అధిక రక్తపోటు అంటే శరీరంలోని రక్తం యొక్క ఒత్తిడి అనారోగ్య స్థాయిలకు చేరిందన్నమాటే. అధిక రక్తపోటును “హైపర్ టెన్షన్” అని కూడా అంటారు. రక్తపోటు అనేది రక్తనాళాల (ధమనుల) గోడలపై రక్తం తన ప్రసారంలో పెంచే శక్తి మరియు గుండె రక్తాన్ని పంపు చేసినపుడు రక్తం అందుకునే నిరోధకవిస్తరణా శక్తి. దీర్ఘకాలిక అధిక రక్తపోటు గుండె-సంబంధిత (హృదయ) ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
అధిక రక్తపోటు విస్తృతంగా రెండు ప్రధాన రకాలుగా విభజించబడుతుంది-ప్రాధమిక లేదా అత్యవసర రక్తపోటు మరియు ద్వితీయ రక్తపోటు. స్వల్ప రక్తపోటు ఏ లక్షణాలను పొడ జూపకుండా (వ్యాధిలక్షణ రహితంగా) ఉండచ్చు, అందువల్ల, రక్తపోటులో తేలికపాటి పెరుగుదల ఉన్నవారు తమకేర్పడిన పరిస్థితి గురించి వారికి తెలియదు. అయితే, అధిక రక్తపోటు కల్గినవారిలో, తలనొప్పి వంటి భయపెట్టే రోగలక్షణాలు ఉంటాయి. అధిక రక్తపోటు అనేది కొన్ని అంతర్లీన లేదా సంబంధిత ఆరోగ్య సమస్యల ఫలితంగా దాపురించి ఉండవచ్చు. అయితే, కొన్నిసార్లు, అధిక రక్తపోటుకు గల కారణం తెలియకుండానే ఉంటుంది. ప్రధానంగా, ఆహారంలో ఉప్పును నియంతరించడం, నిత్యశారీరక వ్యాయామం చేయడం మరియు తగిన మందులు తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటును సమర్థంగా నియంత్రించవచ్చు.
రోగిలో అధిక రక్తపోటును కనుగొనడంలో ఆలస్యం చేసినా, కనుగొన్న తర్వాత చికిత్సను ఆలస్యంగా మొదలుపెట్టినా, గుండెకు రక్త సరఫరా తక్కువై లేదా పూర్తిగా నిల్చిపోయి, తీవ్రమైన గుండెపోటు, (తీవ్రమైన మయోకార్డియల్ ఇంఫార్క్షన్) మరియు కంటి సమస్యలు (రెటినోపతీ) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇలా అధిక రక్తపోటును ఆలస్యంగా కనుగొన్నపుడు, దాని తదుపరి పరిణామం అంతర్లీనంగా ఉండే వ్యాధికారకం మరియు స్వీకరించిన చికిత్సపై ఆధారపడి ఉంటుంది. అధిక రక్తపోటు, చక్కెరవ్యాధి లేదా డయాబెటిస్ ఉన్నవారికి వచ్చినట్లైతే అది వారిపై ప్రభావం చూపి కీడు చేసే ప్రమాదముంది. జీవితాంతం జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మరియు జీవితాంతం నిబద్ధతగా ఔషధాలను తీసుకోవడం అధిక రక్తపోటు సక్రమ నిర్వహణకు చాలా అవసరం. పరిస్థితి అలాగున్నపుడు, అధిక రక్తపోటు ఉన్నవారు ఔషధాలకు కట్టుబడి జీవనం సాగించడం కష్టం. అందుకే, నియతకాలికంగా ఆసుపత్రులకెళ్లి వైద్యులను సందర్శించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం మరియు వైద్యుని సలహాలను పాటించి ఎప్పటికప్పుడు తగిన జీవనశైలి మార్పులు చేసుకుంటే అధిక రక్తపోటును నిర్వహించడంలో రోగులు కృతకృత్యులవుతారు
అధిక రక్తపోటు (హై బిపి) యొక్క చికిత్స
అధిక రక్తపోటుకు పూర్తిగా చికిత్స చేయబడదు. కానీ వ్యాధి మరింత తీవ్రతరం కాకుండా నివారించేందుకు తగిన జాగ్రత్తలు, సరైన సంరక్షణ మరియు అధికరక్తపోటు-వ్యతిరేక ఔషధాలతో వ్యాధిని నియంత్రించవచ్చు. అధిక రక్తపోటు చికిత్స మీ డాక్టర్ తీసుకున్న రక్తపోటు రీడింగులపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా చికిత్స ప్రారంభించటానికి ముందు రెండు లేదా అంతకంటే ఎక్కువ రీడింగులు తీసుకోవాలి.
- మీకు 120/80 mm Hg లేదా అంత కంటే తక్కువ రీడింగ్ కల్గిన సాధారణ రక్తపోటు ఉంటే, మీ డాక్టర్, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోమని, క్రమమైన వ్యాయామం చేయమని మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించమని మీకు సలహా ఇస్తారు.
- మీ సిస్టోలిక్ బిపి (బ్లడ్ ప్రెషర్) 120-129 mm Hg గా ఉంది, అయితే, డయాస్టొలిక్ BP 80 mm Hg కన్నా తక్కువ ఉంటే, మీ డాక్టర్ మిమ్మల్ని ప్రి-హైపర్‌టెన్షన్ వర్గంలోకి చేరే గంభీరమైన రక్తపోటు రోగిగా మిమ్మల్ని నిర్ధారిస్తారు. ఈ దశలో, మీరు మందులు వాడాల్సిన అవసరం లేదు, కానీ, మీ రోజువారీ దినచర్యలో కొన్ని ఆహారాలు మరియు వ్యాయామాలు చేర్చడం అవసరం కావచ్చు. ఇంట్లో ఎలక్ట్రానిక్ మెషీన్స్ ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి బిపిని పర్యవేక్షించమని లేదా అందుకోసం వైద్యశాలకు వెళ్ళమని మీ డాక్టర్ మిమ్మల్ని అడగవచ్చు.
- మీ సిస్టోలిక్ బిపి 130-139 mm Hg మరియు డయాస్టొలిక్ బిపి 80 - 89 mm Hg కంటే తక్కువ ఉంటే, మీరు 1వ దశ- రక్తపోటును కలిగి ఉన్నారన్నమాట. ఈ సందర్భంలో, మీ వైద్యుడు మీకు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ యాంటీ-హైపర్టెన్సివ్ ఔషధాలు తీసుకొమ్మని సలహా ఇస్తారు. అలాగే, ఆహారంలో మార్పులు, వ్యాయామం, మరియు ఖచ్చితమైన బిపి పర్యవేక్షణ పట్ల శ్రద్ధ వహించమని మీ డాక్టర్ మీకు సూచిస్తారు.
- మీ సిస్టోలిక్ BP 140 mm Hg లేదా అంతకన్నా ఎక్కువ మరియు డయాస్టొలిక్ BP 90 mm Hg లేదా అంతకంటే తక్కువ ఉంటే, మీరు 2వ దశ రక్తపోటు లేదా అధిక రక్తపోటు కలిగి ఉన్నారన్నమాట. ఈ సందర్భంలో, కఠినమైన BP పర్యవేక్షణతో పాటు, మీ డాక్టర్ మీకు ఒకటి కంటే ఎక్కువ హైపర్టెన్షివ్ ఔషధాలు మరియు ఖచ్చితమైన ఆహారం మార్పు మరియు నిత్యవ్యాయామ నియమాలను పాటించమని సలహా ఇస్తారు.
- కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ACE ఇన్హిబిటర్స్, బీటా-బ్లాకర్స్ మరియు మూత్రవర్ధకాల్లాంటి (డైయూరెటిక్స్) మందుల్ని అధిక రక్తపోటు నివారణ (లేదా యాంటీహైపెర్టెన్సివ్) ఔషధంగా మీరు ఉపయోగిస్తారు. ఈ మందులలో ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను చేర్చిన కలబోత మందుల్ని (combination medicines) మీ అధిక రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగిస్తారు. మీ రక్తపోటు వ్యాధి తీవ్రత, రక్తపోటు రీడింగ్స్, మీ వయస్సు, మరియు మందుల లభ్యత ఆధారంగా మీ చికిత్స కోసం కావాల్సిన ఔషదాల ఎంపికను మీ వైద్యులే నిర్ణయిస్టారు.
- మీ వైద్యుడు సలహా ఇచ్చినట్లుగా, అధిక రక్తపోటు మందులను క్రమం తప్పకుండా తీసుకుంటే, ఆహారంలో ఉప్పు పరిమితిని పాటిస్తూ, ఒత్తిడిని దరి చేరనీయకుండా రోజువారీ సాధారణ వ్యాయామాలను చేస్తూంటే మీ రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. పేర్కొన్న ఈ చర్యల్ని క్రమం తప్పకుండా పాటిస్తే అధిక రక్తపోటు వలన సంభవించే మరేఇతర సంక్లిష్టతల్ని కూడా నివారిస్తాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు గురించి
- ఆరోగ్యకర ఆహారసేవనం
వేయించిన ఆహారపదార్థాలు, ఇతర చెత్త తిండ్లు (జంక్ ఫుడ్) తినడం ఆపి, మీ దిననిత్య ఆహారంలో పచ్చికూరగాయలు, తాజా పళ్ళు మరియు తృణధాన్యాలు వంటి ఆరోగ్యకర పదార్థాలను తినడం ప్రారంభించండి.
- మద్యం తీసుకోవడం పరిమితం చేయాలి
మీకు మద్యపానం మరియు పొగాకుసేవనం అలవాటుంటే వాటిసేవనాన్ పరిమితం చేయడం లేదా వీలైతే అవి రెండింటినీ పూర్తిగా త్యజిస్తే గనుక మీ రక్తపోటు నియంత్రణకు ఎంతో సహాయపడుతుంది.
- తక్కువ ఉప్పును ఉపయోగించడం, డబ్బాల్లో తినడానికి సిద్ధంగా ఉంచిన (canned foods) ఆహారాలు తినడాన్ని పూర్తిగా ఆపేయడం.
- దృఢంగా ఉండటం (staying fit)
మీరు నడవడం మరియు జాగింగ్ వంటి సాధారణ వ్యాయామాలను మీ దినచర్యలో భాగంగా చేసుకుంటే మీరు దృఢంగా ఉండడమే కాకుండా మీ అధిక రక్తపోటు కూడా నిరోధించబడుతుంది. మీరు ఈత, తీవ్రతరమైన వ్యాయామం వంటి కసరత్తుల్ని చేయచ్చు కానీ, మీ డాక్టర్ అనుమతితో మరియు నిపుణుడి మార్గదర్శకత్వంలో మాత్రమే చేయాలి.
- ఒత్తిడి నిర్వహణ
ఒత్తిడి కూడా అధిక రక్తపోటుకు ఒక ముఖ్యమైన కారణం కావచ్చు. యోగా, ధ్యానం, లోతైన శ్వాస-వ్యాయామాలు వంటి ఒత్తిడినిర్వహణా చర్యలు తీసుకోవడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవచ్చు మరియు మీ రక్తపోటునూ నిర్వహించుకోవచ్చు.
జీవనశైలి నిర్వహణ
మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే మీరు పాటించే జీవనశైలి మార్పులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీ రోజువారీ జీవితంలో మీరు చేసుకునే మార్పులు అధిక రక్తపోటును నియంత్రించడానికి చాలా ముఖ్యమైనవి. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆరోగ్యకరమైన చర్యలు మీ మందుల మోతాదు తగ్గింపుకు కూడా దారితీస్తుంది, అంటే కాదు, మరింత సంక్లిష్టతను నివారించి రక్తపోటును నియంత్రించవచ్చు. అటువంటి జీవనశైలి మార్పులు కొన్ని ఇక్కడ మీకోసం సూచిస్తున్నాం :
- మీ బరువును గమనించండి
మీ శరీరబరువు వైపు ధ్యాస ఉంచి, జాగ్రత్తపడడం అనేది మీ రక్తపోటును నియంత్రించే అత్యంత ప్రభావవంతమైన మార్గం. బరువు పెరగడం వలన రక్తపోటూ పెరుగుతుంది, అలాగే బరువు తగ్గితే రక్తపోటు కూడా తగ్గుతుంది. ఊబకాయం అనేది పెరిగిన రక్తపోటు మరింత విపరీతమయ్యేందుకు ఓ ప్రమాద కారకంగా ఉంటుంది. మీరు మీ ఎత్తు మరియు వయస్సుకు తగిన బరువును కల్గి ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఆదర్శ శరీర ద్రవ్యరాశి సూచిక ప్రకారం మనిషి బరువు “18 మరియు 24.5 kg /m2” మధ్య ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం
- నిత్య వ్యాయామం:
అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి మీ రోజువారీ దినచర్యలో వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. వారానికి కనీసం 5 రోజులు 30 నిమిషాల నడక వంటి చర్యలు మీ రక్తపోటును నియంత్రించడంలో మీకు సహాయపడతాయి. ముఖ్యంగా, మీరు మంచి ఫలితాల కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇతర వ్యాయామాలైన ఈత, నృత్యం, జాగింగ్, పరుగు మొదలైనవాటిని మీ రోజువారీ కార్యకలాపాలలో భాగంగా చేసుకోవచ్చు. ఏదైనా వ్యాయామం చేసే ముందు మీ డాక్టర్ లేదా భౌతిక వ్యాయామ నిపుణుడి (fitness expert) ని సంప్రదించండి.
- నియమితమైన DASH ఆహారాన్ని అనుసరించండి
మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కీలకమైనది. ఆరోగ్యకరమైన ఆహారాల జాబితాలోకి ఏమొస్తాయంటే తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు మరియు తక్కువ కొవ్వు కల్గిన డెయిరీ, పాల ఉత్పత్తులు. ఇంకా, మంచి కొలెస్ట్రాల్ తో కూడిన ఆహారాలు మరియు సంతృప్త కొవ్వులు (saturated fats) కూడా ఆరోగ్యకర ఆహారాల జాబితాలోకి వస్తాయి. ఈ నియమిత ఆహారాన్ని “DASH-ఆహారం” అని పిలుస్తారు. DASH అంటే Dietrary Approaches to Stop Hypertension. ఎప్పటికప్పుడు మీరు అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లను మార్చడం కష్టంగా ఉన్నందున మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కోసం ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. వంటగదిలో అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు ఉంచవద్దు, ఎందుకంటే అలాంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు మీరు ఏర్పరుచుకున్న నియమితఆహారాన్నిచెదరగొట్టవచ్చు.
- ఉప్పు తినడాన్ని పరిమితం చేయండి
రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడానికి తినే ఉప్పును తగ్గించడం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ ఆహారపదార్థాల ప్యాక్ లపై ఉండే లేబుల్స్ లో ఏమి రాసుందో చదవండి. మీ డాక్టర్ మీకు మీరు తీసుకునే ఆహారంలో ఉప్పును తగ్గించమని సూచిస్తారు. తినే ముందు, వండి సిద్ధం చేసిన వంటలకు/ఆహార పదార్థాలకు అదనంగా ఉప్పును చిలకపోవడం మీకే లాభదాయకం.
- మద్యపానాన్ని పరిమితం చేయండి
మద్యపానాన్ని ఓ మోస్తరు మోతాదులో తీసుకుంటే గుండెకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, అధికంగా తీసుకుంటే అది గుండెకు హానికరం కావచ్చు. మీరు మద్యపానం యొక్క ప్రభావాలను అర్థం చేసుకోవటానికి మీ వైద్యుడితో సంప్రదించవచ్చు. మీరు మద్యపానాన్ని పరిమితం చేసే దిశగా, ఎంత (తక్కువ) పరిమాణంలో మద్యం పుచ్చుకోవచ్చో వైద్యుడ్ని అడిగి తెల్సుకుని ఆ ప్రకారం మాత్రమే తీసుకోవచ్చు.
- ధూమపానం వదిలేయండి
ధూమపానం (smoking) రక్తపోటును పెంచుతుంది. బీడీ/సిగరెట్ ధూమపానాన్ని మీరు నెమ్మదిగా తగ్గించొచ్చు, అటుపై ధూమపానాన్ని పూర్తిగా మానేయొచ్చు, దీనివల్ల గుండెజబ్బులొచ్చే ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. మంచి ఆరోగ్యానికి కూడా మీరు ధూమపానం నిలిపివేయవచ్చు.
- ఒత్తిడిని నిర్వహించండి
ఒత్తిడితో కూడిన జీవనశైలి రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది. ఒత్తిడిని తగ్గించుకొని, నెమ్మదిని అలవర్చుకుని, ధ్యానం చేయడం నేర్చుకొని దాన్ని క్రమంగా అభ్యసించడం ద్వారా మీ రక్తపోటును నియంత్రించడం సాధ్యపడుతుంది.
- మీ డాక్టర్ని సందర్శించండి
వైద్యుడితో క్రమమైన సందర్శనలు మరియు వైద్యుడి చేత వ్యాధి నయం చేసుకునే క్రమంలో వస్తున్న పురోగతిని తనిఖీ చేయించుకోవడం లాంటి చర్యలు మీ రక్తపోటును పర్యవేక్షించేందుకు సహాయపడుతాయి. అంతే కాక, మీ డాక్టర్ మీకు కొనసాగుతున్న చికిత్స ప్రభావాన్ని గమనించగల్గుతారు. మరియు చికిత్సలో అవసరమైన మార్పులను చేయవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే, మీకు వ్యాధిలక్షణాలు లేకుంటే కూడా, సాధారణ రక్తపోటు పరీక్ష చేయించుకోవడం వల్ల మీరు ఇంకా అధిక రక్తపోటుతో బాధపడుతున్నదీ లేనిదీ నిర్ధారణ అవుతుంది.
- హితుల మద్దతు కోరండి
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మరియు మీ జీవితంలో ఒత్తిడిని తగ్గించడానికి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మద్దతు చాలా ముఖ్యమైనది కాబట్టి వారి మద్దతును తీసుకోండి.
అధిక రక్తపోటు (హై బిపి) యొక్క చిక్కులు
రోగ నిరూపణ
అధిక రక్తపోటు యొక్క నిరూపణ అనేది రోగి అంతర్లీన వ్యాధికారణం మరియు రోగి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. అత్యవసర రక్తపోటున్న రోగి విషయంలో, రోగ నిర్ధారణ బలహీనంగా ఉంటుంది మరియు అధిక రక్తపోటు బాగా నియంత్రించబడకపోతే మరింత సంక్లిష్టతలకు దారితీయవచ్చు. ద్వితీయ రక్తపోటు విషయంలో, వ్యాధికి గల కారణానికి చికిత్స చేస్తే, రోగనిర్ధారణ క్రమంగా మెరుగుపడుతుంది మరియు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వయస్సు పెరుగుదలతో, రక్తపోటు కూడా పెరుగుతుంది. ఇంకా, గుండె జబ్బులు మరియు మూత్రపిండ వైఫల్యం వంటి సమస్యలు కూడా వయస్సు పైబడిన వారిలో వస్తాయి. రక్తపోటులో స్వల్ప తగ్గింపు తీవ్రమైన వైకల్యాలు మరియు సమస్యలను నివారించవచ్చు. అందువల్ల, మీరు మీ అధిక రక్తపోటును పర్యవేక్షించుకుంటూనే దాన్ని నియంత్రణలో ఉంచడానికి మీ డాక్టరు యొక్క సూచనలను ఎల్లప్పుడూ అనుసరించాలి.
ఉపద్రవాలు
ఔషధసేవనం మరియు జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటును బాగా నియంత్రించకపోతే, పక్షవాతం వంటి పలు తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. ఆ సమస్యలేవంటే:
- బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం
మెదడు కణాలు ఆకస్మికంగా మరణానికి గురవ్వడం మూలంగా మారణాంతకమైన పక్షవాతం లేదా బ్రెయిన్ స్ట్రోక్ దాపురిస్తుంది. అధిక రక్త పోటు కారణంగా మెదడురక్తనాళాల్లో అడ్డంకులేర్పడ్డం లేదా ఆ రక్తనాళాలు మూసుకుపోవడమో లేదా సంకోచించుకుపోవడమో జరుగుతుంది. ఇది పక్షవాతం లేదా మాట పడిపోవటానికి దారి తీస్తుంది.
- గుండె-ధమనుల వ్యాధులు
హృదయ సంబంధమైన వ్యాధులలో రక్తపోటు పెరుగుదల కారణంగా, గుండె-ధమనులు దెబ్బతినడం, ధమనుల సంకోచానికి కారణమయ్యే రక్త కణాల నష్టం జరుగుతుంది. ఫలితంగా, గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుంది.
- గుండెపోటు
గుండెకు రక్త ప్రవాహంలో ఆకస్మిక క్షీణత ఏర్పడి గుండెపోటుకు దారి తీస్తుంది. దీన్నే “మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్” అని కూడా పిలుస్తారు.
- దీర్ఘకాల మూత్రపిండ వైఫల్యం
దీర్ఘకాల రక్తపోటు మీ మూత్రపిండాలను దెబ్బ తీస్తుంది.
- మరణం
రక్తపోటు చాలా ఎక్కువగా పెరిగిపోయి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది, అందుకు తక్షణమే తీవ్రమైన వైద్య సంరక్షణ, సపర్యల్ని (intensive care) అందించకపోతే మరణానికి దారితీస్తుంది.
అధిక రక్తపోటు (హై బిపి) అంటే ఏమిటి?
గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశంలో సంభవించే మరణాలకు అధిక రక్తపోటు ప్రధాన కారణంగా పరిణమించింది. అధిక రక్తపోటునే “హైపర్ టెన్షన్” గా పిలుస్టారు. ఇది చాలా సాధారణ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. మీకు అధిక రక్తపోటు ఉందని తేలిన తర్వాత, ఇక జీవితాంతం “యాంటీ-హైపర్ టెన్సివ్ ట్రీట్మెంట్” చికిత్సను తీసుకొంటూ తగిన జీవనశైలి మార్పులను చేసుకోవడం అవసరమవుతుంది. గుండె వ్యాధులు, స్ట్రోకులు, ఇస్కీమిక్ కార్డియాక్ వ్యాధులు మరియు మూత్రపిండ వైఫల్యాలకు అధిక రక్తపోటు ఒక ముఖ్యమైన ప్రమాద కారకం. అందువల్ల, అధిక రక్తపోటును బాగా నియంత్రించకపోతే అది ఇతర ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. అధిక రక్తపోటు మరియు దాని చికిత్సా పరిణామ-ఫలితాలు ఆ వ్యక్తి యొక్క జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరియు అధిక రక్తపోటు కల్గిన ఆ వ్యక్తి యొక్క కుటుంబ చరిత్రకు సంబంధించినవి. 30 ఏళ్ల వయస్సు తరువాత సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల రక్తపోటును అలాగే, ఇతర ఆరోగ్య సమస్యలకు సమర్థమంతంగా పర్యవేక్షించేందుకు సహాయపడతాయి. ఇందుగ్గాను, ‘ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ రక్తపోటు పర్యవేక్షణా యంత్రాల’ను ఇంట్లోనే వాడవచ్చు. ఈ రక్తపోటు పర్యవేక్షణా యంత్రాలు ఉపయోగించడం సులభం మరియు వాటి రీడింగులను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అధిక రక్తపోటు కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి మరియు 2020 నాటికి ఇది వైకల్యం మరియు మరణానికి ప్రధాన కారణమని అంచనా వేయబడింది.
అధిక రక్తపోటు (హై బిపి) యొక్క లక్షణాలు
అధిక రక్తపోటు యొక్క అత్యంత అద్భుతమైన లక్షణం ఏమిటంటే ఎలాంటి వ్యాధి లక్షణాలు పొడజూపకుండా ఎంత కాలం కావాలో అంత కాలాన్ని గడిపేయగలదు. అధిక రక్తపోటును కలిగిఉన్న చాలా మందికి తమకు అధిక రక్తపోటు దాపురించిందన్న సంగతి అసలు తెలియదు. కనుక,, మీరు మీ డాక్టర్‌ను క్రమం తప్పకుండా సందర్శించండి, అలా వైద్యుడి సందర్శనం, వైద్యపరీక్షలు చేయిం కోవడం వల్ల మీ రక్తపోటు స్థాయిలలో ఎటువంటి మార్పులు వస్తున్నాయనేది ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది.
మీకు నియంత్రించలేని రక్తపోటు గనుక ఉంటే, మీరు ఈ క్రింది లక్షణాలను గమనించవచ్చు:
- తీవ్రమైన తలనొప్పి - అధిక రక్తపోటు వలన మీకు తల చాలా భారమైనట్లు తోచవచ్చు, లేదా తలానొప్పితో మీరు బాధపడవచ్చు.
- అలసట లేదా గందరగోళం- మీరు బలహీనమైన లేదా అసౌకర్యం లేదా నిర్లక్ష్యం కావచ్చు.
- దృష్టి సమస్యలు - మీకు దృష్టి మసకబారడం, లేదా వస్తువులు రెండుగా కనబడ్డం జరగొచ్చు.
- ఛాతీ నొప్పి - మీకు ఛాతీలో పదునైన నొప్పి ఉన్నట్లు, లేదా ఎదలో భారంగా ఉన్నట్లు అనిపించవచ్చు.
- శ్వాస సమస్య - మీరు సరిగ్గా శ్వాస తీలుకోలేకపోతున్నట్లు మీకు అనిపించొచ్చు.
- గుండె దడ (palpitation) - మీరు మీ గుండె ఎక్కువగా కొట్టుకోవడాన్ని మీరే వినగలరు. దీన్నే “గుండె దడ” అని కూడా అంటారు.
- మూత్రంలో రక్తం - మీకు అరుదుగా నలుపు రంగు మూత్రం పోతున్నట్లు అనిపించొచ్చు లేదా కొద్దిగా గోధుమ రంగు మూత్రాన్ని గమనించవచ్చు.
అధిక రక్తపోటు (హై బిపి) యొక్క కారణాలు
అధిక రక్తపోటుకు అనేక కారణాలు ఉన్నాయి. ఒకవేళ మీరు అధిక రక్తపోటుకు గురైనట్లైతే అందుకు కారణాలు తెలుసుకునేందుకు మీ డాక్టర్ మీ వ్యక్తిగత చరిత్రను అడగొచ్చు. మీకున్న అధిక రక్తపోటును గుర్తించేందుకు, గల కారణాన్ని పసిగట్టేందుకు మీ ఆహారం గురించి, అలవాట్లు గురించి , మరియు మీ కుటుంబ చరిత్ర వంటివాటిని డాక్టర్ అడుగుతాడు. మీకున్న అధిక రక్తపోటుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారణాలు ఉండవచ్చు.
- చాలా సార్లు, అధిక రక్తపోటు గుర్తించబడకుండా పోతుంటుంది. మరియు అధికరక్తపోటుకు కారణం తెలియకుండా పోతూఉంటుంది.
- పెరిగిన బరువు, డయాబెటిస్ (చక్కెరవ్యాధి), మూత్రపిండ వ్యాధి మరియు నిద్రపోతున్నప్పుడు శ్వాసలో కష్టపడడం వంటి జబ్బులకు అధిక రక్తపోటు ద్వితీయమవుతుంది.
- ఊబకాయం - ఊబకాయంతో కూడిన అధిక బరువు రక్తపోటుకు కారణమవచ్చు.
- ఒత్తిడి - ఒత్తిడితో కూడిన జీవితం రక్తపోటును ప్రభావితం చేయవచ్చు.
- జన్యు కారణాలు - అధిక రక్తపోటు కుటుంబాలలో వంశ పారంపర్యంగా వస్తుంటుంది.
- అనారోగ్యకరమైన జీవన విధానం - పొగాకు ధూమపానం మరియు లోనికి పొగాకును నమిలి సేవించడడం, అధిక మద్యపానం, జంక్ ఫుడ్ తినడం వంటివి అధిక రక్తపోటుకు కారకాలవచ్చు.
- గర్భం - గర్భప్రేరిత అధిక రక్తపోటు కొందరు ఆడవాళ్ళలో చూడవచ్చు.
- డ్రగ్స్- మీరు తీసుకొంటున్న కొన్ని మందులు అధిక రక్తపోటు ప్రబలడానికి కారణం వహిస్తాయి.
ప్రమాద కారకాలు / Risk factors
అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచే పలు అంశాలు ఉన్నాయి. అవి ఏవంటే:
- వయస్సు - మీ వయస్సు పెరుగుతున్నకొద్దీ మీ రక్తపోటు పెరుగుతుంది.
- సెక్స్ - ఇది మహిళల కంటే పురుషులలోనే చాలా సాధారణం.
- కుటుంబ చరిత్ర - మీ తండ్రి తరపు లేదా తల్లి తరపు కుటుంబ సభ్యులు గనుక అధిక రక్తపోటు చరిత్రను కలిగి ఉంటే, మీరు క్రమం తప్పకుండా రక్తపు ఒత్తిడి పరీక్షల్ని చేయించుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కుటుంబ చరిత్రను బట్టి అధిక రక్తపోటు మీకు కూడా రావచ్చు కాబట్టి.
- ఊబకాయం - ఎవరైతే బరువెక్కువుంటారో, వారు బరువు పెరగేకొద్దీ వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతుంటాయి.
- కూర్చునివుండే నిశ్చల స్థితి జీవనశైలి/Sedentary lifestyle - ఎలాంటి శారీరక కార్యకలాపాలు లేకుండా ఎప్పుడూ కూర్చునే ఉండే నిశ్చల జీవనశైలి మీ బరువును పెంచుతుంది, తద్వారా మీ రక్తపోటు కూడా పెరుగుతుంది. కాబట్టి, మీ రక్తపోటును నిర్వహించడానికి వ్యాయామం మరియు శారీరక శ్రమ ముఖ్యమైనవి.
- పొగాకు సేవనం - పొగాకు సేవనం (అంటే పొగాకు నమిలి మింగడం) అధిక రక్తపోటుకు చాలా ప్రమాదకరమైన ప్రమాదకారకంగా ఉంటుంది, ఎందుకంటే, పొగాకు సేవనం వల్ల ధమనుల (నరాల) గోడల మందం పెరిగి తద్వారా మనిషి ధమనులు మూసుకుపోవడం జరుగుతుంది.
- అధిక ఉప్పు తీసుకోవడం - అధిక రక్తపు ఒత్తిడికి ఆహారంలో తీసుకునే ఉప్పు ప్రమాణం పెరగడం ఒక ముఖ్యమైన ప్రమాద కారకంగా ఉంటుంది, ఎందుకంటే మన శరీరంలోకెళ్ళే ఉప్పు ద్రవాలను కలిగి ఉంటుంది, కనుక ఆలా పెరిగిన ఉప్పు ప్రమాణం గుండె మీద బరువును పెంచుతుంది.
- మద్యపానం - మితం మించిన మద్యపానం అనేది గుండెకు ప్రమాదకరమే. మహిళలైతే ఒకటి కంటే ఎక్కువ పానీయాలు తీసుకోవడం మరి పురుషులైతే రెండింటి కంటే ఎక్కువ మధ్య పానీయాలు తీసుకోవడం రక్తపోటును పెంచి ప్రమాదాన్ని దాపురింపజేస్తాయి.
- ఒత్తిడితో కూడిన జీవితం - మీ జీవితంలో ఒత్తిడిని ఎంత ఎక్కువగా పెంచుకుంటారో, అంతే ఎక్కువగా అధిక రక్తపోటు వలన మీరు బాధపడతారు అప్రధాన/గౌణ పరిస్థితులు- చక్కెరవ్యాధి/మధుమేహం వంటి పరిస్థితులు హైపర్ టెన్షన్ ను మరింత పెంచే ప్రమాదముంది.
- గర్భం - ఇది కొందరు స్త్రీలలో అధిక రక్తపోటుకు దారితీస్తుంది.
అధిక రక్తపోటు (హై బిపి) యొక్క నివారణ
మీ జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా అధిక రక్తపోటును నివారించడం లేదా ఈ వ్యాధి మనకు దాపురించడాన్ని ఆలస్యం చేయడం సాధ్యపడుతుంది. ఇక్కడ అధిక రక్తపోటును దూరంగా ఉంచడంలో సహాయపడే పలుకారకాలను వివరిస్తున్నాం. ఇవి అధిక రక్తపోటును నివారించడంలో సహాయపడతాయి:
- ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు
చెత్త తిండి (జంక్ ఫుడ్) తినడం మానుకోండి మరియు బయట తినడం పరిమితం చేయండి. ఎల్లప్పుడూ అనారోగ్యకరమైన వాటి కంటే ఆరోగ్యకరమైన వాటినే ఎంచుకోండి. మీరు ఏమి తింటున్నారు ఎంత తింటున్నారు అనే దానిపై నిఘా ఉంచేందుగ్గాను ఆహార ప్యాకేజీలపై రాసిఉండే వివరణలను (కంటెంట్లను) చదవండి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
- తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా క్రమమైన వ్యాయామాలు
ఓ 30 నిమిషాల నడక లేదా 15 నిమిషాల వేగవంతమైన (జాగింగ్) గమనం మీ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి సరిపోతుంది. కాబట్టి, మీ దినచర్యలలో ఈ వ్యాయామాలు పాటించేలా చూసుకోండి.
- మద్యపానం, ధూమపానం మానుకోవడం లేదా పరిమితం చేయడం
మద్యపానం, ధూమపానం మానుకోవడంవల్ల లేదా పరిమితం చేయడం వల్ల మన శరీరంలో అధిక రక్తపోటు ముదరకుండా లేదా మరింత పెరక్కుండా నివారించవచ్చు. ధూమపానం మరియు మద్యం సేవిందడం అధిక రక్తపోటుకు ప్రమాద కారకాలు, అందువల్ల, వాటిని పరిమితం చేయడానికి లేదా వీలైతే వాటిని పూర్తిగా విసర్జించేందుకు ప్రయత్నించండి.
అధిక రక్తపోటు (హై బిపి) యొక్క వ్యాధినిర్ధారణ
అధిక రక్తపోటు నిర్ధారణకు, మీరు మీ రక్తపోటుపరిమాణాన్ని కొలవడం కోసం డాక్టర్‌ను సందర్శించాలి. రక్తపోటును స్పిగ్మోమానోమీటర్ అని పిలవబడే ఒక పరికరం ఉపయోగించి కొలుస్తారు. ఈ పరికరం మీ ఎగువ చేయి అంటే భుజం కింది భాగమైన రెట్ట చుట్టూ ఒక గుడ్డ పట్టీని (కఫ్) బిగుతుగా మడవటం, ఆ తర్వాత చుట్టిన ఆ పట్టీ మడతలోనికి చేతితో గాలిని పంపు చేసే పరికరంతో గాలిని పంపు చేసి పంపడం ద్వారా రక్తపోటును కొలిచేందుకు రూపొందించబడింది. ప్రత్యామ్నాయంగా, ఎలక్ట్రానిక్ మెషీన్‌ను ఉపయోగించి కూడా రక్తపోటును అంచనా వేయవచ్చు. ఎగువ భుజంపై పట్టీ/కఫ్ ఉంచడానికి కారణం ఏమంటే ఇది బ్రాచియల్ ధమని అని పిలువబడే ఒక రక్తనాళాన్ని కలిగి ఉంది. చేతిలోని బ్రాచైయల్ ధమని కింద, అణఁగియున్నస్థితిలో ఇమిడిఉన్న సంపీడన పెద్ద ధమని ఉంది. రక్తపోటు కొలత సమయంలో, బిగుతుగా కట్టిన పట్టీలోనికి గాలిని పంపు చేసే పరికరంతో గాలి ఒత్తిడిని పెంచి రక్త ప్రవాహాన్ని నిలిపివేస్తుంది. పెంచిన గాలి ఒత్తిడిని రిలీజ్ చేయడం ద్వారా వాయు ప్రసరణను మీ వైద్యుడు స్టెతస్కోప్ ను ఉపయోగించి వినడానికి వీలవుతుంది. ఇంకా, సంఖ్యా కొలతలు కలిగిన పాదరసంతో కూడిన రక్తపోటు రీడింగ్స్ ని చూస్తాడు. రక్తపోటు కొలత యంత్రం ఆటోమేటిక్ అయితే, అది పాదరసం సంఖ్యాత్మక స్కేలును కలిగి ఉండదు, కానీ ప్రత్యక్ష ఎలక్ట్రానిక్ పఠన ప్రదర్శనను కలిగి ఉంటుంది. ప్రదర్శన తెర నేరుగా రక్తపోటు రీడింగ్స్ చూపిస్తుంది.
రక్తపోటును సిస్టోలిక్ మరియు డయాస్టొలిక్ రక్తపోటుగా నమోదు చేస్తారు. సిస్టోలిక్ రక్త పీడనం అనేది హృదయ స్పందనల సమయంలో కొలుస్తారు, అయితే, డయాస్టొలిక్ రక్త పీడనం అంటే గుండె యొక్క సడలింపు కాలంలో కొలుస్తారు. రక్తపోటును కొలిచినప్పుడు డయోస్టోలిక్ ఒత్తిడి ద్వారా సిస్టోలిక్ ఒత్తిడిగా సూచించబడుతుంది మరియు యూనిట్ పాదరసం యొక్క మిల్లిమీటర్ అంటే, mm యొక్క Hg గా కొలుస్తారు కొలిచిన రక్తపోటు యొక్క ఫలితాలను ఇలా అంచనా వేయవచ్చు:
- సాధారణ రక్తపోటు - 120/80 mm Hg లేదా అంతకంటే తక్కువ
- సాధారణ రక్తపోటు కంటే ఎక్కువ - 120/80 mm Hg పైన
మీరు డాక్టరు వద్దకు మొదటిసారి వెళ్ళినపుడు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, మీ డాక్టర్ మిమ్మల్ని అధిక రక్తపోటు రోగిగా నిర్ధారించడానికి మరియు చికిత్సా విధానాన్ని ప్రారంభించటానికి ముందు స్థిరమైన ఫలితాల కోసం మరిన్ని రీడింగ్స్ తీసుకుంటాడు. మీ మొదటి సందర్శన సమయంలో ఆందోళన లేదా భయము వలన మీ రక్తపోటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అందువల్ల, అనేక రీడింగ్‌లు అవసరమవుతాయి. మీరు అధిక రక్త పోటుతో బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలితే డాక్టరు (అతను / ఆమె) ప్రారంభించిన చికిత్సలో రక్తపోటు యొక్క ప్రతిస్పందనను పర్యవేక్షించడానికి, దానికి అనుగుణంగా చికిత్సను సవరించడానికి మీ డాక్టర్ మిమ్మల్ని తరచుగా తనను సందర్శించమని కోరతాడు.
అధిక రక్తపోటు కొరకు మందులు
Medicine Name | Pack Size | |
---|---|---|
Amlodac Tablet | Amlodac 10 Tablet | |
Amchek Tablet | Amchek 10 Tablet | |
Angicam Tablet | Angicam 2.5 Mg Tablet | |
Aten | ATEN 100MG TABLET | |
Amlokind AT | AMLOKIND AT TABLET | |
Amtas Tablet | Amtas 5 Tablet | |
Concor Am | Concor AM 2.5 Tablet | |
Concor Tablet | Concor 10 Tablet | |
Met XL AM | Met XL AM 25/2.5 Tablet | |
Betacard | Betacard 25 Tablet XL | |
Revelol Am | Revelol AM 5 Mg/25 Mg Tablet | |
Tazloc Trio | Tazloc Trio 40 Tablet | |
Amlopres AT | Amlopres AT 25 Tablet | |
Stamlo Beta | SLAMLO BETA TABLET | |
Cardivas | CARDIVAS CR 20 | |
Tenoric | TENORIC 100MG TABLET | |
Polycap | Polycap Capsule | |
Stamlo | Stamlo 10 Tablet | |
Telma Am | Telma 80 AM Tablet | |
Ctd | CTD 12.5 Tablet | |
Bpc At | Bpc At 50 Mg/5 Mg Tablet | |
Metofid Am | Metofid Am 25 Mg Tablet | |
Frumide | Frumide 40 Mg/5 Mg Tablet | |
Amdac 5 Mg Tablet | Amdac 5 Mg Tablet |
అధిక రక్తపోటు ఆయుర్వేదంలో నవీన్ నడిమింటి సలహాలు
అధిక రక్త పోటు -- నివారణ
రక్త నాళాల్లో మలినపదార్ధాలు చేరినపుడు రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడుతుంది. అటువంటప్పుడు రక్తం వేగంగా ప్రవహించడానికి ప్రయాత్నించడాన్ని "రక్త పోటు " అంటారు.
యోగాసనం:--
పద్మాసనం లో కూర్చొని చిటికెన వేలు, బొటన వేలు కలిపి మధ్యలో పెట్టి మిగిలిన మూడు వేళ్ళను చాచాలి.
రెండు చేతులను అదేవిధంగా పెట్టుకొని, తలను నిటారుగా పెట్టుకొని కళ్ళు మూసుకొని నొసటి మధ్యలో ఒక ఆకారాన్ని ఊహించుకొని మనోఫలకం పై పెట్టుకోవాలి.కనుగుడ్లు పైకి పోకూడదు.
ఇప్పుడు క్రమముగా శ్వాస వేగాన్ని తగ్గించాలి.ఇప్పుడు మనసు వాయువు తో లగ్నమవుతుంది.
శరీరంలో ఈ సమయం లో చాలా ప్రశాంతమైన మార్పులు జరుగుతాయి.అన్ని రకాల మదాలు అణిగి పోయి ప్రశాంతత కలుగుతుంది.
ఆహారం:-- ఎక్కువ సార్లు కాఫీలు తాగడం,పాన్ మసాలాలు,గుట్కాలు, మద్యం, అధిక కారం, అధికమైన మసాలాలు, వాడ కూడదు. అవి వాడితే ప్రాణాయామాలు చేసినా B.P తగ్గదు
ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడుకోవాలి. దీని వలన ఎలాంటి ముప్పు ఏర్పడదు.
పచ్చి మిర్చి తగ్గించి మిరియాలు ఎక్కువగా వాడాలి. కొత్త చింత పండు వాడకూడదు. అన్నిటికంటే చింత పువ్వు, చింత చిగురు అతి శ్రేష్టమైనది .వీటిని నిల్వ వుంచుకొని వాడడం మంచిది. ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగావాడాలి.
హై బిపి ఉన్నవారు ఇలా చిత్రము లో ఉన్నట్లు clips పెట్టుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజుకి 3 సార్లు 5 నిమిషాలు చొప్పున ధరించాలి. జయగురుదత్త
కిచిడి లేదా పొంగలి:--
గోధుమ రవ్వ,పెసర పప్పు కలిపి దానికి కారెట్, బీట్రూట్,జిలకర,ధనియాలపొడి, ఆకుపత్రి
(సగం ఆకు ), కొంచం ఆవు నెయ్యి లేదా కొద్దిగా నువ్వుల నూనె, సైంధవ లవణం,అల్లం కలిపి వండుకొని తింటే B.P. కి వేరే మందులు అవసరం లేదు.
అధిక రక్త పోటు
ఉష్ణం అధికంగా పెరగడం వలన అధిక రక్త పోటు వస్తుంది.
1. చంద్ర భేదన ప్రాణాయామం:-- పద్మాసనం లో లేక అర్ధ పద్మాసనంలో లేక సుఖాసనం లో కూర్చొని బొటన వ్రేలుతో కుడి ముక్కును మూసి నెమ్మదిగా గాలిని పీల్చాలి.
ఎడమ ముక్కును మూసి పీల్చిన గాలిని రెట్టింపు నెమ్మదిగా వదలాలి.
అదే విధంగా రెండవ వైపు కూడా చెయ్యాలి.
ఈ విధంగా రోజుకు మూడు సార్లు ఆహారానికి ఒక గంట ముందు 12 సార్లు లేదా 24 సార్లు చొప్పున చెయ్యాలి.
2 శీతలి ప్రాణాయామం :-- సుఖాసనం లో కూర్చొని నాలుకను దొన్నె లాగా మడిచి గాలిని బాగా దీర్ఘంగా లోపలి పీల్చి, నోరు మూసి కొంత సేపు ఆపి ఉంచాలి, తరువాత నెమ్మదిగా ముక్కు ద్వారా గాలిని వదలాలి. దీని వలన శరీరము చల్లబడుతుంది. ఈ విధంగా రోజుకు 12 లేక, 18 లేక, 24 సార్లు చెయ్యాలి.
3. శీత్కారి ప్రాణాయామం ;-- సుఖాసనం లో కూర్చొని రెండు పళ్ళ మధ్య నుండి గాలిని పీల్చి లోపల కొంత సేపు నిలిపి వుంచి తరువాత నెమ్మదిగా ముక్కు ద్వారా వదలాలి. దీని వలన రక్త పోటు అతి సహజంగా నివారింపబడుతుంది.
ఆహారం:-- రోజుకు రెండు, మూడు సార్లు ఆహారంలో ఒక్కొక్క టీ స్పూను పొడి కరివేపాకు పొడి తీసుకుంటూ వుంటే రక్తం లో వున్న వేడి తగ్గుతుంది. ఇది రక్తంగడ్డ కట్టకుండా చేయడం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
వేప చిగుళ్ళను కూడా దీనితో కలిపి వాడితే B. P. అతి వేగంగా నివారింపబడుతుంది.
బీరకాయ, సొరకాయ, పొట్ల కాయ,దోసకాయ,టమేటా,తీపిద్రాక్ష (ఎండు ద్రాక్ష), నల్లద్రాక్ష,ఆపిల్, దానిమ్మ లాటి పళ్ళ రసాలు సాయంత్రం పూట తాగుతూ వుంటే రక్త పోటు అదుపులో వుంటుంది.
తాజా పుదీనా ----- 100 gr
కరివేపాకు ----- 100 gr
కొత్తిమీర ----- 100 gr
అన్నింటిని కలిపి దంచి రసం తీసి అది ఎంత వుంటే అంత కలకండ కలిపి కరిగించి చిన్న మంట మీద కాచాలి రసాలన్ని ఇగిరి తీగ పాకం వచ్చే వరకు కాచి, దించి, చల్లార్చి సీసాలో భద్ర పరచాలి. రెండు టీ స్పూన్ల పాకాన్ని అర గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి. దీనితో B.P. నివారింప బడుతుంది
. దీనిలో జిలకర పొడి, ధనియాల పొడి కూడా కలుపుకోవచ్చు. దీని వలన జీర్ణ శక్తి పెరుగుతుంది.
అధిక రక్తపోటు వలన వచ్చే గుండె సంబంధ సమస్యలు
1. High B.P. వున్న మనిషిని చొక్కా తీసేసి బోర్లా పడుకోబెట్టాలి.ఒక నూలు గుడ్డ(తుండు గుడ్డ అయినా పరవాలేదు) బాగా తడిపి, పిండి మెడ దగ్గర నుండి నడుము వరకు పరిచి అద్ది దుప్పటి కప్పి ఉంచాలి.దీని వలన అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.
2. Ice Cubes ను గుడ్డలో వేసి మెడ దగ్గర నుండి నడుము వరకు వెన్నుపూస మీద కాపడం పెట్టాలి. దీనిని కశేరుకా శీతల స్నానం అంటారు. దీని వలన అధిక రక్తపోటు అప్పటికప్పుడు అదుపులోకి వస్తుంది.
3. అనులోమ, విలోమ ప్రాణాయామాలను 12, 18, 24 సార్లు చెయ్యాలి.
4. చంద్ర భేదన ప్రాణాయామం చెయ్యాలి. ఈ రెండు వ్యాయామాలను ప్రతి రోజు చేస్తే గుండెపోటు అదుపులో వుంటుంది.
ఆహారం--
ఉల్లిగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా చేసి కూరలో కొన్ని, పెరుగు అన్నంలో కొన్ని తింటూ
వుంటే గుండెపోటు రాదు. ఉల్లి అతి వేడిని తగ్గిస్తుంది.అతి వేడి వలన గుండెపోటు వస్తుంది . ఉల్లి అధిక, అల్ప రక్తపోటు లను నియంత్రిస్తుంది.
ఒక టీ స్పూను ఉల్లిరసం,మరియు ఒక టీ స్పూను తేనె కలిపి ఆహారానికి ఒక గంట ముందు రాత్రి పూట తీసుకుంటూ వుంటే అధిక రక్తపోటు అదుపులో వుంటుంది.
150 గ్రాముల సొరకాయ (అనప కాయ) ముక్కలను కుక్కర్ లో వేసి అర లీటరు నీళ్ళు పోసి ఒక విజిల్రానివ్వాలి. గోరు వెచ్చగా అయిన తరువాత వడకట్టి ఆ నీటిని తాగాలి. ఉదయం పరగడుపున 5,6 రోజులు మాత్రమే సేవించాలి. ఒక గంట వరకు ఏమి తినకూడదు. దీని వలన రక్తపోటు అతి త్వరగా అదుపులోకి వస్తుంది
రక్తపోటు అదుపులో ఉండాలంటే కాలేయము, ప్లీహము సమస్థితిలో (సమ ఉష్ణోగ్రత) వుండాలి.
అనులోమ, విలోమ ప్రాణాయామం చెయ్యాలి.
అధిక రక్తపోటు సమస్య -- నివారణ
కారణాలు:-- మానసికమైన ఒత్తిడి, కొవ్వు పెరగడం, నరాలు కుంచించుకు పోవడం మొదలైనవి.
ఆచరణ :-- నిన్ను నువ్వే సరిదిద్దుకోవాలి. సమయ పాలనను పాటించాలి. ఆసనాలు, వ్యాయామమ చెయ్యాలి,
ఎండ ఎక్కువగా వున్నపుడు పైత్య ప్రభావం ఎక్కువగా వుంటుంది. అందువలన మధ్యాహ్న సమయంలో
రక్తపోటు ప్రభావం ఎక్కువగా వుంటుంది.
1. పొడవైన నూలు బట్టను చల్లని నీటిలో ముంచి పిండి వెన్నుపూస మీద కప్పాలి. ఒక క్షణంలో వేడి లాగేసి B.P. వెంటనే తగ్గుతుంది.
2. చల్లని నీటిలో గిలకలు మునిగే వరకు కాళ్ళను ఉంచాలి.
3. చేతిగుడ్డను నీళ్ళలో ముంచి ముఖం మీద వేసుకోవాలి.
4. ఆరడుగుల నూలు గుడ్డను నీటిలో ముంచి పిండి పక్కటెముకలకు తగిలేట్లు చుట్టాలి. దాని మీద పలుచని పొడి గుడ్డను, దాని మీద మందపాటి గుడ్డను చుట్టాలి.
5. నరాలు బాగా రిలాక్స్ అవ్వాలంటే హాయిగా నేలమీద వెల్లికిలా పడుకొని యోగనిద్రాసనం వేస్తూ శరీరంలోని ఒక్కొక్క భాగం చాల చల్లబడుతున్నట్లు, విశ్రాంతిగా వున్నట్లు భావించాలి.
చిన్న పిల్లలకు కూడా B.P. వస్తుంది.
ఎవరి ఆలోచనలు వారు తమ అధీనంలో వుంచుకోవాలి. ఆహార సేవన విధానం, సమయాలు, పదార్ధాలు మార్చుకోవాలి.
ప్రతి రోజు శరీరాన్ని తైలంతో మర్దన చెయ్యాలి. దీని వలన అల్ప, అధిక రక్తపోట్లు ఖచ్చితంగా తగ్గుతాయి.
ఈ విధంగా నలభై రోజులు చేయాలి.
అరకప్పు నాటు ఆవు మూత్రం తాగితే B.P.సులభంగా నియంత్రించ బడుతుంది.
తులసి ఆకుల పొడి
పుదీనా ఆకుల పొడి
కరివేపాకు పొడి
జిలకర పొడి
ధనియాల పొడి
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.ప్రతిరోజు అర టీ స్పూను పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు తాగాలి.దీని వలన రక్తపోటు మాత్రమే కాదు అజీర్ణం, అగ్ని మాంద్యం, అరుచి లాంటివన్నీ తగ్గుతాయి.
అతి కారం, అతి ఉప్పు తిన కూడదు. ఉప్పును పూర్తిగా మానకూడదు, సమంగా వుండాలి.
అధిక రక్తపోటు --నివారణ
మూత్ర పిండాలు రక్తాన్ని గ్రహించి మలిన పదార్ధాలను ఆయా అవయవాలకు అందిస్తుంది. మంచి రక్తాన్ని శరీరానికి అందిస్తాయి.రక్త నాళాలలో కొవ్వు చేరితే రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది.
B. p. లక్షణాలు:-- ఉదయం నిద్ర లేవగానే తూలినట్లుగా వుండడం, వాంతి వచ్చినట్లుగా పడిపోతున్నట్లుగా ఉండడం వంటి లక్షణాలు వుంటాయి.
128 ఇది సాధారణమైన B. P. 180 ఇది ఎక్కువ B. P.
140 / 100
సర్ప గంధ చూర్ణము
త్రిఫల చూర్ణము
అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. ప్రతి రోజు ఒక గ్రాము పొడిని తీసుకుంటే
ఎలాంటి B. P.వుండదు నార్మల్ గా వుంటుంది.
అతి కొవ్వు వలన వచ్చే అధిక రక్తపోటు --- నివారణ
కొత్తిమీర
కరివేపాకు
పుదీనా
అన్నింటిని సమాన భాగాలు తీసుకుని విడివిడిగా పొడులు చేసి జల్లించి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
ప్రతి రోజు అర టీ స్పూను పొడిని నోట్లో వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు తాగాలి. దీని వలన అధిక రక్తపోటుతగ్గుతుంది. దీని వలన రక్తంలో గడ్డ కట్టుకున్న కొవ్వు కరుగుతుంది.
అతి కొవ్వు వలన అధిక రక్తపోటు, మరియు అల్పరక్తపోటు-- నివారణ
ఉల్లిగడ్డ యొక్క నిజ రసం -- రెండు టీ స్పూన్లు
తేనె ---రెండు టీ స్పూన్లు
రెండింటిని కలిపి ఆహారానికి గంట ముందు సేవిస్తూ వుంటే అధిక కొవ్వు వలన వచ్చే
అధిక రక్తపోటు, అల్పరక్తపోటు నివారింప బడతాయి.
టెన్షన్, భయం, ఆందోళన ఎక్కువగా పెరుగుతూ వుంటాయి. దీని వలన వాత, పిత్త, కఫాలు ప్రకోపిస్తాయి.
బి, పి పెరగడం వలన శరీరంలో వాతం పెరుగుతుంది. ఇది తల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది.
మెదడు నాళాలపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీని వలన పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ.
బి. పి కి ఎన్ని మందులు వాడినా తల మీద తైల మర్దన తప్పని సరి. ఇది బి. పి ని నియంత్రిస్తుంది. తలను రోజుకు రెండు మూడు సార్లు తైలం తో తడుపుతూ వుండాలి. ముఖ్యంగా నువ్వుల నూనెను పరోక్షంగా వేడి చేసి అంటుకోవాలి. లేదా సుషుప్తి తైలం గాని, బ్రాహ్మి తైలం గాని, క్షీరబల తైలం గాని అంటుకోవచ్చు. .
నువ్వుల నూనెను నేరుగా వేడి చెయ్యకుండా వేడి నీటి లో పెట్టి వేడి చెయ్యాలి.
అధిక రక్తపోటు --నివారణ
స్థూల కాయము, వారసత్వము, శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా నిర్వహించ బడకపోవడం, ఆహార వ్యవహార నియమాలను సరిగా పాటించక పోవడం, మానసిక సమస్యలు మొదలైన కారణాల వలన అధికరక్తపోటు ఏర్పడుతుంది. మానసిక సమస్యలున్నవాళ్ళకు మందులు సరిగా పనిచెయ్యవు.
జ్యోతిష్మతి గింజల చూర్ణం --- 25 gr
తిప్ప తీగ చూర్ణం --- 50 gr
సరస్వతి ఆకుల చూర్ణం ---- 50 gr
సర్ప గంధ చూర్ణం --- 50 gr
బ్రాహ్మి చూర్ణం --- 50 gr
వస చూర్ణం --- 50 gr
తేనె --- తగినంత
అన్ని చూర్ణాలను కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
అర టీ స్పూను పొడిలో తగినంత తేనె కలిపి తినాలి. ఈ విధంగా ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.
మానసిక సమస్యలు వున్నవాళ్ళకు మందులు సరిగా పనిచేయవు. ఇతర ఔషధాలు వాడుతున్న ఈ ఔషధాన్ని కూడా వాడుకోవచ్చు. ఉప్పు తగ్గించి వాడాలి.
అధిక రక్తపోటు
రక్తపు ఒత్తిడినే రక్తపోటు అంటారు. It is a silent killer .
లక్షణాలు, కారణాలు :--
కొంతమందిలో తలతిరగడం ముఖ్య కారణం. జన్యుపరం కావచ్చు. అధిక బరువు,వ్యాయామం చేయకపోవడం, ఉప్పు ఎక్కువగా వాడడం, ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం,ధూమపానం, మూత్రపిండాలలో సమస్యలు, మొదలైనవి.
అన్నింటికంటే ముఖ్యమైనది రక్తంలో ఎక్కువగా కొవ్వు చేరడం.
వెల్లుల్లి, మునగల క్షీరపానం :--
వెల్లుల్లి -- 4, 5 పాయలు
మునగ ఆకులు --- 10
ఆవు పాలు --- ఒక కప్పు
నీళ్ళు --- ఒక పెద్ద గ్లాసు
వెల్లుల్లి పాయలను, మునగ ఆకులను కలిపి మెత్తగా దంచి పాలు, నీళ్ళు కలిపి ఉడికించాలి దీనిని ప్రతి రోజు రాత్రిపూట తాగుతూ వుంటే అధిక రక్తపోటు నివారించ బడుతుంది.
2. తాజా తులసి ఆకులు --- గుప్పెడు (50 gr )
వెల్లుల్లి పాయలు --- 3
రెండింటిని ముద్దగా నూరి చిన్న ఉండగా చేసి మింగాలి. ఈ విధంగా ప్రతిరోజు చేయాలి.
సూచనలు :-- ఎత్తుకు తగిన . బరువు వుండాలి. ఉప్పును నియంత్రిచుకోవాలి. మద్యపానం, ధూమపానాలను వదలాలి. కొవ్వు పదార్ధాలను వాడకూడదు
అధికరక్తపోటు --- మానసిక సమస్య
తెల్ల మద్ది చెక్క పొడి తో కషాయం కాచి ప్రతి రోజు తాగుతూ వుంటే కంట్రోల్ అవుతుంది.
తెల్ల మద్ది చెక్క పొడి
ఉసిరిక పొడి
కలకండ
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి భద్రపరచుకోవాలి.
ప్రతి రోజు అర టీ స్పూను పొడిని మంచి నీటితో సేవించాలి.
కారం, ఉప్పు తగ్గించి తినాలి.
రక్తపోటు తగ్గడానికి అర్జున పానీయం
తెల్ల మద్ది చెక్క పొడి --- 120 gr
తులసి ఆకుల పొడి --- 30 gr
ఉసిరి పెచ్చుల పొడి --- 30 gr
పుదీనా ఆకుల పొడి --- 30 gr
చిన్న యాలకుల పొడి --- 10 gr
శొంటి పొడి --- 10 gr
అతిమధురం పొడి --- 10 gr
అన్నింటిని బాగా కలిపి సీసాలో నిల్వ చేయాలి
ఒక గ్లాసు నీటిని స్టవ్ మీద పెట్టి మరిగేటపుడు ఒక స్పూను నిండుగా పొడి వేసి మరిగించాలి.
తరువాత దించి పాలు, కలకండ కలిపి తాగాలి. దీనిలో తాజా పుదీనా ఆకులను కూడా
వేసుకోవచ్చు. మధుమేహం వున్నవాళ్ళు తాటి బెల్లం కొద్దిగా కలుపుకుని తాగవచ్చు.
దీని వలన ఆకలి పెరుగుతుంది. రక్త ప్రసరణ క్రమబద్ధీకరించబడుతుంది
అధిక రక్తపోటు --- నివారణ
30 సంవత్సరాల వయసు దాటిన తరువాత కారణం లేని తలనొప్పి వున్నా, శరీరం లోని ఏ భాగం
నుండి అయినా రక్తస్రావం వంటి లక్షణాలు వున్నా దానిని రక్తపోటు గా అనుమానించవచ్చు
j
కారణాలు, లక్షణాలు :-- వంశపారంపర్య లక్షణాలు, జన్యు పరమైన లక్షణాలు, అధిక బరువు
వ్యాయామం చేయకపోవడం , మద్యం సేవించడం, రక్త ప్రసరణలో వేగం పెరగడం ( స్ట్రోక్) వంటి
కారణాల వలన రక్తపోటు వచ్చే అవకాశం కలదు .
Non Drug Moralities అనగా తమను తామే నియంత్రించుకోవడం వలన వ్యాధిని
నియంత్రించవచ్చు .
సర్పగంధాది చూర్ణం
జటామాంసి వేరు చూర్ణం --- 20 gr
గ్రందితగరం చూర్ణం --- 20 gr
పల్లేరు కాయల చూర్ణం --- 20 gr
సర్పగంధి వేరు చూర్ణం --- 20 gr
అన్ని చూర్ణాలను బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
దీనిలో "మోతాదు" చాలా ప్రధానమైనది .
ఒక గ్రాము ( స్పూను చివర) చూర్ణాన్ని అర కప్పు వెన్న తీసిన పాలతో గాని, లేదా నీటితో గాని
( ఉత్తమమైనది) లేదా చిటికెడు తేనెతో గాని లేదా నేతితో గాని తీసుకోవచ్చు.
మూలికల ఉపయోగాలు :--
జటామాంసి ఆందోళన ను తగ్గించి మంచి నిద్ర వచ్చేట్లు చేస్తుంది.
అధిక రక్తపోటు ---నివారణ
తెల్ల మద్ది చెక్క పొడి ---- 75 gr
కరక్కాయ పొడి ---- 25 gr
జాపత్రి పొడి ---- 25 gr
పల్లేరు కాయల పొడి ---- 25 gr
మందార పూల పొడి ---- 25 gr
తులసి ఆకుల పొడి ---- 25 gr
సునాముఖి పొడి ---- 25 gr
తులసి రసం ---- తగినంత
అన్ని చూర్ణాలను కలిపి కల్వంలో వేసి తగినంత తులసి రసం పోసి నూరి శనగ గింజలంత మాత్రలు
తయారు చేసి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి .
పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పూటలా వాడాలి రక్తపోటు ను నియంత్రించడానికి
రక్తపోటు నియంత్రణకు
మునగ గింజల చూర్ణాన్ని కషాయం కాచి ఉదయం , సాయంత్రం తాగుతూ వుంటే బి పీ కంట్రోల్ అవుతుంది
అధిక రక్తపోటు --- నివారణ
ఇది రాబోయే వ్యాధులకు మూలం .
రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను మెంతులను వేస్సి నానబెట్టాలి . ఉదయం పరగడుపున నీటిని మాత్రమె తాగాలి . ఈ విధంగా రోజులు చేస్తే B . P కంట్రోల్ అవుతుంది
B . P.
తులసి కాండాన్ని పూసలుగా తయారు చేసి రాగి తీగ తో చుట్టి మూడు చుట్లు మేడలో మాలగా ధరించాలి వేసుకోవాలి .
దీనితో B . P . ఎప్పటికి కంట్రోల్ లో వుంటుంది .
తులసి దళాలు
కొత్తిమీర
కరివేపాకు
పుదీనా
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి .
ప్రతిరోజు ఒక టీ స్పూను పొడిని అన్నంలో కలుపుకొని తినాలి .
తెల్లవారు జామున 4 గంటలకు నిద్ర లేవాలి . రాత్రి పడుకునే ముందు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దానిలో 3, 4 తులసి దళాలను వేసి చెక్క పీట మీద పెట్టాలి . నేల మీద పెట్టకూడదు . ఉదయం ఆ నీటిని తాగాలి .
ఉదయం స్నానానికి అరగంట , గంట ముందు శరీరాన్ని నేతితో గాని , ఆముదము తో గాని మర్దన చేయాలి .
దీనివలన శరీరం లోని వేడి తగ్గుతుంది .
సూర్యభేదన ప్రాణాయామం 12 సార్లు చేయాలి . మరియు శీతలీ ప్రాణాయామం చేయాలి . దీనితో కళ్ళు తిరగడం
తగ్గుతుంది .
మందముగా వున్న బట్టను నీటిలో ముంచి గట్టిగా పిండాలి . దానిని పొడవుగా మడవాలి . రోగిని బోర్లా పడుకోబెట్టి
ఆ తడి బట్టను ముచ్చెన గుంట నుండి వెన్నుపూస చివరివరకు పరచాలి దీనిని కశేరుక పట్టు అంటారు .దీనిని 15 నిమిషాలు ఉంచాలి . ఈ విధంగా రెండు పూటలా చేయాలి .
పాదాలను చల్లటి నీటిలో పెట్టుకుని కుర్చీలో కూర్చుంటే 10 నిమిమిషాలలో అధిక రక్తపోటు నియంత్రణ లోకి వస్తుంది .
ఉదయం , సాయంత్రం ఉల్లిపాయలను తింటూ ఉంటే అల్ప , అధిక రక్తపోటు లు నియంత్రణలోకి వస్తాయి .
సూచనలు :--- ఉప్పుకు బదులుగా సయింధవ లవణం వాడాలి .పచ్చి మిర్చి వాడకూడదు . మిరప్పొడికి బదులుగా
మిరియాల పొడి వాడాలి . మరీ పాత చింతపండును వాడడం మంచిది .టమాటాలు ఎక్కువగా వాడుకోవాలి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి