6, జులై 2020, సోమవారం

ప్రపంచవ్యాప్తంగా 18 శాతం మందికి ఉబ్బసం (ఆస్తమా) ఉన్నట్టు అంచనా. అయితే ఉబ్బసం వ్యాధి వస్తే తగ్గదనే భయం ఒకరిదైతే.. పిల్లలు పెద్దవాళ్లయితే అదే తగ్గుతుందిలే అన్న నిర్లక్ష్యం మరొకరిది. ఇలాంటి అపోహలు అనేకం ఉన్నాయి. మరింత సమాచారం కోసం నమస్తే తెలంగాణలో ప్రచురించబడిన ఈ ఆర్టికల్ చూడండి.


ఆస్తమా (ఉబ్బసం) వ్యాధి దీర్ఘకాలం పాటు విడవకుండా వేధించే క్రానిక్ డిసీజ్. ఈ సమస్యలో ఊపిరితిత్తుల్లోకి వాయువును తీసుకెళ్లే శ్వాసకోస నాళాల లోపలి గోడలు ఉబ్బిపోతాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. పెద్ద వారి కంటే ఈ వ్యాధి ముప్పు పిల్లల్లోనే ఎక్కువ. ఎందుకంటే వారి శ్వాసకోస నాళాలు చాలా చిన్నగా ఉంటాయి. ఆస్తమా వల్ల చిన్నారులకు ప్రాణాపాయం ఉంటుంది. చిన్నారుల్లో ఎక్కువగా వచ్చే అనారోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. అందుకే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.


లక్షణాలు
గురక, దగ్గు, ఛాతీ బిగపట్టినట్టు ఉండడం, శ్వాస కష్టంగా తీసుకోవడం (ముఖ్యంగా రాత్రులు, తెల్లవారుజామున) వంటివి ఉంటే దాన్ని ఆస్తమాగానే భావించాలి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే నిద్రలో ఎక్కువగా కదులుతుంటారు. ముఖ్యంగా రాత్రులు ఈ లక్షణాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆస్తమా ఉన్న పిల్లల్లో తరచుగా బ్రాంకైటిస్ వస్తుంటుంది. దగ్గు అన్నది తరచుగా లేదా అడపాదడపా రావచ్చు. తల్లి పాలు తాగే చిన్నారులు ఆస్తమాలో ఫీడింగ్ సరిగా తీసుకోకపోవడం గుర్తించొచ్చు. ఆస్తమాలో శ్వాస తీసుకోవడం వేగంగా ఉంటుంది. దీనివల్ల హార్ట్ రేట్ కూడా పెరిగిపోతుంది.

కారకాలు
అలెర్జీ కారకాలు, జంతువులు, సిగరెట్ల పొగ, వాతావరణ కాలుష్యం, చల్లటి గాలి, వాతావరణంలో మార్పులు, ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వైరస్ లు, దుమ్ములోని క్రిములు, జలుబు సైతం ఆస్తమాకు దారితీస్తాయి. వైరల్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల వల్ల, కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వారసత్వంగా తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉన్నా, తక్కువ బరువుతో జన్మించిన చిన్నారుల్లో, నాసల్ అలెర్జీలు (రైనైటిస్) వల్ల ఈ సమస్య రావచ్చు. ఇంటిలోని కాలుష్యాలైన దుమ్ము, దోమల నివారణ మందులు, పెర్ ఫ్యూమ్, డియోడరెంట్, పరుపులు, తలగడలో ఉండే బ్యాక్టీరియా కూడా ఆస్తమా కారకాలే. హైదరాబాద్ నగరంలోనే 10 శాతం మంది చిన్నారులు శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి అంత ప్రబలంగా ఉండదు. కనుక వారికి అలెర్జీలు, ఆస్తమా వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

వైద్యులను ఆశ్రయించాలి...
పైన చెప్పుకున్న తరహా లక్షణాల్లో ఏవి కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ప్రారంభంలోనే వైద్యులను ఆశ్రయిస్తే పరిస్థితి తీవ్రతరం కాకుండా వేగంగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ తరహా వ్యాధుల్లో ఆలస్యం చేస్తే రికవరీ కూడా ఆలస్యం అవుతుంది. ఐదేళ్లు ఆపై వయసున్న పిల్లలకు పెద్దల మాదిరే పరీక్షల ద్వారా ఆస్తమాను నిర్ధారిస్తారు. స్పైరోమెట్రీ (బ్రీతింగ్ టెస్ట్) టెస్ట్ ద్వారా గుర్తిస్తారు. ఎక్స్ రే, రక్త పరీక్షలు కూడా సూచించొచ్చు. దీనిలో ఊపిరితిత్తుల పనితీరు తెలుస్తుంది. ఐదేళ్ల కంటే చిన్న వయసులో స్పైరోమెట్రీ టెస్ట్ ఫలితాలు అంత కచ్చితంగా ఉండవు. లక్షణాలు, పెద్దలు చెప్పే వివరాలు, స్టెత్ సాయంతో పిల్లల శ్వాస, గుండె స్పందనలు విని, ఎక్స్ రే ఆధారంగా డాక్టర్లు సమస్యను గుర్తిస్తారు.
 
చికిత్స
రెండు రకాలుగా ఉంటుంది. ఉబ్బసం నుంచి ఉపశమనం కోసం మందులు ఇస్తారు. దీర్ఘకాలంలో ఈ లక్షణాలు రాకుండా తిరిగి రాకుండా ఉండేందుకు కూడా మందులు సూచిస్తారు. ఇందుకోసం కార్టికోస్టెరాయిడ్ మందులను సిఫారసు చేస్తారు. వైద్యుల సూచన మేరకు నిర్ణీత సమయంలో మందులు ఇవ్వడం చాలా అవసరం. చిన్నారులకు నెబ్యులైజర్ ద్వారా మందులు సూచిస్తారు. రోజులో తగినంత విటమిన్ డి లభించేలా చూసుకోవడం మంచిది.

వీటికి దూరం
మందులు వాడడమే కాకుండా మరోవైపు ఆస్తమాకు దారితీసే కారకాలకు పిల్లల్ని దూరంగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోతపాలతోనూ ఆస్తమా వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. కనుక సాధ్యమైనంత వరకు తల్లిపాలు ఉంటే అవే పట్టించాలి. ఐస్ క్రీములు వంటివి ఇవ్వకూడదు. కూల్ డ్రింక్స్, ఎయిర్ కూలర్లకూ దూరంగా ఉంచాలి. చాక్లెట్లు మరీ ఎక్కువ ఇచ్చినా ఇబ్బందే. బయటకు తీసుకెళితే మాస్క్ లు ధరింపజేయడం మంచిది.

వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే శ్వాసకోశ వ్యాధులు... ఈ ఆసనం వేస్తే...


శ్వాసకోశ వ్యాధుల నివారణకు భుజంగాసనం మంచి మేలు చేస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలో తెలుసుకుందాం.

ప్రశాంతమైన గదిలో ఒక మెత్తని దుప్పటి పరుచుకోవాలి. దానిపై నెమ్మదిగా బోర్లా పడుకోవాలి. గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచి చేతులను ఛాతీ ప్రక్కన అరచేతులు ఆని ఉండేటట్లుగా మోచేతులు పైకి ఉండేటట్లు ఏర్పరుచుకోవాలి.

బారుగా చాపిన పాదాలు ఒకదానికొకటి ఆని ఉండేటట్లు ఉంచుకోవాలి. అనంతరం నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ బరువును అరచేతులపై ఉంచి ఛాతీని తద్వారా మెడను బాగా పైకి లేపాలి. 


తలను బాగా పైకెత్తి పైకి ఆకాశం వంక చూస్తున్నట్లు ఉంచుకోవాలి. ఈ భంగిమలో వెన్ను చక్కగా అర్థచంద్రాకారంలాగా వెనుకకు వంగి ఉంటుంది. ఇలా ఎవరి అవకాశాన్ని బట్టి వారు ఛాతీని పైకి లేపాలి. 

లేదంటే బొడ్డును కొలమానంగా ఉంచుకుని నాభి వరకూ నడుము నుంచి పొట్ట, ఛాతీ లేపాలి. ఈ సమయంలో చేతులను నిటారుగా లేపి ఉంచేకంటే కొంచెం వంచి ఉంచడం మంచిది. ఇలా చెయ్యడం వలన భుజాలు, చేతులు కూడా శక్తివంతమవుతాయి. 

ఇది సర్పం శిరస్సు లేపి పడగ విప్పి ఆడినట్లు ఉంటుంది కాబట్టి భుజంగాసనం అన్నారు. దీనిలో శ్వాస నియమం శరీర భాగాలు విప్పారుతాయి. కాబట్టి శ్వాస తీసుకుంటూ భంగిమకు వచ్చి పూర్ణస్థితిలో ఉండాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉండవచ్చు. 

ఈ విధంగా ఈ ఆసనాన్ని మూడునాలుగుసార్లు చేయవచ్చు. అనంతరం రెండు భుజాల మీద అంటే కుడి భుజము మీద ఎడమ చేతిని ఎడమ భుజము మీద కుడిచేతిని ఉంచి దానిపై గడ్డాన్ని ఉంచి విశ్రాంతిని తీసుకోవాలి.

దీన్ని ఎవరెవరు చెయ్యకూడదు...?

గర్భం ధరించిన స్త్రీలు ఈ ఆసనాన్ని వేయకూడదు. పొట్టకు వత్తిడి తగిలేది కనుక వేయరాదు. అలాగే వెన్నుకు సంబంధించి ఏవైనా ఇంజెక్షన్లు, ఆపరేషన్లు వంటివేవైనా జరిగినవారు కూడా చేయకూడదు. మిగిలినవారు స్త్రీ, పురుషులు చిన్నపిల్లల దగ్గర్నుంచి వృద్ధాప్యం వరకూ ఎవరైనా ఈ ఆసనాన్ని వేయవచ్చు. 

ఉపయోగాలు...

ఈ ఆసనం వల్ల గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ కు మంచి ప్రయోజనం కలుగుతుంది. సర్వైకిల్ స్పాండిలైటిస్ అనే మెడకు సంబంధించిన వ్యాధి రాకుండా ఉంటుంది. వచ్చినా తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు వ్యాకోచం చెంది శ్వాస బాగా ఆడటం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులను నిరోధించవచ్చు. 

శరీరం చాలా శక్తివంతంగా మారుతుంది. వెన్నుగా బాగా శక్తి వచ్చి వెన్నులోని డిస్కుల సమస్యలు తగ్గుతాయి. బొడ్డు వరకూ బాగా లేపి సాధన చేయడం వల్ల పొట్ట కండరాలన్నీ వ్యాకోచం చెంది అక్కడి అవయవాలు, జీర్ణాశయం చురుగ్గా పనిచేస్తాయి.

సూర్యనమస్కారాల

రకరకాల ఒత్తిళ్లతో బిజీగా ఉండే మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం చాలా ముఖ్యం. మరి అదేలా సాధ్యం... రోజూ తీసుకునే ఆహారాలలో పోషక విలువలు అధికంగా ఉండాలి. అలానే రోజుకో ఆపిల్ పండు తీసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలతో మహిళలు ఆరోగ్యపరమైన జీవితాన్ని పొందవచ్చును. మరి ఆ వ్యాయామాలేంటో.. ఎలా చేయాలో చూద్దాం...

అధిక బరువు గలవారు బరువు తగ్గాలనుకుంటే.. స్క్వాట్స్ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు, హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. తరచుగా సూర్యనమస్కారాలు చేయడం వలన నడుము భాగం గట్టి పడుతుంది. అలానే మోకాళ్లపై భాగం దృఢంగా మారుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. 

ప్లాంక్స్ వ్యాయామం చేస్తే.. కండారాలకు చాలా మంచిది. ముఖ్యంగా ఛాతీ, కటి వలయ భాగం దృఢంగా మారుతుంది. ఈ వ్యాయామంతో రక్తంలోని చక్కెర స్థాయిలు మెరుగుపడుతాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో అడ్డంకులు ఉండవు. అలానే నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వ్యాయామం చేయడం వలన ముడతల చర్మం కాస్త తాజాగా మారు

వర్షాకాలంలో సాధారణంగా వచ్చే శ్వాసకోశ వ్యాధుల నివారణ

భారీ ధారాపాతంగా కురిసే వర్షాల వలన తరచుగా అనారోగ్యాలు వస్తాయి. వర్షాకాలంలో సాదారణంగా కోల్డ్, దగ్గు,ఫ్లూ మరియు శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆహారం మరియు నీటి వలన మలేరియా,డెంగ్యూ మరియు 
అనేక అంటువ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. మీరు సాధారణ వర్షాకాల వ్యాధులు రాకుండా ముందుగానే సురక్షితంగా ఉండడానికి ఈ ముందు జాగ్రత్త చర్యలను చేపట్టవచ్చు.
1. సాధారణ శ్వాస వ్యాధులను నివారించేందుకు, మీరు ఎల్లప్పుడూ మీతో రైన్ కోట్ తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. ఉదయం పూట ఎండ ఉండవచ్చు, అయినప్పటికి రోజు సమయంలో ఎప్పుడైనా ధారాపాతంగా వర్షం కురిసే అవకాశం ఉంది. అందువలన మీ వెంట గొడుగు లేదా రైన్ కోట్ తప్పనిసరిగా ఉండాలి. 
2. ఒక ఆహార సప్లిమెంట్ లేదా సహజ రూపంలో విటమిన్ సి ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది సాధారణ శ్వాసకోశ వ్యాధులను దూరంగా ఉంచటానికి సహాయపడుతుంది. విటమిన్ సి కోల్డ్ చికిత్సలో ఉత్తమ నివారణగా పనిచేస్తుంది. ఇది చల్లని హిల్స్ మరియు ప్రతిరోధకాలను ప్రేరేపిస్తుంది. 
3. మీరు వర్షంలో బాగా తడిచినప్పుడు స్నానం చేయటం వలన అంటువ్యాధులు వ్యాప్తి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి సహాయం చేస్తుంది. 
4. మీరు వర్షం లోనించి ఇంటిలోకి తిరిగి వచ్చిన తర్వాత సూప్ లేదా వెచ్చని పాల వంటి వేడి పానీయం తీసుకోవాలి. ఇలా చేయుట వలన మీ శరీరం యొక్క ఉష్ణోగ్రత మార్పు వలన ఏర్పడే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి. 
5. ఎల్లప్పుడూ మీరు మీ చేతులను శుభ్రం ఉంచుకోవటం మరియు ఈ సీజన్లో శానిటరీ లోషన్ ఉపయోగించాలని నిర్ధారించుకోండి. 
6. అంతేకాకుండా గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన చిట్కా ఏమిటంటే మీ శరీర ఉష్ణోగ్రత నిర్వహించడానికి మరియు మీ శరీరం నుండి విషాన్ని బయటకు పంపించటానికి పుష్కలంగా నీటిని త్రాగటం అలవాటు చేసుకోవాలి.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

కామెంట్‌లు లేవు: