది. అల్సర్ కనిపిస్తూ ఉంటుంది. సిగ్నాయిడ్ స్కోప్, ఆనోస్కోప్, కొలనోస్కోప్ ద్వారా పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు.

చికిత్స
యాభైశాతం మందిలో ఫిషర్స్ ఎటువంటి ఆపరేషన్ లేకుండా వాటంతట అవే తగ్గిపోతాయి. మలద్వారం దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవటం, మల విసర్జన తరువాత కాటన్ గుడ్డతో తుడవటం వల్ల ఫిషర్ తొందరగా మానిపోతుంది. ఒకవేళ ఫిషర్ ఎక్కువ రోజులు ఉంటే మానడం కష్టమవుతుంది. సిట్స్ బాత్ (మలద్వారాన్ని ఇరవై నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచడం) వల్ల ఫిషర్ వల్ల వచ్చే సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, సమయానుసారంగా తినడం, సమయానికి మలవిసర్జనకు పోయే అలవాటు చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటే ఎనస్తటిక్ ఆయింట్‌మెంట్ పైపూతగా రాసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

హోమియో మందులు
ఆసిడ్ నైట్రికమ్ : ఈ మందు ముఖ్యంగా శ్లేష్మపొర, చర్మం కలిసే దగ్గర సమస్య ఉంటే పనిచేస్తుంది. కుచ్చినట్లుగా నొప్పి, చిరాకు ఎక్కువగా ఉండటం, మలవిసర్జనకు కష్టపడాల్సి రావటం, మలవిసర్జన తరువాత గంటల తరబడి నొప్పి ఉండటం, మలంతో పాటు రక్తం పడుతుండటం, త్వరగా అలసిపోవటం, రాత్రివేళ చలిగానీ, వేడిగానీ ఎక్కువ ఉంటే బాధలు ఎక్కువ కావటం, ప్రయాణం చేస్తున్న సమయంలో ఉపశమనంగా అనిపించటం వంటి లక్షణాలున్న వారికి ఈ మందు ఉపయోగకరంగా ఉంటుంది.

ఆస్కులస్ హిప్ :
 ఈ ఔషధం పేగు కింది భాగంలో ఎక్కువగా పనిచేస్తుంది. పైల్స్‌తో పాటు నడుము నొప్పి ఉండటం, రక్తం తక్కువగా పడటం, హెమరాయిడల్ వీన్స్(సిరలు)నిండుగా ఉబ్బిపోయి ఉండటం, మలాశయం దగ్గర చిన్న చిన్న పుల్లలు ఉన్నట్లుగా అనిపించటం, నొప్పి కింది నుంచి పైకి వెళుతున్నట్లు అనిపించటం, నడిచినపుడు, మలవిసర్జన సమయంలో నొప్పి ఎక్కువ కావడం వంటి లక్షణాలున్న వారు వాడదగిన మందు ఇది.

అలోస్ సొకట్రీన :
 ఎక్కువ సమయం కూర్చుని ఉండే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో చక్కగా పనిచేస్తుంది. మలాశయం దగ్గర నొప్పి, రక్తం ఎక్కువగా పడటం, చల్లటి నీటితో కడగినపుడు ఉపశమనంగా అనిపించటం, మలం జిగటగా రావడం, పైల్స్ బయటకు వేళాడుతూ ఉండటం వంటి లక్షణాలున్న వారు ఉపయోగించదగిన ఔషధం.

రటానియా: ఈ మందు ముఖ్యంగా మలాశయం పైన పనిచేస్తుంది. విపరీతమైన వెక్కిళ్లు, మలాశయం దగ్గర నొప్పి, మలవిసర్జన తరువాత నొప్పి కొన్ని గంటల వరకు ఉండటం, మలవిసర్జనకు కష్టపడాల్సి రావడం, మంట, చల్లటి నీటితో కడగటం వల్ల ఉపశమనంగా ఉండటం వంటి లక్షణాలున్న వారికి సూచించదగిన మందు.

మెర్క్‌కార్: మలవిసర్జన సమయంలో తీవ్రమైన బాధ, మలం వేడిగా, రక్తంతో కలిసి రావడం, జిగటగా, దుర్వాసనకూడా ఉండటం, రాత్రి సమయంలో బాధ ఎక్కువగా ఉండటం, కదలకుండా ఉన్నప్పుడు ఉపశమంగా అనిపించడం వంటి లక్షణాలున్నవారు వాడదగిన మందు.

పమోనియా : మలవిసర్జన తరువాత దురద, మంటగా ఉండటం, కాళ్లపైన, పాదాలపైన, మలాశయం వద్ద పుండ్లు తయారవడం, పైల్స్ లేత వంకాయ రంగులో ఉండటం వంటి లక్షణాలున్న వారికి సూచించదగిన మందు.

నక్స్‌వామికా: ఆధునిక జీవనం వల్ల ఈ సమస్య వచ్చినవారికి ఉపయోగపడే మందు. ఎక్కువ సమయం కూర్చుని పని చేసే వారికి ఈ మందు ఇవ్వవచ్చు. మలబద్ధకం, తరచుగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, మలవిసర్జన కొంచెం కొంచెంగా రావటం, దురద, నొప్పి ఎక్కువగా ఉండటం, పైల్స్, ఉదయంపూట బాధ ఎక్కువవడం, నిద్ర పోయినపుడు ఉపశమనంగా అనిపించడం వంటి లక్షణాలున్న వారు ఉపయోగించదగిన మందు.

సల్ఫర్: వేడి పడదు, నీళ్లు అంటే ఇష్టం ఉండదు. చర్మం, వెంట్రుకలు పొడిబారి ఉంటాయి. ఎక్కువ సేపు నిలబడి ఉండలేరు. మలద్వారం వద్ద మంట, దురద ఉంటుంది. పొద్దున లేచిన వెంటనే విరేచనాలు అవుతాయి. పైల్స్ నుంచి రక్తస్రావం, పొడిగా, వెచ్చగా ఉండే వాతావరణంలో ఉపశమనంగా అనిపించటం వంటి లక్షణాలు ఉన్న వారు వాడదగిన మందు.

వృద్ధుల్ని వేధించే..నొప్పులు కు 

Oldage

నిత్యం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాల శాతం తగ్గడం వలన మల బద్దకం ఏర్పడుతుంది. దీంతో మలవిసర్జన కష్టంగా మారును. మలవిసర్జన సాఫీగా జరగనప్పుడు ముక్కడం వలన మలాశయం వద్ద ఉండే కండరాలు, రక్తనాళాలు ఒత్తిడికి గురై ఉబ్బు తాయి. కొన్నిసందర్భాలలో రక్తస్రావం కూడా జరుగుతుంది. నేడు ఎక్కువ మంది వృద్ధులు ఈ సమస్యతో బాధించడుతున్నారు. పైల్స్(హీమ రాయిడ్స్)లను సాదారణంగా అర్షమొలలు అంటారు. పైల్ అంటే గడ్డ అని హీమరాయిడ్ అంటే రక్త స్రావం కావడం అని అర్థం. మొలలు చూడటానికి పిలకలుగా కనబడినా, రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మల ద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా కనిపిస్తాయి. అర్షమొలలు (ఫైల్స్) ముఖ్యంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చును. వీటిలో ఒకరకం ఫైల్స్ మలద్వారం లోపలే ఉండి బయటికి కనిపించకుండా ఉండును. ఇలా ఫైల్స్ మలద్వారం లోపల ఉండటం వలన రోగికి ఫైల్స్ ఉన్న విషయం చాలా రోజుల వరకు తెలియ కుండా ఉండును. ఇక రెండవ రకం ఫైల్స్ మలద్వారానికి వెలుపలే ఉంటాయి. ఇవి చేతికి తాకుతుంటాయి. మల విసర్జనకు వెళ్ళినప్పుడు కొన్ని రకాల మొలలు నొప్పి కలిగిస్తుంది. పడుకున్నప్పుడు ‘మొలలు’ లోపలికిపోయి నొప్పి తగ్గుతుంది. అర్షమొలలు లోపలికి పోతున్నాయి కదా అని అజాగ్రత్తతో మందులు వాడకుండ, డాక్టర్ సలహా తీసుకో కుండా ఉంటే కొన్ని రోజులకు ‘మొలలు’ మలద్వారం బయట ఎక్కువ సంఖ్యలో తయారై శాశ్వతంగా బయటనే ఉండిపోయి తీవ్రమైన అవస్థలకు గురి చేయును.
కారణాలు : తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మల విసర్జన సక్రమంగా జరగక మలబద్దకం ఏర్పడటం వలన, కొందరిలో వంశ పారం పర్యంగా, ఎక్కువసేపు కుర్చీలోనే కూర్చొని కదలకుండా విధులను నిర్వర్తిం చడం వల్ల, తక్కువగా నీరు త్రాగడం వల్ల, మద్యం అతిగా సేవించుట వల్ల, ఫాస్ట్ ఫుడ్స్ వేపుళ్లు అతిగా తినడం వల్ల, మాంసాహరం తరుచుగా తినటం వలన పైల్స్ సమస్య వస్తుంది.
లక్షణాలు : మల విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి, మంట వుంటాయి. మనుషులు చురుకుగా ఉండలేరు. ఎక్కడికంటే అక్కడికి
ప్రయాణాలు చేయలేరు. సుఖవిరేచనం కాక పోవ డం వీరిని బాధిస్తుంది. సుఖవిరేచనం కాక పోవ టంచే చిరాకుగా, కోపంగా ఉంటారు. అప్పు డప్పుడు విరేచనంలో రక్తం పడుతుంటుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి, మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.
జాగ్రత్తలు : సులభంగా జీర్ణమయ్యే ఆహారప దార్ధాలు తీసుకోవటం శ్రేయష్కరం. ఘనపదార్థాల కన్నా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవటానికి ప్రయత్నించాలి. కారం,నూనె, మసాల పదార్థాలు బాగా తగ్గించాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4నుడి 5 లీటర్లు). ప్రతి రోజు వ్యాయామం చేయాలి. రోజు మల విసర్జన సాఫీగా జరిగేట్లుగా చూసుకోవాలి. మద్యం అతిగా సేవించుట, ఫాస్ట్ ఫుడ్స్ వేపుల్లు , మాంసాహరం, చిరుతిండ్లు తినటం మానుకోవాలి. మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్ చేయాలి.
చికిత్స : వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. వ్యాధి ఆరంభంలోనే హోమియో మందులను వాడుకుని ప్రయోజనం పొందవచ్చును. హోమియో వైధ్యవిధానంలో ప్రతి ఔషదం మానసిక లక్షణాలతో కూడి ముడిపడి ఉంటుంది. మందుల ఎంపికలో కూడా మానసిక శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకొని మందు లను సూచించడం జరుగుతుంది కనుక సమూ లంగా పైల్స్ వంటి రుగ్మతలనుండి విముక్తి పొందవచ్చును.
మందులు : అస్కులస్‌హిప్ : మల ద్వారం పొడిగా ఉండి నొప్పిగా అనిపిస్తుంది. ఆసనంలో పుల్లలు గుచ్చుతున్నట్లుగా ఉంటుంది. విరేచనానికి వెళ్లాలంటేనే భయపడి పోతారు. విరేచనం తరువాత నొప్పిగా బాధగా అనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక గుర్తుంచుకోదగినది.
నక్స్‌వామికా : శారీరక శ్రమ లేకుండా, మలబద్ద కంతో బాధ పడుతూ తరుచుగా మలబద్దకం నివా రణ మాత్రలు వాడే వారికి ఈ మందు ఆలోచించ దగినది. అలాగే తరుచుగా మల విసర్జన చేయాల నిపించడం, తీరా మలవిసర్జనకు వెళితే మలం సాఫీ గా జరుగక బాధాకరంగా అనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.
అలోస్ : ఫైల్స్ మలద్వారం వెలుపల ‘గ్రేప్స్’ లాగా ఉండి చేతికి తాకుతూ ఉండును. మల విసర్జనకు వెళ్ళినప్పుడు ‘రక్తం’ పడుతూ ఉంటుంది. మలద్వారం మంట, దురదగా అనిపిస్తుంది. మొలలు ఉన్న ప్రదేశంలో చల్లని నీరు తాకినా నొప్పి, మంట నుండి ఉపశమనం పొందుట గమనించదగిన లక్షణం. ఇటువంటి లక్షణా లున్నవారికి ఈ మందు తప్పక ఆలోచిం చదగినది.
సల్ఫర్ : పైల్స్ వ్యాధి నయం చేయుటలో ఈ మందు అతి ముఖ్యమైనది. చాలా కేసులలో ఈ మందును వాడి పైల్స్ వ్యాధి నుండి విముక్తి పొందవచ్చును. మలబద్దకంతో బాధ పడుతూ ఉంటారు, మలవిసర్జనకు వెళితే మలం సాఫీగా జరుగక మంట, నొప్పి బాధాకరంగా ఉంటుంది. నొప్పి మలవిసర్జన అనంతరం కూడ ఉండి బాధిం చును. మలవిసర్జన సమయంలో మొలలు (పైల్స్) బయటకు వచ్చి వేధించును. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.
రటానియా : వీరికి ఆసనంలో గాజుపెంకులు గుచ్చుతున్నట్లుగా ఉంటుంది. విరేచనం వెళ్లిన తరువాత కొంత సేపు వరకు నొప్పిగా బాధగా అనిపిస్తుంది. మలవిసర్జన సమయంలో అప్పు డప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
హెమామెలీస్ : మలబద్దకంతో బాధ పడుతూ ఉంటారు, మలవిసర్జనకు వెళితే మలం సాఫీగా జరుగక మంట, నొప్పి కూడి రక్తం విస్తారంగా పడుతూ ఉన్నప్పుడు ఈమందు బాగా పని చేయును. ఈ మందులే కాకుండా పైల్స్ బాధ నివారణ కు నె్రైటిక్ ఆసిడ్, మ్యురాటిక్ ఆసిడ్, గ్రాఫాయిటీస్, మెర్కుసాల్, ఫాస్పా రస్ వంటి మందుల ను వ్యాధి లక్షణాల ఆధారంగా వాడుకొని పైల్స్ నుంచి విముక్తి పొందవచ్చును.

ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 

కామెంట్‌లు లేవు: