29, జులై 2020, బుధవారం

మానసిక సమస్య కు పరిష్కారం మార్గం తీసుకొని కోవలిసిన జాగ్రత్తలు ఈ లింక్స్ లో చూడాలి

మానసిక వ్యాధికి చికిత్ అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

oneఒక కాలంలో మానసిక రోగుల్ని శరణాలయాల్లో గొలుసులతో కట్టేసి, చాలా దారుణంగా చూసేవారు. జనం మానసిక సమస్యలతో బాధపడేవారి ప్రవర్తనలకు వారే కారణమని తిట్టేవారు. ఇప్పుడు కూడా చాలామంది మానసిక వ్యాధిగ్రస్తులు తమ ఇళ్ళల్లోనూ, హస్పటల్స్లోనూ మానవహక్కులకు భంగంకలిగేంతగా వేధింపులకు, దూషణలకు గురవుతున్నారు. చాలామంది మానసిక వ్యాధులంటే నయం చెయ్యలేనివిగా భావిస్తారు, కొంతమంది ఇతరులతో "మాట్లాడడం" చికిత్సలో భాగమని అర్థంచేసుకోలేరు.

వాస్తవం చాలా వేరుగా వుంటుంది. చాలా మానసిక వ్యాధుల్ని సమర్థవంతంగా నయంచెయ్యొచ్చు. అసలు సమస్యేమిటంటే చాలామంది మానసిక వ్యాధిగ్రస్తులు ఆరోగ్య కార్యకర్తను చాలా అరుదుగా కలుస్తారు. ఒకవేళ కలిసినప్పటికీ వారికి అంతగా పని చెయ్యని చికిత్సలు, ఒకోసారి హాని కలిగించే చికిత్సలు లభిస్తాయి. శారీరక వ్యాధులకు లాగానే మానసిక వ్యాధులకు సరైన మందుల్ని సరైన మోతాదులో తగినంత కాలం వాడితేనే వ్యాధి నయమవుతుంది. "మాట్లాడడం" అనేది మాత్ర పనిచేసినంత సమర్థంగా పనిచెయ్యొచ్చు అయితే, అది ఏ కారణానికి, ఏవిధంగా మాట్లాడడం జరిగింది అనేదానిమీద ఆధారపడుతుంది.

ఈ అధ్యాయాన్ని చదివేటప్పుడు మీరు రెండు అంశాల్ని గుర్తుపెట్టుకోవాలి :

  • ఈ మాన్యువల్లో వివరించబడిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని సంపాదించిన ఏ సాధారణ ఆరోగ్య కార్యకర్త అయినా చాలా మానసిక వ్యాధులకు ఆత్మవిశ్వాసంతో చికిత్స చెయ్యగలడు. అలా మానసిక వ్యాధి నిర్ధారణ అంటే అతనికి నిపుణుల చికిత్స అవసరమని అర్థం కాదు. ఇప్పుడు ఏచికిత్స అవసరమో మీకు తెలుసని మాత్రమే అర్థం.
  • మానసిక వ్యాధులను నయం చెయ్యడానికి చాలా సమర్ధమైన చికిత్సలు ఉన్నాయి. మామూలుగా మానసిక వ్యాధికి చికిత్స చేసే పద్ధతిలో శారీరక బాధలకు చికిత్స చెయ్యడం- నిద్ర పట్టకపోతే నిద్ర మాత్రలు, అలసటగా వుంటే విటమిన్ మాత్రలు, నెప్పలు వుంటే నెప్పిని తగ్గించేమాత్రలు- ఇవి దీర్ఘకాలంలో ఎందుకూ ఉపయోగపడనివి. శారీరక వ్యాధులకు లాగానే మానసిక వ్యాధులకు కూడా వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారణ చెయ్యడం, దానికి తగిన ప్రత్యేకమైన చికిత్స చెయ్యడం చాలా ముఖ్యం

మానసిక ఉద్రిక్తత (టెన్షన్) అనేది జీవితంలోని వివిధ పరిస్థితులు, ఒత్తిళ్లు మరియు సంఘటనలకు  మన శరీరం మరియు మెదడు యొక్క ప్రతిస్పందన. టెన్షన్ మరియు ఒత్తిడికి దోహదపడే కారకాలు ఒక వ్యక్తికి మరొకరికి భిన్నముగా ఉంటాయి. జరుగుతున్న సంఘటనల మీద చాలా తక్కువ లేదా అస్సలు నియంత్రణ లేకపోవడం, ఊహించని సంఘటనల లేదా కొత్త విషయాలతో వ్యవహరించేటప్పుడు కంగారు/భయం కలగడం, టెన్షన్ కు దారితీస్తాయి. దీర్ఘకాలిక టెన్షన్ మరియు ఒత్తిడి అధిక రక్తపోటుఊబకాయం మరియు మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మానసిక ఉద్రిక్తతకు సంబంధించిన ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:

  • నిద్రలేమి
  • ఆత్మనూన్యతా భావం
  • అలసట
  • కుంగుబాటు (డిప్రెషన్)
  • చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ తినడం
  • మద్యపానం మరియు ధూమపానం వంటి హానికరమైన అలవాట్లు చేసుకోవడం
  • దృష్టి కేంద్రీకరించడంలో కఠినత
  • బరువు తగ్గడం లేదా బరువు పెరగడం
  • తలనొప్పి
  • నిరంతరం కంగారుగా అనిపించడం
  • మలబద్ధకం
  • కలత మరియు అవిశ్వాసం
  • అతిసారం
  • ఆందోళన
  • కండరాల నొప్పి
  • భయంగా అనిపించడం
  • మైకము

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మానసిక ఉద్రిక్తతకు ప్రధాన కారణాలు:

  • కుటుంబం, పని మరియు వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన ఒత్తిడి
  • ఒత్తిడి రుగ్మతలు, ఉదాహరణకు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) వంటివి
  • సన్నిహిత కుటుంబ సభ్యులని కోల్పోవడం
  • చాలా ఒత్తిడికి గురికావడం
  • నిరాశావాదం
  • పెద్ద (ముఖ్య) జీవిత మార్పులు
  • చంటి బిడ్డను కలిగి ఉండడం

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు పూర్తి ఆరోగ్య చరిత్రను తెలుసుకుంటారు మరియు ఒత్తిడిని నిర్ధారించడానికి శారీరక పరీక్షను నిర్వహిస్తారు.

ఈ కింది పద్ధతులను ఉపయోగించి టెన్షన్కు చికిత్స చేస్తారు:

  • కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (Cognitive behavioural therapy): ఈ చికిత్స మనస్సు నుండి ప్రతికూల భావాలు మరియు ఆలోచనలను తొలగించడానికి సహాయపడుతుంది మరియు వ్యక్తిని ప్రశాంతంగా మరియు సానుకూలంగా (positive) ఉంచుతుంది. ఇది నిద్ర, తిండి అలవాట్లను మెరుగుపరుస్తుంది మరియు మద్య దుర్వినియోగం వంటి సమస్యల ఉపశమనానికి సహాయపడుతుంది.
  • విశ్రామక పద్ధతులు (Relaxing techniques): ధ్యానం, యోగ మరియు తాయ్ చి (Tai Chi) లేదా కొన్ని రకాల నూనెలతో చేసే పరిమళ చికిత్స (aromatherapy) వంటి విశ్రామక పద్ధతులు అలాగే సోషల్ సపోర్ట్ (సామజిక సహకారం) మరియు ఘాడ శ్వాస వ్యాయామాలు (deep breathing exercises) మనస్సుకు  విశ్రాంతినిస్తాయి.
  • శారీరక శ్రమ: మానసిక స్థితిని మెరుగుపరచడం మరియు కండరాల ఒత్తిడిని తగ్గించడానికి క్రమమైన శారీరక శ్రమ ఉండాలని సిఫార్సు చేయబడుతుంది.
  • సమూహిక చికిత్స మరియు మనస్తత్వ సెషన్లు (Group therapy and psychology sessions): ఓపెన్ గ్రూప్ (open group) మరియు క్లోజ్డ్ గ్రూప్ (closed group) సెషన్లలో పాల్గొనడం అనేది భావోద్వేగాలను మెరుగుపరచడంలో, సామాజిక నైపుణ్యాలను  మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సిఫారసు చేయబడతాయి.
  • ఆల్కాహాల్ ఉపయోగ రుగ్మత (alcohol use disorder), గంజాయి ఉపయోగ రుగ్మత (cannabis use disorder), ఓపియాయిడ్ ఉపయోగ రుగ్మత (opioid use disorder) మరియు పొగాకు ఉపయోగ రుగ్మత (tobacco use disorder) వంటి వ్యసనాలు కోసం థెరపీ/చికిత్స.






మానసిక ఉద్రిక్తత (టెన్షన్) కొరకు మందులు

Medicine NamePack Size
BrufenBrufen Active Ointment
CombiflamCombiflam Paed Suspension
Ibugesic PlusIbugesic Plus Oral Suspension
TizapamTizapam 400 Mg/2 Mg Tablet
Brufen MRBrufen MR Soft Gelatin Capsule
LumbrilLumbril Tablet
TizafenTizafen Capsule
EndacheEndache Gel
FenlongFenlong 400 Mg Capsule
Ibuf PIbuf P Tablet
IbugesicIbugesic 200 Tablet
IbuvonIbuvon Suspension
Ibuvon (Wockhardt)Ibuvon Syrup
IcparilIcparil 400 Tablet
MaxofenMaxofen Tablet
TricoffTricoff Syrup
AcefenAcefen 100 Mg/125 Mg Tablet
Adol TabletAdol 200 Mg Tablet
BruriffBruriff Tablet
EmflamEmflam 400 Injection
Fenlong (Skn)Fenlong 200 Mg Tablet
FlamarFlamar 3D Tablet
Bjain Bacopa monnieri Mother Tincture QBjain Bacopa monnieri Mother Tincture Q

మందుల్ని ఎప్పుడు వాడాలి?

twoముందు మీరు అసలు మందును వాడాలా, లేదా అనేది నిర్ణయించాలి. ఒకోసారి ఆరోగ్య కార్యకర్త మందుల్ని వాడనవసరం లేదని అనుకుంటున్నప్పటికీ మందుల్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తి మందుల్ని ఆశిస్తున్నాడని మీరు మందుల్ని ఇవ్వొద్దు. ఇంతకు ముందు ఆరోగ్య కార్యకర్తను కలిసినప్పుడల్లా అతనికి మందుల్ని ఇచ్చారు కనుక ఇప్పుడు కూడా అతను మందుల్ని ఆశిస్తాడు. వ్యాధిని నయం చెయ్యడానికి మందుల్ని ఇంజక్షన్ లను ఇవ్వడం ద్వారా మాత్రమే సహాయ పడొచ్చని వారు నమ్ముతారు. వ్యాధుల గురించి పరిజ్ఞానం, జీవనశైలిలో మార్పులు, భావోద్వేగ పరమైన అసరా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని వారికి తెలియదు. వారికి వ్యాధి గురించి బోధించకుండా అనవసరమైన మందుల్ని ఇస్తూ వుంటే వ్యాధి నయమవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీర్ఘ కాలంలో అతను మీ దగ్గరకు ఎక్కువ తరచుగా, ఎక్కువ కాలంపాటు వస్తాడు, మీ సమయాన్ని ఎక్కువ తీసుకుంటాడు.

మరొక వైపు కొంతమంది మందుల్ని తీసుకోవడానికి అసలు ఇష్టపడరు. వారు చాలా కారణాల్ని క్షమాపణల్ని వెల్లడిస్తారు. మందుల్ని నిరాకరించడానికి చాలా సాధారణమైన కారణం అజ్ఞానం.

కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు మానసిక వ్యాధులకు మందుల్ని వాడడం ప్రమాదకరమని భావిస్తారు. భిన్నమైన మానసిక వ్యాధులకు భిన్నమైన మందులు ఉన్నాయి. మీరు అనుసరించ వలసిన కొన్ని సామాన్య నిబంధనలు ఉన్నాయి. (పెట్టె 3.1) వీటిని సక్రమంగా అనుసరిస్తే ఇతర మందులెంత సురక్షితమో మానసిక వ్యాధులకు వాడే మందులు కూడా అంతే సురక్షితం. మందులు ఫలితాన్నిస్తాయని తెలిసినప్పుడు మందుల్ని ఇవ్వకుండా వుండే తప్పిదాన్ని చెయ్యకండి.

ఈ క్రింది మానసిక వ్యాధులకు ఖచ్చితంగా మందుల వలన ప్రయోజనం ఉంటుంది :

  • షిజోఫ్రినియా, మానిక్ డిప్రెసివ్ వ్యాధి, ఎక్యూట్ సైకోసిస్ లాంటి తీవ్రమైన మానసిక వ్యాధులు.
  • సాధారణ మానసిక వ్యాధులు, ముఖ్యంగా అవి ఒక నెలకంటే ఎక్కువ కాలం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క రోజువారీ పనుల మీద ప్రభావం చూపుతున్నప్పుడు.
  • దగ్గరి బంధువు మరణం లాంటివి జరిగాక, ఉద్రేకం, స్థిమితం లేకపోవడం లాంటి చాలా ఒత్తిడితో కూడిన సందర్భాలలో.

3.1. మానసిక వ్యాధికి మందుల్ని వాడడానికి సూచనలు :

  • మానసిక వ్యాధి ఏరకందో గుర్తించడానికి ప్రయత్నించండి. వ్యాధి నిర్ధారణ అయితే మందుల్ని ఎంపిక చేసుకోవడం చాలా సులభమవుతుంది.
  • వ్యాధి రకాన్ని బట్టి మందులు అవసరమో, కాదో నిర్ణయించండి.
  • మందును ఎలా తీసుకోవాలో, ఎంతకాలం తీసుకోవాలో రోగికి వివరించండి.
  • ఇబ్బందుల్ని నివారించడానికి కొన్ని మందుల్ని తక్కువ మోతాదుతో ప్రారంభించి అవసరమైన మోతాదుకు క్రమేపీ పెంచాలి.
  • ఏమైనా ఇబ్బందులు కలుగుతాయేమో జాగ్రత్తగా గమనించాలి (మానసిక వ్యాధులకు వాడే చాలా మందులు సురక్షితమయినప్పటికీ) అనుమతించ బడిన మోతాదును ఎప్పుడూ దాటకండి.
  • కొన్ని మందుల్ని మరీ తక్కువ కాలం (ఉదా: డిప్రెషన్ కి వాడే మందులు), కొన్ని మందుల్ని మరీ ఎక్కువ కాలం(నిద్ర మాత్రలు) వాడడాన్ని నివారించండి.
  • తరువాత చూపించు కోవడానికి వచ్చినప్పుడల్లా ముందు వాడిన మందులే అని రాసేసే చాపల్యానికి గురికావద్దు. ఎవరైనా సంవత్సరాల తరబడి ఒక మందును వాడుతూంటే ఆవ్యక్తి ఆరోగ్యాన్ని సమీక్షించండి.
  • మీ ప్రాంతంలో దొరికే మందుల వ్యాపార పేర్లు, వాటి ధరలు తెలుసుకుని ఉండండి.

ఏ మందుల్ని వాడాలి?

తరువాత చర్య ఏ మందుని వాడాలో నిర్ణయించడం. మానసిక వ్యాధికి 4 ప్రధాన విభాగాల మందులు ఉన్నాయి.

  • డిప్రెషన్ లేక కుంగుబాటుకి చికిత్స చెయ్యడానికి మందులు.
  • ఏంగ్డయిటీ లేక ఆందోళనకి చికిత్స చెయ్యడానికి మందులు.
  • తీవ్రమైన మానసిక వ్యాధులకు చికిత్స చెయ్యడానికి మందులు.
  • మానిక్-డిప్రెసివ్ వ్యాధికి చికిత్స చెయ్యడానికి మందులు.

కొన్నిసార్లు మానసిక వ్యాధికి ఏ మందు వాడాలో వ్యాధి నిర్ధారణ మీద ఆధార పడుతుంది. ఆ విధంగా సాధారణ మానసిక వ్యాధుల చికిత్సకు డిప్రెషన్ ని తగ్గించే మందుల్ని వాడతారు. కొన్నిసార్లు వ్యాధి లక్షణాలకు చికిత్స చెయ్యడానికి మందుల్ని వాడొచ్చు. అలా వ్యాధి నిర్ధారణతో సంబంధం లేకుండా ఎవరికైనా నిద్ర పోవడానికి సహాయ పడేందుకు నిద్ర మాత్రల్ని ఇవ్వొచ్చు. అదే విధంగా తీవ్రమైన మానసిక వ్యాధులు లేక బుద్ధి మాంద్యం కారణంగా కలిగే ప్రవర్తనా పరమైన సమస్యలకు ఏంటీసైకాటిక్ మందుల్ని వాడతారు.

threeఏంటీ డిప్రెసెంట్స్ :

ఈ మందుల్ని డిప్రెషన్ కి మరియు ఏంగ్టయిటీ కి వాడతారు. ఈ సమస్యలు అలసట, నిద్రాలోపాల లాంటి వివరించలేని బాధల రూపంలో కనబడతాయి. ఇంకా అవి పానిక్ డిజార్డర్, అబెసివ్- కంపల్సివ్ డిజార్డర్ కు కూడా ఉపయోగపడతాయి. మద్యం వ్యసనం, షిజోఫ్రినియా లాంటి ఇతర మానసిక వ్యాధులలో వచ్చే డిప్రెషన్ కి కూడా వీటిని వాడతారు.

మీరు వాడడానికి 3 రకాల ఏంటీ డిప్రెసెంట్స్ ఉన్నాయి.

  • టైసైక్లిక్ ఏంటీడిప్రెసెంట్స్ ఇమిప్రమిన్, ఎమిట్రిప్టిలిన్, నారిమిప్రమిన్, నార్ట్రిప్టిలిన్, డోథియోపిన్, డెసిప్రమిన్ లాంటివి.
  • సెరొటినిన్ బూస్టర్స్, ఫూవోక్సటిన్, ఫూవోక్సమిన్ లాంటివి.
  • వెన్హాఫాక్సిన్, పారొక్ష్సిటిన్, బుప్రొపియాన్, సిటలో ప్రమ్ లాంటి కొత్త మందులు.

ఏంటీ డిప్రెసెంట్స్ ని వాడమని చెప్పే ముందు మీరు గుర్తుంచుకోవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి.

  • ఏంటీ డిప్రెసెంట్స్  పని చెయ్యడానికి 3 - 4 వారాలు పట్టోచ్చు.
  • వ్యాధి మళ్ళీ తిరగ బెట్టకుండా ఉండడానికి మందుల్ని కనీసం ఆరు నెలల పాటు వాడాలి.
  • సరైన మోతాదులో ఇస్తేనే మందులు పని చేస్తాయి.
  • టైసైక్లిక్ ఏంటీ డిప్రెసెంట్స్ కి నిద్ర రావచ్చు, రోగులతో మద్యం తాగొద్దని చెప్పండి.
  • ఇబ్బందులు సాధారణంగా కొద్ది కాలమే ఉంటాయి. అందు చేత కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ రోగిని మందుల్ని మానకుండా వాడమని చెప్పండి. ప్రోస్టేట్ గ్రంధి పెరిగినప్పుడు, గ్లకోమా ఉన్నప్పుడు టైసైక్లిక్స్ కి వాడగూడదు.
  • సెరిటినిస్ బూస్టర్స్ కి తక్కువ ఇబ్బందులు ఉంటాయి, కాని ఖరీదు ఎక్కువ.

ఏంటీ ఏంగ్డయిటీ మందులు :

ఈ మందుల్ని "స్లీపింగ్ పిల్స్" అని కూడా అంటారు. డయాజిపామ్, నిప్రజిపామ్, లొరాజిపామ్, కొనాజిపామ్, ఆల్ర్పజాలమ్, ఆక్సజిపామ్. వీటిని నిద్రా సమస్యలకు ఏంగ్టయిటీకి చికిత్స చెయ్యడానికి ఉపయోగిస్తారు. ఈ మందుల్ని రాసేముందు మీరు గుర్తుంచు కోవలసిన విషయాలు ఉన్నాయి.

  • ఈ మందుల్ని వాడేటప్పుడు రోగి మద్యాన్ని తాగకూడదు.
  • గర్భవతికి చివరి నెలల్లో ఈ మందుల్ని ఇవ్వగూడదు.
  • 4 వారాలకంటే ఎక్కువ కాలం పాటు ఇస్తే అలవాటుగా మారే ప్రమాదం ఉంటుంది కనుక ఒక నిబంధనగా అంతకంటే ఎక్కువ రోజులపాటు ఈ మందుల్ని ఇవ్వగూడదు.

బీటాబ్లాకర్స్ :

సామాన్యంగా ఈ మందుల్ని అధిక రక్తపోటుకి, గుండె సమస్యలకి వాడతారు. అందులో ప్రాప్రనొలాల్ అనే మందు తీవ్రమైన ఏంగ్టయిటీకి వచ్చే శారీరక బాధల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. (ఉదా. చేతులు వణకడం, గుండెదడ)

ఈ మందుల్ని రాసేముందు రెండు విషయాల్ని గుర్తు పెట్టుకోవాలి.

  • శ్వాస కు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారికి ఈ మందుల్ని ఇవ్వగూడదు.
  • గర్భవతికి చివరి నెలల్లో ఈ మందుల్ని ఇవ్వగూడదు.

ఏంటీసైకాటిక్ మందులు :

చాలా రకాల ఏంటీసైకాటిక్ మందులు ఉన్నాయి. వాటిని గ్రూపులుగా విభజించడానికి సులభమైన మార్గం:

  • క్లోర్ప్రోమజిన్, థయోరడజిన్, టైఫ్లోపిరజిన్ మరియు హాలొపిరడాల్ లాంటి పాత ఏంటీసైకాటిక్ మందులు.
  • ఒలాన్జపిన్, క్లోజపిన్ మరియు రిస్ పెరిడాన్ లాంటి కొత్త ఏంటీసైకాటిక్ మందులు సాధారణంగా పాతమందులు ఎక్కువ ఇబ్బందుల్ని కలగజేస్తాయి, కాని ఖరీదు తక్కువ.

fourఏంటీ సైకాటిక్మందుల్ని తీవ్రమైన మానసిక వ్యాధులకు చికిత్స చెయ్యడానికి, బాగా ఉద్రేకంలో, లేక గందరగోళంలో ఉన్నవారిని నెమ్మదింప జేయడానికి వాడతారు. అవిధంగా, బుద్ధిమాంద్యం లేక మతిమరపుతో సరిగ్గా ప్రవర్తించనివారికి కూడా వీటిని ఇవ్వొచ్చు.

ఈ మందుల్ని ఇచ్చే ముందు ఈ క్రింది అంశాల్ని గమనికలో ఉంచుకోవాలి:

  • మందుల పూర్తి ప్రభావం రావడానికి కొన్ని వారాలు పట్టోచ్చు.
  • కొంత కాలం పాటు మాత్రమే ఉండే సైకోసెస్ లో రెండు వారాల్లోనే క్రమేపీ మందుల్ని తగ్గించవచ్చు. ఒకవేళ బాధలు తిరగబెడితే, ప్రారంభ మోతాదుని తిరిగి మొదలు పెట్టి, మూడు నెలల పాటు కొనసాగించి, మళ్ళీ క్రమేపీ తగ్గించాలి.
  • షిజోఫ్రినియాకు కనీసం ఒక సంవత్సరం పాటు చికిత్స చెయ్యాలి. (చాలా మందికి ఇంకా ఎక్కువ కాలం పాటు చికిత్స అవసరపడొచ్చు).
  • మానియా కు లక్షణాలు తగ్గేవరకు, ఆ తరువాత మూడు నెలల వరకు చికిత్స చెయ్యాలి. ఈ లోపు మళ్ళీ వ్యాధి తిరగబెట్టకుండా వేరే మందును ప్రారంభించాలి. (క్రింద చూడండి)
  • చాలామందికి ఇబ్బందులు ఉంటాయి, కాని అవి చాలా తేలికపాటివి.
  • మందుల మోతాదును కొంచెం తగ్గిస్తే, అది ఇబ్బందులు తగ్గడానికి సహాయ పడుతుంది.
  • వణుకు, బిగిసిపోవడం లాంటి మందులకు వచ్చే ఇబ్బందుల్ని తగ్గించడానికి ప్రోసైక్లిడిన్ లేక బెంజ్ హెక్సాల్ ని ఉపయోగించవచ్చు.
  • కొంతమంది మానసిక వ్యాధుల నిపుణులు తక్కువ ఇబ్బందులు ఉండేందుకు రోగులందరికీ ఈ మందుల్ని వాడమని సూచిస్తారు. ఇది రోగులు మందులు మానకుండా వాడడానికి సహాయపడుతుంది.
  • కండరాలు తీవ్రంగా పట్టేస్తున్నప్పుడు (ఉదా. మెడ కండరాలు), ప్రోసైక్లిడిన్ లేక బంజ్ హెక్సాల్ ఇంజక్షన్ని ఇవ్వాలి.
  • ఏంటీసైకాటిక్ మందులకు వచ్చే ఇబ్బందులు (పైన), వాటిని తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలు (క్రింద) వివరించబడినాయి

fiveమానిక్ డిప్రెసివ్ లేక బైపోలార్ డిజార్జర్స్ ని నివారించడానికి మందులు :

మానిక్ డిప్రెసివ్ డిజార్జర్కి మాత్రమే వ్యాధి మళ్ళీ తిరగబెట్టకుండా వాడడానికి ప్రత్యేకమైన మందులు ఉన్నాయి.

ఈ క్రింది మందుల్లో దేనినైనా వాడవచ్చు:

  • లిథియమ్కార్బొనేట్
  • సోడియమ్ వాట్ర్పోయేట్
  • కార్బమజిపిన్

ఈ మందుల్లో దేనిని వేసుకున్నా ఎక్కువ కాలం వేసుకోవాలి (కనీసం 2 సంవత్సరాలు), రక్తంలో మందు స్థాయి ఎంత వుందో గమనిసూ ఉండాలి. మందును ప్రారంభించాలనే నిర్ణయం మానసిక వ్యాధుల నిపుణుడు తీసుకోవడం ఉత్తమం. రక్తంలో మందు స్థాయి ఎంత ఉందో తెలుసుకునే సౌకర్యం లేనప్పుడు లిథియమ్ని వాడగూడదు. నిపుణుల లభ్యత లేనప్పుడు లిథియమ్ కంటే కార్భమజిపిన్ లేక వాట్ర్పోయేటిని వాడడం సురక్షితం. ఈ మందుల్లో దేనిని గర్భవతులకు ఇవ్వగూడదు.

ఒక వేళ ఆవ్యక్తి పరిస్థితి మెరుగు పడకపోతే ఏమి చెయ్యాలి?

ఆ వ్యక్తి పరిస్థితి మెరుగు పడక పోతే ఈక్రింది కారణాలను పరిగణనలోకి తీసుకోండి :

  • మందుల్ని సక్రమంగా తీసుకోకపోవడం : మందుల్ని ఎందుకు వేసుకోవాలో, sixమందు మోతాదు ఎంతో ఆ వ్యక్తి అర్ధం చేసుకున్నాడే లేడో నిర్ధారణ చేసుకోండి. మందులు సక్రమంగా వేసుకోక పోవడానికి కారణం కొంచెం మెరుగు పడగానే ఇంక మందుల అవసరం లేదని ఆ వ్యక్తి భావించడం. మరొక కారణం మందుల్ని ఎక్కువ కాలం వేసుకుంటే అది అలవాటుగా మారుతుందేమోనని ఆ వ్యక్తి భయపడడం. మందులకు ఏవైనా ఇబ్బందులు రావడం కూడా మందుల్ని ఆపడానికి కారణం కావచ్చు. (క్రింద చూడండి) మందు చాలకపోవడం. ఇది తరచుగా తక్కువ మోతాదులో ఇచ్చే ఏంటీ డిప్రెసెంట్ మందుల విషయంలో జరగుతుంది,
  • మందుల్ని తగినంత ఎక్కువ కాలం తీసుకోకపోవడం : మళ్ళీ ఈ సమస్య sevenకూడా ప్రధానంగా ఏంటీ డిప్రెసెంట్స్ విషయంలో జరుగుతుంది. ఈ మందులు సానుకూల ప్రభావం కలగజేయడానికి కనీసం రెండు వారాల పాటు నిర్ణీత మోతాదులో తీసుకోవాలి.
  • తప్ప వ్యాధి నిర్ధారణ : డిప్రెషన్ వలన వ్యక్తులు ముడుచుకుని ఉంటారు లేక అలసటగా ఉంటారు లేక వారు సైకాటిక్ అయిఉండొచ్చు. ఒక వేళ సైకాటిక్ అయివుంటే ఏంటీ డిప్రెసెంట్స్ సహాయ పడకపోవచ్చు. రోగి పూర్తి నిర్ణీత మోతాదులో మందును కనీసం నెల రోజుల నుండి తీసుకుంటూందని మీకు నమ్మకముంటే వ్యాధి నిర్ధారణ సక్రమంగా ఉందో, లేదో పునరాలో చించాలి.

eightపైవన్నీ ఆలోచించి చర్యలు తీసుకున్నాక కూడా ఇంకా రోగి పరిస్థితి మెరుగు పడకపోతే, మీకు మరీ దగ్గరలో ఉన్న మానసికవైద్య కేంద్రానికి పంపడం గురించి ఆలోచించండి.

మందుల వల్ల ఇబ్బందులు ఉంటే ఏమి చెయ్యాలి?

ముందు అతను చెప్పే ఇబ్బందులు నిజమైనవేనా అనేది నిర్ధారించుకోండి. ఎవరైనా ఒకరు తమకు మందు మొదలు పెట్టినప్పటి నుండి అలసటగా ఉంటూందని చెప్పొచ్చు, కాని కొంచెం సానుభూతితో అడిగితే ఆ ఇబ్బంది మందు మొదలు పెట్టకముందు నుండి ఉందని, అది వ్యాధి వలన వచ్చిందే తప్ప మందు వల్ల కాదని అర్థమవుతుంది. అవిషయం వివరించి రోగికి నచ్చ చెప్పండి. సాధారణంగా మానసిక వ్యాధుల మందులకు వచ్చే ఇబ్బందుల్ని గుర్తుంచుకోండి. ఒక వేళ ఒక ప్రత్యేకమైన ఇబ్బందికి వీటిలో దేనితోనూ పోలిక లేకపోతే ఇతర కారణాలేమైనా ఉన్నాయేమో ఆలోచించండి. ఒకసారి ఆ వ్యక్తికి ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయని మీరు భావిస్తే, మీకు ఈ క్రింది ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.

  • ఇబ్బందులు మరీ భరించలేనంతగా ఉన్నాయా? చాలా మందులకు ఇబ్బందులు ఉంటాయి, కాని అవి చాలా తేలికపాటివి, తాత్కాలికమైనవి. ఆ ఇబ్బందులు ఎంతబాధను కలిగిస్తున్నాయో ఆ వ్యక్తిని అడగండి. తక్కువ కాలంలో మందుల వల్ల ప్రయోజనం కనిపిస్తూంటే చాలామంది అవి భరించకలిగినంతే ఉన్నాయని చెప్పారు.
  • మోతాదును తగ్గించవచ్చా? కొన్నిసార్లు మోతాదును కొద్దిగా తగ్గించి చూడవచ్చు. ఇది వ్యాధి పెరగకుండా ఇబ్బందుల్ని తగ్గించడానికి దారి తీయవచ్చు.
  • ఆ వ్యక్తికి మందును మార్చవచ్చా? అదే మానసిక వ్యాధికి చాలా రకాల మందుల్ని వాడవచ్చు. ఒక మందుతో భరించలేని ఇబ్బందులు వస్తే మందును మార్చి వేరే రకం మందును ప్రయత్నించవచ్చు.
  • మందు అవసరమా? కొంతమందిలో తరువాత మళ్ళీ పరీక్షకు వచ్చినప్పుదు మందు అవసరం తక్కువగా కనిపిస్తుంది. మందును ఆ పుజేసి, మళ్ళీ ఒక వారం తరువాత చూచి మందును ఆపాక కూడా ఆ వ్యక్తి పరిస్థితి బాగానే ఉందని నిర్ధారించుకోండి.

మానసిక వ్యాధుల చికిత్సలో ఇంజక్షన్ ల అవసరం ఎప్పుడు ఉంటుంది?

మానసిక వ్యాధుల చికిత్సలో ఇంజక్షన్ లకు పరిమితమైన పాత్ర ఉంది. (పెట్టె 3.2). ఈ పరిస్థితుల్లోనే కాక అసలు మానసిక వ్యాధుల చికిత్సలోనే ఇంజక్షన్ లను వాడగూడదు. విటమిన్ లోపం వలన కాక, సాధారణ మానసిక వ్యాధులకు ఉండే అలసట, నీరసం మొదలైన వాటికి అనవసరంగా విటమిన్ ఇంజక్షన్ లాంటివి ఇవ్వొద్దు. పక్క పేజీలోని బొమ్మలు ఇంజక్షన్లను ఇవ్వడానికి కొంత మార్గదర్శన నిస్తాయి.

3.2 మానసిక వ్యాధుల్లో ఇంజక్షన్ చికిత్సలు :

మందుల్ని నోటి ద్వారా వేసుకోవడానికి తిరస్కరించి అలజడితో, లేక ఉద్రేకంగా, హింసాత్మకంగా ప్రవర్తించేవ్యక్తికి ఈ క్రింది వాటిలో ఏదో ఒకటి :

  • డయాజిపామ్, 5 - 10 మి.గ్రా., కండరంలోకి (ఇంట్రామస్క్యులర్) లేక nineసిరలోకి (ఇంట్రావీనస్) ఇంజక్షన్.
  • హాలో పెరిడాల్, 5 - 10 మి.గ్రా., ఇంట్రామస్క్యులర్ ఇంజక్షన్.
  • క్లోర్ప్రోమజిన్ 25 - 100 మి.గ్రా., ఇంట్రామస్క్యులర్ ఇంజక్షన్.
  • నోటి ద్వారా మందుల్ని సక్రమంగా వేసుకోని, తరచుగా అనారోగ్యానికి గురయే షిజోఫ్రినియా రోగులకు (వీరిని స్పెషలిస్తుల దగ్గరకు పంపడం ఉత్తమం).
  • పూఫినజిన్ డెకనొయేట్ 26 - 75 మి.గ్రా., ప్రతి నాలుగు వారాలకు.
  • ఫూపెన్థిక్శాల్ డెకనొయేట్ 25 - 200 మి.గ్రా. ప్రతి నాలుగు వారాలకు.
  • హాలో పెరిడాల్ డెకనొయేట్ 25 - 200 మి.గ్రా. ప్రతి నాలుగు వారాలకు.
  • జుక్లోపెన్థిక్బాల్ డెకనొయేట్ 100 - 400 మి.గ్రా. ప్రతి నాలుగు వారాలకు.

మందుల ఖరీదు

పాత మందుల మీద కొత్తగా పస్తున్న మానసిక వ్యాధుల మందుల వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, వాటివల్ల తక్కువ ఇబ్బందులు ఉన్నాయి, బాగా పని చేస్తున్నాయి. కాని వీటికి ఉన్న అతి పెద్ద పరిమితి (ఇతర ఆరోగ్య సమస్యలకు వాడే మందులకు లాగానే) వాటి ధర, ఒక మందును రాసేముందు వీటిని పరిగణనలోకి తీసుకోవాలి, ఎందుకంటే ఒకొకసారి ఇబ్బందులలో తేడాకంటే ధరలో తేడాయే మందు అవసరం ఉన్న వారికి ప్రధానం కావచ్చు.

రోగులు మందుల్ని సక్రమంగా తీసుకునేలాగా చెయ్యడమెలా?

చాలా ముఖ్యమైన విషయం రోగులకు వారి వ్యాధి గురించి, మందుల గురించి అవగాహన కలిగించడం. కొన్ని ముఖ్యమైన అంశాలు:

  • వ్యాధి ఎలాంటి లక్షణాల్ని కలగజేస్తుందో, శారీరక వ్యాధులకులాగే మానసిక వ్యాధులకు కూడా మందులు ఎలా సహాయ పడతాయో రోగికి వివరించండి.
  • రోగిని మందులు తీసుకోమని ప్రోత్సహించడానికి కుటుంబ సభ్యుల్ని (రోగి అనుమతితో) కూడా కలుపుకోండి.
  • ఇబ్బందుల్ని తగ్గించడానికి తీసుకునే చర్యలలో భాగంగా ముందు మందును తక్కువ మోతాదుతో ప్రారంభించి క్రమేపీ మోతాదును అవసరమైన స్థాయికి పెంచాలి.
  • మానసిక వ్యాధులకు వాడే చాలా మందులు పని చెయ్యడానికి కొంత సమయం పడుతుందని వివరించండి. (ఉదాహరణకు ఏంటీ డిప్రెసెంట్స్ పని చెయ్యడం ప్రారంభమవడానికి కనీసం రెండు వారాలు పడుతుంది.)
  • పరిస్థితి కొంత మెరుగు పడేదాకా కనీసం వారానికొకసారి రోగిని చూడండి.
  • ఇబ్బందులు వస్తే ముందు సూచించిన చర్యల్ని తీసుకోండి.
  • మందుల్ని తీసుకోవడానికి సులభమైన పద్ధతిని అనుసరించండి, చాలా సైకియాట్రిక్ మందుల్ని రోజుకొక సారి వేసుకుంటే చాలు. (ఉదాహరణకు, ఏంటీ సైకాటిక్ మరియు ఏంటీ డిప్రెసెంట్ మందులు)
  • క్రితం సారి ఎప్పుడు రోగి చూపించుకోవడానికి వచ్చాడో తెలిస్తే, మిగిలిన మందుల్ని లెక్కించడం ద్వారా మందుల్ని ఇప్పటి వరకు సక్రమంగా వేసుకున్నదీ, లేనిదీ తెలుసుకోవచ్చు.

క్రింది చర్చ సాధారణ మానసిక అనారోగ్యాలకు సంబంధించినదే అయినప్పటికీ ఇంకా సామాన్యమైన ఉపయోగంకలది.

మాట్లాడే చికిత్సలు, కౌన్నిలి౦గ్

కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు సరైన ఆరోగ్య సంరక్షణ రోగితో కేవలం మాట్లాడడానికి మించి ఉంటుందని భావిస్తారు. కొంతమంది అసలు మాట్లాడడం చికిత్స ఎలా అవుతుందని సందేహ పడతారు. అందుకనే వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకు మందుల్ని ఇచ్చేస్తారు, చాలామంది రోగులు కూడా క్లినిక్ కి వెళ్ళినప్పుడు మందుల్ని ఇస్తారని అశిస్తారు. కొంతమంది ఇంజక్షన్ ని చెయ్యమని కూడా అడుగుతారు! ఆరోగ్యం విషయంలో రోగితో మాట్లాడడం ద్వారా చికిత్స గురించి ఉన్న కొన్ని సందేహాల్ని తీర్చుకోవడం, కొన్ని తప్ప అభిప్రాయాల్ని సరిచేసుకోవడం మంచిది.

మాట్లాడే చికిత్సల్ని "కౌన్సిలింగ్" అని అంటారు. కౌన్సిలింగ్ అనే పదాన్ని వేర్వేరు విధాలుగా ఉపయోగిస్తారు, వేర్వేరు వ్యక్తులకు వేర్వేరుగా అర్థమవుతుంది. అలా ప్రత్యేక శిక్షణ లేని ఒక వ్యక్తి బాధలో ఉన్న తన స్నేహితులకు కౌన్సిలింగ్ చెయ్యొచ్చు. ఈ పద్ధతి కౌన్సిలింగ్ లో కౌన్సిలర్ తరచుగా కేవలం తన ఊహ, తనజ్ఞానాన్ని అనుసరించవచ్చు. ఈ పద్దతిలో కొన్ని బలాలు ఉన్నప్పటికీ ఇతరులు నేర్చుకుని, ఉపయోగించగల చికిత్సలాగా ఇది ప్రతి ఒక్కరికీ ఉపయోగపడకపోవచ్చు. ఒక చికిత్సగా కౌన్సిలింగ్ ఒక స్నేహితునితో కేవలం మాట్లాడడానికి మించి ఉంటుంది. దీనికి రెండు కారణాలు ఉంటాయి.

  • కౌన్సిలింగ్ కి ఒక పద్ధతి ఉంటుంది. కౌన్సిలింగ్ పద్ధతులన్నీ ఒక వ్యక్తికి మానసిక వ్యాధి రావడానికి కారణాలేమిటో తెలుసుకుని ఆ సమస్యలకు పరిష్కారాలను వెదుకుతాయి.
  • తమ సహాయం కోరి వచ్చిన వారికి ఆరోగ్య కార్యకర్తలు కౌన్సిలింగ్ చేస్తారు. ఈ సందర్భంలో కౌన్సిలింగ్ మరియు సలహాలనిస్తే అదే నయం చేసే శక్తిని కలిగి ఉంటుంది. కౌన్సిలింగ్ ఒక నైపుణ్యం, ఏ ఆరోగ్య కార్యకర్త అయినా ఆసక్తి, వికాసం గల మనసు ఉంటే నేర్చుకోగలడు.

మానసిక వ్యాధి ఉన్నవారికి కౌన్సిలింగ్ సహాయ పడుతుందనడానికి ఆధారముంది. అయినప్పటికీ కౌన్సిలింగ్ మందులకు పోటీదారు కాదు. అవగాహన, నమ్మకాన్ని కలిగించడం కౌన్సిలింగ్ లో కీలక అంశాలని మీరు అనుకుంటే మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కౌన్సిలింగ్ చెయ్యండి. ప్రతి ఒక్కరు తమ వ్యాధి గురించి కొంతయినా అర్థం చేసుకోవాలిగదా! ఒక వ్యక్తి మీ సహాయంతో సంతృప్తి చెందడానికి లేక సంతోషంలేకుండా మరొకరి దగ్గరకు సహాయం కోరి వెళ్ళడానికి మధ్య బోధనా ప్రక్రియ ప్రముఖ పాత్ర వహిస్తుంది.

సమస్య పరిష్కారం (క్రింద చూడండి) లాంటి ఇతర మానసిక వ్యాధి చికిత్సలు చాలా సులభమైనవి, చాలా రకాల వ్యాధులకు ఉపయోగకరమైన వ్యూహాలుగా అన్వయించుకోవచ్చు. అలా, ఒక నియమంగా, మీ దగ్గరకు వచ్చిన వారి ఆరోగ్య సమస్య ఏమిటి అనేదానితో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ ప్రాథమిక సూత్రాల్ని ఉపయోగించవచ్చు. కొంతమందికి దానితోపాటు మందుల్ని కూడా ఉపయోగించవచ్చు.

కొన్ని మానసిక వ్యాధులకు ఎక్కువ ప్రభావం కలిగిన ప్రత్యేకమైన చికిత్సలను ఉపయోగించాలి. ముఖ్యంగా ఈ అనారోగ్యాలు సాధారణ మానసిక వ్యాధులు, మద్యం, మత్తుమందుల వ్యసనం. కౌన్సిలింగ్ చికిత్సలో ముఖ్యమైన అంశాలు ఈ విధంగా ఉంటాయి :

  • నమ్మకాన్ని కలిగించండి
  • వివరణ ను ఇవ్వండి
  • ప్రశాంతత మరియు శ్వాస వ్యాయామాల్ని నేర్పండి
  • ప్రత్యేకమైన లక్షణాలకు సలహానివ్వండి
  • సమస్యా పరిష్కార నైపుణ్యాలను బోధించండి

భరోసానివ్వండి

tenతరచుగా ఆరోగ్య కార్యకర్తలు డిప్రెషన్ మరియు ఏంగ్డయిటీ ఉన్న వారిని ‘మెంటల్’ లేక ‘న్యూరాటిక్’ అంటూ శ్రద్ధగా పట్టించుకోరు. ఈ వ్యాఖ్యలు వారికి నిజమైన ఆరోగ్య సమస్య లేదని సూచిస్తాయి. నీకేమీ సమస్య లేదు అని చెప్పే తప్పిదాన్ని చెయ్యకపోవడం ముఖ్యం. వారిలో ఏదో తేడా ఉందనేది వాస్తవం. చాలా మంది తమకేదో ప్రమాదకరమైన జబ్బు ఉందని భయపడతారు. ఇది మరింతగా వారిని ఒత్తిడికి, విచారానికి గురి చేస్తుంది. మీరు వారి సమస్యను, బాధల్ని అర్థం చేసుకున్నానని, కాని వారికేమీ ప్రాణాపాయం లేక ప్రమాదాన్ని కలిగించే వ్యాధి లేదని నమ్మకం కలిగేలాగా చెప్పాలి. వారికి ఉన్న సమస్య చాలా సాధారణమైనదని నమ్మకం కలిగించి, సమస్యకు కారణాల్ని పరిష్కారాల్ని వివరించాలి.

వివరణనివ్వండి

elevenసమస్య స్వరూపమేమిటో వివరించడం ఆ వ్యక్తి తనకు ఉన్న లక్షణాలకు కారణాల గురించి అవగాహన చేసుకోవడానికి, అతని సందేహాలు తీరడానికి సహాయపడుతుంది. మొదట ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పడో ఒకప్పుడు శరీర అసౌఖ్యానికి సంబంధించిన లక్షణాలను అనుభవిస్తారని మామూలు మాటల్లో తెలపాలి. కుడి వైపు 1.1 లో ఉన్న కేసు, లూసీ ఉదాహరణను తీసుకోండి అప్పుడు మీరు ఆ వ్యక్తి చెప్పిన ప్రత్యేకమైన లక్షణాల మీద దృష్టిని నిలపొచ్చు. లక్షణాలు ఎలా ప్రారంభమయాయో తెలిస్తే వాటిగురించి మరింత బాగా వివరించడానికి వీలవుతుంది. ఉదాహరణకు కేసు. 1.1 లో రీటాకు మీరిలా చెప్పొచ్చు.

"ఒక వ్యక్తి ఒత్తిడికి గురయినప్పుడు, లేక ఒక విషయం గురించి కలతచెందడం లేక విచారపడడం జరిగినప్పుడు ఆ వ్యక్తి కి నిద్ర సక్రమంగా పట్టక పోవడం, ఒంటి నెప్పులు, వ్యాకులతలు ఉంటాయి. మీకు గత నెల రోజులుగా అలసటగా, సంతోషమనేది లేకుండా ఉంది. మీ భర్త చనిపోవడం, మీ పిల్లలు గ్రామాన్ని విడిచి దూరంగా వెళ్ళడం వలన మీరు ఒత్తిడికి గురవడమే దీనికి కారణం. మీరు కుంగుబాటుకు లోనయారు. ఇది మీరు సోమరిగా మారడం వలనో లేక మీరు మెంటల్ అవడం వలనో కాదు. ఇది మన కమ్యూనిటీలో చాలామందికి కలిగే సాధారణ సమస్యే. మీరు వర్ణించిన సమస్యలన్నీ భావోద్వేగ అనారోగ్యంతో వచ్చినవే"

లేక 1.3 కేసులో రవి ఉదాహరణను తీసుకోండి :

“ఊపిరి సరిగ్గా తీసుకోలేక పోవడం, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం భయం, ఏంగ్జయిటీ లేక ఆందోళన వలన కలిగే లక్షణాలు. ఇవి చాలా సాధారణమైన లక్షణాలు, ఏదో ప్రమాదకరమైన వ్యాధి చిహ్నాలు కావు. నిజానికి అవి మీరు ఏ విషయం గురించో ఒత్తిడికి లేక విచారానికి లోనవడం వలన వచ్చేవే. మీరు ఒత్తిడికి గురయినప్పుడు వేగంగా శ్వాస తీసుకుంటారు. శ్వాస వేగం పెరిగినప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీకేదో ప్రమాదం జరగబోతూందనే భయం ఆవహిస్తుంది.

నిజానికి మీరు శ్వాసను నియంత్రించుకుని ఉన్నట్లయితే త్వరగా ఆసంఘటనను ఆపగలిగి ఉండేవారు. మీ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం వలన కలిగిన షాక్ కారణంగా మీరు ఏంగ్జయిటీతో బాధనడుతున్నారు. ఇది ఎవరికైనా జరగొచ్చు, ఇది మీరు చంచలంగా మారుతున్నదానికి నిదర్శనం కాదు."

లేక కేసు 1.4 లోని మైఖేల్ ఉదాహరణను తీసుకోండి :

twelve"మీకుగల నిద్రా సమస్యలు, ఉదయమే జబ్బుగా ఉన్నట్లనిపించడం, కడుపులో మంట, నెప్పి, మీరు విపరీతంగా మద్యాన్ని తాగడం వలన కలిగిన లక్షణాలు. మద్యం తాగడం అలవాటుగా మారే వ్యసనం కనుక ఇప్పుడు మీకు ఎప్పుడూ తాగుతూనే ఉండాలనిపిస్తూంది. అందువల్లే మీకు ఉదయం లేవగానే జబ్బుగా ఉన్నట్లనిపిస్తూంది. మీకు తాగడం మీద నియంత్రణ లేకుండా పోయిందని, మీకు జబ్బుగా, ఒంట్లో ఏమీ బాగోనట్లు అనిపిస్తూందని మీరు డిప్రెషన్ కి, విచారానికి లోనవుతున్నారు. మీరు తాగుడును ఆపేస్తే, ఈసమస్యలన్నీ మాయమయి మీరు మెరుగ్గా ఉంటారు"

అతని అనారోగ్యానికి కారణమేమిటని అతను అనుకుంటున్నాడో, దానికి ఏవి సహాయ పడతాయని భావిస్తున్నాడో ఆవ్యక్తిని మీరు అడగడం చాలా ముఖ్యం. అతని అభిప్రాయాల్ని అర్థం చేసుకోవడం చికిత్సను మెరుగ్గా రూపొందించడానికి ఉపయోగపడుతుంది.

తన వ్యాధి దుష్ట శక్తుల కారణంగా వచ్చిందని భావించే స్త్రీ ఉదాహరణ ను తీసుకోండి. మీరు ఆమెకు పూజారిని కలిసి ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోమని సలహాని ఇవ్వొచ్చు, కాని ఆమె బాధలు ఒత్తిడి వలన కూడా కలుగుతాయి ప్రశ్నలు లేక సందేహాలు కాబట్టి మీరు సూచించే చికిత్సను కూడా తీసుకోమనండి. అశాస్త్రీయంగా ఉన్నాయా? అనిపించినప్పటికీ ఆ వ్యక్తి అభిప్రాయాన్ని కొట్టి పారేయకండి. ఆ వ్యక్తి తన జబ్బు గురించి చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం ద్వారా మీరు మెరుగైన ఫలితాన్ని సాధించవచ్చు. మీ వివరణ తరువాత ఆ వ్యక్తి తన సందేహాల్ని కలవరాల్ని తీర్చుకునే అవకాశాన్ని తప్పక ఇవ్వండి.

ప్రశాంతత లేక శ్వాస వ్యాయామాలు

thirteenప్రశాంతంగా ఉండడం మానవ మెదడుపై ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది సంప్రదాయ ధ్యానం లోనూ, ఆధునిక సైకాలజీలో కూడా ఉపయోగపడే మార్గం. ప్రశాంతతను పొందడానికి ఉపయోగించే చాలా పద్ధతుల్లో శ్వాస వ్యాయామాల్ని ఉపయోగిస్తారు. ఈ వ్యాయామాలే భావోద్వేగ సమస్యలతో బాధపడేవారికి సహాయ పడడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

క్రింద సూచించిన విధంగా వ్యాయామాల్ని బోధించే ముందు మీరు స్వయంగా చేసి చూడండి. మీకు ప్రశాంతంగా, శాంతిగా అనిపిస్తుంది. మీకు జబ్బు ఉందని అనుకోకుండా మీరు తీసుకోగలిగిన చికిత్స ఇది!

ఈ వ్యాయామాల్ని రోజులో ఎప్పుడైనా చెయ్యొచ్చు. కనీసం రోజుకు 10 నిమిషాలు ఈ వ్యాయామాల కోసం కేటాయించాలి. వ్యక్తిని అలజడికి గురి చెయ్యకుండా, నిశ్శబ్దంగా ఉండే గదిలో వ్యాయామాల్ని చెయ్యాలి. ఈ క్రింది విధంగా చెయ్యాలి.

  • పడుకుని లేక సౌకర్యంగా కూర్చుని వ్యాయామాన్ని మొదలుపెట్టండి. ప్రత్యేకమైన స్థితి ఏమీ లేదు. ఏది సౌకర్యంగా ఉంటుందో అదే సరైన స్ఠితి.
  • ఆ వ్యక్తి కళ్ళ మూసుకోవాలి.
  • 10 సెకన్ల తరువాత తన శ్వాస లయ మీద దృష్టిని కేంద్రీకరించడం ప్రారంభించాలి.
  • అప్పుడు నెమ్మదిగా, క్రమంగా, స్థిరంగా ముక్కు ద్వారా ఊపిరి తీసుకోవడం మీద దృష్టిని కేంద్రీకరించమని చెప్పండి.
  • అతను ఎంత నెమ్మదిగా ఊపిరి లయ ఉండాలని మిమ్మల్ని అడిగినట్లయితే, నెమ్మదిగా మూడు అంకెలు లెక్కించే వరకు ఊపిరిని తీసుకుని, మళ్ళీ మూడు అంకెలు లెక్కించే వరకు ఊపిరిని విడవమని, తరువాత మూడు అంకెలు లెక్కించేవరకు, మళ్ళీ ఊపిరిని తీసుకునేవరకు, ఊపిరి తీసుకోకుండా ఆగమని చెప్పండి.
  • అతని తో ప్రతిసారి ఊపిరి తీసుకుంటున్నప్పుడు మనసులోనే రిలాక్స్ లేక తమ భాషలో దానికి సరితూగే పదాన్ని అనుకోమనండి. మత పరమైన విశ్వాసాలు ఉన్నవారు వారి మతానికి సంబంధించిన ముఖ్యమైన పదాన్ని ఉదాహరణకు, హిందువులు ‘ఓం’ లేక క్రైస్తవులు ‘స్తోత్రం’ అనే పదాల్ని ఉపయోగించవచ్చు.
  • ఏ విధంగా గాఢంగా, స్థిరంగా ఊపిరి తీసుకోవచ్చో మీరు చేసి అతనికి చూపించండి.
  • రోజూ చేస్తే రెండు వారాల్లో ఈ వ్యాయామాల ఫలితం అనుభవంలోకి వస్తుందని అతనికి తెలియజెప్పండి. తగినంత అనుభవం వచ్చినప్పుడు వివిధ రకాల సందర్భాలలో, ఉదాహరణకు బస్సులో కూర్చుని ఉన్నప్పుడు, అతను ప్రశాంతతను పొందగలడు.

ప్రత్యేకమైన లక్షణాలకు సలహా

వ్యక్తి లక్షణాలకు స్పందించే విధంగా ఉంటే కౌన్సిలింగ్ చాలా బాగా పని చేస్తుంది. ఈ మాన్యువల్ లోని తరువాత భాగాలలో ఇంకా వివరంగా వర్ణించబడిన ప్రత్యేకమైన లక్షణాలకు ఎలా చికిత్స చెయ్యాలో తెలపడానికి ఈ క్రిందివి ఉదాహరణలు:

  • పేనిక్ ఎటాక్స్ లేక భయబ్రాంతులవడం : వేగంగా ఊపిరి తీసుకోవడంతో పేనిక్ ఎటాక్స్ వస్తాయి. శ్వాస వ్యాయామాలు వీటిని తగ్గించడానికి సహాయపడతాయి.
  • భయాలు : కొన్ని ప్రత్యేక సందర్భాలలో వ్యక్తికి పేనికై ఎటాక్స్ రావడంతో అవి మళ్ళీ వస్తాయనే భయంతో ఆ సందర్భాలను తప్పించుకోజూస్తాడు. వీటిని పరిష్కరించడానికి సరైన మార్గం భయంగొలిపే ఆ సందర్భాలను ఎదుర్కోవడమే తప్ప పారిపోవడం కాదు.
  • అలసట మరియు నిస్తాణ : డిప్రెషన్ ఉన్న వారికి అలసటగా, నీరసంగా ఉంటుంది ఇది ఏ పనినీ చెయ్యకుండా ముడుచుకుని కూర్చునేలా చేస్తుంది. ఇది మరింత డిప్రెషన్ లో కూరుకు పోయేలా చేస్తుంది. ఈ విష వలయాన్ని ఛెదించడానికి డిప్రెషన్ లో ఉన్న వ్యక్తిని క్రమేపీ మామూలు పనులు చేసుకునే లాగా ప్రోత్సహించాలి.
  • నిద్రా సమస్యలు : ఇవి చాలా సాధారణం. సరైన నిద్రా పద్ధతి గురించి సాధారణ సలహా మళ్ళీ మామూలు నిద్రా పద్ధతులు రావడానికి చాలామందికి సహాయ పడుతుంది.
  • శారీరక ఆరోగ్యం గురించి చింత : ఇది కూడా చాలా సాధారణం, ముఖ్యంగా పీకులు, నెప్పులు లాంటి శారీరక బాధలు చాలా ఉన్నప్పుడు.

సమస్య ని పరిష్కరించడం

fourteenఒక వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలు అతను డిప్రెషన్ లేక ఏంగ్టయిటీకి గురవడానికి ఎలా దారితీస్తాయో, ఎలా ఈ భావోద్వేగాలు సమస్యల్ని పరిష్కరించడాన్ని కష్ట తరం చేస్తాయో సమస్యల పరిష్కార పద్ధతి బోధిస్తుంది. ఒక వ్యక్తియొక్క ఒక ప్రత్యేక సమస్యను పరిష్కరించడానికి మీరు ప్రయత్నించడం లక్ష్యం కాదు. దానికి బదులు మీరు అతనికి ఈ నైపుణ్యాలను నేర్పించి అతను తన సమస్యలను తానే స్వయంగా పరిష్కరించుకునే లాగా బోధించాలి

ఎ) సాధారణ సమస్య రోజువారీ అవసరాలకు తగినంత డబ్బు లేకపోవడం.

బి) ఇది మద్యం అలవాటుకు దారితీస్తుంది.

సి) ఆ వ్యక్తి తన విలువైన డబ్బును మద్యం కోసం ఖర్చు పెట్టడం వలన అతను మరింత పేదవాడవుతాడు.

డి) అతను తన పనిని సక్రమంగా చెయ్యడు, ఉద్యోగం ఊడిపోతుంది.

ఇ) ఇది అతన్ని మరింత విచారంలో మంచుతుంది, నిస్సహాయస్థితిలో మరింత ఎక్కువగా తాగుతాడు, ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువవుతాయి.

సమస్య పరిష్కారంలో అంచెలు ఈక్రింది విధంగా ఉంటాయి :

  • చికిత్సను వివరించండి.fifteen
  • సమస్యలను విశదపరచండి (వ్యక్తి ఎదుర్కొనే వివిధ సమస్యలేమిటి?).
  • సమస్యల సారాంశాన్ని చూడండి (ఈ సమస్యలకు, వ్యక్తి లక్షణాలకు సంబంధమేమిటి?).
  • సమస్యను ఎంపిక చేసి లక్ష్యాలను కూడా ఎన్నుకోండి (వ్యక్తి సమస్యను ఎందుకు అధిగమించాలి?).
  • పరిష్కారాలను నిర్దేశించండి (సమస్యను అధిగమించడానికి కార్యా చరణ).
  • ఆచరించాక ఫలితాన్ని సమీక్షించండి (అది సమస్యను తగ్గించిందా, లేక వ్యక్తి మూడ్ మెరుగుపడిందా?)

3.3 వ్యక్తులు ఎదుర్కొనే సమస్యల రకాలు :

  • భార్యా భర్తల మధ్య సంబంధాలలో సమస్యలు, మాట్లాడకపోవడం, వాదులాటలు, కుటుంబంలో హింస, లైంగిక జీవితం సక్రమంగా లేకపోవడం.
  • ఇతరులతో సంబంధాలలో సమస్యలు, అత్తమామలు, పిల్లలు, బంధువులు స్నేహితులు లాంటివారు.
  • ఉద్యోగ సమస్యలు, ఉద్యోగం లేకపోవడం, లేక మితిమీరి పని చేస్తున్నట్లు భావించడం.
  • ఆర్థిక సమస్యలు, సరిపడా డబ్బు లేక పోవడం, అప్పులు ఉండడం.
  • ఇంటి సమస్యలు, ఇంటి చుట్టూ ఎప్పుడూ గోల గోలగా ఉండడం.
  • సామాజిక ఒంటరితనం, కొత్త ప్రదేశంలో ఒక్కరూ ఉండడం, స్నేహితులెవరూ లేకపోవడం.
  • శారీరక ఆనారోగ్యాలు, ముఖ్యంగా దీర్ఘకాలంగా నెప్పులతో కూడిఉన్నవి.
  • లైంగిక సమస్యలు, లైంగిక ఆసక్తి తగ్గడం లాంటివి.
  • ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం.
  • చట్టపరమైన సమస్యలు.

చికిత్స గురించి వివరించండి :

చికిత్సను వివరించడంలో మొదటి అడుగు ఒక వ్యక్తి జీవితం లోని సమస్యలకు, అతని భావోద్వేగాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఆ భావోద్వేగాలు సమస్యా పరిష్కారంలో ఎలా అడ్డంకిగా ఉంటాయో స్పష్టంగా తెలియజేయడం. ఈ పద్ధతి ఏవిధంగా పనిచేస్తుందో ఇలా వివరించవచ్చు.

“మీకులాగే బాధలున్న వారికి ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు, సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది తెలుసుకోవడం సహాయ పడుతుంది. మీ సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించుకునే మార్గాల గురించి ఆలోచించాలనుకుంటున్నాను.”

సమస్యలను స్పష్టం చెయ్యండి :

తన జీవితంలో ఆమె ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రశ్నించండి. సమస్యల్ని లోతుగా తెలుసుకునేందుకు ఆమె కుటుంబ జీవితం గురించి ప్రశ్నించండి. వ్యక్తిగతమైన అంశాల్ని (లైంగిక జీవితం లాంటివి) ప్రస్తావించేముందు కొంచెం సురక్షితమైన అంశం (పని లేక ఉద్యోగం లాంటివి) గురించి ప్రశ్నించడంతో ప్రారంభించండి. అయినప్పటికీ, వ్యక్తిగత అంశాల్ని ప్రశ్నించినప్పుడు - అవి చాలా ముఖ్యమైనవని, వ్యక్తిని కుదుపుతాయని గుర్తుంచుకోండి. వ్యక్తిగత ప్రశ్నల్ని వేసేటప్పుడు ఒక ఉపయోగకరమైన పద్ధతి ఇలా చెప్పడం...

“ఎవరైనా విచారంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వారికి సెక్స్ మీద ఆసక్తి తగ్గిపోతుంది, మీకెప్పుడైనా అలా జరిగిందా?"

లేక

“విచారంలో ఉన్నవారు మామూలుకంటే ఎక్కువగా తాగడం సాధారణం, మీరెంత తాగుతున్నారు?"

ఈ పద్ధతిలో వ్యక్తిగతమైన విషయాన్ని ప్రస్తావించడం మీ ప్రశ్నలకు అతను ‘అవును’ అని చెప్పినప్పటికీ మీరు ఆశ్చర్యంతో నిశ్చేష్ణులవరని నిరూపిస్తుంది. మానసిక అనారోగ్యాలు ఉన్న వారితో మాట్లాడేటప్పుడు ఆరోగ్య కార్యకర్తలు ఇబ్బంది పడే అంశాల జాబితా పెట్టె 3.3. లో ఇవ్వబడింది

సమస్యలను సంక్షిప్తంగా చెప్పడం :

ఒకసారి సమస్యల సమాచారాన్నితెలుసుకున్నాక వ్యక్తితో ఇలా చెపూసమస్యల గురించి టూకీగా తెలియజేయండి

“మీరు మీ బిడ్డ పుట్టాక మీ జీవితంలో అనేక విషయాలు మారాయని చెప్పారు. మీరిప్పుడు ఉద్యోగం చెయ్యడం లేదు, సగం రాత్రి మేల్కొనే ఉంటున్నారు, మీ స్నేహితుల్ని చూడడమే అవడం లేదు. ఇదంతా మీభర్తకు మీకు మధ్య ఉన్న సంబంధంమీద ప్రభావం చూపుతోంది".

ఈ విధంగా చెయ్యడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆమెకు తను చెప్తున్నది మీరు శ్రద్ధగా వింటున్నారనే నమ్మకాన్ని కలిగిస్తుంది. సమస్యలకు ఒక నిర్మాణం ఉంటుందని తెలుపుతుంది. వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడే పద్ధతి అని కూడా తెలుస్తుంది.

ఒక సమస్యను ఎంపిక చేసుకుని లక్ష్యాన్ని ఏర్పరచుకోండి :

తరువాత అడుగు పరిష్కరించదగిన ఒక ప్రత్యేకమైన సమస్యను ఎంపిక చేసుకోవడం, వ్యక్తి తను పెట్టుకోవాలనుకుంటున్న లక్ష్యాలను ఎన్నుకోవడం. సరైన సమస్యను ఎంపిక చేసుకోవడానికి ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి.

  • తనకు ఉన్న సమస్యలనన్నిటిని చెప్పమనండి. అన్నిటికంటే ఎక్కువగా అతన్ని బాధిస్తున్న సమస్యలేమిటో గుర్తించండి. స్వల్ప కాలంలో పరిష్కరించగలిగిన సమస్యపై గురిపెట్టండి, ఉదాహరణకు సమస్య తన భర్త లేక భార్యతో సంబంధంలో దీర్ఘకాలంగా ఉన్న ఇబ్బందికి సంబంధించినదయితే అది ముందుగా చేపట్ట వలసిన సమస్య కాదు. అలాకాక ఉద్యోగానికి లేక సాంఘిక ఒంటరితనానికి సంబంధించిన ఇలీవలి సమస్యతో ప్రారంభించడం ఉపయోగకరంగా ఉంటుంది.
  • చికిత్స లక్ష్యం ఆతనికి సమస్యల్ని పరిష్కరించుకునే నైపుణ్యాలను నేర్పడమే తప్ప అతని సమస్యలనన్నిటినీ పరిష్కరించడం కాదని గుర్తుంచుకోండి.
  • ఒకసారి సమస్యను ఎంపిక చేసాక, ఆవ్యక్తి చికిత్సతో తను పరిష్కరించుకోవాలి అనుకుంటున్న సమస్య అదేనో, కాదో అడిగి నిర్ధారించుకోండి.

పరిష్కారాల్ని నిర్దేశించండి :

దీనిలో ఈక్రింది అంశాలు ఉన్నాయి:

  • పరిష్కారాలను ఆలోచించండి - ఆ వ్యక్తితో వివిధ పరిష్కారాల గురించి చర్చించండి.seventeen
  • పరిష్కారాల సంఖ్యను తగ్గించండి- ఎక్కువ ప్రత్యమ్నాయాలు ఉంటే ఆతని సాంఘిక నేపథ్యంలో ఆచరణ సాధ్యమైన వాటిమీద దృష్టిని కేంద్రీకరించండి.
  • తరువాత పరిణామాలను గుర్తించండి - పరిష్కారాల ఫలితంగా తరువాత రాగల పరిణామాలను పరిగణనలోకి తీసుకోండి.
  • అత్యుత్తమ పరిష్కారాన్ని ఎంచుకోండి.
  • పరిష్కారాన్ని ఎలా అమలు చెయ్యాలో ప్రణాళిక వేసుకోండి.
  • మళ్ళీ మీరు కలుసుకునేలోగా అతను సాధించగల లక్ష్యాలను నిర్దేశించండి
  • మరీ చెడుగా జరిగినప్పుడు, ఉదాహరణకు, పూర్తిగా ఆ పరిష్కారం విఫలమైనప్పుడు, ఏమిజరగగలదో అంచనా వేయండి.

తన సమస్యలకు అతనికి తోచిన పరిష్కారాల్ని చెప్పడానికి ప్రోత్సహించండి. ఈ eighteenవిధంగా అతని ఆత్మవిశ్వాసం పెరగడానికి సహాయ పడతారు. ఉదాహరణకు, ఒంటరిగా ఉండడం పెద్ద సమస్య అని అతను అంటే "మీరు స్నేహితుల ఇళ్ళకు వెళ్ళడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని నేననుకుంటున్నాను" అని, సమస్యకు అదెంత పూర్తిగా సరైన, తార్మికమైన పరిష్కరమైనప్పటికీ, చెప్పొద్దు. దానికి బదులు ఇలా చెప్పండి "ఇప్పుడు సమస్యేమిటో తెలిసింది కదా, దీనికి ఏం చేద్దామో మీరే చెప్పండి".

తరచుగా పరిష్కారాలను గుర్తించడం కష్టం, ఇంకా ఎక్కువ ప్రశ్నల్ని వెయ్యడం ద్వారా లేక ఈ క్రింది విధంగా ప్రత్యక్ష సలహాలనివ్వడం ద్వారా సహాయపడవచ్చు.

నా భర్త చనిపోయాక, మాపిల్లలు ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తరువాత నన్ను ఒంటరితనం చాలా బాధిస్తుంది.

  • కీలకమైన సాంఘిక ఆసరాలను గుర్తించడం ద్వారా అతనికి తనకు ఆధారమివ్వగల వారిగురించి అవగాహనను కలిగించవచ్చు.
  • స్థానికంగా ఉన్న సహాయ కేంద్రాల గురించి మీకు బాగా తెలిసి ఉండడం చాలా ముఖ్యం. ప్రత్యేకమైన సమస్యలకు ఆచరణాత్మక సలహానివ్వగలిగే వీలుంటుంది.
  • కొంతమంది విషయంలో మీరు మరింత ప్రత్యక్ష పాత్రను నిర్వహించవలసి రావచ్చు, ఉదా. నిరక్షరాస్యులైన వ్యక్తుల తరపున సహాయ సంస్థలకు ఉత్తరాలు రాయడం.
  • వ్యక్తి సమస్యలకు పరిష్కారాల గురించి మీ అభిప్రాయాలను, ముఖ్యంగా చికిత్స ప్రారంభంలో, చెప్పవలసి రావచ్చు, కాని ఏదో ఒక దశలో అతనే ప్రధాన పాత్ర తీసుకునేలాగా ప్రయత్నించాలి.
  • కొన్ని సాధారణ సమస్యలకు పరిష్కారాల్ని ఈ మాన్యువల్లోని ఇతర భాగాలలో సూచించడం జరిగింది
  • కుటుంబంలో హింస.
  • ఒంటరితనం, వేరుగా, ఏకాంతంగా ఉండడం.
  • సన్నిహితుల్ని కోల్పోవడం.
  • సంబంధాలలో సమస్యలు.
  • మద్యం, మత్తు మందుల దుర్వినియోగం.
  • జబ్బు పడిన బంధువు సంరక్షణ.

సమీక్ష :

ఆ వ్యక్తిని కలిసి మాట్లాడినదాన్ని సంక్షిప్తంగా సమీక్ష చేసుకోవాలి. ముఖ్యంగా లక్ష్యాలు, సమస్యల పరిష్కారానికి ప్రణాళికను సమీక్షించాలి.

తరువాత సమావేశాలు :

తరువాత సమావేశాల ప్రధాన లక్ష్యం :

  • ఆ వ్యక్తి ఎంతబాగా తన పనుల్ని పూర్తి చేసాడో సమీక్షించడానికి.
  • ఒకవేళ కొంత మెరుగుదల ఉంటే అదే సమస్యకు కొత్త పరిష్కారాల్ని లేక కొత్త సమస్యకు పరిష్కారాల్ని ప్రయత్నించడం.
  • ఒకవేళ కొంత మెరుగుదల కూడా లేకపోతే, ఎందుకు అలా జరిగిందో విశ్లేషించి, కొత్త లక్ష్యాల్ని ఏర్పరచుకోవాలి
  • మెరుగుదలను మదింపు చేసేటప్పుడు నిర్దిష్టంగా ఉండాలి. ఎలా ఉన్నారు? అంటే ఆమె భుజాలెగరేసి, ‘ఒ.కే.’  అనే అస్పష్టమైన సమాధానం చెస్తే, దాన్ని మీరు ఆమోదించగూడదు. ఆమె కచ్చితంగా ఎలా చేసిందో ఆ వివరాల్ని ఈ క్రింది విధంగా అడగాలి :
  • తన లక్ష్యాన్ని చేరడానికి ఆమె ఏమి చేసింది?
  • అది సులభంగా ఉందా లేక కష్టమనిపించిందా?
  • ఆమె భావాల మీద, అనుభూతుల మీద దాని ప్రభావమేమిటి?
  • నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సంతృప్తికరంగా చేరుకున్నట్లు మీరు, ఆమె అంగీకరించి కొత్త లక్ష్యం పైన దృష్టి
  • సారించాలనుకుంటున్నారా?
  • ఒకవేళ అనుకున్నట్లు జరగకపోతే ఏమి తప్పిదం జరిగింది?

సంక్షోభంలో ఉన్నప్పుడు కౌన్సిలింగ్

సంక్షోభం అంటే ఒక వ్యక్తి ఇంక సమస్యల్ని ఎదుర్కోవడం తన వల్ల కాదని లేక తను జీవితంలో ఓడిపోయానని భావించడం. ఒక వ్యక్తికి సంక్షోభం అనిపించింది వేరే వ్యక్తికి తప్పనిసరిగా సంక్షోభం అనిపించకపోవచ్చు. సంక్షోభం అనేది తన పరిస్థితి గురించి ఆవ్యక్తి యొక్క దృష్టికోణం మీద, ఆ పరిస్థితి తాలూకు సమస్యల్ని ఎదుర్కోవడంలో అతని సామర్థ్యం మీద ఎలాంటి ప్రభావం చూపింది అనే దాని మీద ఆధారపడుతుంది. సంక్షోభంలో కౌన్సిలింగ్ దుఃఖాన్ని తట్టుకునేందుకు ఆ వ్యక్తికి సహాయపడాలి. సంక్షోభ కౌన్సిలింగ్ లో కీలకమైన అడుగులు:

  • ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోండి : ఏమి జరిగింది? ఆమె క్లినిక్ కి ఎందుకు వచ్చింది? ఈ సమయంలో ఆమెకు సహాయపడ గల వారెవరు? ఆమెతో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు లేక ఇతరుల నుండి సమాచారాన్ని పొందండి
  • ఐకమత్యాన్ని నెలకొల్పుకోండి : ఆమెను తన కథను తన స్వంత వేగంతో చెప్పనివ్వండి. తొందరలో ఉన్నట్లు కనపడకండి. ఆమెతో ఏకాంతంగా మాట్లాడండి.
  • వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యాన్ని అంచనా వెయ్యండి : ఆమెతో మాట్లాడుతూ, ఆమెను గమనిస్తూ, ఆమె ప్రవర్తన అసహజంగా ఉందా అనేది చూడండి. ఆమె పొంతన లేని విషయాల్ని మాట్లాడుతూందా, ఆమె తాగి ఉన్న చిహ్నాలేమైనా ఉన్నాయా అనేది గమనించాలి.
  • సంక్షోభాన్ని కలగజేసిన ప్రధాన సమస్య ఏమిటో అంచనా వెయ్యండి : సాధారణంగా సంక్షోభానికి కారణంగా ఒకే ఒక్క ప్రధాన సమస్య ఉంటుంది. చాలా తరచుగా అది భార్యాభర్తల మధ్య సంబంధం తెగిపోవడం, దగ్గరి వ్యక్తి మరణించడం, లేక హింస ఫలితం అయుంటుంది.
  • పరిష్కారాల్ని సూచించడానికి ప్రయత్నించండి : ఇతరులతో మనసు విప్పి తన సమస్యను చెప్పడం, ఆమె పిచ్చిదయి పోవడం లేదనే నమ్మకాన్ని కలిగించడం, పోలీస్ లేక ఇతర సహాయ సంస్థలతో మాట్లాడడం, బాగా తీవ్రంగా ఉన్నప్పుడు కొద్ది సమయం పాటు హాస్పటల్ లో ఉంచడం మొదలైనవి దీనిలో భాగమే.
  • అవసరమైతే మందును ఇవ్వండి : ఉదాహరణకు ఆమె చాలా కల్లోలస్థితిలో ఉండి, సరిగ్గా నిద్ర పోకపోతే కొన్ని రోజులకు నిద్రమాత్రల్ని ఇవ్వండి.
  • తప్పనిసరిగా మళ్ళీ సమీక్షకొరకు ఒకటి, రెండు రోజుల్లో రమ్మనండి : ఒకటి, రెండు రోజుల్లో చాలామంది కొంత ప్రశాంతంగా ఉంటారు, పరిస్థితిని కొంచెం ఎక్కువగా నియంత్రణలో ఉంచుకుంటారు. అప్పుడు వారి మానసిక స్థితిని మరింత లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుంది.

మానసిక వ్యాధులు ఉన్నవారిని పూర్వ స్థితికి తేవడం

మానసిక వ్యాధులు ఒక వ్యక్తి ఇంట్లోనూ, పని చేసే దగ్గర, సాంఘిక సందర్భాల్లోనూ తమ సామర్థ్యానికి తగినట్లు పని చెయ్యడం మీద ప్రభావాన్ని చూపుతాయి. బాగా తీవ్రంగా ఉన్న మానసిక వ్యాధులు ఒక వ్యక్తిని అశక్తుడిని చెయ్యడానికి చాలా కారణాలుంటాయి :

  • “అనుభవం" లక్షణాలు ఒక వ్యక్తి "ఇంక పని చేసి లాభం లేదు", లేక "స్నేహితుల్ని కలవాల్సిన పని లేదు" అని భావించేలా చెయ్యొచ్చు.
  • “ఆలోచన” లక్షణాలు ఒక వ్యక్తి ఏకాగ్రతను నిలపడం, సరిగ్గా నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులతో మాట్లాడడాన్ని కష్టతరం చెయ్యొచ్చు.
  • అసహజమైన ప్రవర్తన ఒక వ్యక్తిని ఇతరుల నుండి వేరు చెయ్యొచ్చు.
  • నింద, వివక్ష మానసిక వ్యాధులు ఉన్నవారికి ఉద్యోగం దొరకడం, వివాహం కావడం కష్టమయేలా చేస్తాయి.

రీహాబిలిటేషన్ అంటే వ్యాధి ప్రారంభమయే ముందున్న మామూలు స్థితికి చేరడానికి మార్గాల్ని కనుకునేందుకు సహయపడే ప్రక్రియ. ఒక వ్యక్తి ఈ లక్ష్యాన్ని చేరేందుకు సహాయ పడడానికి మీరు చెయ్యగలిగినవి చాలా ఉన్నాయి :

  • వ్యాధికి సరైన చికిత్స అందేలాగా జాగ్రత్త తీసుకోండి.nineteen
  • ఆ వ్యక్తితోనూ, అతని కుటుంబ సభ్యులతోనూ కలిసి అతన్ని వ్యాధి రాకముందు స్థితికి తేవడానికి ప్రణాళికను రూపొందించండి.
  • అతను చెయ్యగలిగే, అతనికి సంతోషం కలిగించే కార్యక్రమాల్ని సూచించండి. (అతను వీటిలో విజయం సాధిస్తే ఇంకా కొత్తవి, ఎక్కువ కష్ట సాధ్యమైన వాటిని సూచించండి).
  • రీహాబిలిటేషన్ ని రూపొందించేటప్పుడు వ్యాధికి ముందు అతని సామర్ధ్యాలను పరిగణనలోకి తీసుకోండి.
  • ఒక బాధ్యత గల, పరిణత వయసు ఉన్న వ్యక్తిగా అతన్ని పరిగణించాలని కుటుంబ సభ్యులకు  చెయ్యండి
  • స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగువారు, సమాజంలోని ఇతరులతో సంబంధం పెట్టుకోవడానికి ప్రోత్సహించండి.
  • అతను భక్తి ఉన్నవాడయితే, మందులతో చికిత్సకు అడ్డంకి కావు కనుక భక్తి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ప్రోత్సహించండి.
  • కొంత అశక్తత ఉన్నవారికి సానుభూతితో ఉద్యోగం ఇచ్చేవారెవరైనా మీకు తెలిస్తే, వారితో ఈ వ్యక్తి గురించి చెప్పండి.
  • వడ్రంగి పని లేక ఇతర వృత్తి విద్యానైపుణ్యాల శిక్షణకేంద్రాలకు ఆవ్యక్తిని పంపండి.
  • ఎప్పటికప్పుడు అతని ప్రగతిని గమనిస్తూ ఉండండి, ఈ సమావేశాల్ని మానసిక ఆరోగ్య సమస్యల గురించి, జీవితంలో అతనిని వేధిస్తున్న కష్టాల గురించి కౌన్సిలింగ్ చెయ్యడానికి ఉపయోగించుకోండి.

మానసిక ఆనారోగ్యానికి చికిత్సలో తరువాత మళ్ళీ మళ్ళీ పరీక్షించడం ప్రాధాన్యత

సరైన వ్యాధి నిర్ధారణ, చికిత్స కొన్ని ఆరోగ్య సమస్యల్ని నయం చేస్తాయి. అలా నయం చెయ్యగలిగిన సమస్యలకు ఉదాహరణ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కాని మానసిక వ్యాధుల సంగతి వేరు. మానసిక వ్యాధి ఉన్న వ్యక్తిని అనేక సార్లు చూడడం వ్యాధి నుంచి కోలుకోవడానికి సహాయ పడుతుంది. మీరు ఒక వ్యక్తిని అనేకసార్లు చూసినప్పుడు ఈ అవకాశం కలుగుతుంది:

  • ఆమెతో మంచి సంబంధాన్ని నెలకొల్పుకోవడానికి.twenty
  • ఆమెకు ఆసరా నివ్వగల బంధువులను కలుసుకోవడానికి.
  • ఆమె సమస్య గురించి మీరు నిజంగా అలోచిస్తున్నారని, ఆమె పరిస్థితి మెరుగుపడాలని మీరు కోరుకుంటున్నారని ఆమె భావించడానికి.
  • వ్యాధి తగ్గుతూందో, లేదో తెలుసుకోవడానికి.
  • చికిత్స తీసుకుంటూందో, లేదో గమనించడానికి-చాలా చికిత్సలు పని చెయ్యడానికి సమయం పడుతుంది, ఒకసారి పని చెయ్యడం మొదలయ్యాక కొంతకాలం వాడవలసి ఉంటుంది; త్వరగా మందుల్ని మానడం తరచుగా వచ్చే సమస్య; ఆమెను అప్పుడప్పుడు కలవడం వలన దీనిని నివారించవచ్చు.

ఇతర చికిత్సలు

మానసిక వ్యాధి ఉన్నవారికి సహాయ పడడానికి కొన్ని ఇతర చికిత్సలు ఉన్నాయి. twentyoneసామాన్య ఆరోగ్య కార్యకర్తలు వీటిని ఉపయోగించే అవకాశం తక్కువ అయినప్పటికి వీటి గురించి కొంచెం తెలుసుకోవడం సహాయకారిగా ఉంటుంది.

  • ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ (ఇ.సి.టి) : చాలా భయపడే "షాక్ థెరపీ" కి ఇది సాంకేతిక పేరు. దీని అవసరం లేని వారికి కూడా ఈ థెరపీని ఇస్తున్నారనే దానిలో సందేహం లేదు. ఒక్కోసారి దీనిని ఎనస్థీషియా లేకుండా ఇస్తూ ఉండి ఉండొచ్చు, ఇది అమోదించ లేని, నీతి బాహ్యమైన చర్య ఇలాంటి చెడ్డ సంఘటనలు ఉన్నప్పటికి, తీవ్రమైన డిప్రెషన్, తీవ్రమైన ఉన్మాదం లాంటి వ్యాధులకు ఇ.సి.టి నాటకీయమైన, సమర్థవంతమైన చికిత్స. ఇది చాలా సురక్షితం కూడా. ఎనస్థీషియా ఇచ్చి చేస్తే ఇబ్బందులు రావడం చాలా అరుదు.
  • సైకోథెరపీ : ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనూ, అభివృద్ధి twentytwoచెందుతున్నదేశాల్లోనూ పట్టణ, పై తరగతి ప్రాంతాలలో ఇప్పుడు చాలా సైకోథెరపీ క్లినిక్ లు అందుబాటులో ఉన్నాయి. సైకోథెరపీ ఎక్కువ సంక్లిష్టమైన తరహాకు చెందిన కౌన్సిలింగ్. దీనికి పెద్ద అడ్డంకి, చాలా తక్కువ మంది నిపుణులు ఉండడం. ఎక్కువ ఖరీదు, ఎక్కువ సమయం వినియోగించవలసిన అవసరం ఉండడం వలన అత్యధిక మంది రోగులకు ఇది అందుబాటులో లేదు.
  • ఆధ్యాత్మిక థెరపీ : చాలా సంస్కృతుల్లో శరీరం, మనసు ఒకటేనని భావిస్తారు. భావోద్వేగ సమస్యలకు పూజారుల్ని స్వస్థత పరచేవారిని సంప్రదిస్తారు. జీవవైద్య చికిత్సలు సులభంగా పొందగలిగినప్పటికి, చాలా మంది డిప్రెషన్ కి, ఏంగ్జాయిటీకి, కుటుంబ సమస్యలు మొదలైన వాటికి ఆధ్యాత్మిక సహాయాన్ని ఎంపిక చేసుకుంటారు. మీరు వారు వ్యాధిని నిర్ధారించే విధానాన్ని చికిత్స చేసే పద్ధతిని అంగీకరించక పోవచ్చు కాని, ఇంకా వారు ఆరోగ్య సంరక్షణ ప్రక్రియలో భాగస్వాములే. కొంతమంది ఆధ్యాత్మిక వైద్యులు మందుల్ని ఆపేయమని చెప్తారు. అలాంటివారి దగ్గరకు సహాయం కోసం వెళ్తున్నవారిని హెచ్చరించి వారించండి.

మానసిక వైద్యనిపుణుడి దగ్గరకు ప౦పి౦చడ౦

మానసిక వైద్య నిపుణులలో చాలా రకాలు ఉంటారు:

  • సైకియాట్రిస్ట్స్ మెడికల్ డాక్టర్లు, ప్రాథమిక వైద్య విద్య, శిక్షణ తరువాత మానసిక వైద్యవిద్యకు సంబంధించిన కోర్సును చదివి, మానసిక వ్యాధుల్ని నయం చెయ్యడానికి శిక్షణను పొందుతారు. చాలా దేశాల్లో అత్యధిక సైకియాట్రిన్స్ హాస్పటల్స్ లోనే పని చేస్తారు. సామాన్య ఆసుపత్రుల్లో ఒక ప్రత్యేక వారు లేక ఒక ప్రత్యేక ఆసుపత్రే దీనికి ఉండొచ్చు. సైకియాట్రిన్స్ ప్రధాన నైపుణ్యాలు తీవ్రమైన మానసిక వ్యాధుల్ని నిర్ధారించి, చికిత్స చెయ్యడంలో ఉంటుంది. వారు మందుల్ని ఇ.సి.టి ని, కొంత "మాటల" చికిత్సను లేక కౌన్సిలింగ్ చేస్తారు.
  • సైకాలజిస్ట్స్ ఏ విధంగా మానవులు జీవితం గురించి నేర్చుకుంటారు, భావోద్వేగాల్ని అనుభవిస్తారు, ఇతరులతో ప్రవర్తిస్తారు అనే వాటిపై ఆధార పడిన వాదాలు లేక ఊహల సహాయంతో మానసిక వ్యాధుల చికిత్స చెయ్యడంపై శిక్షణను పొందుతారు.
  • సైకియాట్రిక్ నర్సులు మానసిక వైద్యంలో ప్రత్యేక శిక్షణను పొందుతారు. వారు ఆసుపత్రులలో గాని, కమ్యూనిటీలో గాని పనిచేస్తారు. వారిప్రధాన పాత్ర "మాటల" చికిత్సను చెయ్యడంలో, తీవ్రమైన మానసిక వ్యాధులు ఉన్నవారికి చికిత్స మరియు రీహేబిలిటేషన్ ని చెయ్యడంలో,
  • సైకియాట్రిక్ సమాజ సేవకులు ఆసుపత్రుల్లో గాని కమ్యూనిటీలో గాని పనిచేస్తారు. వారు సాంఘిక సమస్యలు, మానసిక వ్యాధిగ్రస్తులు జీవితంలో ఎదుర్కొనే కష్టాల విషయంలో పరిష్కారాన్ని పొందడంలో సహాయపడతారు. సైకియాట్రిక్ నర్సులు, సైకియాట్రిక్ సమాజసేవకులు “మాటల" చికిత్సను చేస్తారు.
  • చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువమంది సైకియాట్రిన్స్ ఉన్నారు. అందువలన ఎక్కువ మంది మానసిక వ్యాధిగ్రసులకు సామాస్య కార్యకర్తలే చికిత్స చెయ్యవలసిన అవసరం ఉంది. అసలు చాలామంది మానసిక రోగులకు సైకియాట్రిన్స్ చికిత్స చెయ్యాల్సిన పని లేదు. చాలా మానసిక వ్యాధుల్ని సామాన్య కార్యకర్తలే గుర్తించి, చికిత్స చెయ్యగలరు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో మానసిక వైద్య నిపుణుల దగ్గరకు రోగుల్ని పంపవలసిన అవసరం పడుతుంది. ప్రత్యేక సందర్భాల గురించి ఈ మాన్యువల్లో చాలా సార్లు చర్చించడం జరిగింది. ఒక సామాన్య నిబంధనగా ఈక్రింది పరిస్థితుల్లో మానసిక వైద్య నిపుణుడి దగ్గరకు రోగిని పంపండి:

  • అసహజమైన ప్రవర్తనలు ఉన్న వారిని, తలకు దెబ్బలు తగిలిన వారు, బాగా ఎక్కువ జ్వరం లాంటి శారీరక వ్యాధి ఉందనే ఆధారం ఉన్నప్పుడు.
  • ఇంటి దగ్గర ఉంచి సాకడం అసాధ్యమైనంత తీవ్రంగా వ్యాధి ఉన్నప్పుడు.
  • ఏ బిడ్డ అయినా బుద్ధి మాంద్యం లేక ఇతర మెదడుకు సంబంధించిన సమస్యతో బాధ పడుతున్నప్పుడు.
  • ఎక్కువ మోతాదులో మద్యాన్ని మత్తు మందుల్ని తీసుకునేవారు అకస్మాత్తుగా వాటిని మానాలని ప్రయత్నించినప్పుడు తీవ్రమైన బాధలకు దారితీస్తే.
  • మీరు చికిత్స చెయ్యడానికి ప్రయత్నించినప్పటికీ వ్యాధి లక్షణాలు రోగుల వ్యక్తిగత జీవితంపై, వారి పనిపై ప్రభావం చూపుతూనే ఉన్నప్పుడు.

అంతేకాక తీవ్రంగా అత్మహత్యా ప్రయత్నం చేసిన వారిని కూడా వారి జీవితం ప్రమాదంలో లేదని నిర్ధారించుకునేందుకు ఒక ఆత్యవసర వైద్య విభాగానికి పంపాలి. ఇది చేసాక కూడా ఇంకా అతను ఆత్యహత్యా ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పుడు మానసిక వైద్య నిపుణుడి దగ్గరకు పంపండి. ఫిట్స్ వస్తున్నవారిని ఫిట్స్ కి మందుల్ని క్రమంగా వాడే ముందు మానసిక వైద్య నిపుణుడు (న్యూరాలజిస్ట్ లేక సైకియాట్రిస్ట్) చూచి అంచనా వెయ్యడం మంచిది. ఎవరినైనా మెరుగైన చికిత్స లేక పరిష్కారాన్ని ఆశిస్తూ వేరెవరి దగ్గరికైనా పంపినప్పుడు సమస్య నేపథ్యాన్ని ఇప్పటికే చేసిన చికిత్సల్ని గురించి కొంచెం వివరిస్తూ ఒక ఉత్తరం రాసిస్తే సహాయకారిగా ఉంటుంది. ఉదాహరణగా రాసిన ఉత్తరం నమూనా పెట్టె 3.4 లో ఇవ్వబడింది. మీరు కూడా మానసిక వైద్య నిపుణుడిని కమ్యూనిటీలో ఎవరినైనా ఎలా సంరక్షించాలో సలహానిసూ ఉత్తరం రాయమని అడగొచ్చు.

3.4 మానసిక వైద్య నిపుణుడి దగ్గరకు రోగిని పంపేటప్పుడు రాసే ఉత్తరం నమూనా, కేసు 1.10 లో రామన్ని గురించి ప్రియమైన డాక్టర్ గారికి

దయచేసి ఈ రామన్ కి మీ సలహానివ్వండి. 74 సంవత్సరాల వయసు ఉన్న ఇతను తన కొడుకు, కోడలుతో కలిసి నివసిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇతను జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల ఇతను చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఉదాహరణకు ఇతను ఇంటి బయటకు వెళ్ళి అటూ ఇటూ తిరిగి ఇంటి దారి కనుక్కోలేక ఎటో వెళ్ళిపోతున్నాడు. ప్రస్తుతం ఇతని జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంది, పైగా కారణమేమీ లేకుండానే ఇతనికి కోపంవసూంది. నేనితనికి నిద్ర మాత్రల్ని విటమిన్ మాత్రల్ని ఇచ్చాను, కాని ఇది ఏమీ మార్పు తేలేదు. రామన్ తన గురించి మధనపడే, అసరా నిచ్చే కుటుంబంతో నివసిస్తున్నాడు...

3.5. మానసిక వ్యాధి చికిత్సలో గుర్తుంచుకోవలసిన విషయాలు :

  • మానసిక వ్యాధి ఉన్న చాలామందికి మానసిక వైద్యుడు చేసినంత బాగానూ సామాన్య ఆరోగ్య కార్యకర్తలు చికిత్స చెయ్యగలరు.
  • వ్యాధి గురించి కనీసం ప్రాథమిక వివరణను సంబంధిత వ్యక్తులకు ఇవ్వాలి. శ్వాస వ్యాయామాలు లాంటి కౌన్సిలింగ్ పద్ధతుల్ని సామాన్య ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సులభంగా అమలు చెయ్యొచ్చు.
  • సక్రమంగా వాడితే మానసిక వ్యాధుల మందులు సమర్థంగా పని చేస్తాయి, సురక్షితం.
  • మందుల్ని వాడడానికి సాధారణ కారణాలు, సైకోసెస్, డిప్రెషన్, ఏంగ్డయిటీ లకు చికిత్స
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

         *సభ్యులకు విజ్ఞప్తి*
          ******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

కామెంట్‌లు లేవు: