అమ్మాయిలని నెల నెల పలకరించేది పీరియడ్స్. ఈ టైమ్‌లో మహిళలు అనేక సమ్యలు ఎదుర్కొంటారు. కొంతమందికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. కానీ, కొంతమందికి మాత్రం కడుపునొప్పి, నడుము నొప్పులు భరించలేనంతగా వస్తుంటాయి. ఇలాంటి సమస్యలని కొన్ని చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి..
అలాగే.. అరటి ఆకుని తీసుకోవాలి.. దానిని కొద్దిసేపు నూనెలో వేసి ఉడికించండి.. తర్వాత దీనికి పెరుగు కలిపి మిక్సీ పట్టాలి. దీనిని రోజంతా కొద్దికొద్దిగా తీసుకోవాలి. ఇలా తీసుకుంటుంటే సమస్య చాలా వరకూ తగ్గుతుంది.
వీటితో పాటు బెల్లంని నములుతూ ఉండాలి. ఇలా చేస్తుంటే మంచి ఉపశమనం ఉంటుంది. అదే విధంగా మెంతులని రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగుతుండాలి. వీలైనంతగా ఎక్కువగా నీటిని తాగుతుండండి..
వీటికి దూరంగా ఉండండి..
ఆయిలీ ఫుడ్, బేకరీ ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్‌కి దూరంగా ఉండండి. వీటి వల్ల మీకు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, వాటికి దూరంగా ఉండడం మంచిది.
ఇవి తినండి..
వీటితో పాటు తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అవకాడో, పీనట్ బటర్, శనగలు, అరటిపండ్లు ఎక్కువగా తీసుకోవాలి. లెట్యూస్, సెలరీ, దోసకాయలు, కర్బూజ, బెర్రీస్ ఎక్కువగా తీసుకోండి. వీటి వల్ల అన్ని సమస్యలు దూరమవుతాయి. కాల్షియం కోసం పాలు, పాల పదార్థాలు తీసుకోవచ్చు. వీటితో పాటు నువ్వులు, బాదం తీసుకుంటుండాలి.
వేడినీటితో స్నానం..
ఇక పీరియడ్స్ టైమ్‌లో వేడినీటిని ఉపయోగించడం మంచిది. శరీరంలోకి తీసుకోవడమైనా.. స్నానానికి వేడినీటిని వాడడం మంచిది. దీని వల్ల బాడీపెయిన్స్ తగ్గిపోతాయి. ఒత్తిడి కూడా దూరమవుతుంది. అదే విధంగా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండడం, ప్యాడ్స్‌ని మారుస్తుండడం చేస్తుండాలి.
కొద్దిగా వ్యాయామం..
అదే విధంగా.. ఈ సమయంలో చేయాల్సిన వ్యాయామాలు కొన్ని చేయాలి. ముఖ్యంగా ఈ టైమ్‌లో కొన్ని యోగాసనాలు మంచి రిలీఫ్‌ని ఇస్తాయి.
నడక అనేది సున్నితమైన మరియు తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామం. మీరు హార్డ్‌వర్క్ ఏమీ చేయకూడదనుకుంటే, నడక చాలా మంచిది. ఇది మీ మానసిక స్థితిని పెంపొందించడానికి సాయపడుతుంది. అదే విధంగా, మీరు కొన్ని కేలరీలను బర్న్ చేయగలరు. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిర్లు లేకపోతె పరుగు కోసం వెళ్ళవచ్చు.
పైలేట్స్..
పైలేట్స్ వ్యాయామం నెలసరి సమయంలో సహాయపడుతుంది. మీ శారీరక స్థితి ప్రకారం మీరు వ్యాయామాలు చేయొచ్చు. ఒకవేళ మీరు తక్కువ వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతుంటే, కొన్ని నిర్దిష్ట పైలేట్స్ కదలిక నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.
యోగా..
యోగా స్ట్రెచ్బుల్ మరియు శ్వాస వ్యాయామాల కలయిక, ఇది నెలసరి సమయంలో యోగా చేయటం చాల మంచుడి. కొన్ని యోగా ఆసనాలు వల్ల శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి మరియు నెలసరి సమయంలో వచ్చే లక్షణాల నుండి తేలికగా బయటపడటానికి సహాయపడుతుంది.
ఇలాంటి చిన్న నియమాలు పాటిస్తే పీరియడ్స్‌లో ఎదురయ్యే అనేక సమస్యలు దూరం అవుతాయి..
1 కామెంట్:
nice msz sir
కామెంట్‌ను పోస్ట్ చేయండి