శోభి మచ్చలు-చర్మం పైన తెల్ల మచ్చలు (vitiligo)నివారణకు నవీన్ నడిమింటి సలహాలు
కావాల్సిన వస్తువులు:
1.తులసి ఆకులు -20
2.మంచి పసుపు -1 స్పూన్
తయారు చేయు విధానం:
తులసి ఆకులు, మంచి పసుపును-కొంచం నీరు తీసుకొని మెత్తగా నూరండి.
ఉపయోగించాల్సిన విధానం:
స్నానానికి గంట ముందు ఆయా మచ్చల పై రుద్దండి. అది ఎండి పోయే వరకు ఉంచి స్నానం చేయండి . అలా 21 రోజులు చేయండి. ఫలితం మీకే తెలుస్తుంది.
శోభి మచ్చలు --- నివారణ
శరీరం మీద తెల్లటి మచ్చలు వుండడం దీని లక్షణం
తులసి ఆకులు ---20
దంచిన పసుపు పొడి ---- ఒక టీ స్పూను.
రెండింటిని కలిపి అవసరమైతే నీరు కలిపి మెత్తగా నూరాలి. స్నానానికి గంట ముందు శోభి మచ్చల మీద సున్నితంగా మర్దన చెయ్యాలి. ఎండిపోయిన తరువాత సున్ని పిండి తో స్నానం చెయ్యాలి.
కడుపులోకి:-
పసుపు ----- 50 gr
పాత బెల్లం ----- 100 gr
రెండింటిని బాగా కలిసి పోయేట్లు దంచి గాజు సీసాలో భద్ర పరచుకోవాలి. ప్రతి రోజు 5 గ్రాముల ముద్దను బుగ్గలో పెట్టుకొని చప్పరించి తిని ఒక గ్లాసు మజ్జిగ తాగాలి.
శోభి (తెల్ల మచ్చలు లేక సిబ్బెం )
కారణాలు :-- పదార్ధాలు కలుషితం కావడం, సున్ని పిండి వాడక పోవడం, తైలం రాయక పోవడం, సబ్బుల వాడమ ఎక్కువకావడం, మొదలైనవి.
ఈ మచ్చలు ముఖం మీద శరీరం మీద చాతీ మీద మెడ మీద వస్తాయి.
తైల మర్దన వలన మచ్చలు రాకపోవడమే కాక రక్త ప్రసరణ పెరుగుతుంది. జ్ఞాన ధారణ పెరుగుతుంది.
ఉత్సాహం పెరిగి ఉల్లాసంగా వుంటారు. అందు వలన చిన్నప్పటి నుండి తైల మర్దన చెయ్యాలి.
"పత్తి గింజలు " కొన్ని ఒక గిన్నెలో వేసి రాత్రంతా నాన బెట్టాలి. ఉదయం వాటిని నూరి మచ్చలపై రుద్దాలి. మచ్చలు చాలా త్వరగా మాయమవుతాయి.
శోభి మచ్చల నివారణ
100 గ్రాముల రేల చెట్టు యొక్క పచ్చి ఆకులను తెచ్చి కల్వంలో వేసి నిమ్మ రసం వేసి మెత్తగా నూరి మచ్చలపై పట్టిస్తే శోభి తగ్గుతుంది. తగ్గే వరకు వాడాలి.
వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, పోషకాహార లోపం, మత్తు పదార్ధాలు ఎక్కువగా వాడడం, మధుమేహ వ్యాధి వెంట్రుకల కుదుళ్ళకు చీము పట్టడం, చుండ్రు మొదలగు కారణాల వలన శోభి మచ్చలు ఏర్పడతాయి.
గంధకం (మామూలు గంధకం)
ముల్లంగి రసం
అల్లం రసం
గంధకాన్ని రెండు రసాలతో నూరి శోభి మచ్చలపై పూయాలి. క్రమంగా తగ్గుతాయి.
2. ముల్లంగి గింజలు
ఉత్తరేణి మొక్క రసం
రెండింటిని కలిపి నూరి పూయాలి.
3. తగరిస గింజల పొడి
పుల్లటి గంజి
కలిపి నూరి పూయాలి
4. నల్ల ముళ్ళ గోరింటాకు రసం మచ్చలపై పూస్తే తగ్గుతాయి.
5. ముల్లంగి రసం, మజ్జిగ కలిపి పూయాలి.
6. ఉత్తరేణి బూడిద ఆముదం కలిపి పూయాలి,
7. నిమ్మ రసం, కొబ్బరినూనె కలిపి పూయాలి.
8. మంచి గంధం, హారతి కర్పూరం కలిపి పూయాలి.
తెల్ల శోభి మచ్చలు పోవడానికి పరిష్కరం
తెల్ల శోభి మచ్చలు పోవడానికి పరిష్కరం
1, ఉత్తరేణి చెట్టు మొత్తము వేర్లతోసహా ఎండించి కాల్చి బూడిదచేసి దీనికి ఆవనూనె కలిపి రాస్తున్న తగ్గును .
2,బావంచాలను 7 సారులు గోమూత్రంలో నానబెట్టి ఎండించి పొడి చేసి గోమూత్రంలో కలిపి రాస్తున్న తగ్గును
రెండు తరాల ముందువరకు మనవాళ్ళు తొంభై ఏళ్ళ వరకూ బట్టతల లేకుండా , జుట్టు నేరవకుండా , కంటిచూపు దెబ్బతినకుండా , నడుం వంగకుండా , పళ్ళు వూడకుండా ఏ కార్పొరేటు హాస్పిటళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నారు ? ఇంత వైద్య సదుపాయం వుండి కుడా ఇప్పటి తరం అందుకు వ్యతిరేకంగా ఎందుకు ఇలా వున్నారో ఎప్పుడైనా ఆలోచించామా ?
తులసితో - శోభి(సిబ్బెం) మచ్చలను పోగొడదాం:
తెల్లని శోభి మచ్చలతో బాధపడేవారు తులసి ఆకులు, హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి నిద్రించేముందు శోభి మచ్చలపైన పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతుండాలి. రోజూ క్రమం తప్పకుండా రెండు మూడు వారాలు ఈ విధానాన్ని ఆచరిస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతయ్.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి