పైల్స్‌కు హోమియో మందులు
పైల్స్‌కు హోమియో మందులు
గర్భిణుల్ని బాధించే పైల్స్ సమస్య స్త్రీలల్లో గర్భం దాల్చిన తరువాత ఎక్కువగా కనిపిస్తుంటుంది. గర్భం దాల్చక ముందు లేని సమస్య గర్భం దాల్చిన తరువాత రావటానికి గల కారణం హార్మోనుల ప్రభావం, బరువ్ఞ పెరుగుట, గర్భాశయం పరిమాణం పెరుగుట. గర్భిణుల్లో సాధారణంగా ప్రొస్టోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉండి శరీరంలోని రక్తనాళాలు కొద్దిగా వ్యాకోచం చెంది ఉంటాయి. ఇలాగే మల ద్వారం వద్ద ఉన్న రక్తనాళాల పరిమాణం పెరిగి అవి ఉబ్బినట్లు అయి పైల్స్ (మొలలు)కు దారి తీయును.
గర్భిణుల్లో గర్భాశయం పరిమాణం పెరుగుట వలన అంతర్గత ఒత్తిడి మూలాన మలబద్ధకం ఏర్పడుతుంది. దీంతో మలవిసర్జనకు బలవంతంగా ప్రయత్నం చేయుట వలన కూడ పైల్స్ సమస్య ఉత్పన్నమవ్ఞతుంది. ఇంతగా బాధించే పైల్స్ సమస్యను బయటకు చెప్పుకోలేక చాలా మంది లోలోన మధన పడుతుంటారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. పైల్స్ (హీమరాయిడ్స్)లను సాధారణంగా అర్షమొలలు అంటారు. పైల్ అంటే గడ్డ అని హీమరాయిడ్ అంటే రక్తస్రావం కావడం అని అర్ధం. మొలలు చూడటానికి పిలకలుగా కనబడినా, రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా కనిపిస్తాయి.
లక్షణాలు:
మల విసర్జన సాఫీగా జరుగక తీవ్రమైన నొప్పి, మంట ఉంటుంది. అప్పుడప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి, మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.
జాగ్రత్తలు:
పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4 నుండి 5 లీటర్లు). రోజు మల విసర్జన సాఫీగా జరుగునట్లుగా చూసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్ వేపుళ్లు, మాంసాహారం, చిరుతిండ్లు తినటం మానుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి.
చికిత్స:
వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. వ్యాధి ఆరంభంలోనే హోమియో మందులను వాడుకుని ప్రయోజనం పొందవచ్చును. హోమియో వైద్య విధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో కూడి ముడిపడి ఉంటుంది. మందుల ఎంపికలో కూడా మానసిక శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకొని మందులను సూచించడం జరుగుతుంది కనుక సమూలంగా పైల్స్ వంటి సమస్య నుండి విముక్తి పొందవచ్చును.
నక్స్‌వామికా:
శారీరక శ్రమ లేకుండా, మలబద్ధకంతో బాధపడుతూ తరుచుగా మలబద్ధకం నివారణ మాత్రలు వాడే వారికి ఈ మందు ఆలోచించదగినది. అలాగే తరుచుగా మల విసర్జన చేయాలనిపించడం, తీరా మలవిసర్జనకు వెళితే మలం సాఫీగా జరుగక బాధాకరంగా అనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి. అస్కులస్‌హిప్: మల ద్వారం పొడిగా ఉండి నొప్పిగా అనిపిస్తుంది. ఆసనంలో పుల్లలు గుచ్చుతున్నట్లుగా ఉంటుంది. విరేచనానికి వెళ్లాలంటేనే భయపడి పోతారు. విరేచనం తరువాత కూడా నొప్పిగా బాధగా అనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక గుర్తుంచుకోదగినది. సల్ఫర్: పైల్స్ వ్యాధి నయం చేయుటలో ఈ మందు అతి ముఖ్యమైనది. చాలా కేసులలో ఈ మందును వాడి పైల్స్ వ్యాధి నుండి విముక్తి పొందటం జరిగింది. మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు, మలవిసర్జనకు వెళితే మలం సాఫీగా జరుగక మంట, నొప్పి బాధాకరంగా ఉంటుంది. నొప్పి మలవిసర్జన అనంతరం కూడా ఉండి బాధిస్తుంది. మలవిసర్జన సమయంలో మొలలు (పైల్స్) బయటకు వచ్చి వేధిస్తాయి. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక వాడుకోదగినది. హెమోమెలీస్: మలబద్ధకంతో బాధ పడుతూ ఉంటారు. మలవిసర్జనకు వెళితే మలం సాఫీగా జరుగక మంట, నొప్పి కూడి రక్తం విస్తారంగా పడుతూ ఉన్నప్పుడు ఈ మందు బాగా పని చేస్తుంది.
రటానియా:
వీరికి ఆసనంలో గాజు పెంకులు గుచ్చుతున్నట్లుగా టుంది. విరేచనం వెళ్లిన తరువాత కొంత సేపు వరకు నొప్పిగా బాధగా అనిపిస్తుంది. మలవిసర్జన సమయంలో అప్పుడప్పుడు రక్తం పడుతు ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. ఈ మందులే కాకుండా పైల్స్‌తో బాధ నివారణకు నైట్రిక్ ఆసిడ్, అలోస్, మ్యురాటిక్ ఆసిడ్, గ్రాఫాయిటీస్, మెర్కుసాల్, ఫాస్పారస్ వంటి మందులను వ్యాధి లక్షణాల ఆధారంగా వాడుకొని గర్భిణీలు పైల్స్ నుండి విముక్తి పొందవచ్చును.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి