నాలుగు నెలల గర్భం అంటే మీరు గర్భధారణ యొక్క మొదటి త్రైమాసికం నుండి విజయవంతంగా ముందుకు వచ్చారు మరియు రెండవ త్రైమాసికంలో ప్రవేశిస్తున్నారు, ఇది నాల్గవ నెల నుండి ప్రారంభమవుతుంది. మీరు శరీరంలోని కొన్ని మార్పులను అంగీకరించిన సమయం ఇది మరియు ఈపాటికి మీరు గర్భవతి అనే వాస్తవం నిర్దారితమవుతుంది. స్త్రీ తన నాల్గవ నెల గర్భం గురించి చాలా సంతృప్తి పొందుతుంది. ఈ నెలలో ‘మార్నింగ్ బ్లూస్’ (ఉదయపు వికారాలు) తగ్గిపోతాయి మరియు మీరు శారీరకంగా మరియు మానసికంగా మునపటి కంటే సౌకర్యమైన అనుభూతి చెందుతారు.
నాల్గవ నెల మీకు మరియు మీ గర్భంలోని శిశువుకి సౌకర్యవంతమైన సమయం, అయితే ఈ నెలలో పిండంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు కూడా జరుగుతాయి, అందువలన మీ ఆరోగ్యం, ముఖ్యంగా మీ ఆహారం పట్ల అధిక జాగ్రత్త వహించాలి. మీకు సహాయపడే కొన్ని ఆహార చిట్కాలు, గర్భ పరీక్షలు, అల్ట్రాసౌండ్లు మరియు ఈ నెలలో మీకు సౌకర్యాన్ని కలిగించే కొన్ని విషయాలను ఈ వ్యాసం తెలియజేస్తుంది. ఈ నెలలో పిండం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి గురించి కూడా ఇది మీకు తెలియజేస్తుం
నాల్గవ నెల గర్భిణీ యొక్క లక్షణాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు - 4 months pregnant symptoms
4 నెలల గర్భంలో శిశువు
మీ శరీరంలో 3 నెలలు గడిపిన తరువాత, ఇప్పటికే శిశువు కడుపులో చాలా సౌకర్యంగా ఉంటుంది. శిశివు దాదాపు పూర్తిగా ఏర్పడుతుంది. ప్రధాన అవయవాలు అభివృద్ధి చెందుతాయి మరియు మాయ (ప్లాసెంటా) నుండి సరైన పోషకాల సరఫరాను కలిగి ఉంటుంది; దాని స్వంత రక్త నాళాలు ఏర్పడతాయి; శిశివులో కండరాలు, చిన్న చిన్న ఎముకలు మరియు అవయవాలు కూడా అభివృద్ధి చెందుతాయి. జననేంద్రియ (లైంగిక) అవయవాలు కూడా ఏర్పడతాయి మరియు ఈ దశలో లింగాన్ని నిర్దారించవచ్చు, కానీ, ఇది భారతదేశంలో నేరం. నాల్గవ నెలలో మీ శిశువు అభివృద్ధి గురించి వాస్తవికంగా తెలుసుకుందాం.
ఉదయపు అనారోగ్యం యొక్క లక్షణాలు ఇకపై మిమ్మల్ని బాధించవు, అంటే మీరు ఎటువంటి మార్పులను అనుభవించరు అని అర్ధం కాదు. మీ శరీరం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న శిశువుకి సరైన స్థానం కల్పించడానికి వివిధ మార్పులకు గురవుతూ ఉంటుంది. గర్భం యొక్క నాల్గవ నెలలో ఈ కింద ఇవ్వబడినవి జరుగుతాయి:
- వికారం తగ్గుతుంది. కాని, గుండెల్లో మంట, మలబద్ధకం మరియు ఉబ్బరం వంటివి ఇంకా కొనసాగుతాయి.
- ఇప్పటికే మీరు కొంత బరువు పెరిగి ఉంటారు మరియు ఈ నెలలో మరికొంచెం వేగముగా బరువు పెరగడం కొనసాగుతుంది. మొత్తం మొదటి త్రైమాసికంలో, మీరు సుమారు 2 కిలోల బరువు పెరిగి ఉండవచ్చు, కాని నాల్గవ నెలలో దానికి సమానమైన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్పష్టంగా మీ కడుపు కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది, అది కొద్దిగా ‘ప్రెగ్నెన్సీ బంప్’ ఆకారాన్ని ఇస్తుంది. మీకు కాస్త నొప్పిగా కూడా అనిపించవచ్చు.
- ఈ నొప్పి మీ వెనుక భాగంలో కూడా కలుగవచ్చు, సాధారణంగా ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం. నాల్గవ నెలలో హేమోరాయిడ్స్ లేదా మొలల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి, ఏదైనా అటువంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
- మీరు బరువు పెరిగేకొద్దీ, మీ వక్షోజాలు కూడా పెరుగుతూ ఉంటాయి. మీ పెరుగుతున్న వక్షోజాలకు అనుగుణంగా మీరు కొన్ని మంచి లోదుస్తులను కొనవల్సి ఉంటుంది. నాల్గవ నెలలో, చనుమొనలు ముదురు రంగులోకి మరియు సున్నితంగా మారుతాయి. మీ వక్షోజాలు మరింత సున్నితంగా మరియు నొప్పిగా అనిపిస్తాయి.
- కొందరు శ్వాస ఆడకపోవడాన్ని కూడా అనుభవించవచ్చు మరియు మరికొందరు ముక్కు నుండి రక్తస్రావం లేదా చిగుళ్ళ రక్తస్రావం లేదా ముక్కు సమస్యలను అనుభవిస్తారు. ఇవి ప్రధానంగా రక్త ప్రవాహం పెరిగిన కారణంగా కలుగుతాయి.
- నాడీ సంబంధమైన (వాస్కులర్) మార్పుల కారణంగా, కొన్నిసార్లు మగతగా కూడా అనిపించవచ్చు.
సానుకూల మార్పులు
- వికారం మరియు అలసట తగ్గడం వలన, మీకు ఖచ్చితంగా శక్తివంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు, మీరు రోజులో ఎక్కువగా నిద్రపోకుండా ఉండగలరు మీ కోసం మీరు కొద్దిగా సమయం ఇవ్వగలగుతారు. ఆటవిడుపు కోసం ఏదైనా క్లబ్‌లో చేరండి, పుస్తకాలు చదవండి, వాకింగ్ కు వెళ్లండి, వ్యాయామం చేయండి, మీకు నచ్చినది చేయవచ్చు.
- శక్తివంతంగా అనిపించడం వలన, సంతోషంగా ఉంటుంది. మీరు తల్లి (అంటే ఖచ్చితంగా) అవుతున్నారని మీరు సంతోషంగా ఉంటుంది, మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులందరికీ ఈపాటికి తెలుస్తుంది. అలాగే, వికారం తగ్గడం వలన, ఆహార వెగటు కూడా ఉండదు మరియు ఎక్కువ ఆహార కోరికలను కలుగుతాయి.
- కొత్త బలము మరియు శక్తి మీ సెక్స్ డ్రైవ్‌ను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది (సానుకూలంగానే). మీ భాగస్వామితో మరింత మంచి లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చు, ఇప్పుడు, మీరు శిశువు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శిశువు మీ గర్భాశయంలోనే సురక్షితంగా ఉంటుంది మరియు దళసరిగా ఉన్న లైనింగ్‌లు (పొరలు) దాన్ని రక్షిస్తాయి.
(మరింత చదవండి: గర్భధారణ సమయంలో సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు) - మీకు మరింత మాతృత్వ భావన కలుగుతుంది మరియు శిశువు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ బిడ్డకు కావలసిన వస్తువులు మరియు బట్టలు మరియు ఆహారాలు, మీరు ఏది చుస్తే దానిని కొనడం ప్రారంభిస్తారు. మీరు ఇప్పటికే శిశువు పేర్ల గురించి ఆలోచించడం మొదలు పెడతారు?
4 నెలల గర్భంలో శిశువు - 4 months pregnancy baby
మీ శరీరంలో 3 నెలలు గడిపిన తరువాత, ఇప్పటికే శిశువు కడుపులో చాలా సౌకర్యంగా ఉంటుంది. శిశివు దాదాపు పూర్తిగా ఏర్పడుతుంది. ప్రధాన అవయవాలు అభివృద్ధి చెందుతాయి మరియు మాయ (ప్లాసెంటా) నుండి సరైన పోషకాల సరఫరాను కలిగి ఉంటుంది; దాని స్వంత రక్త నాళాలు ఏర్పడతాయి; శిశివులో కండరాలు, చిన్న చిన్న ఎముకలు మరియు అవయవాలు కూడా అభివృద్ధి చెందుతాయి. జననేంద్రియ (లైంగిక) అవయవాలు కూడా ఏర్పడతాయి మరియు ఈ దశలో లింగాన్ని నిర్దారించవచ్చు, కానీ, ఇది భారతదేశంలో నేరం. నాల్గవ నెలలో మీ శిశువు అభివృద్ధి గురించి వాస్తవికంగా తెలుసు
4 నెలల గర్భిణీ శిశువు పరిమాణం - 4-month pregnant baby size
నాల్గవ నెల ప్రారంభంలో పిండం 7 సెంటీమీటర్లు పొడవు ఉంటుంది మరియు నాల్గవ నెల చివరి నాటికి దానికి రెట్టింపు పెరుగుతుంది, అప్పుడు 14 సెం.మీ పరిమాణంలోకి పెరుగుతుంది.
నాల్గవ నెలలో శిశువు అభివృద్ధి - Baby development 4 months
శిశువు 4 నెలల్లో పెరుగుతూ మరియు పరిపక్వం చెందుతూ ఉంటుంది. ప్రధాన అవయవాలు ఇప్పటికే ఏర్పడతాయి. అవి మరింతగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కనురెప్పలు ఏర్పడతాయి మరియు కళ్ళకు పైన కలుస్తాయి. శరీర వెంట్రుకలతో పాటు కనుబొమ్మలు మరియు కనురెప్ప వెంట్రుకలు కూడా ఏర్పడతాయి.
అప్పటికే ఏర్పడిన చేతి వేళ్లు మరియు కాలి వేళ్ల మీద గోర్లు పెరగడం ప్రారంభిస్తాయి మరియు పిండం రుచి మొగ్గలను కూడా అభివృద్ధి చేస్తుంది. శిశువు యొక్క శరీరం అభివృద్ధి మరియు పెరుగడం కొనసాగిస్తుంది, ఇది మునుపటి పెద్ద తల మరియు చిన్న శరీరం యొక్క రూపాన్ని తగ్గిస్తుంది.
అలాగే, ఈ సమయంలో పిండం హృదయ స్పందన యొక్క శబ్దం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది మరియు అల్ట్రాసౌండ్ స్కానర్ సహాయంతో దానిని వినవచ్చు.
4 నెలల గర్భంలో శిశువు కదలికలు - 4 months pregnant baby movements
పిండం నాల్గవ నెలలో కదలడం ప్రారంభిస్తుందా? అవును. ఖచ్చితంగా. మీరు వీటిని అనుభవించవచ్చు లేదా అనుభవించకపోవచ్చు.
పిండం మీలాగే నాల్గవ నెలలో చాలా చురుకైన స్థితిలో ఉంటుంది. పిండం యొక్క అతిచిన్న కదలికలలో దాని బొటనవేలును పీల్చటం వంటివి ఉంటాయి, ఇది పుట్టిన తరువాత పాలు పీల్చడానికి అభివృద్ధికావలసిన ముఖ్యమైన నైపుణ్యం. పిండం గర్భంలో ఈత కొట్టడం వంటి శక్తివంతమైన కదలికలను కూడా చేయగలదు.
నాల్గవ నెల పిండంలో, ఏడుపు లేదా ఎక్కిళ్ళు వంటి కొన్ని ఇతర విధులు కూడా అభివృద్ధి చెందుతాయి.
గర్భధారణ యొక్క 4 వ నెలలో ఆహారం - 4th month of pregnancy diet
పిండం యొక్క అన్ని విధాల అభివృద్ధి సాధారణంగా జరిగేందుకు నాల్గవ నెలలో సరైన ఆహారం తీసుకోవడం ఒక ముఖ్యమైన అంశం. గర్భధారణ సమయంలో మీ శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది మరియు దానికి అనుగుణంగా మీ ఆహారం కూడా తప్పనిసరిగా మారాలి. 4 నెల కోసం కొన్ని ఆహార అవసరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
కేలరీలు తీసుకోవడాన్ని పెంచండి
గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో, మీరు మీ గర్భవతి కాక ముందు తీసుకునే కెలరీలకు సమానమైన కేలరీలను తీసుకోవాలి (ఆహార కోరికలను మినహాయించి). కానీ, నాల్గవ నెల, రెండవ త్రైమాసికంలో ప్రారంభాన్ని సూచిస్తుంది కాబట్టి, మీరు తీసుకునే కేలరీలను పెంచడం కూడా చాలా ముఖ్యం.
నాల్గవ నెలలో కనీసం 2200 కేలరీలు తీసుకోవాలని మీరు సిఫార్సు చేయబడింది మరియు మీ శరీర అవసరాలను బట్టి ఇంకా ఎక్కువ కూడా అవసరం కావచ్చు.
దీని కోసం, సమతుల్య ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన వనరుల నుండి అధిక కేలరీలను తీసుకోవడం మరియు తర్వాత విభాగాలలో చర్చించిన ఆహారాలని ప్రత్యేకంగా చేర్చడం చేయడం మంచిది.
(మరింత చదవండి: భారతీయ ఆహారాల కోసం క్యాలరీ చార్ట్)
ఫైబర్ తీసుకోవడం పెంచండి
నాల్గవ నెలలో మలబద్ధకం ఒక పెద్ద సమస్య కాబట్టి, కరిగే (soluble) మరియు కరగని (insoluble) రెండు రకాల డైటరీ ఫైబర్లను ఆహారంలో ఎక్కువగా చేర్చడం చాలా ముఖ్యం. జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు మలబద్దకాన్ని నివారించడంలో ఫైబర్ల యొక్క సామర్ధ్యత రుజువు చేయబడింది. అలాగే, అవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఇది ఏమి తోచక ఏదోకటి తినాలనే ఆహార కోరికలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఆహారంలో ఎక్కువ ఫైబర్స్ చేర్చడానికి, సాధ్యమైనప్పుడల్లా ఎక్కువ తృణధాన్యాలు, తాజా పండ్లు మరియు కూరగాయలను అధికంగా తీసుకోండి.
ఎక్కువ నీరు తీసుకోండి
ఇది ఫైబర్స్ యొక్క సమీకరణకు సహాయపడుతుంది మరియు రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు కనీసం 2-3 లీటర్ల నీరు తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. మీ బరువు మరియు శారీరక శ్రమ స్థాయిని బట్టి మీకు మరింత ఎక్కువ నీరు అవసరం కావచ్చు.
మీ ఆహారంలో ఎక్కువ ఐరన్ ను చేర్చండి
ఐరన్ లోప రక్తహీనతను నివారించడానికి గర్భధారణ సమయంలో ఐరన్ తీసుకోవడం చాలా అవసరం. రక్తం ఏర్పడటానికి ఐరన్ ముఖ్యమైనది, పిండానికి పోషణను అందించడానికి మరియు అసాధారణతలను నివారించడానికి ఇది అవసరం. అలాగే, ఐరన్ లోపం ముందస్తు ప్రసవం, తక్కువ జనన బరువు మరియు ఇతర క్రమరాహిత్యాలతో ముడి పడి ఉంటుంది.
పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి గర్భధారణ సమయంలో 30 నుండి 60 మి.గ్రా ఐరన్ తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తుంది.
ఆకుకూరలు, గింజలు (నట్స్), కాయధాన్యాలు, తృణధాన్యాలు మరియు చిక్కుళ్ళు వంటి ఆహార వనరులను మీ ఆహారంలో చేర్చడం ద్వారా దీనిని సాధించవచ్చు.
ఈ సహజ మొక్కల వనరుల ద్వారా ఐరన్ వినియోగాన్ని పెంచేటప్పుడు, దాని శోషణను సులభతరం చేయడానికి విటమిన్ సి ని కూడా ఆహారంలో చేర్చాలి.
ప్రోటీన్లను తీసుకోండి
ప్రోటీన్లు శరీరం యొక్క బిల్డింగ్ బ్లాక్లు, ఇది గర్భధారణ సమయంలో ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం.
గర్భధారణ సమయంలో పాలు మరియు ప్రోటీన్లను ఆహారంలో చేర్చడం అనేది పిండం పెరుగుదలను ప్రోత్సహిస్తుందని మరియు వాటి లోపం పెరుగుదల ఆగిపోవడానికి కారణమవుతుందని పరిశోధన ఆధారాలు సూచిస్తున్నాయి. నాల్గవ నెలలో శిశువు వేగంగా పెరుగుతుంది కాబట్టి, మీరు తగినంత ప్రోటీన్లను తీసుకోవడం చాలా ముఖ్యం.
అయితే, మీ ఆహారంలో ప్రోటీన్లను తగినంతగా మాత్రమే చేర్చాలని మరియు ప్రతి రోజు 65 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదని సిఫార్సు చేయబడింది. గర్భధారణ సమయంలో అధిక ప్రోటీన్ వినియోగం కూడా పిండం పెరుగుదలను ఆలస్యం చేస్తుంది.
ఫోలిక్ యాసిడ్
ఫోలిక్ యాసిడ్ న్యూరల్ ట్యూబ్ ఏర్పడటంలో పాల్గొంటుంది మరియు ఈ విటమిన్ లోపం న్యూరల్ ట్యూబ్ అసాధారణతలకు కారణమవుతుంది. అయితే, అభివృద్ధి ఇప్పటికే పూర్తయినందున సాధారణంగా గర్భధారణ యొక్క నాల్గవ నెలలో ఇది అవసరం ఉండదు.
కాల్షియం
పిండం ఎముకల పెరుగుదలను సులభతరం చేయడానికి మీ ఆహారంలో కాల్షియం చేర్చడం చాలా అవసరం, అయితే అదనపు సుప్ప్లీమెంటేషన్ అవసరం లేదు.
నివారించాల్సిన ఆహారాలు
పచ్చి లేదా సరిగ్గా వండని గుడ్లు మరియు పప్పరోని, సలామి, హాట్‌డాగ్స్ వంటి పచ్చి లేదా కోల్డ్ ప్రాసెస్ చేసిన మాంసాలు ఎందుకంటే ఇవి పరాన్నజీవులను వ్యాప్తి చేసి అంటువ్యాధులకు కారణమవుతాయి. అలాగే సీఫుడ్, సుషీ, ట్యూనా, చీజ్, పచ్చి పాలు, కాలేయం, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను కూడా నివారించాలి. ఇది కాకుండా, అదనపు కెఫిన్ తీసుకోవడం తక్కువ జనన బరువుతో ముడిపడి ఉన్నందున అదనపు కెఫిన్ లేదా గ్రీన్ / హెర్బల్ టీ వినియోగాన్ని నియంత్రణలో ఉంచాలి. కాబట్టి, రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ టీ లేదా కాఫీ త్రాగకూడదు.
గర్భం యొక్క 4 వ నెలలో వ్యాయామం చేయండి - Exercise during the 4th month of pregnancy
గర్భధారణ యొక్క నాల్గవ నెలలో వ్యాయామం చేయడం పూర్తిగా సురక్షితం. మీరు ఇప్పుడు మరింత శక్తివంతం అయినందున, మీరు చురుకైన నడక, సైక్లింగ్, ఈత, జాగింగ్ లేదా యోగా వంటి వివిధ రకాల శారీరక వ్యాయామాలను ఎంచుకోవచ్చు. మీరు గర్భధారణకు ముందు శారీరకంగా చురుకుగా (వ్యాయామాలు చేస్తూ ఉంటే) ఉంటే, శిక్షకులని సంప్రదించి మీరు అదే దినచర్యను తిరిగి ప్రారంభించవచ్చు. అయితే, మీరు వ్యాయామం కొత్తగా ప్రారంభిస్తే, ప్రతిరోజూ 30 నిమిషాల సెషన్‌ను ప్రారంభించడం ద్వారా మీ దినచర్యను ప్రారంభించండి, ఆపై క్రమంగా ఆ వ్యవధిని పెంచండి.
గర్భధారణ మధుమేహం మరియు గర్భధారణ రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు అధిక బరువును నివారించడానికి వ్యాయామం సహాయపడుతుంది. మలబద్దకం మరియు ఇతర జీర్ణ సమస్యలను తొలగించి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది.
అయినప్పటికీ, నొప్పి, తలనొప్పి, మైకము, ఊపిరి ఆడకపోవడం, అలసట, వాపు, కండరాల బలహీనత లేదా యోని స్రావాలు వంటి లక్షణాలు కనిపిస్తే, మీరు వ్యాయామం ఆపివేసి వైద్యుడిని ఒకసారి సంప్రదించాలి.
నాల్గవ నెలలో నిర్ధారణ పరీక్షలు - Diagnostic tests during the fourth month of pregnancy
12 వ వారంలో చేయకపోతే, నాల్గవ నెలకు మరియు 12వ వారానికి కలిపి ఒక స్క్రీనింగ్ పరీక్ష సిఫార్సు చేయబడింది. దీనిని 16 వ వారంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో పిండం యొక్క అసాధారణతలు మరియు అంటువ్యాధులను గుర్తించడానికి అల్ట్రాసౌండ్ మరియు తల్లి రక్త పరీక్షలు ఉంటాయి. శిశువు యొక్క స్థానాన్ని గుర్తించడంలో కూడా అల్ట్రాసౌండ్ సహాయపడుతుంది.
నాల్గవ నెలలో, ఈ అల్ట్రాసౌండ్ల సహాయంతో పిండం గుండె చప్పుడును కూడా గుర్తించవచ్చు.
4 వ నెల గర్భంలో టీకాలు వేయడం - Vaccination during the 4th month of pregnancy
మీరు ఇంతకు ముందు టీకాలు వేయించుకోకపోతే గర్భధారణ సమయంలో టీకాలు వేయించుకోవడం చాలా ముఖ్యం. వాక్సినేషన్ వలన పిండానికి కూడా యాంటీబాడీలు చేరతాయి కాబట్టి ఇది మిమ్మల్ని మరియు మీ బిడ్డను రక్షించడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో ఇది సురక్షితమైనప్పటికీ, టీకాల వలన వాపు, నొప్పి లేదా జ్వరం వంటి సమస్యలు కలుగుతాయి, కాబట్టి, ఒకసారి మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.
శిశువులలో వీటిని నివారించడానికి వీలైనంత త్వరగా ఫ్లూ (ఇన్ఫ్లుఎంజా) మరియు కోరింత దగ్గుకు టీకాలు వేయించుకోవడం మంచిది. ఇది శిశువులకు టీకాలు వేసే సమయం వరకు వారికి రక్షణ కల్పిస్తుంది. ఫ్లూ షాట్ న్యుమోనియా వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదం నుండి శిశువులను రక్షిస్తుంది.
గర్భం నాల్గవ నెలలో: చేయవలసినవి మరియు చేయకూడనివి - Pregnancy fourth month:
గర్భధారణ సమయంలో ఏమి చేయాలో మరియు వీటిని నివారించాలో తెలిపే జాబితా ఇక్కడ ఉంది.
చేయవలసినవి
- సమతుల్య ఆహారం తీసుకోండి
- క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యండి
- పనికి వెళ్ళండి
- సెక్స్ చేయండి
- శారీరకంగా చురుకుగా ఉండండి
- మీకు ఇష్టమైన అభిరుచిని ఎంచుకోండి
- స్నేహితులతో బయటకు వెళ్ళండి
- సపోర్టివ్ బ్రా ధరించండి
- అల్ట్రాసౌండ్ మరియు రక్త పరీక్ష క్రమం తప్పకుండా చేయించుకోండి
- మీ వైద్యుడిని క్రమం తప్పకుండా సంప్రదించండి
- కడుపులో మరియు వెనుక భాగంలో నొప్పి ఉన్నట్లయితే మీ వైద్యుడిని వెంటనే సంప్రదించండి
- బేబీ షాపింగ్‌కు వెళ్లండి
చేయకూడనివి
- కేలరీలను పరిమితం చెయ్యడం
- నిశ్చల (కదలకుండా ఉండే) జీవనశైలి
- తీవ్రమైన శారీరక శ్రమ చేయడం
- తప్పు సైజ్ బ్రా ధరించడం
- డాక్టర్ అప్పోయింట్మెంట్లను నివారించడం
- విటమిన్లు లేదా ఫోలిక్ యాసిడ్ వంటి సూచించని మందులు తీసుకోవడం
- ప్రోటీన్లను అధికంగా వినియోగించడం
- పచ్చి మాంసాలు, చేపలు మరియు గుడ్లతో కూడిన మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం
- తినడానికి ముందు పండ్లు కడగకుండా వినియోగించడం
- శిశువు పుట్టడానికంటే ముందు లింగ నిర్దారణ చేయడం
- గృహ నివారణ చిట్కాలు లేదా మూలికా ఔషధాలను అధికంగా ఉపయోగించ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి