9, ఏప్రిల్ 2020, గురువారం

జుట్టు ఊడి పోవడానికి కారణం తీసుకోవాలిసిన జాగ్రత్తలు


*జుట్టు రాలిపోతోందా..? అయితే ఇలాంటి ఆహారం తీసుకోండి!అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

జుట్టు రాలిపోతోందా..? అసలు కారణమేమిటో తెలుసుకోండి అంటున్నారు వైద్య నిపుణులు. టీనేజ్ అబ్బాయిలను, అమ్మాయిలను కూడా జుట్టు ఊడిపోవడం ప్రధాన సమస్యగా వేధిస్తోంది.

అయితే, ఇలా జుట్టు ఊడిపోవడానికి చాలా కారణాలుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. థైరాయిడ్ సమస్య, చర్మ వ్యాధి, చుండ్రు వంటివి లేనప్పుడు జుట్టు రాలుతుంటే అది తప్పకుండా ప్రోటీన్స్ లోపమేనని గ్రహించాలని వారు సూచిస్తున్నారు.

అందుకే, ప్రోటీన్ పుష్కలంగా వుండే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే.. సోయాబీన్స్, పాల ఉత్పత్తులు, కాయగూరలు, బీన్స్, మాంసాహారం పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా వంటివి కూడా తింటూ వుండాలి.

ఇలా ప్రోటీన్ ఫుడ్డు గనుక మన ఆహారంలో కచ్చితంగా ఉండేలా చూసుకుంటే జుట్టుకి మంచి పోషకాలు లభిస్తాయి. దాంతో, హెయిర్ ఫాలింగ్ (జుట్టు రాలడం) సమస్యను అధిగమించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.వివరాలు కు లింక్స్ లో చూడాలి https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
*👉🏾జుట్టుని కాపాడుకోండిలా*
            జుట్టు రాలుట సమస్య ఉండడం మూలాన తమ “కేశసంపద”ను కోల్పోయి తాము ఉండాలనుకున్న విధంగా ఉండలేకపోతున్నామని భావించి ఈ రోజుల్లో చాలామంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవడం చూస్తున్నాం. సాధారణంగా రోజుకు కొంత జుట్టు రాలడం సహజం. మరలా వీటి స్థానంలో కొత్త జుట్టు రావడం జరుగుతుంది. రోజుకు సుమారుగా 40 నుండి 60 వరకు వెంట్రుకలు రాలుతుంటాయి ఇంత కంటే ఎక్కువగా రాలిపోతుంటే కేశ సంరక్షణకు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
జుట్టు రాలుట, చుండ్రు సమస్యను కొంతమంది బయటకు చెప్పుకోలేక దానినుండి త్వరగా విముక్తి పొందాలని మార్కెట్‌లో లభించే రకరకాల నూనెలు, షాంపులు, సబ్బులు, క్రీములు,లోషన్‌ల పై దృష్టిసారిస్తారు. వీటిపై సరైన అవగాహన లేక ఆశతో వాటిని ఎక్కువగా మార్చి మార్పి వాడటం వలన జుత్తు రాలుట, చుండ్రు తగ్గకపోగా సమస్య ఇంకా తీవ్రమై ఇతర ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది.
కారణాలు : పోషక పదార్థాలున్న ఆహారం తీసుకోకపోవటం. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు. థైరాయిడ్ లోపాలుండటం. మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. నిద్ర లేమితో బాధపడటం. హర్మోన్లు సమతుల్యత దెబ్బతినటం వలన చర్మం ప్రభావితమై జుట్టు రాలును. వెంట్రుకల కుదుళ్ళలో ఏర్పడే ఫంగస్ ఇన్‌ఫెక్షన్ వలన, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వలన శుభ్రంగా ఉంచుకోకపోవుట, కొందరిలో శరీరతత్వం బట్టికూడా చుండ్రు రావడం జరుగుతుంది.
లక్షణాలు : జుట్టు రాలుట అధికంగా ఉన్నప్పుడు విపరీతమైన దురద, జుట్టు పీక్కోవాలనిపించటం, తలలో మంట, చికాకు, వాటితోపాటు తలను దువ్వినప్పుడు తలనుండి తెల్లటి పొట్టు రాలటం ముఖ్యంగా గమనించవచ్చు.
నివారణకు జాగ్రత్తలు : హర్మోన్లు సమతుల్యంగా ఉండటానికి పౌష్టికాహారం తీసుకోవాలి. ఎక్కువగా మొలకెత్తిన విత్తనాలు, పండ్లు , ఆకుకూరలు, వెజిటబుల్స్ తీసుకోవాలి. తలకు వాడే షాంపూ, నూనె, సబ్బులను డాక్టర్ సలహా మేరకే వాడాలి. షాంపూ లేదా ఆయిల్‌ను వెంట్రుకల కుదుళ్లలో, వేళ్లతో నెమ్మదిగా ఎక్కువ సేపు మర్దన చేయటం వలన ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు తలకు ‘టోపీ‘ ధరించడం మంచిది. కొవ్వు, నూనె సంబంధిత పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు.
మానసిక ఒత్తిడి కూడా ‘జుట్టు రాలుట’ పై ప్రభావం చూపుతుంది కావున మానసిక ప్రశాంతతకు ప్రతి రోజు యోగా, వ్యాయామం విధిగా చేయాలి.
చికిత్స : హార్మోనుల సమస్య వలన జుట్టు రాలుట చుండ్రుతో బాధపడే వంటి సమస్యలను రూపుమాపే శక్తి వంతమైన ఔషధాలెన్నో హోమియో వైద్యంలో కలవు. వ్యక్తి మానసిక, వ్యక్తిత్వ, శారీరక లక్షణాలను ఆధారం చేసుకొని వైద్యం చేసినచో 
👉🏾జుట్టు రాలుట సమస్యను త్వరితగతిగా నివారించవచ్చును.
మందులు : 
👉🏾లైకోపోడియం : ఈ మందు యువకుల్లో వచ్చే జుట్టు రాలుట సమస్యకు ముఖ్యమైనది. వీరు మానసికస్థాయిలో దిగులుగా, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ద్వేషం, అహం, పిరికితనం కలిగి ఉంటారు. ముసలితనం ముందుగానే వచ్చినట్లుగా నుదిటిపై ముడుతలు పడుతాయి. ఎవరైనా కృతజ్ఞతలు తెలిపితే వెంటనే కంట తడి పెడుతారు. ఇటువంటి లక్షణాలు ఉండి “జుట్టు రాలుట సమస్య”తో బాధపడే వారు ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చును.
👉🏾ఆర్సినిక్ ఆల్బ్ : తల పొడి పొడిగా వుండి పొట్టు రాలుతూ ఉండును, “మధ్యరాత్రి” దురద, తీవ్రమైన మంట ఉండట గమనించదగిన లక్షణం.
సెపియా : తల మీద ఎప్పటికీ తేమగా ఉండి జుట్టు అధికంగా రాలిపోతుంది. చుండ్రు పొట్టు దువ్వినప్పుడు రాలును, ఈ మందు ఎక్కువగా “స్త్రీలలో” వచ్చే జుట్టు రాలుట సమస్యకు, చుండ్రుకు బాగా పనిచేయును.
👉🏾ఫాస్పరస్ : చుండ్రు అధికంగా ఉండి దువ్వినప్పుడు రాలును, వెంట్రుకలు గుత్తులు, గుత్తులుగా రాలుట ఈ మందులోని ముఖ్య లక్షణం. తలలో “పేను కొరుకుడు ” కు సైతం ఈ మందు ఉపయోగంగా పనిచేయును.
👉🏾తూజా : వెంట్రుకల కొనల చిట్లిఉండి, బిరుసుగా మారును, తలనుండి తెల్లటి పొట్టు రాలుతూ ఉండును. దురద ఎక్కువగా ఉండును. శరీరంపై “వార్ట్స్ ” ( పులిపిరికాయలు ) ఉండి చుండ్రుతో బాధపడే వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. తలలో చుండ్రు అధికంగా ఉండి, పొట్టు, జుట్టు రాలును. దురద, మంట “ఎండ వేడికి ” ఎక్కువ అగును. తలనొప్పి కూడా తీవ్రంగా ఉండుట గమనించదగిన లక్షణం .
కాల్కేరియాకార్బ్: జుట్టు రాలుట సమస్య ఉండటంతో పాటు చుండ్రు “పసుపురంగు” లో ఉండి పొడి పొడిగా రాలును. తలకు రెండువైపుల జుట్టు రాలును. తలకు చెమటలు ఎక్కువగా పడుతుంది. ఈ మందు “ఊబ శరీరతత్వం ” గల వారికి తప్పక ఆలోచించదగినది.
ఆర్నికా మరియు జబోరాంది 👉🏾ఆయిల్స్ : జుట్టు సంరక్షణకు, జుట్టు పెరుగుదలకు, చుండ్రు నివారణకు హోమియో వైద్యంలో ఎక్కువగా ఈ ఆయిల్స్ వాడుతున్నారు. ఆర్నికా లేదా జబోరాంది ఆయిల్స్‌ను వారానికి కనీసం మూడుసార్లు జుట్టు కుదుళ్ళకు చేతి వేళ్లతో మర్దన చేయుట వలన చాలా ప్రయోజనం పొందవచ్చు. ఇవేకాకుండా సల్ఫర్, సోరీనం, లైకోపోడియం, కాం థారిస్, కాలీమోర్, కాలీసల్ఫ్, కాల్కేరి యా ఫాస్ మందులను లక్షణ సముదా యం అనుసరించి వాడితే సత్ఫలితాలు ఉంటాయి. ‘జుట్టు రాలుట, చుండ్రు’ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు వైద్యుని సలహా మేరకే మందులు వాడాలి.
ధన్యవాదములు 🙏🏼
మీ నవీన్ నడిమింటి 
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: