పిల్లలు పక్క తడుపుతున్నారా?
S ,
సాధారణంగా పసిపిల్లలు తరచుగా పక్కతడుపుతుంటారు. దీనిని నాక్టర్నల్ ఎన్యురెసిస్ అని వ్యవహరిస్తుంటారు. ఈ సమస్య పిల్లలు ఒక నిర్ధిష్టమైన వయస్సుకు వచ్చేవరకు కొనసాగుతుంది. అయితే కొందరు పిల్లలు ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ అలవాటును కొనసాగిస్తూ ఉంటే అది ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది. తక్కువ గది ఉష్ణోగ్రతలు, నిద్రపోయే ముందు అధిక ద్రవాలను తీసుకోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. పిల్లాడు 6, 7 సంవత్సరాల వయస్సు దాటుతున్నా కూడా పక్క తడిపే అలవాటు ఉన్నట్లయితే దీనికి అనేక కారణాలు ఉంటాయి. అవేంటంటే..
* పిల్లల మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉండడం కూడా ఒక కారణం. ఈ సమస్యతో ఉన్న పిల్లలు ఎక్కువ సేపు మూత్రం నియంత్రించలేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది.
* మూత్రాశయం నిండినప్పుడు బాత్రూమ్‌కు వెళ్లాలి అని పిల్లాడికి తరచూ చెబుతుండాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు సోమరితనం, మొండితనం వల్ల సరైన సమయానికి బాత్రూమ్‌కి వెళ్లకుండా లేటు చేస్తుంటారు.
* పిల్లాడు ఆహారంలో అధికంగా కెఫిన్ లేదా డైయూరిటిక్స్ వంటివి ఎక్కువగా ఉన్నా కూడా మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది.
* మధుమేహం ఉన్నా కూడా పిల్లలకు మూత్ర నియంత్రణ ఉండదు.
* యూరినరీ ట్రాక్ ఇనె్ఫక్షన్ వచ్చినా, ఒత్తిడి లేదా మానసిక సమస్యలున్నా కూడా మూత్ర నియంత్రణ ఉండదు.
కాబట్టి పై కారణాల్లో ఏదో వైద్యుని సహాయంతో తెలుసుకుని తగిన చికిత్సను అందించాలి. ఇవే కాకుండా జీవనశైలిలో మార్పులు, ఆహార ప్రణాళికలో మార్పులను జోడించి, ఇంట్లో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కూడా దీన్ని నియంత్రించవచ్చు.
* పక్క తడపడం తగ్గించడంలో క్రానె్బర్రీ జ్యూస్ ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ రాత్రి పడుకోబోయే ముందు తీసుకోవడం ద్వారా సమస్యను తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది యూరినరీ ట్రాక్ ఇనె్ఫక్షన్ సమస్యను తగ్గించడంలో ఎంతో కీలకంగా పనిచేస్తుంది.
* సహజ సిద్ధమైన ఫైబర్ సమృద్ధిగా ఉండే వాల్‌నట్స్, కిస్‌మిస్‌లు.. పక్క తడిపే పిల్లల సమస్యను నిరోధించడానికి చక్కగా ఉపయోగపడతాయి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి పిల్లల పెరుగుదలకు సహాయపడే ముఖ్య ఖనిజం.
* తృణధాన్యాలు పిల్లల్లో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఓట్స్, ఫుడ్‌రైస్, కార్న్‌ఫ్లేక్స్, గోధుమ పొట్టు వంటి ధాన్యాలు పక్క తడిపే అలవాటును తగ్గిస్తాయి.
* ఈ సమస్యకు అరటిపండ్లు అద్భుతమైన గృహ చిట్కాగా ఉపయోగపడతాయి. ఈ పండు జీర్ణవ్యవస్థకు సహకారాన్ని అందివ్వడమే కాకుండా మూత్రాశయంలో అదనపు ద్రవాన్ని నిరోధించడంలో ఉత్తమంగా ఉపయోగపడుతుంది.
* దాల్చిన చెక్క, తేనెలో ఉండే గుణాలు పిల్లల్లో పక్క తడిపే అలవాటును నివారిస్తాయి. ఇవి పీడియాట్రిక్ డయాబెటిస్ సమస్య చికిత్సలో కూడా సహకారాన్ని అందివ్వగలవు.
* ఈ సమస్యను తగ్గించడంలో తులసిని పూర్వీకుల వైద్యంగా చెప్పారు. కొన్ని తులసి ఆకులను వేయించి తేనెతో కలిపి ఇవ్వడం వల్ల సమస్య తగ్గిపోతుంది.
* స్వీట్లు, చాక్లెట్ల తయారీలో ఉపయోగించే కృత్రిమ రసాయనాలు, చక్కెరలు పిల్లల్లో రాత్రి సమయంలో కొన్ని జీవక్రియలకు దారితీయొచ్చు. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు స్వీట్లు, చాక్లెట్ల జోలికి పిల్లలు వెళ్లకుండా చేయాలి.
* పిల్లలను రాత్రి పడుకునేముందు ఎక్కువ మంచినీరు, జ్యూస్‌లు తాగకుండా చేయాలి.
* పడుకునే ముందు పిల్లలను బాత్రూంకి వెళ్లమని చెప్పాలి.
* వీలైతే మధ్య రాత్రులలో క్రమం తప్పకుండా పిల్లలను బాత్రూమ్‌కు తీసుకెళ్లాలి. ఇలా తరచూ చేస్తుంటే పిల్లలు త్వరలోనే ఈ అలవాటును మానేస్తారు.
* ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా బెడ్ వెట్టింగ్ అలారమ్స్ వస్తున్నాయ. వీటివల్ల కొంత ఉపయోగం ఉంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి