నడుము నొప్పికి ఆయుర్వేదం నవీన్ సలహాలు
నడుము నొప్పి వచ్చిందంటే చాలు. పెయిన్ కిల్లర్స్, నొప్పి నివారణ కొరకు మందులు వాడడం నేడు అధికమైపోయింది.
నడుము నొప్పి వచ్చిందంటే చాలు. పెయిన్ కిల్లర్స్, నొప్పి నివారణ కొరకు మందులు వాడడం నేడు అధికమైపోయింది. ఈ క్రమంలో వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లను గురించి పట్టించుకోవడం లేదు. అయితే అలాంటి ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన పని లేకుండానే కింద ఇచ్చిన కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే చాలు. నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు.
* ఒక కప్పు పాలలో తేనె వేసుకొని రోజూ తాగడం వల్ల నడుము నొప్పి రాకుండా చూసుకోవచ్చు.
* నొప్పిగా ఉన్న ప్రదేశంలో ఐస్ ముక్కతో కాపడం పెట్టడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
* తెల్ల చామంతి పూలతో చేసిన కషాయంతో నడుము నొప్పిని తగ్గించవచ్చు.
* నొప్పి ఉన్న చోట అల్లం పేస్ట్‌ను కాసేపు ఉంచినా మంచి ఫలితం ఉంటుంది.
* రెండు చెంచాల గసగసాల పొడిని గ్లాసు పాలలో కలుపుకొని రోజుకు రెండు త్రాగండి నొప్పి తగ్గింది
2.-నడుం నొప్పికి ఆయుర్వేద వైద్యం
నడుము నొప్పి సమస్యతో సతమతమయ్యేవారికే ఆ బాధ ఎంతటి తీవ్రంగా ఇబ్బందిపెడుతుందో తెలుస్తుంది. ఈ నడుం నొప్పిని భరించడం చాలా కష్టమవుతుంటుంది. అయితే ఆయుర్వేద వైద్యంలో నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ప్రతి రోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం పావు గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుం నొప్పి తగ్గుతుంది. అలాగే అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణ కోశం బాగుపడి నడుంనొప్పి తగ్గుతుంది. ఆవనూనె, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వేడినీళ్ళతో స్నానం చేస్తే నడుం నొప్పి తగ్గుతుంది.
పంచకర్మ చికిత్సలలో భాగంగా అభ్యంగన స్నానం, కటివస్థ బాగా ఉపకరిస్తాయి. నడుము నొప్పితో బాధపడేవారు వంకాయ, వేరుశనగ నూనె, మినప పదార్థాలు, పెరుగు ఎక్కువుగా తీసుకోవడం మంచిది కాదు. లావుగా ఉన్నవారికి నడుం నొప్పి వుంటే, పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మ రసం పోసి పరగడుపున తాగుతుంటే, ఒళ్ళు తేలిక పడి నొప్పి తగ్గుతుంది. ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను మంచి నడుంచుట్టూ కాపు పెడు పెట్టాలి నొప్పి తగ్గింది
ఆయుర్వేద వైద్యంలో నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు.
* ప్రతి రోజూ 10 చుక్కలు వెల్లుల్లి రసం పావు గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుం నొప్పి తగ్గుతుంది
* అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణ కోశం బాగుపడి నడుంనొప్పి తగ్గుతుంది.
* ఆవనూనె, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వేడినీళ్ళతో స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
* పంచకర్మ చికిత్సలలో భాగంగా అభ్యంగన స్నానం, కటివస్థ బాగా ఉపకరిస్తాయి.
* నడుము నొప్పితో బాధపడేవారు... వంకాయ, వేరుశనగ నూనె, మినప పదార్థాలు, పెరుగు ఎక్కువుగా తీసుకోవడం మంచిది కాదు.
* లావుగా ఉన్నవారికి నడుం నొప్పి వుంటే, పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మ రసం పోసి పరగడుపున తాగుతుంటే, ఒళ్ళు తేలిక పడి నొప్పి తగ్గుతుంది.
* ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను మంచి నడుంచుట్టూ కాపు పెడుతుంటే, నడుంనొప్పి తగ్గిపోతుంది- మీ నవీన్ నడిమింటి
- విశాఖపట్నం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి