అంగస్తంభన వైఫల్యం తరువాత, స్ఖలనం సమస్యలనేవి పురుషులలో సర్వసాధారణమైన లైంగిక సమస్యలలో ఒకటి. స్ఖలనం జాప్యమవడం లేదా స్ఖలనం కోసం తీసుకున్న సమయం పురుషులలో మారుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి; ఒకదాని ద్వారా వాంఛనీయమైనదిగా భావించేది మరొకదానికి సరిపోకపోవచ్చు. శీఘ్ర స్ఖలనం లేదా ఆలస్యంగా అయ్యే స్ఖలనం చాలా మంది పురుషులకు పూర్తిగా ఇబ్బంది కలిగించే విషయం. స్ఖలనం లోపాలు క్రింది రకాలుగా ఉంటాయి:
- శీఘ్ర స్ఖలనం
- ఆలస్యంగా అయ్యే స్ఖలనం
- తిరోగామి స్ఖలనం లేక రెట్రోగ్రేడ్ స్ఖలనం
వీటన్నింటినీ వివరంగా పరిశీలిద్దాం (అన్వేషిద్దాం).
శీఘ్ర స్ఖలనం (Premature ejaculation)
శీఘ్ర స్ఖలనం (Premature Ejaculation) అనేది సాధారణంగా వీర్య స్ఖలనం తొందరగా అయిపోవడం మరియు స్ఖలనంపై వ్యక్తికి నియంత్రణ లేకపోవడంగా చెప్పబడుతుంది, శీఘ్ర స్ఖలనం అంగ ప్రవేశానికి ముందు లేదా అంగ ప్రవేశమయింతర్వాత జరుగుతుంది. యోనిలోపల (ఇంట్రావాజినల్) స్ఖలనం జాప్యం సమయం (Intravaginal ejaculation latency time-IELT), అనగా, వీర్యస్ఖలనం మరియు 1 నిమిషం కన్నా తక్కువ సమయంలో అంగప్రవేశం అయినపుడు దాన్ని సాధారణంగా “శీఘ్ర స్ఖలనం” గా గుర్తించబడుతుంది, అయితే 1 నుండి 1.5 నిమిషాల మధ్య IELT కూడా శీఘ్ర స్ఖలనం అధిక-ప్రమాద విభాగంలోకి వస్తుంది. ప్రపంచంలో 4 నుండి 40% మంది పురుషులలో శీఘ్ర స్ఖలనం నివేదించబడింది. ఇది జీవితకాలమంతా ఉండచ్చు, మధ్యలో పొందినది లేక రావడమో కావచ్చు, అంతఃకరణమైంది లేదా అస్థిరమైంది కావచ్చు. జీవితకాల శీఘ్ర స్ఖలనం స్థిరంగా ఉంటుందని నిర్వచించబడింది. ఏదేమైనా, ఈ రకమైన జీవితకాల శీఘ్ర స్ఖలనం శీఘ్ర అంగస్తంభన వంటి ఇతర సమస్యలతో సంబంధం కలిగి ఉంటుంది. కొన్ని జన్యు మరియు హార్మోన్ల కారకాలు శీఘ్ర స్ఖలనానికి దారితీసే ప్రమాదం ఉన్నట్లు కనుగొనబడింది.
స్ఖలనం సమయం మరియు ఫిర్యాదు యొక్క పౌనఃపున్యం (frequency) ఆధారంగా, శీఘ్ర స్ఖలనాన్ని క్రింది వర్గాలుగా వర్గీకరించవచ్చు:
శీఘ్ర స్ఖలనం రకం | జీవితకాలపు శీఘ్ర స్ఖలనం | మధ్యలో పొందిన శీఘ్ర స్ఖలనం | అస్థిర శీఘ్ర స్ఖలనం | అంతఃకరణ శీఘ్ర స్ఖలనం |
యోనిలోపల (ఇంట్రావాజినల్) స్ఖలనం జాప్య సమయం (IELT) | 1 నిముషం కంటే తక్కువ | 3 నిముషాల కంటే తక్కువ | సాధారణం | సాధారణం |
కారణాలు | జీవసంబంధ పనితీరులోఆటంకాలు | స్వకీయం, వైద్యపరమైంది లేక మానసిక సంబంధమైంది | లైంగిక చర్యలో వ్యత్యాసం కారణంగా కావచ్చు | మానసికం లేక సాంస్కృతికం |
శీఘ్ర స్ఖలనం | ఉంది | ఉంది | కొన్నిసార్లు ఉంటుంది | తరచుగా ఉంటుంది |
శీఘ్ర స్తంభన | ఉంది | లేదు | లేదు | లేదు |
స్థితి | అతిబలి | అల్పబలి | సాధారణం | సాధారణం |
స్ఖలనమయింతర్వాత నిక్కని శిష్ణం | ఉంది | లేదు | లేదు | లేదు |
పైన పేర్కొన్న కారణాలతో పాటు, హార్మోన్లు కూడా శీఘ్ర స్ఖలనానికి కారకంగా ముడిపెట్టడం జరిగింది. శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్న పురుషులలో తక్కువ స్థాయిలో ఉన్న ప్రోలాక్టిన్ (రక్తంలో ఉంటుందిది) సాధారణంగా కనిపిస్తుంది.
శీఘ్ర స్ఖలనం నిర్ధారణలో ఈ కింది అంశాలు (కారకాలు) ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
చికిత్స
శీఘ్ర స్ఖలనం రకాన్ని బట్టి చికిత్స మారవచ్చు, ఇది క్రింది విధంగా చర్చించబడుతుంది:
జీవితకాలపు శీఘ్ర స్ఖలనం (Lifelong PE)
జీవితకాలపు శీఘ్ర స్ఖలనానికి సాధారణంగా ఎస్ఎస్ఆర్ఐ మందుల నిర్వహణతో చికిత్స చేయబడుతుంది, ఈ మందులు సెరోటోనిన్ హార్మోన్ ను నిరోదిస్తాయి. ఈ మందులు స్ఖలనం చేసే సమయాన్ని పెంచుతాయి. కానీ ఈ మందులు కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. కొంతమంది పురుషులకు అదనపు సలహాల సాయం (కౌన్సెలింగ్) అవసరం ఉండదు, సాధారణంగా మందుల ప్రభావాలు మరియు రుగ్మత గురించి వారికి వివరించడానికి ఈ సలహాల సాయం అందించబడుతుంది. అలాగే, జీవితకాలపు శీఘ్ర స్ఖలనం మరియు చికిత్స ఔషధాల ప్రభావాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది.
పొందిన అతిశీఘ్ర స్ఖలనం (Acquired PE)
పొందిన శీఘ్ర స్ఖలనం చికిత్సలో ఎక్కువగా కౌన్సెలింగ్ మరియు మానసిక చికిత్స ఉంటుంది మరియు ఎటువంటి మందుల అవసరం ఉండదు. అయినప్పటికీ, వ్యక్తిగత పరిస్థితిని బట్టి, నోటి ద్వారా సేవించే మందులు లేదా పైపూత మందులను ఇవ్వవచ్చు.
అంతఃకరణ శీఘ్ర స్ఖలనం (Subjective PE)
ఈ రకం శీఘ్ర స్ఖలనం సాధారణంగా లైంగిక చర్యలలో సాధారణ వైవిధ్యాల వల్ల సంభవిస్తుంది. కాబట్టి, అలాంటి పురుషులు వారి శీఘ్ర స్ఖలనం యొక్క మూల కారణాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. అంతఃకరణ శీఘ్రస్ఖలనం చికిత్సలో, ప్రధానంగా వ్యక్తిగత మరియు జంట కౌన్సెలింగ్ ఉంటుంది. ఎస్‌ఎస్‌ఆర్‌ఐ మందులు సూచించబడవచ్చు లేదా సూచించబడకపోవచ్చు.
అస్థిరమైన శీఘ్ర స్ఖలనం (Variable PE)
ఈ రకమైన శీఘ్ర స్ఖలనానికి ఎటువంటి చికిత్స అవసరం లేదు. అస్థిరమైన శీఘ్ర స్ఖలనం (Variable PE) విషయంలో, ఈ సమస్య వెనుక ఉన్న మానసిక స్థితిని తెలుసుకోవడానికి మరియు వ్యవహరించడానికి వ్యక్తికి సహాయపడటానికి మానసిక విశ్లేషణ సాధారణంగా జరుగుతుంది.
(మరింత చదవండి: శీఘ్ర స్ఖలనం చికిత్స)
ఆలస్యమయ్యే స్ఖలనం (Delayed ejaculation)
అకాల స్ఖలనానికి చాలా విరుద్ధంగా ఉంటుందిది, ఆలస్యంగా అయ్యే స్ఖలనం అనేది వ్యక్తి స్ఖలనం చేయలేని పరిస్థితిని సూచిస్తుంది లేదా యోనిలోపల (ఇంట్రావాజినల్) స్ఖలనం జాప్యం సమయం (IELT) సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకోవడాన్ని సూచిస్తుంది.
దీనిని నిరోధిత స్ఖలనం, ఇడియోపతిక్ అనెజాక్యులేషన్ (AE), సరిపోని స్ఖలనం మరియు రిటార్డెడ్ స్ఖలనం అని కూడా పిలుస్తారు. AE సాధారణంగా వ్యక్తి యొక్క స్ఖలనం చేయలేని పూర్తి అసమర్థతను సూచిస్తుంది.
అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకారం, ఆలస్యమయ్యే స్ఖలనాన్ని (DE) నిర్ధారించడానికి, ఒక వ్యక్తికి కిందిరెండు షరతులలో కనీసం ఒకటి ఉండాలి:
- స్ఖలనం యొక్క ఆలస్యం లేదా అసమర్థత
- ఉద్రేకం స్థాయి ఏమాత్రం తగ్గకపోయినా గత ఆరు నెలల్లో స్ఖలనం లేకపోవడం.
ఆలస్యమయ్యే స్ఖలనాన్ని గుర్తించే యోనిలోపల (ఇంట్రావాజినల్) స్ఖలనం జాప్యం సమయం (IELT) సమయాన్ని నిర్వచించేటప్పుడు వివాదం ఉన్నట్లు అనిపిస్తుంది. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ ప్రకారం, ఆలస్యమయ్యే స్ఖలనానికి యోనిలోపల (ఇంట్రావాజినల్) స్ఖలనం జాప్యం సమయం 20-25 నిమిషాలు ఉండవచ్చు. ఏదేమైనా, జర్నల్ ఆఫ్ సెక్స్ అండ్ మారిటల్ థెరపీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, సాధారణ పురుషులలో యోనిలో స్ఖలనజాప్య సమయం 4 నుండి 10 నిమిషాల వరకు ఉంటుంది, కాబట్టి ఈ కాలపరిమితి కంటే ఎక్కువ ఆలస్యాన్ని “ఆలస్యంగా అయ్యే స్ఖలనంగా (DE) గా పరిగణించబడుతుంది.
ఏది ఏమయినప్పటికీ, ఆలస్యమయ్యే వీర్య స్ఖలనం అనేది పురుషుల లైంగిక రుగ్మతలో 1% మాత్రమే జీవితకాలపు ఆలస్య వీర్య స్ఖలనంతో 5% మంది పురుషులు ఆలస్యమయ్యే వీర్యస్ఖలనంతో బాధపడుతున్నారు.
ఆలస్యమయ్యే స్ఖలనం వయస్సుపెరగడంతో సాధారణం కాని మరికొన్ని అంశాలు కూడా ఈ రుగ్మతతో సంబంధం కలిగి ఉన్నారు. అటువంటి కారకాల జాబితా ఇక్కడ ఈకింద ఉంది:
- ఆత్మవిశ్వాసం లేకపోవడం
- అపరాధ (భావం)
- మత విశ్వాసాలు
- ఆందోళన మరియు నికుంగుబాటు వంటి మానసిక సమస్యలు
- అధిక పౌనఃపున్యం (high frequency ) లేదా విపరీతమైన హస్త ప్రయోగం
- ప్రేమ పట్ల, సంబంధం పట్ల లేదా భాగస్వామి పట్ల అసంతృప్తి
- వాస్తవికతకు భిన్నమైన లైంగిక కల్పనలు
- లైంగిక కోరిక లేకపోవడం
- స్ఖలనం మరియు యాంటిడిప్రెసెంట్లను ఆలస్యం చేసే SSRI లు వంటి ఔషధ ప్రయోగం లేదా మందులు
- వ్యక్తిగత జన్యుశాస్త్రం
- తగ్గిన థైరాయిడ్ పనితీరు
- ప్రోలాక్టిన్ హార్మోన్ లేకపోవడం
* గమనిక: జాబితా సమగ్రమైనది కాదు. రోగ నిర్ధారణ వ్యక్తిగత కారకాలు మరియు వైద్య
చరిత్రపై ఆధారపడి ఉంటుంది.
వ్యాధి నిర్ధారణ
ఆలస్యమయ్యే వీర్య స్ఖలనం సాధారణంగా వ్యక్తి యొక్క లైంగిక చరిత్ర మరియు కొన్ని వైద్య పరీక్షల ద్వారా నిర్ధారణ అవుతుంది. వ్యక్తి చరిత్రలో నాడీ సంబంధిత రుగ్మతలు, హస్త ప్రయోగం, ఉద్వేగం లేకపోవడం, సంభోగం యొక్క తరచుదనం లేక పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ), మూత్రసమస్యలు లేదా వృషణ సమస్యలు లేదా సాంస్కృతిక పరిమితులు వంటి అంశాలు ఉంటాయి.
వైద్య పరీక్షలో సాధారణంగా శుక్రవాహిని (vas deferens) మరియు అధివృషణిక (ఎపిడిడిమిస్)లను పరీక్షించడం ఉంటుంది, పురుషాంగం యొక్క వృషణాల పరిమాణం మరియు పరిమాణంలో ఏదైనా అసాధారణతలు, సామర్థ్యం లేదా వృషణాలు మెలిపెట్టినట్లుండే (స్క్వీజింగ్) బాధను అనుభూతి చెందలేకపోవడం (సాధారణంగా నొప్పి గ్రాహకాలను ప్రేరేపిస్తుంది), క్రెమాస్టెరిక్ రిఫ్లెక్స్ (లోపలి తొడను కొట్టడానికి సంబంధించిన రిఫ్లెక్స్) .
ఏదైనా అసాధారణతను నిర్ధారించడానికి వైద్యుడు తదుపరి పరీక్షలను సూచించవచ్చు.
చికిత్స
ఆలస్యమయ్యే స్ఖలనానికి (DE) చికిత్స వ్యక్తిగత కారణంపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది మానసిక సమస్య అయితే కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో, లైంగిక పనితీరును పెంచడానికి టెస్టోస్టెరాన్ ద్రావణం మరియు డోపామైన్ (శరీరం యొక్క ఆనందం హార్మోన్) అగోనిస్ట్ మందులు సూచించబడతాయి. ఈ ఔషధాలలో మంట, వికారం, మూత్ర సమస్యలు, మలబద్ధకం మరియు విరేచనాలు వంటి కొన్ని అనుబంధ దుష్ప్రభావాలు ఉన్నాయని గమనించడం ముఖ్యం.
తిరోగామి స్ఖలనం లేదా రెట్రోగ్రేడ్ స్ఖలనం (Retrograde ejaculation)
రెట్రోగ్రేడ్ స్ఖలనం అనేది మగవాళ్ళలో కలిగే అసాధారణమైన లైంగికక్రియ వైఫల్యం, ఇది 2% కన్నా తక్కువ కేసులలో సంభవిస్తుంది. పురుషాంగం నుండి వీర్యం బహిష్కరించడానికి సానుభూతి నరాలు కారణం. ఇది అంతర్గత యురేత్రల్ స్పింక్టర్ (శరీరంలోని ఒక నిర్దిష్ట బిందువు గుండా ద్రవం వెళ్ళడానికి మూసివేసే లేదా తెరిచే కండరము) మూసివేయబడిందని మరియు మూత్రాశయంలోకి తిరిగి వెళ్ళడానికి బదులు వీర్యం బయటకు ప్రవహిస్తుందని నిర్ధారిస్తుంది. సానుభూతి నాడిలో ఏదైనా పనిచేయకపోవడం వల్ల మూత్రమార్గంలో (యూరేత్ర)లో వీర్యం సేకరించబడుతుంది. ఫలితంగా, భావప్రాప్తిలో చాలా తక్కువ వీర్యం రావడం లేదా అసలు వీర్యం లేకుండానే భావప్రాప్తి కలగడం జరుగుతుంది. ఈ పరిస్థితినే “రెట్రోగ్రేడ్ స్ఖలనం (RE)” గా నిర్వచించారు. అయితే, లైంగికవాంఛ ప్రేరేపణ లేదా అంగస్తంభనలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
జన్యుసంబంధకారకాలు, వెన్నెముక గాయం, మెడ గాయం, మూత్రాశయ శస్త్రచికిత్స వంటి అనేక కారణాలు తిరోగామి స్ఖలనానికి (RE) కారణమవుతాయి. డయాబెటిస్ మెల్లిటస్ మరియు పార్కిన్సన్స్ తిరోగామి స్ఖలనంతో సంబంధం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.
వీర్యం ఉనికి కారణంగా మూత్రంలో మబ్బుకమ్మడంతో సంబంధం కలిగి ఉంటుంది. రెట్రోగ్రేడ్ స్ఖలనం యొక్క రోగనిర్ధారణ లక్షణాలలో ఇది కూడా ఒకటి.
చికిత్స
తిరోగామి స్ఖలనం (RE) చికిత్సలో వ్యక్తిగత కేసును బట్టి కొన్ని మందులు లేదా శస్త్రచికిత్సలు ఉంటాయి.
సానుభూతి నరాల పనితీరును అనుకరించే నోటి మందులు సాధారణంగా RE చికిత్సలో చేర్చబడతాయి. అదనంగా, యాంటికోలినెర్జిక్స్, పారాసింపథెటిక్ నరాల పనితీరును నిరోధించే మందులు కూడా RE చికిత్స కోసం ఉపయోగిస్తారు. ఈ మందులలో చాలావరకు వాటి స్వంత దుష్ప్రభావాలను కలిగి ఉండవచ్చని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మరియు వైద్యుడి పర్యవేక్షణలోనే ఈ మందుల్ని సేవించాలి.
ఒక అధ్యయనం ప్రకారం, సంభోగం తరువాత మూత్రాశయం నుండి కూడా స్పెర్మ్ పొందవచ్చు మరియు జంటలలో సంతానోత్పత్తి సమస్యలను తగ్గించడానికి కృత్రిమంగా గర్భధారణ చేయవచ్చు.