21, ఏప్రిల్ 2020, మంగళవారం

తిప్పతీగ ప్రతి రోజు తినడం వల్ల ఉపయోగం ఏమిటి తెలుసు కొనడం

*తిప్పతీగ ఆరోగ్య ప్రయోజనాలు... కానీ ఎలాంటివారు వాడకూడదు...? అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. తిప్పతీగను కషాయంలా చేసుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. తిప్పతీగలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
 
1. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలవు. అలాగే శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పని చేస్తుంది.
 
2. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే చాలు... అజీర్తి సమస్య పోతుంది. 

3. తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్‌గా పని చేస్తుంది. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు.
 
4. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయి. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి.
 
5. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది. కీళ్లవ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి. తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకుని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల బారి నుంచి బయటపడొచ్చు. ఆ పాలలో కాస్త అల్లం కలుపుకుని కూడా తాగొచ్చు.
 
6. తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తిప్పతీగతో తయారుచేసిన మందులను వాడకూడదు.

బరువు తగ్గడానికి తిప్పతీగ: తిప్పతీగ హైపోలిపిడెమిక్ చర్యలను కలిగి ఉంటుంది, దీనిని  క్రమముగా వినియోగిస్తే బరువు తగ్గుదలలో అద్భుతముగా పనిచేస్తుంది. ఇది జీర్ణాశయ  ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు కాలేయాన్ని రక్షిస్తుంది.
జ్వరం కోసం తిప్పతీగ: తిప్పతీగలో రోగ నిరోధక చర్యలు మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది డెంగ్యూ జ్వరము వంటి సాధారణ సూక్ష్మజీవుల కారణంగా వచ్చే  అంటువ్యాధుల నుండి రక్షిస్తుంది.
డయాబెటీస్ కోసం తిప్పతీగ: తిప్పతీగ మధుమేహం కోసం ప్రభావవంతమైనది ఎందుకంటే ఇది ఇన్సులిన్ నిరోధకత మెరుగుపరచడం ద్వారా రక్తంలో గ్లూకోస్ స్థాయిలను తగ్గించడంలో    సహాయపడుతుంది.
శ్వాసకోశ వ్యాధులకు తిప్పతీగ: దీర్ఘకాలిక దగ్గు, అలెర్జిక్ రినిటిస్ చికిత్సలో తిప్పతీగ ప్రభావవంతమైనదిగా గుర్తించారు మరియు ఉబ్బసం యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడవచ్చు.
మహిళలకు తిప్పతీగ: దాని రోగనిరోధక-పెంచే లక్షణాల కారణంగా, ఋతుక్రమం ఆగిపోయిన మహిళలకు తిప్పతీగ ఒక గొప్ప ఉపయోగకరమైన మూలిక. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు  బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
పురుషుల కోసం తిప్పతీగ: తిప్పతీగ యొక్క ఉపయోగం లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది మరియు పురుషులలో లైంగిక కోరికను పెంచుతుంది.
క్యాన్సర్కు తిప్పతీగ: కొన్ని అధ్యయనాలు దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల క్యాన్సర్ చికిత్సలో తిప్పతీగ వాడకాన్ని ప్రతిపాదించారు.
మానసిక ఆరోగ్యానికి తిప్పతీగ: తిప్పతీగను సాధారణంగా ఆందోళన, నిరాశ మరియు ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితుల నిర్వహణకు ఉపయోగిస్తారు.
తిప్పతీగను ఎలా ఉపయోగిస్తారు - How giloy is used in Telugu
తిప్పతీగ కాండం లేదా ఆకును కషాయము రూపంలో తీసుకోవచ్చు కానీ సాధారణంగా దీనిని పొడి రూపంలో ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యుడు సూచించినట్లయితే తిప్పతీగ మాత్రలు, క్యాప్సుల్స్, మరియు తిప్పతీగ రసం వంటి ఇతర ఉత్పత్తులు తీసుకోవచ్చు. మీరు ఈ మూలిక యొక్క రుచిని ఇష్టపడకపోతే, దానిని మూలికల టీ రూపంలో కొనుగోలు చేయవచ్చు.

తిప్పతీగ మోతాదు - Giloy dosage in Telugu
ఆయుర్వేద వైద్యుల ప్రకారం, 1-2 గ్రా తిప్పతీగ కాండం లేదా ఆకు పొడి మరియు 5 మి.లీ. వరకు తిప్పతీగ కాండం లేదా ఆకు రసాన్ని దాని దుష్ప్రభావాల గురించి చాలా చింతించకుండా తీసుకోవచ్చు. ఏమైనప్పటికీ, ఆరోగ్య ఔషధంగా తిప్పతీగను తీసుకోవటానికి ముందు ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించడం మంచిది.

తిప్పతీగ దుష్ప్రభావాలు - Giloy side effects in Telugu
తిప్పతీగ ఒక సమర్థవంతమైన హైపోగ్లైసిమిక్ ఏజెంట్ (రక్త చక్కెర తగ్గింపు), కాబట్టి మీరు ఔషధాలు వాడుతున్న డయాబెటిక్ వ్యక్తి అయితే, ఏ రూపంలో ఐన తిప్పతీగను తీసుకోవటానికి ముందు మీ వైద్యుడిని తనిఖీ చేయడమే మంచిది.
గర్భం ధరించినా లేదా చనుబాలిచ్చు సమయంలో తిప్పతీగ యొక్క సంభావ్య ప్రభావాలు గురించి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి గర్భిణీ మరియు చనుబాలిచ్చు స్త్రీలు ఏ రూపంలోనూతిప్పతీగను ఉపయోగించటానికి ముందు వారి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి
తిప్పతీగ మీ రోగనిరోధక వ్యవస్థను మరింత చురుకుగా పనిచేయటానికి ఉద్దీపన చేయగల ఒక అద్భుతమైన రోగనిరోధక సూత్రం. కాబట్టి, మీరు ఆటోఇమ్యూన్(autoimmune) వ్యాధితో బాధపడుతున్నట్లయితే, తిప్పతీగను తీసుకునే ముందు తీసుకోవాలా లేదా అని మీ వైద్యుడిని అడగండి.

(మరిన్ని కొత్త విషయాలకూ

https://vaidyanilayam.blogspot.com/పైన చెప్పిన ఆకు రసం తో పతంజలి షాప్ లో సిరప్ 
రూపం లో లభించును 

డాక్టర్ సలహా ల కొరకు  సంప్రదించండి. లో చూడండి)
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
 
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: