21, ఏప్రిల్ 2020, మంగళవారం

పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలి అంతే డైట్ ప్లాన్ యోగ నియమాలు


28 రోజులు ఈ ఒక్క ఎక్స‌ర్‌సైజ్ చేస్తే.. పొట్ట త‌గ్గ‌డం ఖాయం..!అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

       ఉండాల్సిన దాని క‌న్నా మ‌న శ‌రీరం అధిక బ‌రువు ఉంటే అప్పుడు ఎన్ని ఇబ్బందులు మ‌న‌కు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీనికి తోడుగా ఇక పొట్ట ఎక్కువ‌గా ఉంటే అప్పుడు ఇంకా స‌మ‌స్య ఎదుర‌వుతుంది. అయితే కింద సూచించిన విధంగా ఓ సింపుల్ ఎక్స‌ర్‌సైజ్‌ను రోజూ 4 నిమిషాల పాటు చేస్తే చాలు. 28 రోజుల్లోనే మీ శ‌రీరంలో అధికంగా ఉన్న‌ కొవ్వు క‌రిగిపోతుంది. అంతేకాదు పొట్ట కూడా త‌గ్గుతుంది.

ఎలా చేయాలంటే..? వివరాలు కు లింక్స్ లో చూడాలి 

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

చిత్రంలో చూపిన విధంగా నేల‌పై బోర్లా ప‌డుకుని మోచేతుల‌ను, కాలి వేళ్ల‌ను ఆధారంగా చేసుకుని శ‌రీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండాలి. దీంతో పొట్ట‌, ఛాతీ కండ‌రాలు, భుజాల‌పై అధికంగా ఒత్తిడి ప‌డుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ వ్యాయామాన్ని 'ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ (Plank Exercise)' అంటారు. దీన్ని నిత్యం కింద సూచించిన విధంగా చేస్తే కేవ‌లం 28 రోజుల్లోనే పొట్ట త‌గ్గుతుంది.

కింద తెలిపిన‌ టైం ప్ర‌కారం పైన చెప్పిన వ్యాయామాన్ని రోజూ చేయాలి..!
1వ రోజు – 20 సెకండ్లు
2వ రోజు – 20 సెకండ్లు
3వ రోజు – 30 సెకండ్లు
4వ రోజు – 30 సెకండ్లు
5వ రోజు – 40 సెకండ్లు
6వ రోజు – రెస్ట్
7వ రోజు – 45 సెకండ్లు
8వ రోజు – 45 సెకండ్లు
9వ రోజు – 60 సెకండ్లు
10వ రోజు – 60 సెకండ్లు
11వ రోజు – సెకండ్లు
12వ రోజు – 90 సెకండ్లు
13వ రోజు – రెస్ట్
14వ రోజు – 90 సెకండ్లు
15వ రోజు – 90 సెకండ్లు
16వ రోజు – 120 సెకండ్లు
17వ రోజు – 120 సెకండ్లు
18వ రోజు – 150 సెకండ్లు
19వ రోజు – రెస్ట్
20వ రోజు – 150 సెకండ్లు
21వ రోజు – 150 సెకండ్లు
22వ రోజు – 180 సెకండ్లు
23వ రోజు – 180 సెకండ్లు
24వ రోజు – 210 సెకండ్లు
25వ రోజు – రెస్ట్
26వ రోజు – 210 సెకండ్లు
27వ రోజు – 240 సెకండ్లు
28వ రోజు – 240 సెకండ్లు ఆపైన మీ ఇష్టం

పైన సూచించిన విధంగా రోజూ ఆయా స‌మయాన్ని అనుస‌రించి ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ చేస్తే ఫ‌లితం ఉంటుంది. త్వ‌ర‌గా పొట్ట త‌గ్గుతుంది.

నడకతో లాభాలు

మెదడు: 
వారానికి కనీసం 2 గంటలు నడవటం వల్ల పోటును 30 శాతం వరకు నివారించవచ్చు. రోజూ కాసేపు నడవటం వల్ల ఎండార్ఫిన్‌లు తయారై శరీరానికి ఉత్సాహాన్నిస్తాయి.

జ్ఞాపకశక్తి: 
వారానికి 3 సార్లు.. ప్రతీసారీ 40 నిమిషాల నడకతో జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. చక్కటి ప్రణాళికకు అనువైన వాతావరణాన్ని మెదడు ఏర్పరచుకుంటుంది.

గుండె: 
రోజుకు 30 నుంచి 60 నిమిషాలు చురుగ్గా నడవటం వల్ల గుండె సంబంధ వ్యాధుల్ని దూరం చేసుకోవచ్చు. 54 శాతం గుండెపోటు నుంచి బయటపడవచ్చు.

కీళ్లనొప్పులు: 
వారంలో 4 గంటలపాటు నడక సాగిస్తే ఎముకల బలహీనతల్ని 43 శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది. రోజుకు 45 నిమిషాలు నడవటంతో కీళ్లనొప్పులు రాకుండా నివారించుకోవచ్చు. ఇదే నడక కాస్త ఎండలో చేస్తే విటమిన్‌ ‘డి’ పెరుగుతుంది.

ఒత్తిడి: 
రోజుకు అరగంట నడక అలవాటు చేసుకుంటే 36 శాతం ఒత్తిడి దూరమవుతుంది.

ఆయుష్షు:
వారానికి 75 నిమిషాల నడక సాగిస్తూపోతే కనీసం రెండేళ్ల ఆయుష్షు పెరుగుతుందనేది అంచనా.

బరువు: 
ప్రతీరోజూ కనీసం 20 నిమిషాలు నడవటంవల్ల ఏడాదికి 3 కిలోలకు పైగా కొవ్వును తగ్గించవచ్చు. రోజుకు 1 గంట నడవటంతో ఒబెసిటీ వ్యాధిగ్రస్తులు సగం బరువును తగ్గించుకోవచ్చు.

బీపీ: 
వారానికి కనీసం 5 రోజులైనా బాగా నడిస్తే అధిక బీపీ ఉన్నవారిలో కనీసం 6 పాయింట్ల వరకు తగ్గుదల కనిపించవచ్చు.

వెన్నునొప్పి: 
వారానికి 3 నుంచి అదనపు గంటలు చురుగ్గా నడవటం వల్ల 40 శాతం వీపు కింద వెన్నునొప్పిని నివారించవచ్చు.

రక్తప్రసరణ: 
నడిచేటప్పుడు కాళ్లు, చేతులు ఆడించడం వల్ల రక్తప్రసరణ వృద్ధి మెరుగవుతుంది. ఉదరం పైన, కింద ఉన్న అవయవాల పనితీరు కూడా మెరుగవుతుంది.

నడకలో ప్రాణాయామం: 
సాధారణ వ్యక్తులు కాస్త వేగంగా నడక సాగిస్తే అలసట వచ్చేస్తుంది. ఆ తర్వాత నడకతో వూపిరి వదలడం, పీల్చుకోవడంలాంటివి ప్రాణాయామాన్ని తలపిస్తాయి. దీనివల్ల వూపిరితిత్తుల పనితీరూ వృద్ధి చెందుతుంది.

వ్యాధినిరోధక శక్తి: 
రోజుకు కనీసం 45 నిమిషాలు నడిచేవారిలో వ్యాధినిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ నడక తర్వాత కచ్చితంగా 15 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.

మలినాలు: 
10-15 నిమిషాలు నడక సాగిస్తే శరీరంలోని వివిధ మలినాలు (టాక్సిన్స్‌) చెమట రూపంలో బయటికి వచ్చేస్తాయి.

ప్రత్యేకించి మహిళలకు..
వారానికి 3 - 5 గంటలు నడక అలవాటు చేసుకుంటే 50 శాతం వరకు రొమ్ము కాన్సర్ల నుంచి బయటపడొచ్చు.

పొట్ట తగ్గడానికి

బరువు తగ్గడానికి

కొవ్వు తగ్గడానికి

ఆయాసం నియంత్రణకు

చక్కని శరీర ఆరోగ్యం కోసం  

మన ఇళ్లలో ఉంటే తీగ కాకరకు 

ప్రతి ఉదయం

 ఒక టీ స్పూన్ ఆకుపసరులో

మూడు నిమ్మరసం చుక్కలు వేసి

మూడు మాసాలు సేవించిన

పైవి అన్ని కుదురును

అలవాట్లు మార్చుకుంటే.. ఆయుష్మాన్‌భవ నవీన్ సలహాలు 

అదుపులేని ఆహారపు అలవాట్లు, వేళకు తినకపోవడం, కనీస వ్యాయామం లేకపోవడం.. నూటికి తొంభై శాతం జబ్బులకు ఇదే కారణం. వాటిలో మార్పు తేగలిగితే అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘవ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చని జాతీయ పోషకాహార సంస్థ (National Institute of Nutrition - NIN ) చెబుతోంది.

ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
* ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు ఉప్పు మాత్రమే వాడాలి. 
* ఒక వ్యక్తి రోజుకు 20 గ్రాములకు మించి వంట నూనె వాడకూడదు. అదీ నెలంతా ఒకే రకం నూనెను వాడకుండా రెండు మూడు రకాల నూనెలను వాడాలి. 
* రోజుకు 400 గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. అందులో 250 గ్రాముల కూరగాయలు, 150గ్రాముల పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. 
* రోజూ కనీసం అరగంట నుంచి గంటపాటు ఏదో ఒక వ్యాయామం చేయాలి. 

రెండు వారాల్లో రెండు ఇంచెస్ పొట్ట కరిగించే నవీన్ నడిమింటి సలహాలు 

ప్రతి ఒక్కరినీ విసిగించే సమస్య పొట్ట. చాలా మంది లావుగా ఉన్నవారికే పొట్ట ఉంటుందనుకుంటారు. కానీ సన్నగా ఉన్న వారిలో కూడా పొట్ట ఉంటుంది. ఆహార నియమాలు, జీవన విధానాలు బట్టీ ఉదరభాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుది. ఈ సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుంది. పొట్ట మొత్తం బాడీషేప్‌ని పాడు చేస్తుంది. మన అవుట్ లుక్ ను అసహ్యంగా మార్చి వేస్తుంది. అయితే ఈ సమస్యను ఈజీగా పరిష్కరించుకోవొచ్చు. ముందుగా మీ నడుము చుట్టుకొలత కొలుచుకోవాలి. బరువు ఎంత అధికంగా ఉన్నామో కూడా పరీక్షించుకోవాలి. ఇక రెండు వారాల్లో రెండు ఇంచుల పొట్ట తగ్గించుకుంటానని మీరు నిర్ణయించుకోవాలి. ఇందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వాటిని తప్పకుండా పాటించాలి. 

పొట్ట తగ్గించుకోవడం కోసం మీరు కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా ఉంటూనే మీరు మీ సమస్యను పరిష్కరించుకోవొచ్చు. హెల్తీ ఫుడ్స్ ను మీ డైట్ చేర్చుకుని కాస్త తేలికపాటి వ్యాయామాలు చేస్తే చాలు. ఇంకెందుకు ఆసల్యం. కింది ఇచ్చిన వాటిని మీ డైట్ చేర్చుకోండి. రెండు వారాల్లో మంచి ఫలితాలు పొందండి. స్టమక్ పై వార్ ప్రకటించండి. సమస్యను అధిగమించండి. 

జనపనార గింజలు 

మీరు రోజు తీసుకునే డైట్ లో కచ్చితంగా జనపనార గింజలు ఉండేలా చూసుకోవాలి. ఇవి పొట్ట చుట్టు ఉన్న కొవ్వును తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. దీనివల్ల రెండు వారాల్లో మీ పొట్ట సైజ్ రెండు ఇంచుల మేరకు తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. వీటిలో ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. అలాగే ఇవి మన శరీరానికి కావాల్సిన ఇరవై అమినో ఆమ్లాలను అందిస్తాయి. ఫైబర్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. అమోఘమైన మినరల్స్ ను కలిగి ఉంటాయి. జీవక్రియ సక్రమంగా కొనసాగేలా చేస్తాయి. ఒమేగా -3, ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్స్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. జనపనార విత్తనాలు విటమిన్ ఇ, భాస్వరం, సోడియం, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, జింక్, ఐరన్ లను కలిగి ఉంటాయి. ఇందులో ఉంటే ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని హానికర యాసిడ్స్ బయటకు వెళ్లేలా తోడ్పడుతాయి. దీంతో మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అంతా కరిగిపోతుంది. మీ స్లిమ్ గా తయారవుతారు.

 మొలకెత్తిన గింజలు 

మొలకెత్తిన గింజల్లో విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. శనగలు, పల్లీలు, పెసర్ల వంటి విత్తనాలకు ప్రత్యేక స్థానం ఇవ్వాలి. చిక్కుళ్లు, సోయా వంటి లెగ్యూమ్ జాతికి చెందిన కూరగాయల విత్తనాలను కూడా మొలకెత్తించినపుపడు మంచి పోషకాహారంగా పనిచేస్తాయి. మనం తీసుకునే ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు ఉంటాయి. ఇవి జీర్ణప్రక్రియ ద్వారా చక్కెరలు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలుగా విడిపోతాయి. ఇవి ఇలా విడిపోవడానికి సహకరించే కొన్ని రకాల ఎంజైమ్‌లు మొలకెత్తిన గింజల్లో ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే ఎంజైమ్‌ల కన్నా మరింత శక్తిమంతంగా పనిచేస్తాయి. శరీరంలోని ఎంజైమ్‌ల చర్యాశీలతను పెంచుతాయి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్‌లపై పనిచేసే అమైలేజ్ ఎంజైమ్ చురుకుదనం మరింత పెరుగుతుంది. కాబట్టి మొలకెత్తిన గింజలను భోజనంలో భాగం చేసుకుంటే జీర్ణప్రక్రియ వేగవంతం అవుతుంది. రెండు వారాల్లో మీరు స్లిమ్ గా తయారువతారు. మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్ బి 30 శాతం, విటమిన్ సి 60 శాతం ఉంటాయి.ఇవి అధిక బరువును తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇవి దోహదం చేస్తాయి. మాంసాహారం నుంచి లభించే కొవ్వును శరీరంలో కలవకుండా చేస్తాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. అందువల్ల ఇవి బరువు తగ్గించుకునేందుకు చక్కగా ఉపయోగపడతాయి. మొలకెత్తిన గింజలను పచ్చిగానే తినాలి. ఉడకబెట్టినా, వేడి చేసినా వాటిలోని పోషకాలు తొలగిపోతాయి. ఈ గింజలకు పచ్చి క్యారెట్లను కలిపి తీసుకుంటే దాని వల్ల బీటా కెరోటిన్ సమృద్ధిగా అందుతుంది. 

వ్యాయామం 

పొట్ట తగ్గాలంటే మీరు వ్యాయామం కూడా బాగా చేయాలి. ప్రారంభంలో ఉదయం పూట కనీసం 20నిమిషాలు తరువాత దశలవారీగా దాన్ని 40-60నిమిషాల దాకా తీసుకెళ్ళాలి. సాధారణ వాకింగ్ 2 వారాల పాటు మానకుండా చేశాక బ్రిస్క్‌వాకింగ్ మొదలు పెట్టాలి. ఆ తర్వాత వాకింగ్, బ్రిస్క్‌వాకింగ్ కలిపి చేయాలి. మరో 2 వారాలు గడిచాక నిపుణుల పర్యవేక్షణలో అబ్డామినల్ క్రంచెస్ ప్రారంభించాలి. వీటిలో విభిన్న రకాలున్నాయి. వీటిలో నుంచి అనువైనవి ఎంచుకుని సాధన చేయాలి. వీటితో పాటుగా సైడ్ బెండ్స్, యోగాసనాలు, లైట్ వెయిట్స్‌తో స్ట్రెంగ్త్ ట్రయినింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి కూడా వీలునిబట్టి అపుడపుడు జత చేస్తుండాలి. రోజుకి 30నిమిషాలతో ప్రారంభించి గంట, గంటన్నర దాకా సమయాన్ని పెంచాలి. ఇలా రెండు వారాలు చేశాక పొట్ట ప్రాంతంలో వచ్చిన మార్పుని, బరువు పరంగా వచ్చిన ఫలితాల్ని బేరీజు వేసుకోవాలి. మరింత మెరుగైన ఫలితాల కోసం ఎక్సర్‌సైజ్ రొటీన్‌లో అవసరమైన మార్పు చేర్పులు చేసుకోవాలి. 

తీపి పదార్థాలకు దూరంగా ఉండండి 

మీరు బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా కొన్ని తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. చక్కెర లేదా తీపి పదార్ధాలు అధికంగా తీసుకోవడం మీరు బరువు పెరుగుతారు. అలాగే చక్కెరను అతిగా తినడం వల్ల శరీరం వినియోగించుకోగా మిగిలింది కాలేయంలో కొవ్వుగా నిల్వ ఉండి పోతుంది. దాంతో కొంత కాలానికి కాలేయం చెడి పోతుంది. స్వీట్స్, తీపిగా ఉండే పానీయాలు వంటి వాటికి కూడా మీరు దూరంగా ఉండాలి. ఇలా చేస్తేనే మీ పొట్ట రెండు వారాల్లో రెండు ఇంచులు తగ్గుతుంది. దీన్ని కంట్రోల్ చేసుకోలేకుంటే మాత్రం కష్టం.

 ఫైబర్ ఎంతో అవసరం 

శరీరానికి ఫైబర్ ఉన్న ఆహార పదర్థాలు చాలా అవసరం. మీరు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, సగ్గుబియ్యం, పప్పుల్లుండేలా చూసుకోండి. వీటిలో ఫైబర్ తప్పక ఉంటుంది. పండ్లు, రొట్టెలు, కూరగాయలు, కందిపప్పు, ఉద్దిపప్పు, పెసరపప్పు, రాజమా మొదలైనవాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. అందువల్ల ఫైబర్‌తో కూడుకున్న ఆహారం తీసుకుంటే మంచిది. అలాగే ఫైబర్ లేనటువంటి ఆహారపదార్థం ఉదాహరణకు మైదాతో చేసిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. భోజన సమయంలో కొన్ని వెజిటేబుల్స్ సలాడ్స్ ను తీసుకోవడం ఉత్తమం. బ్రౌన్ రైస్ మిల్లెట్ వంటి అన్ రిఫైండ్ ధాన్యాలను ఎంచుకోవడం ఉత్తమం. దీంతో బరువును కంట్రోల్లో ఉంటుంది. ఫైబర్ శరీరంలో కొవ్వు ఏర్పడకుండా చేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ను మీ డైట్ లో చేర్చుకుంటే మీ పొట్ట చుట్టు ఉన్న కొవ్వు కూడా ఈజీగా తగ్గుతుంది. 

పండ్లు కూరగాయలు 

తాజా పండ్లు, కూరగాయలు తక్కువ సాచురేటేడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. వీటిని అధికంగా తినటం చాలా మంచిది. ఇందులో కొవ్వు పదార్థాలను తగ్గించే ఫైబర్లు ఫుష్కలంగా ఉంటాయి. రోజులో ఒక్కసారైన వీటని తినటం చాలా మంచిది. చిలగడ దుంప, బ్రోకలీ, ఆపిల్. స్త్రాబెర్రీ, తదితర పండ్లు, కూరగాయాలు ఎక్కువ మొత్తంలో కరిగే ఫైబర్లను కలిగి ఉంటాయి. ఒక రోజులో 8విడతలుగా పండ్లను , పచ్చికూరలన తీసుకోవడం వల్ల జీవనశైలి మెరుగ్గా తయారవుతుంది. అలాగే మీ పొట్ట కూడా ఈజీగా కరిగిపోతుంది.   

పాలపదార్థాలకు దూరంగా ఉండండి 

పాలు, వెన్న, నెయ్యి, పెరుగు ఇలాంటి వాటిలో ఎక్కువ కొవ్వు పదార్థాలుంటాయి. పాల పదార్థాలన్ని శరీరంలో కొవ్వు స్థాయిలను పెంచే అవకాశం ఉంది. పాలలో సాధారణంగా కొవ్వు పదార్దాలు 4 %, పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేట్‌లు) - 4.7 %, మాంసకృత్తులు (ప్రోటీన్‌లు) 3.3 %, నీరు - 88 % ఉంటుంది. ఆవు పాలలో 69 కిలోకేలరీలు, గేదె పాలలో 100 కిలో కేలరీలు, మేక పాలలో 66 కిలో కేలరీలు శక్తి ఉంటుంది. అయితే పొట్ట తగ్గాలంటే మాత్రం పాలు, వాటి సంబంధిత ఆహార పదార్థాలకు కాస్త దూరంగా ఉండడం మంచిది. 

బెర్రీలు బాగా తినండి 

బ్లూ బెర్రీస్, రాస్బెర్రీస్, బ్లాక్ బెర్రీలు అధికంగా ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటాయి. పలు పరిశోధనల ప్రకారం 'బ్లూ బెర్రీస్ తిన్న ఎలుకలు వాటి నడుము చుట్టూ ఉన్న ఫాట్ ని కోల్పోయాయి. అంతేకాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. తక్కువ కొలెస్ట్రాల్స్ ఇందులో ఉంటాయి. రక్తంలోని గ్లూకోస్ ని కూడా ఇవి నియంత్రణలో ఉంచుతాయి. అందువల్ల రెండు వారాల్లో పొట్ట సైజ్ తగ్గాలంటే మీరు తీసుకునే ఆహారంలో బెర్రీలు ఉండేలా చూసుకోండి. 

నట్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి 

మంచి కొవ్వు పదార్థాలు కలిగి ఉన్న ఆహరం వలన శరీరంలో LDL స్థాయిలు తగ్గి HDL వంటి కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. ఫైబర్, గుండెకు ఆరోగ్యాన్ని చేకూర్చే, ఫాట్, విటమిన్ 'E', పొటాషియం, ప్రోటీన్'లను అందించే గింజలను రోజూ తినండి. వీటి వలన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా సహాయం చేస్తాయి. డ్రైనట్స్ బెస్ట్ న్యూట్రీషియన్ స్నాక్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఎప్పటికీ మిస్ చేయకూడదు. ఎందుకంటే వీటిలో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తాయి.

 గ్రీన్ టీ తాగండి

 గ్రీన్ టీ అధిక బరువుని తగ్గించడంలో సూపర్బ్ గా పని చేస్తుంది. శరీరంలో పేరుకున్న కొవ్వుని తొలగిస్తుంది. గ్రీన్ టీ యాంటీ-ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటుంది, వీటిని కాటేచిన్స్ అంటారు. ఇవి కణాలకు హానిచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అలాగే గ్రీన్ టీ శరీరాన్ని సన్నగా ఫిట్ గా ఉంచుతుంది. ఇది జీవక్రియ బాగా సాగేలా చేస్తుంది. ఎక్కువ క్యాలోరిలను కరిగిస్తుంది. త్వరగా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అందువల్ల మీరూ రెండు వారాల పాటు రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తప్పకుండా తాగాలి. ఇలా చేస్తే మీ పొట్ట చుట్టు ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. స్లిమ్ గా తయారవుతారు. 

 అల్లం

 ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అల్లానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్స్, మాంగనీస్, కాపర్ వంటి విలువైన పోషకాలున్నాయి. అలాగే అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది. పొట్ట చుట్టు పేరుకు పోయిన కొవ్వును ఇది ఈజీగా తగ్గిస్తుంది. అల్లంలో ఉండే జింజరాల్ అనే పదార్థం శరీరంలో ఉన్న అధిక నీటిని బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీనివల్ల కొవ్వు కరిగిపోతుంది. అలాగే పొట్టలో పీహెచ్ లెవెల్స్ పెంచడంలోనూ అల్లం సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అల్లం వాటర్ తాగడంతో మంచి ప్రయోజనాలుంటాయి. ఒక లీటర్ నీటిని తీసుకుని ఉడికించాలి. ఒక ముక్క అల్లం తీసుకుని శుభ్రం చేసి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి మరుగుతున్న నీటిలో కలపాలి. మరో 5 నుంచి 10 నిముషాలు ఉడికించాలి. ఆ నీటిని చల్లార్చి, వడకట్టి, తాగాలి. ఈ నీటిని రోజంతా మామూలు నీళ్లు తాగినట్టుగా తాగాలి. క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరంలో కొవ్వు కరిగిపోతుది.

 కార్బొనేటెడ్ డ్రింక్స్ 

కార్బొనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండడం మంచిది. దీనివల్ల కొవ్వు పదార్థాలు పెరగడేకాకుండా ఆరోగ్యాన్ని కూడా బాగా దెబ్బతీస్తాయి. కోలా, చెర్రీ కోలా, క్రీమ్ సోడా, డైట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, గింజర్ ఆలే, గింజర్ (అల్లం) బీరు, గ్రేప్ సాఫ్ట్ డ్రింక్స్ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండడం బెస్ట్. వీటికి బదులుగా మంచి నీరు, తదితర మంచి పానీయాలు తీసుకోవడం మంచిది. వీటికి దూరంగా మీ పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోదు. 

ఆల్కహాల్స్ కు దూరంగా ఉండండి 

మద్యపానంవల్ల ఎన్నో శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు (అల్సర్) రావొచ్చు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. అలాగే అధిక పొట్ట-జీర్ణకోశ వ్యాధులు కలుగుతాయి. ఆల్కహాల్‌లో ఉండే హానికర గుణం వల్ల, అది సంక్రమించే లోప పోషణ వల్ల కాలేయం దెబ్బ తింటుంది. అలాగే ఆరోగ్యంగా దృఢంగా ఉండలేరు. మద్యపానం వల్ల నరాలలో శక్తి తగ్గుతుంది. పోషకాహారం దృష్ట్యా తగిన ఆహారం తీసుకుంటు న్నప్పటికీ, మద్యం తాగడం వల్ల ఎలాంటి ఫలితం ఉండడు. అలాగే మీ పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల ఆల్కహాల్స్కు దూరంగా ఉండండి. 

హైడ్రేటెడ్ గా ఉండండి 

శరీరం నుండి గణనీయ స్థాయిలో ముఖ్యమైన సాల్ట్, మినరల్ లతో పాటుగా ద్రావణాలు కోల్పోకుండా హైడ్రేటెడ్ గా ఉండాలి. చాలామంది డీ హైడ్రేషన్ కు గురవుతుంటారు. అందువల్ల ఎక్కువగా నీటిని తాగాలి. కార్బోహైడ్రేట్ ఆధారిత ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. శరీరంలో నీరు తగ్గిపోకుండా చూసుకోవాలి. శరీంలోని నీరంత చెమట రూపంలో బయట వెళ్తే బాడీ నీటిశాతాన్ని కోల్పోతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు శరీరానికి కావాల్సిన మినరల్స్ ను అందిస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాగే ఇది ఆరోగ్యంగా మీ వెయిట్ లాస్ కావడానికి తోడ్పతుంది.

కామెంట్‌లు లేవు: