2, ఏప్రిల్ 2020, గురువారం

తోక ఎముక నొప్పి నివారణ నవీన్ సలహాలు


Coxodynia , తోక ఎముక నొప్పి తీసుకోవసిన జాగ్రత్తలు , కాక్షోడినియా

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - తోక ఎముక నొప్పి(Coxodynia-కాక్షోడినియా)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మనిషికి తోక ఉండదు కాని తోకలాంటి భాగము వెన్నేముక వెన్నెముకలో ఉంటుంది . వెన్నెముక చివర త్రిభుజాకారం లో అంతమయ్యే ఎముక అది . దాని నొప్పితో కొంతమంది బాధపడడుతుంటారు . ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తే శరీర బరువు ప్రభావము ఆ ఎముకవీద పడి బాధిస్తుంది . వైద్యభాషలో దీనిని " కాక్సీడినియా" అంటారు . ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు కుర్చీలో కూర్చొని చేస్తున్నవే .

వీపు చిట్టచివర కాళ్ళు రెండుగా చీలేచోట వేలుపెట్టి నొక్కినప్పుడు బాధ అనిపించినా , మూత్రవిసర్జన సమయం లో లేదా ఆ తర్వాత లేచి నిలుచుంటున్నప్పుడు ఆ భాగము లో నొప్పి అనిపించినా మీలో ఇబ్బంది మొదలైందని గుర్తించంది . ఈ నొప్పి తొడలలోకి , కొన్ని సమయాలలో పురజాలలోకి ప్రాకవచ్చును .

శరీర బరువు అధికంగా క్లవారికి ఈ ఇబ్బంది అధికం ,
ఎక్కువ దూరము డ్రైవింగ్ చేసే వాళ్ళలోనూ ఇది కనిపిస్తుంది .
కొన్ని రకాలమందులు వాడడం వల్ల నూ ఇది రావచ్చును .
ఎక్కువకాలము మలబద్దకం తో బాధపడే వారు కొంద్రిని ఇది నొప్పిగా ఉండవచ్చును .
కాక్సిక్స్ ఎముక కు దెబ్బలు తగిలిన దాని చుట్టు ఉన్న నెర్వస్ ఇర్రిటేషన్‌ వలన కలుగ వచ్చును .

చికిత్స :
  • కూర్చున్న పొజిషన్‌ నుండి పడుకునే పొజిషన్‌ కి మారడం వలన నొప్పి తగ్గును ,
  • విరోచనం మందం అవకుండ పీచుపదార్ధాలు తీసుకోవాలి ,
  • కూర్చునే కుర్చీ మెత్తగా ఉండే టట్లు చూసుకోవాలి ,
  • డ్రైవింగ్ లో కొన్ని మెలకువలు పాటించాలి ,
నొప్పి నివారణకు :
  • Butaproxyvon gel /ointment నొప్పిదగ్గర రాయాలి .
  • Tab . Trim (tramadol + paracetamol ) రోజుకి 2 చొ.. వారం రోజులు వాడాలి ,
  • వేడి నీళ్ళ కాపడం పెట్టవచ్చును ... నొప్పి తగ్గుతుంది .
మంచి వైద్యుని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

కామెంట్‌లు లేవు: