15, ఏప్రిల్ 2020, బుధవారం

చేతులు కాలు త్రిమురులు పరిష్కారం మార్గం


రాత్రుళ్ళు కాళ్ళ తిమ్మిరి సమస్యలు బాధిస్తున్నాయా? అయితే వాటిని వదిలించుకోండిలా అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

ముఖ్యంగా రాత్రి సమయాల్లో, కాళ్ళు తిమ్మిరులకు గురవడం అనేది అత్యంత సాధారణమైన అంశంగా ఉంటుంది. తరచుగా పాదాల అడుగుల భాగం, తొడలు, లేదా మోకాలి కింద కాళ్ళ భాగం వంటి ప్రాంతాలలోనే కాకుండా, కొందరికి అరచేతులలో కూడా తిమ్మిర్లు ఏర్పడుతుంటాయి. ప్రధానంగా కండరాల సంకోచ వ్యాకోచాల వలన ఈ పరిస్థితి తలెత్తుతుంది.


సాధారణంగా, నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు, లేదా నిద్ర నుండి అప్పుడే మేలుకుంటున్న సమయంలో ఈ తిమ్మిర్లు సహజంగా ఏర్పడుతుంటాయి. కొన్ని సందర్భాలలో ఈ బాధ మరింత తీవ్రంగా కూడా పరిణమించవచ్చు. మరియు కొన్ని నిమిషాలపాటు కొనసాగవచ్చు. ఒక్కోసారి కండరాలు కఠినతరంగా మారడం, కాలిని తాకినా, కదిలించినా నొప్పి కలగడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. కొందరికి సగం నిద్రలో కూడా ఈ సమస్య తలెత్తుతుంటుంది.

కానీ ఈ తిమ్మిరులు, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోం సమస్యకు భిన్నంగా ఉంటుందని తెలుసుకోవడం ముఖ్యం. తరచుగా ఈ రెండు సమస్యలు రాత్రి వేళల్లో తలెత్తుతున్నప్పటికీ, ఒక ప్రధాన సారూప్యత ఉంటుంది. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ సమస్య తలెత్తినప్పుడు, కాళ్ళు కదిలించినప్పుడు సడలింపు అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ తిమ్మిరుల సమస్య తలెత్తినప్పుడు, నొప్పి తీవ్రత పెరుగుతుంది.

అయినప్పటికీ, ఈ సమస్యకు గల కారణాలను శాస్త్రవేత్తలు ఇంకనూ పూర్తిస్థాయిలో నిర్ధారించలేదు. కానీ, తరచుగా ఈ సమస్య తలెత్తడం కొన్ని విపరీత ఆరోగ్య పరిస్థితులకు దారితీయవచ్చని వారు అనుమానిస్తున్నారు.

కాళ్ళ తిమ్మురులకుగల ప్రధాన కారణాలు :

• సుదీర్ఘకాలం తక్కువ ఉష్ణోగ్రతలలో ఉండడం

• రక్తప్రసరణ సమస్యలు

• థైరాయిడ్ వ్యాధి

• నిర్జలీకరణము

• నిర్దిష్టరకాల ఔషదాలు.

• కిడ్నీవ్యాధులు

• గాయాలు

• అధికమైన శారీరకశ్రమ

• కండరాల ఓవర్లోడ్

• కాల్షియం లేకపోవడం

• గర్భం

• మెగ్నీషియం లోపించడం

• పొటాషియం లోపించడం

ఈ తిమ్మిరికి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కారణం కాదని గమనించినట్లయితే, మీకు మీరే సహాయపడటానికి కొన్ని భిన్నమైన పద్ధతులపై ఆధారపడవచ్చు.

తిమ్మిరుల చికిత్సా విధానం :


1. మెగ్నీషియం :

మీరు తరచుగా తిమ్మిరిని ఎదుర్కొంటున్నట్లయితే మీ రోజువారీ ఆహారంలో మెగ్నీషియం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మీరు ఈ పోషక పదార్ధంతో కూడిన విత్తనాలు మరియు గింజలను కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇదివరకు వ్యాసాలలో కొబ్బరినీళ్ళలో కూడా అధిక మెగ్నీషియం నిల్వలు ఉన్నట్లుగా మనం తెలుసుకున్నాము. సప్లిమెంట్స్ తీసుకోవాలని భావిస్తున్న ఎడల సంబంధిత వైద్యుని సంప్రదించడం మేలు.

అంతేకాక, మీరు నిద్రకు ఉపక్రమించే ముందుగా మెగ్నీషియం నూనెతో కాళ్ళను మర్దన చేయడం కూడా మంచిదిగా సూచించబడింది. అరకప్పు వేడినీటికి, అరకప్పు మెగ్నీషియంక్లోరైడ్ రేకులను జోడించి, అవి కరిగిన తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లబరచండి. ప్రతిరోజూ మీరు నిద్రకు ఉపక్రమించే ముందు కాళ్ళ మీద ఒక స్ప్రేబాటిల్ సహాయంతో ఐదు నుండి పది సార్లు స్ప్రే చేయండి.


2. స్తబ్దుగా ఉండకండి :

ఎటువంటి వ్యాయామాలు చేయకపోయినా, కనీసం నడకనైనా అనుసరిస్తున్నారని నిర్దారించుకోండి. శరీరం స్తబ్దుగా ఎటువంటి క్రియలను పాటించని పక్షంలో రోగనిరోధకత కూడా మందగిస్తుంది. కావున మీ రోజూవారీ విధానంలో భాగంగా వ్యాయామాన్ని కూడా కలిగి ఉండేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. క్రమంగా మీ కండరాల తిమ్మిరి సమస్య కూడా తొలగిపోతుంది.

3. నీటిని తీసుకోవడం పెంచండి :

కాళ్ళ తిమ్మురులకు గల ప్రధాన కారణాలలో నిర్జలీకరణం(డీహైడ్రేషన్) కూడా ఒకటి. రోజూవారీ అవసరానికి మాత్రమే నీటిని తీసుకోవడం చేస్తుంటారు కొందరు. అధిక శారీరిక శ్రమ, సూర్యతాపం, శరీర జీవక్రియలు వంటి అనేక కారకాల మూలంగా శరీరానికి ఎప్పటికప్పుడు నీటి అవసరం ఉంటుందని మరవకండి. రోజూవారీ శరీర అవసరాల దృష్ట్యా నీటిని తరచుగా తీసుకోవడం మూలంగా కూడా మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.

4. ఎప్సోమ్ ఉప్పు కలిపిన నీటితో స్నానం :

అనేకమంది నిపుణులు, మరియు శిక్షకుల ప్రకారం, ఎప్సోమ్ ఉప్పు కలిపిన స్నానము శరీరానికి మంచిదిగా సూచించబడింది. ఇది తిమ్మిరులను తొలగించడమే కాకుండా, దీనిలోని మెగ్నీషియం కండరాలకు ఉపశమనాన్ని అందిస్తుంది. తరచుగా కనీసం వారానికి ఒకసారైనా ఎప్సోం ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం మంచిదిగా సూచించబడుతుంది.

5. మర్దన లేదా ఆక్యుపంక్చర్ విధానాలు :

ఆక్యుపంక్చర్ విధానం కండరాల విశ్రాంతికి తోడ్పడడంతో పాటు, ఇతరత్రా కండర సమస్యలను పరిష్కరించడానికి సూచించబడుతుంది. కాని, ఆక్యుపంక్చర్ సూదులతో కూడిన చికిత్సా విధానం. కావున కొందరు దీనిపట్ల సుముఖంగా ఉండరు. అటువంటి పరిస్థితుల్లో మసాజ్ వైపు మొగ్గుచూపడం మంచిది. మసాజ్ ఆయిల్ సహకారంతో మీ ప్రియమైన వారిచేత రోజూవారీ ప్రణాళికలో భాగంగా పడకకు ఉపక్రమించే ముందు మసాజ్ చేయించుకోండి. త్వరితగతిన మీ కండరాలు విశ్రాంతికి లోనవుతాయి.

6. స్ట్రెచ్ :

తిమ్మిరి సమస్యలతో కూడిన కాళ్ళను స్ట్రెచ్ చేయడం ద్వారా, కండరాలకు విశ్రాంతిని అందించవచ్చు. ఈ సమయంలో ఎటువంటి శారీరక చర్యలకు పూనుకోవద్దు., అది నొప్పిని ప్రేరేపించవచ్చు. మీ కండరాలను విస్తరించినట్లుగా స్ట్రెచ్ చేయండి. మరియు శాంతంగా ఆ ప్రాంతంలో మర్దన చేయండి.

గమనిక : కొందరు మరో అడుగు ముందుకు వేసి కుడిపక్క తొడభాగాన, నరాలు లాగిన అనుభూతికి లోనవుతుంటారు. ఈ సమస్య, మెరల్గియా పెరస్తీషియా అయ్యే అవకాశాలు ఉంటాయి. కావున తరచుగా ఈ సమస్య ఎదురవుతున్న ఎడల వైద్యుని సంప్రదించడం మేలు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవన శైలి, ఆహార,హస్త సాముద్రిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయం

ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

కామెంట్‌లు లేవు: