15, ఏప్రిల్ 2020, బుధవారం

కంటి చూపు పెరగాలి అంతే సలహాలు

*#కంటిచూపు మెరుగుకు 8 నవీన్ నడిమింటి సలహాలు… ఇలా చేస్తే మీ కళ్లకు రక్షణనిస్తునట్టే*

 సింపుల్ టిప్స్‌ను నిత్యం పాటిస్తూ చ‌క్క‌ని నేత్ర దృష్టిని ఎలా పొంద‌వ‌చ్చో తెలుసుకోండి..! ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న జ‌నాభాలో నేడు అధిక శాతం మంది ఎదుర్కొంటున్న ప్ర‌ధాన అనారోగ్య స‌మ‌స్య‌ల్లో నేత్ర సంబంధ‌మైన‌వి కూడా ఎక్కువ‌గానే ఉంటున్నాయి. ఈ రోజుల్లో అప్పుడే పుట్టిన శిశువుల్లో కూడా ఈ స‌మ‌స్య ఎదుర‌వ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైపోయింది. ఇక యువ‌త‌, పెద్ద‌ల్లో అధిక శాతం మంది చిన్న వ‌య‌స్సులోనే కంటి అద్దాలు, కాంట‌క్ట్ లెన్స్‌లు ధ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వారు నేత్ర సంర‌క్ష‌ణ‌పై దృష్టి సారించాల్సి వ‌స్తోంది. అయితే కింద ఇచ్చిన ప‌లు స‌హ‌జ సిద్ధ‌మైన టిప్స్‌ను పాటిస్తే నేత్ర సంబంధ స‌మ‌స్య ఏదైనా సుల‌భంగా దూర‌మ‌వుతుంది. ఆ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు వెంట‌నే దూర‌మ‌వుతాయి. క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ, బీటా కెరోటిన్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి. ఇవి నేత్ర సంబంధ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాయి. చూపు స్ప‌ష్ట‌త‌ను పెంచుతాయి.
2. నేటి త‌రుణంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూట‌ర్ల వాడ‌కం ఎక్కువైంది. దీనికి తోడు బ‌య‌ట తిర‌గ‌డం, ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటే ఆ ప్ర‌భావం క‌ళ్ల‌పై కూడా ప‌డుతుంది. రోజూ క‌నీసం 3 గంట‌ల పాటు క‌ళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకుంటే ఈ ఒత్తిడి నుంచి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.
3. రోజులో కొంత స‌మయం పాటు ఆహ్లాద‌క‌ర‌మైన ప‌చ్చ‌ని ప్ర‌కృతిని చూడండి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల‌కు ఎంత‌గానో హాయి క‌లుగుతుంది. ఇది నేత్రాల‌కు పూర్తి స్థాయిలో హాయినిస్తుంది.
4. కంటి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌ల‌ను ఎక్కువ‌గ ధ‌రించే వారు రోజులో కొంత స‌మ‌యం పాటు వాటికి దూరంగా ఉండేందుకు య‌త్నించండి. దీని వ‌ల్ల లెన్స్‌ల ద్వారా క‌ళ్ల‌పై ప‌డే ఒత్తిడి త‌గ్గుతుంది.
5. కంప్యూట‌ర్ల‌పై ఎక్కువ‌గా ప‌నిచేసేవారు...
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: