క‌రోనా వ‌చ్చి సీరియ‌స్ ల‌క్ష‌ణాలు లేక‌పోతే.. హోం ఐసోలేష‌న్ లో ఎలా ఉండాలి

హోమ్ ఐసోలేషన్‌‌లో ఉన్నరా?

కరోనా పాజిటివ్‌‌ వస్తే చాలా మందిలో సీరియస్‌‌ లక్షణాలేమీ ఉండట్లేదు. అలాంటివాళ్లు హోమ్‌‌ ఐసోలేషన్‌‌ పాటిస్తే చాలంటున్నారు డాక్టర్స్‌‌. సీరియస్‌‌ లక్షణాలున్న వాళ్లను మాత్రమే హాస్పిటల్స్‌‌కు రావాలని, మిగతావాళ్లు హోమ్‌‌ ఐసోలేషన్‌‌ పాటిస్తే చాలని ప్రభుత్వం కూడా చెప్తోంది. పాజిటివ్‌‌ వచ్చిన వాళ్లు మాత్రమే కాదు.. కరోనా లక్షణాలున్న వాళ్లు కూడా ఐసోలేషన్‌‌ పాటించడమే మంచిది. అయితే ఐసోలేషన్‌‌ ఎలా పాటించాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? దగ్గర ఉంచుకోవాల్సిన మెడికల్‌‌ కిట్‌‌, మెడిసిన్‌‌ ఏంటి? ఈ విషయంలో డాక్టర్స్‌‌, ప్రభుత్వం అందిస్తున్న సూచనలివి.

జ్వ‌రం, జలుబు, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్‌‌ చేయించుకోవాలి. ఇలా చేయించుకున్న వాళ్లలో కొందరిలో కరోనా ఉన్నా, టెస్ట్‌‌లో పాజిటివ్‌‌ కనిపించకపోవచ్చు. కరోనా ఉండికూడా టెస్ట్‌‌లో పాజిటివ్‌‌ రాకపోతే దీన్ని ‘ఫాల్స్‌‌ నెగెటివ్‌‌’ అంటారు. అందుకే ‘ఒకసారి టెస్ట్‌‌లో నెగెటివ్‌‌ వచ్చింది కదా, ఇక కరోనా లేదు’ అనుకోవడం కరెక్ట్‌‌ కాదు. మళ్లీ మూడు రోజుల తర్వాత ఇంకోసారి టెస్ట్‌‌ చేయించుకోవాలి. టెస్ట్‌‌ రిజల్ట్స్‌‌తో సంబంధం లేకుండా, కరోనా లక్షణాలుంటే ఐసోలేషన్‌‌ పాటించాలి.

ఎవరికి ఐసోలేషన్‌‌?

తక్కువ లక్షణాలు ఉన్నవాళ్లు, హార్ట్‌‌, కిడ్నీ, ఇతర జబ్బులు లేనివాళ్లు మాత్రమే ఐసోలేషన్‌‌లో ఉండాలి. మిగతావాళ్లు హాస్పిటల్‌‌లోనే ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకోవాలి. గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రత్యేక గదిలోనే ఐసోలేషన్‌‌ పాటించాలి. సెపరేట్‌‌ బాత్‌‌రూమ్‌‌ ఉండాలి. నిబంధనల ప్రకారం ఇంట్లో వృద్ధులు, హార్ట్‌‌, కిడ్నీ ప్రాబ్లమ్స్‌‌, క్యాన్సర్‌‌‌‌ పేషెంట్స్‌‌ ఉన్న చోట ఐసోలేషన్‌‌ ఉండకూడదు. వాళ్లను వేరే చోటుకు పంపించడమో, లక్షణాలున్న వాళ్లే వేరే చోట ఉండటమో చేయాలి. ఎందుకంటే కరోనా రోగుల నుంచి వీళ్లకు త్వరగా వైరస్‌‌ వ్యాప్తి చెందొచ్చు.

కొన్ని రూల్స్‌‌

ఫ్యామిలీలో ఒకరికి కరోనా వస్తే మిగతావాళ్లు క్వారంటైన్‌‌ పాటించాలి.

పేషెంట్‌‌తోపాటు, కేర్‌‌‌‌ టేకర్‌‌, ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌ కూడా ఆరోగ్యసేతు యాప్‌‌ కచ్చితంగా వాడాలి.

కరోనా పేషెంట్స్‌‌ శుభ్రత పాటించాలి. దగ్గు, తుమ్ములు వస్తే మోచేతిని అడ్డం పెట్టుకోవాలి. న్యాప్‌‌కిన్స్‌‌ వాడొచ్చు. వాటిని మూత ఉన్న డస్ట్‌‌బిన్‌‌లోనే వేయాలి.

కర్చీఫ్‌‌లు వాడితే తిరిగి సోప్‌‌ వాటర్‌‌‌‌లో వాష్‌‌ చేసుకుని మళ్లీ వాడుకోవచ్చు. డ్రెస్‌‌లు, బెడ్‌‌షీట్స్‌‌, టవల్స్‌‌, ప్లేట్స్‌‌, గ్లాస్‌‌లు వంటివి వేరేవాళ్లు వాడకుండా చూసుకోవాలి. వాటిని కూడా రెగ్యులర్‌‌‌‌గా సోప్‌‌ లేదా హాట్‌‌ వాటర్‌‌‌‌తో వాష్‌‌ చేసుకోవాలి.

వీలైతే పేషెంట్స్‌‌ తమ గదిని సొంతంగా క్లీన్‌‌ చేసుకోవడం బెటర్‌‌‌‌. వేరేవాళ్లు రూమ్‌‌ క్లీన్‌‌ చేస్తే కరోనా వచ్చే ఛాన్స్‌‌ ఉంది. తప్పనిసరై, చేతకాని పరిస్థితిలో మాత్రమే కేర్‌‌‌‌టేకర్‌‌‌‌తో క్లీన్‌‌ చేయించుకోండి. ఇలా చేసేటప్పుడు పీపీఈ కిట్‌‌ లేదా ఎన్‌‌ 95 మాస్క్‌‌, ఫేస్‌‌ షీల్డ్‌‌, గ్లోవ్స్‌‌ కచ్చితంగా వాడాలి.

వీలైనంత వరకు పేషెంట్స్‌‌ తమ గదిలోనే ఉండటం బెటర్‌‌‌‌. తప్పనిసరై గది నుంచి బయటికి వస్తే, గ్లోవ్స్‌‌, మాస్క్‌‌, ఫేస్‌‌ షీల్డ్‌‌ వాడాలి. ఇతరులెవరూ దగ్గరగా ఉండకుండా చూసుకోవాలి.

స్మోకింగ్‌‌, ఆల్కహాల్‌‌ డ్రింకింగ్‌‌ వంటి అలవాట్లు ఉంటే మానెయ్యాలి. ముఖ్యంగా స్మోకింగ్‌‌ వల్ల లంగ్స్‌‌ మరింతగా దెబ్బతింటాయి.

ఎనిమిది నుంచి పదిగంటలు నిద్రపోవాలి. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్‌‌‌‌ పెరుగుతుంది. గోరువెచ్చటి నీటిని మాత్రమే తాగుతుండాలి.

వీలైనంత వరకు బోర్లా పడుకోవాలి. దీనివల్ల ఊపిరితిత్తులకు గాలి బాగా అందుతుంది.

దగ్గర్లోని ప్రభుత్వ లేదా ప్రైవేట్‌‌ డాక్టర్స్‌‌ను ఆన్‌‌లైన్‌‌లో లేదా ఫోన్‌‌ ద్వారా కన్సల్ట్‌‌ చేసి, వారి ప్రిస్క్రిప్షన్‌‌, సూచనల్ని పాటించాలి. రోజూ కనీసం రెండుసార్లు డాక్టర్స్‌‌ను సంప్రదిస్తూ, మీ హెల్త్‌‌ స్టేటస్‌‌ను వివరించాలి.

కేర్‌‌‌‌టేకర్స్‌‌ జాగ్రత్తలు

ఏ అనారోగ్య లక్షణాలు లేనివాళ్లు మాత్రమే కరోనా పేషెంట్స్‌‌కు కేర్‌‌‌‌ టేకర్స్‌‌గా ఉండాలి.

పేషెంట్స్‌‌ వాడే వస్తువులు ఇంట్లో ఎవరూ తాకకూడదు.

పేషెంట్‌‌ గదిలోకి లేదా దగ్గరగా వెళ్లినప్పుడు కనీసం ఆరడుగుల దూరం పాటించాలి. అలాగే మూడు లేయర్స్‌‌ కలిగిన మాస్క్‌‌ లేదా పీపీఈ కిట్‌‌ తొడుక్కోవాలి.

పేషెంట్‌‌ దగ్గరకు వెళ్లొచ్చిన తర్వాత కిట్‌‌ తీసేసి, సోప్‌‌ వాటర్‌‌‌‌లో కనీసం అరగంటపాటు ఉంచాలి. ఆ తర్వాత వాటిని వీలైతే కాల్చేయాలి. లేదంటే ఎవరూ ముట్టుకోకుండా కవర్స్‌‌లో చుట్టి పడేయాలి. రెగ్యులర్‌‌‌‌ డస్ట్‌‌బిన్‌‌లో వేయకూడదు.

శుభ్రంగా స్నానం చేసిన తర్వాతే ఇంట్లో మిగతా వస్తువులను తాకాలి.

ఇంటిని రెగ్యులర్‌‌‌‌గా శానిటైజ్‌‌ చేస్తుండాలి.

బీ పాజిటివ్‌‌

కరోనా పేషెంట్స్‌‌కు అన్నింటికంటే ముఖ్యమైంది పాజిటివ్‌‌ యాటిట్యూడ్‌‌. పాజిటివ్‌‌ అని రాగానే ప్యానిక్‌‌ అవ్వాల్సిన అవసరం లేదు. కోలుకుంటామన్న నమ్మకం ఉంటేనే, దీన్ని దాటగలడం సాధ్యం. సీరియస్‌‌ లక్షణాలుంటే హాస్పిటల్‌‌లో జాయిన్‌‌ అవ్వాలి. లేదంటే ఐసోలేషన్‌‌ పాటించాలి. ఏమైనా డౌట్స్‌‌ ఉండే దగ్గర్లోని వైద్య సిబ్బందికి సమాచారం అందించి సాయం పొందొచ్చు. గవర్నమెంట్‌‌, ఇతర సంస్థలు అందిస్తున్న హెల్ప్‌‌లైన్‌‌ నెంబర్స్‌‌కు కాల్‌‌ చేయొచ్చు. వీడియో కాల్స్‌‌, వాట్సాప్‌‌, సోషల్‌‌ మీడియా ద్వారా మీ వాళ్లతో టచ్‌‌లో ఉంటూ పాజిటివ్‌‌గా ఉండాలి. మీకున్న స్పేస్‌‌లో వ్యాయామం, యోగా, ప్రాణాయామం వంటివి చేయాలి. పుస్తకాలు చదవడం, ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ ఛానెల్స్‌‌ చూడటం, మ్యూజిక్‌‌ వినడం, పెయింటింగ్‌‌, రైటింగ్‌‌ వంటివి చేయొచ్చు. మంచి ఆహారం తీసుకోవాలి. సిట్రస్‌‌ ఫ్రూట్స్‌‌, మజ్జిగ తీసుకుంటే మంచిది. నెగెటివ్‌‌ ఆలోచనలు, డిప్రెషన్‌‌ వంటివి ఉంటే ఆన్‌‌లైన్‌‌లో సైకాలజిస్ట్‌‌ల కౌన్సెలింగ్‌‌ తీసుకోవాలి.

హాస్పిటల్‌‌కు ఎప్పుడు వెళ్లాలి?

ఐసోలేషన్‌‌లో ఉన్నంత మాత్రాన అందరూ కోలుకుంటారని చెప్పలేం. అందుకే ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిని అంచనా వేసుకోవడం ముఖ్యం. థర్మామీటర్‌‌‌‌, పల్స్‌‌ ఆక్సిమీటర్‌‌‌‌ రీడింగ్‌‌ను ఎప్పటికప్పుడు డాక్టర్‌‌‌‌తో షేర్‌‌‌‌ చేసుకోవాలి. వాళ్ల సూచనల ఆధారంగా హాస్పిటల్‌‌కు వెళ్లాలి. కింది లక్షణాలు కనిపిస్తే హాస్పిటల్‌‌కు తీసుకెళ్లాలి.

ఆక్సిజన్‌‌ లెవల్స్‌‌ 94 కంటే తగ్గితే హాస్పిటల్‌‌కు తీసుకెళ్లి, ఆక్సిజన్‌‌ అందించాలి.

పల్స్‌‌ రేట్‌‌ 60–100 ఉండాలి. 60కి తగ్గినా, 100 కంటే ఎక్కువైనా డాక్టర్‌‌‌‌ను కన్సల్ట్‌‌ చేయాలి.

ఛాతిలో నొప్పి ఎక్కువైనప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినప్పుడు

బెడ్‌‌పై నుంచి లేవలేని పరిస్థితిలో, అయోమయానికి గురైనప్పుడు

పెదవులు, ముఖం నీలి రంగులోకి మారుతున్నప్పుడు లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని అర్థం.

ఏడు రోజులకు మించి జ్వరం తగ్గకుండా ఉన్నా లేదా టెంపరేచర్‌‌‌‌ 103 కంటే ఎక్కువున్నా హాస్పిటల్‌‌కు వెళ్ళాలి 


కరోనా అనుమానిత లక్షణాలు, హోమ్  ఐసోలేషన్ గురించి సందేహాలు  సలహాలు

 *1. దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్నవారు ఎవరికి తెలియజేయాలి...?* 

జ. మీరు నివసించు ప్రాంతానికి చెందిన ఆరోగ్య కార్యకర్తలకు లేదా వార్డు/గ్రామ వాలంటీర్లకు తెలియజేయాలి. వారు మీ ఇంటికి వచ్చి మీ ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి మీకు కోవిడ్ పరీక్ష చేయుటకు ఏర్పాటు చేస్తారు.

 *2. కోవిడ్ పరీక్ష లో పాజిటివ్ గా నిర్ధారించిన ఎడల ఏమి చేయాలి.* 

జ. ముందుగా కంగారు పడకుండా ధైర్యంగా ఉండవలెను.   కుటుంబ సభ్యులతో గాని ఇతరులతో కానీ కలవకుండా దూరాన్ని పాటించాలి. మాస్కు ధరించాలి. ఇంట్లో సామానులు ఏమి తాకరాదు. ఇంటిలో 60 సంవత్సరాలు పైబడినవారు, పిల్లలు గర్భిణీ స్త్రీలు ఉన్న ఎడల వారికి దూరముగా ఉండవలెను. వారికి కూడా పరీక్షలు నిర్వహించే వరకు విడిగా ఉండవలెను.

 *3. వ్యాధి నిర్ధారణ తర్వాత ఏం చేస్తారు.* 

జ. ఈ వ్యాధి సోకిన వ్యక్తిని దగ్గరలోని ఆసుపత్రి వద్ద  ఆరోగ్య కార్యకర్తలు లేదా మండల /మున్సిపాలిటీ అధికారులు పరీక్షలు నిర్వహించెదరు.

 *4. ఎటువంటి పరీక్షలు నిర్వహిస్తారు.* 

జ. ప్రతి కరోనా సోకిన వ్యక్తికి రక్త పరీక్షలు, ఎక్స్ రే, శ్వాస పరీక్షలు మొదలగునవి చేసి వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తారు.

 *5. పరీక్షల అనంతరం ఏం చేస్తారు.* 

జ. వ్యాధి సోకిన ప్రతి 100 మందిలో సుమారు 75 మందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. అలాంటి వారు ఇంటి వద్దనే పదిరోజులు ఆరోగ్య కార్యకర్తల సలహాలు పాటించాలి. మిగతా 25 మందిని వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్ కేర్ సెంటర్స్ కు మరియు ఆసుపత్రులకు తరలించడం జరుగుతుంది.

 *6. హోమ్ ఐసోలేషన్ పై ప్రజల్లో ఉన్న  అపోహలు ఎలా నివృత్తి చేస్తారు.* 

జ. ముందుగా ప్రజలు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. ఈ వ్యాధి ఇప్పటికిప్పుడే అంతరించి పోదు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు పాటించాలి. అదేవిధంగా ఈ వ్యాధి సోకిన ప్రతి ఒక్కరికి హాస్పటల్లో చికిత్స అవసరం లేదు అనేది కూడా అర్థం చేసుకోవాలి. భవిష్సత్ లో చాలా ఎక్కువ మంది వ్యాధికి గురికావచ్చు. అందరూ హాస్పటల్లో చేరాలని కోరుకోవటం సహజమే కానీ సాధ్యపడదు. అందువలన వ్యాధి లక్షణాలు లేనివారు ఇంటి వద్దనే ఉండి చికిత్స పొందాలి. 

7. *వ్యాది సొకిన వ్యక్తి పట్ల ఇరుగు పొరుగు వారి భయాలు ఎలా ఉంటాయి* 

జ. కరోనా వ్యాధి సోకిన వ్యక్తి యొక్క ఇరుగు పొరుగు వారు భయపడడం సహజమే. కానీ ఇంటిలోని వారు ఇరుగు పొరుగు వారు మానసికంగా సిద్ధపడాలి. రేపు మీకు కూడా రావచ్చు. అలా అని ప్రతి ఒక్కరిని వెలివేయడం సమంజసం కాదు. ఇది ఒక తరహా ఫ్లూ లాంటిది. వస్తుంది పోతుంది అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. వ్యాధిగ్రస్తుని పట్ల సానుకూల దృక్పథం అలవాటు చేసుకోవాలి.

 *8. హోం ఐసోలేషన్ ఉండాలంటే వారి గృహంలో ఎలాంటి సదుపాయాలు ఉండాలి.* 

జ. వేరే గది మరియు మరుగుదొడ్డి  ఉండాలి. ఒకవేళ ఒకే మరుగుదొడ్డి ఉంటే వ్యాధిగ్రస్తుడు వాడిన  అర్ధగంట తరువాత ఇతరులు వాడుకోవచ్చు. బట్టలు ఉతికే డిటర్జెంట్ పౌడరు తో మరుగుదొడ్డి శుభ్రం చేస్తే సరిపోతుంది.

 *9.. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యాధిగ్రస్తుడి తో ఎవరు ఉండవచ్చు.* 

జ. వృద్ధులు చిన్నపిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు ఉన్న ఎడల వారిని వేరే గృహంలో ఉంచాలి. వ్యాధిగ్రస్తుని కి సపర్యలు చేయుటకు ఒక వ్యక్తి ఉంటే సరిపోతుంది .

 *10. సపర్యలు చేయు వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.* 

జ. ఎల్లప్పుడూ మాస్కు ధరించాలి. సోకిన వ్యక్తి యొక్క వస్తువులను బట్టలను తాకరాదు. ఒకే గదిలో ఉండాల్సి వచ్చినప్పుడు ఒకరికొకరు రెండు మీటర్ల దూరాన్ని పాటించాలి.

 *11.. ఈ వ్యాధి సోకిన వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.* 

జ. ముందుగా వ్యాధి తీవ్రత లేదు కాబట్టే ఇంటిలో ఉండమన్నారు అని తెలుసుకోవాలి. ఎప్పుడు సెల్ ఫోను ఆన్ లో ఉంచుకోవాలి. ఆరోగ్య సేతు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. కార్యకర్తలు అందజేసిన మందులు వాడాలి. తేలికపాటి వ్యాయామాలు ధ్యానం  చేయాలి.

వారి గదిని, బట్టలను మరుగుదొడ్డిని వారే శుభ్రం చేసుకోవాలి. అతను ఉపయోగించిన పాత్రలు శుభ్రం చేసుకోవాలి.

 *12. హోం ఐసోలేషన్ లో ఎన్ని రోజులు ఉండాలి.* 

జ. జ్వరం గాని ఇతరత్రా ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేని ఎడల పది రోజుల తదుపరి పూర్తిగా కోల్కన్నట్లుగా భావించవచ్చును.14 రోజుల తర్వాత అతను దైనందిన కార్యక్రమాలను చేసుకోవచ్చును.

 *13. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తికి అనారోగ్య సమస్యలు తలెత్తితే ఏం చేయాలి* 

జ. జిల్లా కేంద్రంలోని కంట్రోల్ సెంటర్లో వీరి పేర్లు ఫోన్ నెంబర్లు నమోదు కాబడును. ప్రతిరోజు కాల్ సెంటర్ ల నుండి వీరికి ఫోన్ చేసి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసు కొందురు. ఆరోగ్య కార్యకర్తలు ప్రతిరోజు వారి ఆక్సిజన్ స్థాయిలను తెలుసు కొందురు. మందులను అందజేస్తారు అత్యవసరమైన ఎడల కాల్ సెంటర్ కి ఫోన్ చేసిన  వెంటనే మెరుగైన చికిత్స కొరకు ఆస్పత్రికి తరలించ బడును. అధైర్య పడవలసిన అవసరం లేదు.

 *14. హోం ఐసోలేషన్ అనంతరం పరీక్షలు అవసరమా* 

జ. అనారోగ్య లక్షణాలు లేని ఎడల మరలా వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదు.

 *15. ఎటువంటి ఆహారం తీసుకోవాలి.* 

జ. బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. శాఖాహారులు పప్పు ధాన్యాలకు , పాలు, పండ్లు, ప్రాధాన్యతనివ్వాలి. మాంసాహారులు పాలు, పండ్లు, గుడ్డు, చికెన్, మటన్, చేపలు ఆహారంగా తీసుకోవచ్చును.

 *16. హోమ్ ఐసోలేషన్ వారిపట్ల ప్రజల్లో ఉన్న అపోహలను ఎలా నివృత్తి చేస్తారు.* 

జ. హోమ్ ఐసోలేషన్ అనేది తప్పనిసరి పరిస్థితి అనేది ముందుగా ప్రజలు అర్థం చేసుకోవాలి. గాలి ద్వారా వ్యాప్తిచెందుతోంది అనే ఆలోచన రాకూడదు.ఈ వ్యాధి సోకిన వ్యక్తిని ప్రేమాభిమానాలతో చూసుకోవాలి. అటువంటి వ్యక్తిని తాకరాదు. మనం పోరాడాల్సింది కరోనాతో, వ్యక్తి తో కాదు అనే నినాదాన్ని తూచా తప్పక పాటించాలి. స్వీయ రక్షణ చర్యలు పాటించాలి. మాస్కు ధరించాలి. అవసరమైతే తప్ప బయటకి రాకూడదు...


కరోనా పాజిటివ్ లేదా అనుమానం వున్నా, లేకున్నా ముందు జాగ్రత్తగా వాడవలసిన టాబ్లెట్స్...




iధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660


*సభ్యులకు విజ్ఞప్తి*

******************

ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.