1. గ్రీన్ టీ:
జపాన్ ప్రజలు తమ రోజువారీ దినచర్య లో భాగంగా గ్రీన్ టీ తో ప్రారంభిస్తారు. ఈ గ్రీన్ టీ వారిని రోజంతా ఉత్సహముగా ఉంచటం తోడ్పడుతుంది.జపాన్ లో గ్రీన్ టీ తప్ప వేరే టీ ని అసలు త్రాగకపోవడం విశేషం.
2. నడక.
సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉన్న జపాన్ లో రవాణా వ్యవస్థ చాలా అభివృద్ధి చెందిన అక్కడి ప్రజలు ఎక్కువగా కాలి నడక కొనసాగిస్తారు. లేదా పబ్లిక్ రవాణా వ్యవస్థ ను వినియోగిస్తారు. దీని వల్ల రోజు వారీ వ్యాయమం తో పాటు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది మరియు మనీ పొదుపు అని భావిస్తున్నారు. దిని కారణంగా జపాన్ లో గుండె జబ్బులు, అధిక బీపీ, మధుమేహం వంటి వ్యాధులు తక్కువ.
3.ఆహారపు అలవాట్లు :
జపాన్ ప్రజల ఆయుష్షు ఎక్కువగా ఉండటంలో అక్కడి ఆహారపు అలవాట్లు ముఖ్య భూమిక పోషిస్తాయి.
అక్కడి ప్రజలు సముద్రంలో దొరికే శాకాహారం, మరియు మాంసాహారం ను ఎక్కువగా వినియోగిస్తారు. అక్కడి ప్రజలు కేలరీలు, షుగర్, కొవ్వు ఉన్న ఆహారం తక్కువ తీసుకుంటారు. అక్కడి ప్రజలు సూప్లు మరియు ఆవిరి పట్టిన ఆహర పదార్థాలు తింటారు. జపాన్ ప్రజలు బ్రెడ్ జంక్ ఫుడ్ ని అసలు తినరు
జపాన్ ప్రజలు కేవలం సముద్రంలో దొరికే చేపలు, రొయ్యలు, పితలు ఆకుపచ్చని కూరగాయలు ఎక్కువగా వినియోగిస్తారు.
4.వంట విధానం.
జపాన్ ప్రజలు ప్రై చేసిన ఆహర పదార్థాలు ఏమాత్రమూ తినరు అక్కడి ప్రజలు అవిరి తో వండిన ఆహారం తీసుకోవడం చేస్తారు. అక్కడి ప్రజలు పాలు,పాల ఉత్పత్తులు కూడా తక్కువ తింటారు. జపాన్ లో బియ్యం కొవ్వు రహిత రకాలు సాగు చేసి వాటినే తింటారు.
5.పరిశుభ్రత.
జపాన్ ప్రజలు తమ వ్యక్తిగత పరిశుభ్రత విషయం లో చాలా కఠినంగా ఉంటారు. చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా పరిశుభ్రంగా తమ పనులను తామే పూర్తి చేసుకుంటారు. జపాన్ పరిశుభ్రమైన దేశాలలో ఒకటి.
బెండకాయ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..
బెండకాయను ఫ్రై చేసిన కూరగా చేసిన పులుసుగా చేసిన ఏ కూరకు రాని రుచి వస్తుంది.అయితే కొంత మంది బెండకాయను జిగురుగా ఉంటుందని తినటం మానేస్తు ఉంటారు.ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకుంటే తప్పనిసరిగా బెండకాయను తింటారు.బెండకాయలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.శరీరానికి అవసరమైన ఎన్నో కీలకమైన పోషకాలు బెండకాయలో ఉన్నాయి.ఇప్పడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
రోగులకు సంజీవని అని చెప్పవచ్చు.బెండకాయలను తినడం వల్ల క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది.దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
బెండకాయలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన అలసట,నీరసం లేకుండా రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి.
బెండకాయలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండుట వలన కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం.
దాంతో బరువు తగ్గుతాం.బరువు తగ్గాలని అనుకొనే వారు బెండకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది.
బెండకాయలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు పోషకాహార లోపం లేకుండా చేస్తాయి.ఈ రోజుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల్లో పోషకాహార లోపం ఒకటి.
శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్ లను తగ్గించటంలో బెండకాయ కీలకమైన పాత్రను పోషిస్తుంది
మునగ చెట్టులోని అద్భుతమైన ఔషద గుణాలు తెలిస్తే వామ్మో అంటాం.
మునగాకు లో కేరెట్ కన్నా 4 రెట్లు అధికంగా
విటమిన్ ఎ, అరటి పండు కన్నా 3 రెట్లు ఎక్కువ
పొటాషియం, నారింజ కన్నా 7 రెట్లు అధికంగా
విటమిన్ సి,పాలలో కంటే 4 రెట్లు అధికంగా
కాల్షియం,గ్రుడ్డు తో సమంగా ప్రోటీన్లు, పాలకూర
కంటే 3 రెట్లు ఎక్కువగా ఐరన్ ఉంది.
గర్భధారణ సమయంలో మహిళలు 9 నెలల పాటు రెండు పూటలా 2-3 చెంచాల మునగాకు రసం కానీ చూర్ణాన్ని కానీ తీసుకుంటే డెలివరీ కి
సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు.
ఆస్తమా, బ్రాంకైటిస్, టిబి వంటి బాధలున్నవారు
రోజూ మునగాకు సూప్ తాగాలి.ఒక గ్లాసున్నర
నీటిలో గుప్పెడు మునగాకు వేసి కషాయం కాచి అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ రసం కలిపి తాగవచ్చు.
వయసుకు తగినట్లు ఎదగని పిల్లలకు నిత్యం ఒక
గ్లాసు పాలలో 5-6 చెంచాల మునగాకు రసం, రెండు స్పూన్ల తేనె కలిపి ఒక సంవత్సరం పాటు
ఇస్తే బలమైన ఎముకలు, పరిశుభ్రమైన రక్తం తో
వారి ఎదుగుదల బాగుంటుంది.
రోజుకొక వెల్లుల్లి రెబ్బ ఒక వారం రోజులపాటు తింటే
హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వెల్లుల్లి యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. పసుపు తర్వాత అంతటి విశిష్ట గుణాలున్న వెల్లుల్లిని క్రమం తప్పకుండా వారం రోజులు తీసుకోవడం వలన మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఈ వెల్లుల్లిని రోజువారీ వంట దినుసుగా వాడతాము. మనం రోజువారీ ఒక వెల్లుల్లి రెబ్బను వారం రోజుల పాటు తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడం మరియు ఇక మీదట రాకుండా చేయవచ్చు. ఇది గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా బ్లడ్ సర్కులేషన్ బాగా చేసే ప్రయత్నం చేస్తుంది. క్యాన్సర్ రిస్కుని తగ్గిస్తుంది మరియు క్యాన్సర్ ఉన్న వాళ్లకి క్యాన్సర్ కణాలను చంపేసే ప్రక్రియను ఈ వెల్లుల్లి చేస్తుంది.
క్యాన్సర్ లేకపోయినా ముందు ముందు క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఇది దోహదపడుతుంది. జలుబు చేసిన వాళ్ళు ఇది వాడటం వలన రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు ఇతర ఇన్ఫెక్షన్స్ ని నివారించి శరీరం యొక్క ఇమ్మ్యూనిటి ని పెంచడానికి సహకరిస్తుంది. షుగర్ ని కంట్రోల్ లో ఉంచడం లో ఈ వెల్లుల్లి ఎంతగానో సహకరిస్తుంది మరియు చేదు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. దీనివలన శరీర బరువు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.
ఈ వెల్లుల్లి రెబ్బని మనం ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం కొంచెం గా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం గా ఉండటం,గ్యాస్ట్రిక్ ట్రబుల్,కడుపులో మంటగా ఉండటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా కడుపులో ఏదైనా సమస్యలు ఉన్నవాళ్లు మరియు అల్సర్స్ ఉన్నవాళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడం మంచిది.
ముఖ్య గమనిక: ఈ ఆర్టికల్ లోని సమాచారం పూర్తిగా నాకు తెలిసిన వివరాలనుంచి సేకరించబడింది. మీ శరీర తత్వాన్ని బట్టి అవసరమైతే నిపుణులు మరియు డాక్టర్ల సలహాని తీసుకుని అనుసరించగలరని మనవి.
పోషకాల గని అయిన కాకరకాయ ఉపయోగాలు మీకు తెలుసా ...?
ఆసియా దేశాలలో ఎక్కువగా ఉపయోగించే కూరగాయల లో కాకరకాయ ముఖ్యమైన కూరగాయ.
ఇది ప్రతి ఇంటి పెరట్లో పెంచబడే తీగ వంటి మొక్క.
ఇది రుచి పరంగా చేదు గా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల లో ఒకటి
కాకరకాయ లో 100 గ్రాములకు 17 కేలరీలు శక్తి మాత్రమే లభిస్తుంది.
ఇందులో పైటో న్యూట్రియన్స్ అధికంగా కలిగి ఉంటుంది
పీచు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్లు అధిక శాతంలో కలిగి ఉంటుంది.
కాకరకాయ లో పాలి పెప్టెడ్ P అనే పైటో న్యూట్రియన్స్ కలిగి ఉంటుంది ఇది రక్తంలో చక్కెర వ్యాధి బారిన పడకుండా నియంత్రణ కోసం పనిచేస్తుంది.
తాజా తాజాగా ఉండే కాకరకాయ లో ఫోలేట్స్ ను అధికంగా కలిగి ఉంటుంది 100 గ్రాముల కాకరకాయ లో 72 మిల్లి గ్రాముల ఫోలేట్స్ ఉంటాయి కాబట్టి ఇవి గర్భిణీ స్త్రీలు చాలా మేలు చేస్తుంది పుట్టబోయే పిల్లల్లో న్యూరాన్యూరాల్ ట్యూబ్ లోపాలు తగ్గిస్తుంది.
కాకరకాయ లో విటమిన్ C అధికంగా ఉంటుంది కనుక ఇది సహజ సిద్ధమైన అంటి యాక్సిడెంట్ పని చేసి హానికరమైన ధాతువులను తొలగించుటలో కీలక పాత్ర పోషించిను.
కాకరకాయ లో విటమిన్ A ,బీటా కేరోటిన్, అల్పా కేరోటిన్ అధికంగా ఉంటుంది ఇవి క్యాన్సర్ నిరోధక శక్తిని పెంచుతాయి.
కాకరకాయ రసము జీర్ణ క్రియలో పెరిస్తాలిక చలనము ద్వారా సులువుగా జీర్ణము అయ్యే విధంగా పనిచేస్తుంది కావున అజీర్ణం, మలబద్దకం వంటివి దరి చెరువు.
కాకరకాయ లో నియాసిన్ ,B కాంప్లెక్స్ విటమిన్లు, జింక్, పొటాషియం, మాంగనిస్ లు అధికంగా కలిగి ఉంటుంది కనుక ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మీరు వృధ్యాప్యంలో కూడా యవ్వనంగా కనిపించాలి అనుకుంటున్నారా అయితే ఇదిగో చక్కటి చిట్కాలు
అరే మీరు ఈ వయస్సు లో కూడా చాలా యవ్వనంగా కనబడుతున్నారు ఎం తింటారు అని ఎప్పుడైనా ఎవరైనా ప్రశంసలు చేస్తే కలిగే ఆనందం అంత ఇంత కాదు
కానీ నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ఈ రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం, పెరుగుతున్న కాలుష్యం, రోజు రోజు కి పెరుగుతున్న రవాణా వ్యవస్థ లో మార్పులు, రోజు రోజు కి తగ్గుతున్న శారీరక శ్రమ, వ్యాయామం, పనిలో ఒత్తిడి వల్ల చిన్న వయసులోనే పెద్ద వారిలాగా వయస్సు తో సంబంధం లేకుండా పోయింది
కానీ ప్రకృతిలో మనకు ప్రసాదించిన ఎన్నో రకాల ఆహర పదార్థాలు మనల్ని ఈ సమస్య పరిష్కారానికి సంజీవనిలా పనిచేస్తాయి.
1.చెరుకు రసం
యవ్వనం కోసం కావాల్సిన ప్రకృతి సహజంగా లభించే పోషకాలు చెరుకు రసంతో విరివిగా లభిస్తాయి.
2.పెరుగు-తేనె
తేనెను పోషకాల గని అంటారు. ఇది ఒత్తిడి మాయం చేసి తక్షణ శక్తి పెరుగుతుంది మరియు మతిమరుపు ని మటుమాయం చేస్తుంది.పెరుగు శరీర ఉష్ణోగ్రతలు తగ్గించి జీర్ణక్రియ పక్రియ ను వేగవంతం చేస్తుంది.
3.ఎండిన ఫలాలు
ఎండిన ద్రాక్ష, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు, ఖార్జుర ఫలాలు విటమిన్ E ,ఐరన్, పొటాషియం, జింక్, ఒమేగా-3ప్యాటి ఆమ్లాలు కలిగి ఉంటాయి మరియు ఇందులో ఉండే ఆయిల్ ముఖకాంతి పెరిగి యవ్వనంగా కనపడేలా చేస్తుంది
4.పుచ్చకాయ
వేసవికాలంలో విరివిగా లభించే పళ్ళు లో పుచ్చకాయ ఒక్కటి. ఇందులో విటమిన్లు A, B, C లు లభ్యమవుతాయి. ఇవి శరీర బరువును మరియు ఉష్ణోగ్రతలు తగ్గించి యవ్వనంగా కనపడేలా చేస్తాయి
5.టమాట:
అధిక రోగ నిరోధక శక్తిగల కూరగాయల్లో టమాటా ఒక్కటి గా చెప్పవచ్చు. ఇది ఉదర, నోటి, పేగు కేన్సర్లను ,గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. టమాట 'ఎ, 'ఇ విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది.
6.వెల్లుల్లి
వెల్లులి వంటింట్లో దొరికే రోగ నిరోధక శక్తిని పెంచే దినుసులు లో ఒక్కటి.ఇది అధిక రక్తపోటు ను,చెడ్డ కొవ్వును తగ్గించి యవ్వనంగా కనపడేలా చేయుటకు ఉపయోగపడుతుంది.
7.పచ్చని ఆకుకూరలు
ప్రకృతి సహజంగా లభించే పోషకాలు అధికంగా ఉండే పచ్చని ఆకుకూరలను క్రమంగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి
8.రోజువారీ శారీరక వ్యాయామం
ప్రతి రోజు ఉదయం చిన్న పాటి వ్యాయామం చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మరియు యవ్వనంగా కూడా కనిపిస్తుంది
హాయిగా నిద్రపోవాలనుకుంటే ఎలాంటి పరుపును , తలగడలను వాడాలో ఓసారి చూద్దాం ....!
మన జీవితంలో అతిముఖ్యమైన వాటిల్లో ఒకటి నిద్ర నిద్రలేకపోతే మనిషి నీరసించిపోయి ఆరోగ్యం దెబ్బతిని మరణిస్తాడు . నిద్ర మనిషి శరీరానికి చాలా అవసరం అది శరీరాన్ని రీ జనరేట్ చేస్తుంది . శరీర అవయవాలకు విశ్రాంతి దొరికి అవి మరలా మంచిగా పనిచేయడానికి నిద్ర అవసరం . ఎంతమంచిగా మనం నిద్రపోతే అంత ఆరోగ్యంగా ఉంటాం . నిద్రకు దూరమైతే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లే .
అటువంటి మంచి నిద్రకోసం ఓ మంచి పరిశుభ్రమైన బెడ్రూమ్ అవసరం . చక్కటి వాతావరణంతో కూడిన చల్లని రూమ్ అవసరం .
అయితే వీటితోపాటు మంచి పరుపు , తలగడలు కూడా అవసరం ఎందుకంటే గచ్చుమీద పడుకుంటే సరిగా నిద్రపట్టదు కారణం గచ్చు గట్టిగా ఉండటం వలన ఓవైపు శరీరం పై బరువు ప్రెస్ అయి శరీరం ఫ్రీగా ఉండకపోవడం వలన నిద్ర సరిగా పట్టదు . అందుకే పరుపును యూస్ చేస్తారు . పరుపు యూస్ చేస్తే సరిపోదు అందులోకూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి .
పరుపు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి , పరుపు పాతబడితే కొత్త పరుపు మార్చుకోవాలి , అలాగే పరుపుపై ఓ కొద్ది రోజులు ఒక సైడే పడుకోవటం వలన ఆ పరుపు కిందకి ప్రెస్ అయి ముడుచుకు పోతుంది దీనివలన మన శరీరం కిందకి అనచబడి ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల పరుపును ఎప్పటికప్పుడు అటునుంచి ఇటూ ఇటునుంచి అటూ తిరగేస్తుండాలి .పరుపు పాతబడినప్పుడు అది ఎగుడూ దిగుడుగా తయారవుతుంది అప్పుడు పరుపును మార్చడం చాలామంచిది .
ఇక తలగడలు అసలు తలగడ ఎందుకు యూస్ చేస్తామంటే మన మెడ భాగం వద్ద తలకి మొండానికి మధ్య ఎముకలు ఒంపుగా ఉంటాయి . అందువల్ల మనం తలగడ లేకుండా పడుకుంటే కన్ఫర్ట్ గా ఉండదు .
ఎందుకంటే ఎముక వలన ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల తలగడ వాడటం చాలామంచిది .
తలగడ వాడకపోతే శ్వాసకూడా శరిగ్గా తీసుకోలేం అందువల్ల ఓ మంచి పరిశుభ్రమచన తలగడలను యూస్ చేయాలి మెత్తగా , స్పాంజిలాంటి తలగడలను ఉపయోగించాలి .గట్టిగా రాయిలాంటి తలగడలను యూస్ చేయకూడదు దీని వలన రక్తప్రసరణ సరిగా జరగక చాలా ఇబ్బందిగా ఉండి నిద్ర పట్టదు .
అందువలన మంచిగా నిద్రపోవాలనుకున్నట్లైతే ఓ మంచి తలగడ , పరుపు , బెడ్రూమ్ అవసరం .ఇవన్నీ మంచిగా ఉన్నట్లైతే మంచి నిద్ర మీ సొంతం .
బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే...... ఇవి అయినా తినాలట..... లేకపోతే ఎన్నో సమస్యలు?
అల్పాహారం తీసుకునేటప్పుడు రక్తంలో చక్కర ,ఇన్సులిన్ స్థాయిల లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి... ఇది దీర్ఘకాలం కొనసాగితే టైప్-2 డయాబెటిస్, అధికరక్తపోటు వంటి వాటి బారిన పడే అవకాశం ఉంది... ఇంట్లో సమయానికి తినకపోవడం వల్ల బయటి ఆహారం మీదకు మనసు లాగుతుంది.. అలా బయట తినే అలవాటు పడితే బరువు పెరిగే ప్రమాదం ఉంది...
ఇప్పుడైనా అల్పాహారం తినడం మానేసినప్పుడు ఎక్కువ నీళ్లు తాగడం క్యారెట్లో కీరదోస మొక్కలు తినడం లాంటివి అలవాటు చేసుకోవాలి... జీడిపప్పు, బాదం ,ఎండుద్రాక్ష ,ఖర్జూరాలు ఆఫీసులో ఉంచుకోవాలి... ఏమీ తినకుండా వచ్చిన రోజు వాటిని తింటే శక్తి లభిస్తుంది... లేదంటే ఆకలి వల్ల మెదడు పనితీరు సన్నగిల్లుతుంది... పని మీద ఏకాగ్రత ఉండదు... రోజు అంతా అలానే ఉంటుంది...
అలాగే అల్పాహారంలో ఆకుకూరలను ఆహారంలో తీసుకుంటే మంచిది.. జ్యూస్ల కు బదులుగా పండ్లను తీసుకోవాలి... వాటిని సలాడ్స్ రూపంలో తీసుకుంటే ఇంకా మంచిది.. ఆకలితో ఉండకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి... అంతేగాని ఒకేసారి ఎక్కువగా తినకూడదు...
మీ జుట్టు ఎప్పటికీ వత్తుగా నల్లగా ఉండాలి అని అనుకుంటున్నారా ..
గుంటగలగర ఆకులు మందార పూల ఆకులు కర్వేపాకులు బాగా ఎండబెట్టి వాటిని మెత్తగా పొడి చేయాలి ఆ మిశ్రమంలో కొద్దిగా ఉసిరి పొడిని కలుపుకుని ఆ మిశ్రమాన్ని పెరుగుతో బాగా కలిపి మీ జుట్టుకు అప్లై చేయండి ఒక అరగంట ఆగిన తర్వాత కడిగేయండి ఇలా చేస్తూ ఉంటే మీ జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
2.) పచ్చి కొబ్బరి తో మీ జుట్టు మరింత అందంగా మెత్తగా పొడవుగా పెరుగుతుంది.
పచ్చికొబ్బరిని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి ఈ మిశ్రమం నుండి కొబ్బరి పాలు తీయాలి ఈ పాలలో కొంచెం అలోవెరా జెల్ కొంచెం తేనె కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత మీ జుట్టును కడిగేయండి మీ జుట్టు ఎంతో షైన్ గా ఉంటుంది ఇలా చేస్తూ ఉంటే మీ జుట్టు మెత్తగా పెరుగుతుంది .
3.) మీ తలకు డై వేసుకుంటున్నప్పుడు కలర్ మీ చర్మానికి అంటుకుంటుందా అయితే ఇలా చేయండి!
మీ తలకు డై వేసుకునే ముందు మీ చెవులకు మెడకు నుదురుకు కొబ్బరి నూనెను అప్లై చేయండి తర్వాత డై వేసుకోండి మీ చర్మానికి అంటుకోకుండా ఉంటుంది ఎక్కడైనా అంటుకుంటే నిమ్మరసంతో ఆ మరకను తుడిచేయండి.
వరి అన్నం మంచిదా.... గోధుమ రోటీ మంచిదా....
మన దేశ ప్రజలందరికీ ప్రధాన ఆహారం వరి, గోధుమ. దక్షిణాది వారు ఎక్కువగా వరిపై ఆధారపడతారు. అదే ఉత్తరాధి వారు అయితే గోధుమలపై ఎక్కువగా ఆధారపడతారు. ఇప్పుడు దక్షిణాది వాళ్లు కూడా అన్నం బదులుగా రోటీని తింటున్నారు. వైద్యులు కూడా గోధుమ పిండి తో చేసిన రోటీలు తినడం మంచిదని సూచిస్తున్నారు. అన్నం తింటే బరువు పెరుగుతాము. అదే గోధుమ పిండితో చేసిన రొట్టెలు అయితే బరువు తగ్గుతారు అంటున్నారు. నాకు మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది అన్నంలో బలం ఉండదు, అన్నం తక్కువగా కూర ఎక్కువగా తీసుకోవాలి అని. ఇది ఎంత వరకు నిజం అంటారు.
అవునండి ఇది నిజమే అన్నం తింటే బరువు పెరుగుతాం. ఇది నేను చెబుతున్న మాట కాదు. పోషకాహార నిపుణులు చెబుతున్న మాట. వరి అన్నంలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే ఇందులో పీచు పదార్ధం చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణం చేతనే కార్బోహైడ్రేట్స్ రక్తంలో త్వరగా కలిసిపోతాయి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ శాతం పెరుగుతుంది. అందుకే బరువు పెరుగుతామని, ఈ కారణం వల్లే మధుమేహం ఉన్న వాళ్ళని అన్నం తక్కువగా తినమని చెబుతారు. అన్నంతో పోల్చుకుంటే గోధుమలలో నాలుగు రెట్లు ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే గోధుమ పిండిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా రక్తంలో గ్లూకోస్ శాతం పెరగకుండా ఇది సహకరిస్తుంది.
అన్నం తో పోల్చుకుంటే గోధుమ పిండి లో ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే గోధుమ పిండి లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నా సరే కూడా బరువు పెరగము. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తిన్న ఆహారం నిధానంగా జీర్ణమవుతూ, కార్బోహైడ్రేట్లు రక్తంలో ఒక్కసారిగా కలవకుండా ఉంటాయి. అందుకే బరువు పెరగడం జరగదు. అందుకే అన్నం బదులుగా గోధుమ పిండి తో చేసిన నూనె లేని రోటీలను ఎక్కువగా తీసుకోమంటారు. కానీ మన దక్షిణాది వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అన్నం తినకుండా ఉండలేరు. అలాంటి వాళ్లు తెల్ల అన్నానికి బదులుగా పొట్టు తీయని అంటే బ్రౌన్ రైస్ ఎక్కువగా తీసుకోండి. ఈ బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ తిన్నా కడుపు నిండిపోతుంది. మిగతా పోషకాల విషయాల్లో మాత్రం ఎలా ఉంటాయో బ్రౌన్ రైస్ లో కూడా అలాగే ఉంటాయి. బ్రౌన్ రైస్ కూడా తినలేము అనుకునేవాళ్ళు, అన్నం తక్కువగా తీసుకుని, తక్కువ నూనెతో చేసిన కూరలను ఎక్కువగా తీసుకోండి. ఈ కారణంగా త్వరగా బరువు తగ్గుతారు. అలాగే షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ అన్నం కంటే కూడా రోటీలు చాలా మంచివి. ఇష్టం ఉన్నా లేకపోయినా మన ఆరోగ్యం కోసం అన్నం బదులుగా ఒక పూట అయినా సరే రోటీలను తీసుకోవడానికి ప్రయత్నించండి.
ప్రతీ రోజూ ఒక అరటి పండు తినడం వలన కలిగే ఉపయోగాలు తెలుసుకోండి.
అరటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఇంకా దీనిలో విటమిన్ B6,విటమిన్ సి,మెగ్నీషియం ,పొటాషియంకాపర్ అధికంగా ఉంటాయి.దీనిలోని మాంగనీస్, ఫైబర్ ,పొటాషియం పోషకాల లోటుని భర్తీ చేస్తాయి.అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.రోజూ ఒక అరటి పండు తినడం వలన కండరాలు ధృఢపడతాయి
. అరటి పండులోని మెగ్నీషియం కండరాలు ధృఢ పడేలా చేస్తుంది.అరటి పండు తినడంవలన వ్యాయామం చేసేవారికి మంచి శక్తి లభిస్తుంది. ఎక్కువ సేపు వ్యాయామం చేయగలుగుతారు.డిప్రెషన్ ఆందోళన ,ఒత్తిడితో బాధపడేవారు అరటి పండు తినడం వలన సమస్య.తగ్గుతుంది.అరటి పండులో ఉంఓే విటమిన్ బి9మన శరీరంలో సెరటోనిన్ లెవెల్స్ను పెంచుతుంది.దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మూడ్ మారుతుంది.నిద్ర లేమి సమస్య తో బాధపడేవారు రోజూ ఒక అరటి పండు తినడం వలన చక్కని నిద్ర పడుతుంది.గ్యాస్ ఎసిడిటీ అజీర్తి సమస్యలతో బాధ పడేవారు అరటి పండును తినడం మంచిది. దీనిలోని ఫైబర్ అజీర్తి సమస్యలను నివారిస్తుంది. పొట్ట దగ్గర కొవ్వు తగ్గేలా హార్మోన్లను యాక్టివేట్ చేస్తుంది.పొట్టలోని మంచి బాక్టీరియాను వృద్ధి చేస్తుంది
.దీంతో జీర్ణాశయ సమస్యలు అదుపులో ఉంటాయి.అరటిలో కాల్షియం లేకపోయినా దీనిలోని పోషకాలు కాల్షియం తయారయ్యేందుకుఉపయోగపడతాయి .తద్వారా ఎముకలు ధృఢంగా మారతాయి. కాబట్టి ప్రతీరోజూ ఆహారంలో అరటి పండును తినండి.
చలికాలంలో చలి నుంచి తప్పించుకోవడానికి కొన్ని మార్గాలు.
నవంబర్ నెల వచ్చిందంటే చాలు మనలో చలి వణుకు మొదలవుతుంది. నాలుగు నెలలపాటు చలికాలం మనల్ని గజగజ వణికిస్తుంది. మన శరీరానికి చలికాలంలో వచ్చే ఇబ్బందులు మరేకాలంలోను రావు. చలి నుంచి తప్పించుకోవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిసారి ఫలించవు.చలితో పాటే అనేక వ్యాధులు కూడా వస్తాయి. ఈ చలి నుంచి, వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి మనకు చాలా మార్గాలున్నాయి.
* ఆహారం :
చలికాలంలో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సింది మన ఆహారం గురించి. ఉదయాన్నే వేడి వేడిగా ఉన్న కాఫీ లేదా టీ తాగడం వలన శరీరానికి ఎంతోకొంత వేడి లభించి చలి అనేది తగ్గుతుంది. ఇక ఆహారంలో ఎక్కువగా గుడ్లు, మిరియాలు, పాలకూర తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్లు, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి వేడిని ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల రక్తప్రసరణ సులువుగా జరుగుతుంది.
* వస్త్రధారణ :
చలికాలంలో అందరూ ఎలాంటి దుస్తులు వేసుకుంటారో మనకు తెలుసు. దీంట్లో కూడా జాగ్రత్తలు అవసరం. వెచ్చదనం కంటే ముందు మన చర్మానికి గాలి తగలడం అవసరం.కాబట్టి శరీరం నిండా దుస్తులు వేసుకోకూడదు.
కొంతమంది చెవులలో గాలి పోకుండా ఉండడానికి గట్టిగా వస్త్రంతో బిగించుకుంటారు. దీనివల్ల కర్ణభేరికి గాలి తగలక చెవి నొప్పి పెడుతుంది. కాబట్టి ఉన్ని దుస్తులు మన శరీరానికి తగు మోతాదులోనే ఉపయోగించుకోవాలి.
* వ్యాయామం :
అన్నింటికంటే ముఖ్యమైనది వ్యాయామం. ఏది లేకపోయినా కానీ ఒక్క వ్యాయామం ఉంటే చలికి దూరంగా ఉండొచ్చు. చాలామంది ఉదయం లేవగానే నిప్పుకుంపటిల చుట్టూ గంటల తరబడి కూర్చుంటారు. అలా చలి కాగితే నిప్పు దగ్గర ఉన్నంతసేపు మాత్రమే చలి ఉండదు. అదే వ్యాయామం చేస్తే నిప్పుతో అవసరమే ఉండదు.
వ్యాయామంలో ముఖ్యమైనది పరుగెత్తడం. వ్యాయామం చేయకపోయినా గాని ఒక పది నిముషాలు పరుగెత్తితే చలి అనేదే ఉండదు. చలి ఉంటుంది కానీ దానిని మన శరీరం తట్టుకుంటుంది. పరుగెత్తడంలో మొదట కష్టం అనిపిస్తుంది కానీ తర్వాత అలవాటై దానికి శరీరం కూడా సహకరిస్తుంది.
మన చలి సులువుగా పోవాలంటే ఆ చలిని తట్టుకునే శక్తి శరీరానికి అందించాలి. అది ఒక్క వ్యాయామం వల్ల మాత్రమే సాధ్యం.
వేడి నీటిని త్రాగటం వలన మనకు కలిగే అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందాం!
ఏదైనా ఉష్ణోగ్రత యొక్క నీటిని చొప్పించడం సాధారణ శ్రేయస్సుకు సహాయపడుతుంది, వెచ్చని నీరు త్రాగటం అనేది అదనపు ఆరోగ్య ప్రయోజనాలను అందించే భావన. ప్రజలు చాలా సంవత్సరాలుగా వేడి పానీయాలను కొట్టారు. జానపద వైద్య సాహిత్యం వెచ్చని నీరు ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందనే కథలతో నిండి ఉంది, అయినప్పటికీ పరిశోధకులు కేవలం వేడి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలకు లోనవుతారు.
వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఒక వ్యక్తి తగినంత నీరు త్రాగనప్పుడు, చిన్న గట్ భోజనం మరియు త్రాగటం ద్వారా తీసుకునే నీటిని ఎక్కువగా గ్రహిస్తుంది. ఇది నిర్జలీకరణానికి కారణమవుతుంది మరియు ప్రేగు కదలికను కలిగి ఉండటం చాలా కష్టతరం చేస్తుంది. దీర్ఘకాలిక నిర్జలీకరణం దీర్ఘకాలిక మలబద్దకానికి కారణమవుతుంది. ఈ మలబద్దకం ప్రేగు కదలికలను బాధాకరంగా చేస్తుంది మరియు అదనంగా ఇతర సమస్యలను ఉద్దేశించవచ్చు, ఇందులో హేమోరాయిడ్లు మరియు ఉబ్బరం ఉంటాయి. వెచ్చని నీరు త్రాగటం చల్లని లేదా వెచ్చని నీటిని తీసుకోవడం కంటే భోజనం త్వరగా నాశనం చేయడానికి సహాయపడుతుంది. ఇది సాధారణ ప్రేగు :కదలికలను ఉపయోగించడం ద్వారా మలబద్ధకం యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శరీర నిర్విషీకరణ: సహజ ఆరోగ్య న్యాయవాదులు వాదిస్తారు, వేడినీరు శరీర నిర్విషీకరణకు సహాయపడుతుంది. ఒక వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి నీరు తగినంత వేడిగా ఉన్నప్పుడు, అది చెమటను కలిగిస్తుంది. చెమట విషాన్ని బహిష్కరిస్తుంది మరియు రంధ్రాలను తేలికగా సహాయపడుతుంది.
మెరుగైన రక్త ప్రసరణ: వేడి నీరు వాసోడైలేటర్, అంటే ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది, ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది కండరాల కణజాలం విశ్రాంతి మరియు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎటువంటి అధ్యయనాలు వెచ్చని నీటిని ప్రసరణలో స్థిరమైన మెరుగుదలలతో వెంటనే అనుసంధానించనప్పటికీ, ప్రసరణలో శీఘ్ర మెరుగుదలలు కూడా కండరాల సమూహాలకు మరియు అవయవాలకు అధిక రక్త తేలియాడటానికి సహాయపడతాయి.
బరువు తగ్గడం: ఎక్కువ నీరు తీసుకోవడం ఒక వ్యక్తి బరువు తగ్గడానికి సహాయపడుతుందనే భావనకు పరిశోధన చాలాకాలంగా మద్దతు ఇచ్చింది. నీరు అదనంగా తినడం వల్ల సంపూర్ణత్వం యొక్క భావోద్వేగాలు పెరుగుతాయి. నీరు శరీరానికి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది మరియు ఇది వ్యర్థాలను బయటకు తీస్తుంది. 2003 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, చల్లటి నీటిని వేడి నీటిలోకి మార్చడం వల్ల బరువు తగ్గడం పెరుగుతుంది. భోజనం కంటే 500 మి.లీ నీరు త్రాగటం వల్ల జీవక్రియ 30 శాతం పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. నీటి ఉష్ణోగ్రతను 98.6 డిగ్రీలకు పెంచడం జీవక్రియలో 40 శాతం విస్తరణకు కారణమైంది. ఈ జీవక్రియ స్టెప్-అప్ నీటి వినియోగం తరువాత 30-40 నిమిషాలు కొనసాగింది.
తగ్గిన నొప్పి: వేడి నీరు ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది, ముఖ్యంగా గాయపడిన కండరాలకు. వేడి నీటి వినియోగాన్ని నొప్పి నివారణకు ఏ పరిశోధన కూడా ఒకేసారి అనుసంధానించలేదు. అయితే, మానవులు నొప్పిని తగ్గించడానికి మామూలుగా హీట్ ప్యాక్‌లు మరియు వెచ్చని నీటి బాటిళ్లను ఉపయోగిస్తారు. వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల కొంత అంతర్గత నొప్పి ఉపశమనం లభిస్తుంది, కాని వెచ్చదనం అదనంగా వాపును పెంచుతుందని గమనించడం చాలా అవసరం.
జలుబుతో పోరాడటం మరియు సైనస్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: సైనస్‌లకు ఉపయోగించే వేడి, జలుబు మరియు నాసికా అలెర్జీల ద్వారా ప్రేరేపించబడే ఒత్తిడిని తగ్గించగలదు. ఆవిరి అదనంగా సైనస్‌లను అన్‌లాగ్ చేయడానికి సహాయపడుతుంది.
పరగడుపున నీళ్లు తాగితే ఆరోగ్యమే మహాభాగ్యం!
చాలా మందికి ఉదయం లేవగానే నీళ్లు త్రాగాలంటే ఏదోలా ఉంటుంది.
శరీరాన్ని కష్టపెట్టకుండా ఉదయాన్నే నీళ్లు త్రాగలేమని ఇంకొంతమంది అంటుంటారు.
కానీ పరగడుపున నీళ్లు త్రాగితే అసాధారణమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎన్నో అనారోగ్య సమస్యల నివారిణిగా నీరు పని చేస్తుందని వైద్యశాస్త్రం కూడా ధృవీకరించింది.
నిద్ర లేవగానే ఒకటిన్నర లీటరు మంచి నీటిని త్రాగిన తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
నీరు త్రాగితే వచ్చే ప్రయోజనాలు:
1. పరగడుపున ఖాళీ కడుపుతో మంచి నీళ్ళు త్రాగటం వలన పెద్దప్రేగు శుభ్రపడి మరిన్ని పోషకాల్ని గ్రహిస్తుందట.
2. కొత్త రక్తాన్ని తయారుచేసి కండరాల కణాల వృద్ధిని పెంచుతుంది.
3. పొద్దున్నే కనీసం అరలీటరు నీటిని త్రాగితే 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచడమే కాకుండా శరీర బరువుని కూడా తగ్గిస్తుంది.
4. రక్త కణాల్ని శుద్ధి చేయడం వలన శరీరంలోని మలినాలు బయటకి పోతాయి. దీని వలన శరీర ఛాయ ప్రకాశిస్తుంది.
5. శ్వేత ధాతువుల్ని సమతుల్యం చేస్తుంది.
6. శ్వేత గ్రంథుల వలన రోజువారీ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా శరీర ద్రవ పదార్థాన్ని కోల్పోకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా పోరాడుతుంది.
నీటి వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మరి.
ఇంకెందు ఆలస్యం మంచి నీళ్ళని పరగడుపున పుష్టిగా తీసుకుని ఆరోగ్యంగా ఉంటారు కదూ!
పొన్నగంటి కూర... కలిగే లాభాలు..... ఏంటో తెలుసుకుందాం
కంటి సంరక్షణలో ఆకుకూరలు పాత్ర చాలా కీలకం. తోటకూర, పాలకూర,కొత్తిమీర, మెంతికూర ఇలా రక రకాలైన తినడం వలన కంటి సమస్యలు దూరమవుతాయి. ఈ యాప్ కుర్ర లో అతి ముఖ్యమైనదిపొన్నగంటి ఆకు కూర. మరి దీని లాభం ఏంటో, ఇందులో ఏ పోషకాలు ఉన్నాయో తెలుసుకుందాం.
పొన్నగంటి కూర శీతాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఎ,బి6, రైబోఫ్లెవిన్, పొటాషియం,ఇనుము,మెగ్నీషియం సమృద్ధిగా దొరుకుతాయి. గోధుమ పిండి, బియ్యం, ఓట్స్ లో కంటే 30 శాతం ఎక్కువగా ప్రొటీన్లు అందుతాయి,అమినో ఆమ్లాలు శరీరానికి లభిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకుకూరలను తరచూ తింటే మంచిది, ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకు లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి ఆస్తమా బ్రాంకైటిస్తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీనిలో లభించే కాల్షియం ఎముకల ఎదుగుదలకు, ఆస్టియోపొరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది.ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గౌట్, మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. ఒకసారి కూర చేశాక పదేపదే చేయడం సరికాదు ఒక్కోసారి వికారానికి దారితీసే ప్రమాదం ఉంది.
చక్కెర వ్యాధిగ్రస్తులకు కూర మంచి ఔషధంలా పనిచేస్తుంది,వారంలో ఒకసారైనా ఈ కూరని తీసుకోవడం మంచిది. రక్తంలోని సమస్యలు దూరం చేస్తుంది, రేచీకటి సమస్య తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.మతిమరుపు సమస్యను దూరం చేసే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.
పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు,సుగంధ ద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును, అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు కూరగాయలు ఇతర తృణ ధాన్యాలను ఆహారంగా తీసుకొని జీవించినట్లు అయితే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని ప్రకృతి వైద్యుల నమ్మకం. జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది పిండిపదార్ధాలు,మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో నీకు తెలుసా?
బీట్ రూట్ అంటే బాబాయ్ అనేవాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ ఇది మహిళలకు ఎంతో మేలు చేస్తుందని చెపుతున్నారు వైద్యులు. ఎలాగంటే. మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో ఇనుములోపం ఒకటి బీట్ రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ లోపాన్ని అధిగమించొచ్చు. ఒక కప్పు బీట్ రూట్ తురుములో 11 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది.
ప్రతిరోజు దీన్ని తీసుకోవడం వల్ల ఆరు శాతం అదనంగా పోషకాలు శరీరానికి అందుతాయి. ఇనుము హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. అవయవాలకు సరిపడినంతగా ఆక్సిజన్ అందించడంలో ఇనుము కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రక్తహీనతతో బాధపడేవారు ఒక ఇరవై రోజుల పాటు రెండు పూటలా బీట్ రూట్ తీసుకోవడానికి ప్రాధాన్యతను ఇచ్చి చూస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఎదిగే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు గ్రేవీ కూరలు, ఇతరత్రా స్నాక్స్ వడ్డించే ముందు వాటిమీద తురిమిన బీట్ రూట్ ని వేస్తే చాలు. పిల్లలు ఇష్ట పడతారు. ఆరోగ్యానికి మంచిది. అలాగే అప్పుడప్పుడు బీట్ రూట్ రసాన్ని చేసి తాగించాలి. అయితే అది రుచికరంగా ఉండేందుకు పుదీనా, అల్లం, నిమ్మరసం, ఉప్పు లాంటివి వేయాలి.
పెసలు.. ఇవి వెయిట్ లాస్ మరియు సన్ టాన్ ను తగ్గించడంతో పాటు అన్ని పోషకాలు సమ్మేళనం.
పెసలు మనిషికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలు. ఇది మన ఆహారంలో ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్, లంచ్ , స్నాక్స్ ఐటమ్స్ గా కూడా ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. మొలకెత్తిన పెసల తో కూడా ఎన్నో వంటకాలు చేసుకోవచ్చు. ఇవి సూర్యకిరణాల నుంచి వచ్చే వేడి నుంచి చర్మానికి కాపాడడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి.
ఇవి చర్మ సమస్యలను తగ్గించడానికి కి చమట కాయలు దద్దుర్లు ,కాలిన గాయాలు, సర్జరీ అయిన మచ్చలు ,చర్మం మీద ముడతలు నివారించడానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో దొరికే ఐరన్ మరి ఏ వెజిటబుల్ లో దొరకదు. తలనొప్పి, కండరాల నొప్పి ,హార్మోన్ ఇంబ్యాలెన్స్, డయాబెటిస్, అధిక బరువుని ,క్యాన్సర్ని, కొలెస్ట్రాల్ లేని దరిచేరనివ్వవు. ఇవిఎంతో రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి.
100 గ్రాముల పైసల్ లో 347 కేలరీస్, జీరో కొలెస్ట్రాల్, పొటాషియం 35%, కార్బోహైడ్రేట్స్ 21% ,ఫైబర్ 64% , ప్రోటీన్ 48% ,క్యాల్షియం 13% ,ఐరన్ 37%, విటమిన్ సి 8% ,a2% ,b6 20% ,మరెన్నో మినరల్స్ ఉంటాయి.
కనీసం వారానికి రెండు సార్లు పెసరపప్పు ను మీ ఆహారంలో తీసుకోండి .ఆరోగ్యంగా జీవించండి.
మీరు క్రమం తప్పకుండా 7 రోజులు లవంగాన్ని తింటుంటే మూడు ప్రయోజనాలు కలుగుతాయి !
హలో ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు, ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను ఈ సమయంలో మీరు ఒక లవంగాన్ని కేవలం 7 రోజులు మాత్రమే తినగలిగితే, మీ శరీరంలో మీకు చాలా ప్రయోజనాలు కనిపిస్తాయి, మీకు వ్యాసం గురించి పూర్తి సమాచారం కావాలి చదవండి .ఈ సమయంలో, ఒక్కొక్క లవంగాన్ని తినండి మీరు లవంగాన్ని 7 రోజులు మాత్రమే తింటే మీరు విందు చేసినప్పుడు, ఆ తర్వాత మీరు లవంగాన్ని తీసుకుంటే, అది మీ జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది మరియు మీరు ఉదయం లేచినప్పుడు, మీ కడుపు పూర్తిగా శుభ్రంగా ఉంటుంది.
సమాచారం కోసం, రోగనిరోధక బూస్టర్ మొత్తం ఎక్కువ కాలం దొరుకుతుందని మీకు తెలియజేయండి, దీని కారణంగా ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది మరియు ఈ కారణంగా, మీ చిన్న వ్యాధులు మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.
మీరు ప్రతిరోజూ ఒక లవంగాన్ని తినడం ప్రారంభిస్తే, మీ శరీరంలోని బలహీనత ముగుస్తుంది ఎందుకంటే మీ బలహీనతను అధిగమించడానికి సహాయపడే అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.
మీకు సమాచారం నచ్చితే, దయచేసి పోస్ట్‌ను లైక్ చేయండి మరియు షేర్ చేయండి…
శీతాకాలం లో వచ్చే చుండ్రు కు నివారణ కేశ సంరక్షణ
శీతాకాంలో జుట్టును మెయింటైన్ చేయడం ఒక సవాలు. ప్రధానంగా చుండ్రు ఎక్కువగా బాధిస్తుంది. అందుకు తలలో దురద , తల నుండి పొట్టు వంటిది రాలడం ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు శీతాకాలంలో మరింత అధికంగా ఉంటుంది. వాతావరణం మరీ వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా జుట్టుపై ప్రభావం చూపుతుంది
మరి ఈ సమస్యను అధిగమించాలంటే ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి.
తలకు మాయిశ్చరైజ్ :
చుండ్రుకు ప్రదాన కారణం తలలో తేమలేకపోవడం, పూర్తిగా పొడిగా ఉండటం. అది శీతాకాంలో మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, చుండ్రు వల్ల జుట్టు మరింత పాడవకుండా ఉండాలంటే తలకు తగినంత తేమను అందివ్వాలి. అందుకు తలలో జుట్టు మొదళ్ళకు పోషణను ఇచ్చే ఉత్పత్తులు, మాయిశ్చరైజర్లు వాడాలి. జుట్టును పొడిగా మార్చే ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
తలస్నానం చేయడానికి ముందు తలకు ఆయిల్ మసాజ్ :
తప్పనిసరి తలస్నానం చేయడానికి ముందు తలకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. వాటిలో ఒకటి చుండ్రు నివారణ. ఆయిల్ మసాజ్ వల్ల జుట్టును బలంగా ఉంచుతుంది, తగిన పోషణ అందిస్తుంది. అందుకు కొబ్బరి నూనె గొప్పగా సహాయపడుతుంది. ఈ నూనెను ఇతర నూనెలతో కలిపి వాడవచ్చు. మరియు కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేసి తలకు మర్ధన చేయడం వల్ల చుండ్రు నివారించవచ్చు. తలస్నానికి ఒక గంట ముందు దీన్ని తలకు రాసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.
షాంపు ఎక్కువ వాడకండి :
జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం జుట్టుకు షాంపు పెట్టి శుభ్రం చేసుకోవడం సహజం. అయితే ఎక్కువగా షాంపు చేయడం వల్ల జుట్టు మాయిశ్చరైజర్ ను కోల్పోతుంది. దాంతో సమస్య మరింత త్రీవం అవుతుంది. కావున షాంపు మితంగా వాడండి వారంలో రెండు మూడు సార్లు చాలు.
యాంటీ డాండ్రఫ్ షాంపులో ఎలాంటి పదార్థాలున్నాయో చూడండి:
తలలో చుండ్రు ఉందని తెలియగానే షాపుకు వెళ్ళి లేబుల్ చదవకుండానే యాంటీ డాండ్రఫ్ షాంపులు ఏవి పడితే అవి కొంటుంటాము. చుండ్రుకు ప్రభావంతంగా పనిచే యాంటీ డాండ్రఫ్ ను ఎంపిక చేసుకుని కొనాలి. ముఖ్యంగా జింక్, విటమిన్ బి, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, టీట్రీ ఆయిల్ ఉన్నవి ఎంపిక చేసుకోవాలి.
రెగ్యులర్ గా యాంటీ డాండ్రఫ్ షాంపు వాడాలి :
చుండ్రుతో పోరాడే ప్రభావంతమైన పదార్థాలతో తయారుచేసిన యాంటీ డాండ్రఫ్ షాంపును ఎంపిక చేసుకోవాలి. వీటిని కొన్ని నెలల పాటు వాడాలి. చుండ్రు పూర్తిగా తొలగిపోవాలంటే కనీసం ఒక నెల సమయం పడుతుంది. అంత వరకు మీరు ఓపికగా వేచి చూడాలి.
సూర్యకిరణాలు నుండి రక్షణ:
సూర్యకిరణాల నుండి జుట్టుకు రక్షణ కల్పించండి తలలో చుండ్రుకు. కారణం సూర్యరశ్మి. కూడా ఒక కారణం. సూర్యుని నుండి. వెలువడే యూవీ కి. రణాలు ఇటు చర్మం, అటు జుట్టుకు హాని కలిగిస్తాయి. కాబట్టి, బయట వెళ్ళేటప్పుడు జుట్టుకు రక్షణ కల్పించాలి. ఇంటి నుండి బయట వెళ్లేటప్పుడు తలకు క్యాప్ పెట్టుకోవాలి .
మీరు తినే ఆహారం :
చుండ్రు నివారణకు మీరు తీసుకునే ఆహారం కొద్ది మార్పులతో పూర్తిగా నివారించుకోవచ్చు.మీరు రోజూ తినే ఆహారంలో సరైన విటమిన్లు మరియు పోషకాలు ఉండేట్లు చూసుకోవడం వల్ల ఇవి చుండ్రుకు కారణమయ్యే ఇతర సమస్యలతో పాటు తలలో ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాను నివారిస్తాయి. తాజా కూరలు, పండ్లు, నట్స్ , ప్రోటీన్స్ ఫుడ్స్, ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. హై షుగర్ మరియు హై ఫ్యాట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి
పచ్చకర్పూరంతో వెన్నను తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే...
ఇటీవల కాలంలో చిన్నా పెద్ద వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దానికి కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాలు సరిగా లేకపోవడమే.... ఏ చిన్న సమస్య వచ్చినా మందులు వాడేసి ఉపశమనం పొందుతాము. కానీ అప్పటికి ఆ సమస్య తగ్గినా పూర్తిగా నయం కాదు. అయితే సహజంగా లభించే కొన్ని పదార్థాలతో మన కంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. మనం తక్కువ ఖర్చుతోనే మన కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
1. రెండు పలుకుల పచ్చకర్పూరం తీసుకుని కొంచెం మంచి గంధాన్ని కానీ వెన్నను కానీ కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే కంటికి సంబందించిన సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది. ఈ పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల కళ్ల మంటలు, కళ్లు ఎరుపెక్కడం, కళ్లలో నుండి నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. కంటిచూపు మందగించడం తగ్గుతుంది.
2. కరివేపాకులో ఉండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు రెండు కరివేపాకు రెమ్మల్ని తినడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
3. పొన్నగంటికూర కళ్లకు మేలు చేయడంలో దానికదే సాటి. తరచూ ఈ కూర తినడం వల్ల కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. పిల్లలకు కంటి సమస్యలు ఉంటే పొన్నగంటి ఆకు రసం ఓ కప్పు తీసుకోవాలి. దానిని నెయ్యితో కలిపి వేడి చేసి ఆ మిశ్రమాన్ని రోజకు ఓ స్పూన్ చొప్పున తాగిస్తున్నట్లయితేవారికి కంటి సమస్యలు దూరమవుతాయి.
4. అలాగే కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు, కంటి చూపుని పెంచేందుకు కొన్ని పోషకాహారాలను రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, నట్స్, చేపలు, గుడ్లు, క్యారెట్, టొమాటో వంటి వాటిని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.
జ్వరం కూడా రాని డెంగ్యూ ఉంది దాని గురించి మీకు తెలుసా? దాని లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.
హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బావున్నారా. ప్రస్తుతం జనాన్ని బయబ్రతులకు గురి చస్తున్నా వ్యాధి డెంగ్యూ దీనివల్ల ప్లేట్లట్స్ పడిపోతాయి అవి పడిపోవడం వల్ల ప్రాణాలకు హాని కలుగ వచ్చు.
డెంగ్యూ వచ్చినప్పుడు జ్వరం, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్ని అధ్యనాల ప్రకారం కొంత మందిలో జ్వరం లాంటి లక్షణాలు కనిపించవు కానీ ప్లేట్లెట్స్ పడిపోతాయి. దీనినే అఫ్రైబిల్ డెంగ్యూ అంటారు. ఇది చాలా ప్రమాదకరమయినది. డాక్టర్స్ కూడా దీన్ని టెస్ట్స్ చేయడం వల్ల మాత్రమే గుర్తించగలరు. ఎడిన్ ఈజిప్ట్టై అనే దోమ కుట్టటం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
ఈ వ్యాధి ఎక్కువగా అక్టోబర్, నవంబర్ నేలలో వస్తుంది. ఈ వ్యాధికి యటువంటీ టీకాలు లేవు.ఇంటి దగ్గర్లో నీరు నిల్వ ఉండాకుండా చూసుకోవడం, దోమ తెరలు ఉపయోగించడం, శరీరం మొత్తం కనిపించకుండా దుస్తులు వేసుకోవడం వల్ల ఈ వ్యాధి ని కొంత వరకు అరికట్టవచ్చు.
ఈ దోమ కుట్టిన వెఎంతనే వ్యాధి లక్షణాలు కనిపించవు. 4నుండి 7 రోజుల తరువాత కనిపిస్తాయి. అవి కూడా శరీరంపై దద్దుర్లు, అలసట గా ఉండటం, ఆకలి లేక పోవడం, ఎటువంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించండి. ఈ వ్యాధి ఎక్కువగా డయాబెటీస్ ఉన్నవాళ్ళకి, చిన్నపిల్లలకు, ముసలివాళ్లను వచ్చ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
రోజుకి 5లీటర్లు నీరు త్రాగితే కిడ్నీలు చెడిపోతాయా??
నీరు త్రాగేవారిని త్రాగలేనివారు ఇలా అని బెదిరిస్తూ ఉంటారు.అన్ని నీళ్ళు త్రాగటం వల్ల కిడ్నీలకు ఎక్కువ పని అయ్యి త్వరగా చెడిపోతాయి అని కూడా అంటారు.మనం త్రాగేనీరు ఒకేసారి 5 లీటర్లు త్రాగితే శరీరానికి చాలా ఇబ్బంది.రోజు మొత్తంలో ఉదయం నుండి సాయంత్రం వరకు కాబట్టి నష్టముండదు.
మనం ఒకేసారిగా ఒక లీటర్ నీరు త్రాగినపుడు ఆ లీటరు నీరు ప్రేగులద్వారా నెమ్మదిగా పీల్చుకొని రక్తంలో కలుస్తుంది.ప్రేగులనుండి రక్తం లివర్లోనికి వెళ్లి అక్కడినుండి గుండెకు చేరుతుంది.గుండే నుండి ఆ రక్తం అన్ని అవయవాలకు పంపబడుతూ ఉంటుంది.ఇలా ప్రతినిమిషం నిరంతరాయంగా ఈ పని జరుగుతూనే ఉంటుంది.గుండె నుండి కిడ్నీలలోనికి వెళ్లిన రక్తం వడకట్టబడుతూ వుంటుంది.ఈ వడపోత వలన అనవసరమైన సాల్ట్స్ ఇంకా ఇతర వ్యర్థపదార్థలు నీటితో కలిసి మూత్రం రూపంలో బయటకు పోతాయి.ప్రతినిమిషం 140-150 మి.లీ. రక్తం కిడ్నీలలోనికి వెళ్లడం,వడపోత కావడం జరుగుతూ వుంటుంది.ఈ లెక్కన మనం త్రాగిన నీరు రక్తంలో కలిసిపోయి దానితోపాటు కొద్దికొద్దిగా కిడ్నీలలోనికి వెళ్ళి ఫిల్టర్ అవుతూ ఉంటుందే.కాని ఒకేసారి ఆ నీటి భారమంతా కిడ్నీలపైన పడదు.రోజుకి 170-180 లీటర్ల రక్తాన్ని కిడ్నీలు వడపోస్తే 1లీటరు నుండి 2లీ.మూత్రం రూపంలో బయటకు వస్తుంది.
నీళ్ళవల్ల అసలు కిడ్నీలు చెడిపోవు అన్న విషయము ఇప్పుడు తెల్సుకుందాము.ఉదా||కు వాటర్ ఫిల్టర్ ను తీసుకుంటే అందులో రెండు క్యాండిల్స్ ఉంటాయి.ఆ క్యాండిల్స్ కుండే రంద్రాలే ఫిల్టర్లు.అలానే మనకు రెండు కిడ్నీలుంటే,ఒక్కొక్క కిడ్నీలో పది లక్షల ఫిల్టర్లు ఉన్నాయి.వాటర్ ఫిల్టరుకుండే రంద్రాలకు నీటిని క్రిందకు వదలడం వల్ల నష్టంగాని కష్టంగాని ఉండదు.నష్టము,కష్టము అంతా నలకలతోనే.బాగా నలకలు ఎక్కువగా ఉన్న మురికినీరు మనం పోస్తే ఆ రెండు ఫిల్టర్లు నెలా,రెండు నెలల్లోనే పూడుకు పోతాయి.అదే నలకలు బాగా తక్కువున్నా స్వేఛ్చమైననీరు,రోజు వాడకట్టుకొని పోస్తే,ఆ రెండు ఫిల్టర్లు 6,7 నెలలపాటు పనిచేస్తాయి.వాటర్ ఫిల్టర్లు పూడుకు పోయేది,చెడి పోయేది నలకలవల్లేగాని నీటివల్ల కాదుకదా!అదే విధముగా మనకిడ్నీలు ఎంత నీటిని వడకట్టినా వాటికీ శ్రమ ఉండదు.శ్రమఅంతా మనలోని నలకలు లాంటి చెత్తను వడకట్టడం వల్లే.ఎవరిలో చెత్త ఎక్కువగా ఉంటే వారికీ త్వరగా కిడ్నీలు చెడిపోతాయి.
శరీరం ఈ చెత్తను బయటకు పంపించి,తనను తాను శుభ్రంగా రక్షించుకోవడం కొరకు,ఈ చెత్తను నీటిలో పెట్టి కిడ్నీలగుండా వడపోసి మూత్రంగుండా వదిలేట్టు చేసుకుంటుంది.నీరు ఎక్కువగా త్రాగినవారికి ఈ చెత్త అంతా కరిగి,మూత్రం గుండా ఏ రోజు కారోజు బయటకు పోతుంది.మూత్రం వస్తే ఇబ్బంది అని,ఎవరైతే నీరు తక్కువ త్రాగుతారో వారికీ కిడ్నీలు,ఈ చెడును బయటకు పంపించడానికి వడకట్టి,మూత్రంగా పంపడానికి సరిగా నీరు లేదని,ఆ చెడును మళ్ళి వెనక్కి లాగేసుకుంటుంది.ఆ చెడు ఇంకో అరగంటకు మళ్ళి కిడ్నీలకు వస్తుంది.మనకు మూత్రం వద్దనుకునే వారికీ వెనక్కి వెళ్ళిపోతుంది.ఇలా ఎలాంటిదంటే,చేటలో బియ్యం పోసుకుని మనకు అక్కర్లేని వడ్ల గింజలను,మట్టి గెడ్డలను ఏరి మళ్ళీ చేటలోనే వేసుకోవడం లాంటిది.అందుకే ఈ మధ్య కిడ్నీ జబ్బులు బాగా పెరిగిపోయాయి.నీటిని ఒకేసారి లీటరున్నరపైనా త్రాగినా నష్టంలేదని ,ఆ నీరు రక్తాన్ని మరీ పలుచగా చేయడంగాని,రక్తంలోని ఉపయోగపడే లవణాలు అనవసరంగా బయటకు పోవడం గాని జరగదని,కిడ్నీలకు కొంచెం కూడా భారం కాదు. రోజుకి 5 లీటర్ల నీరు త్రాగడం అనేది శరీరాన్ని లోపల శుభ్రపరుచుకోవడానికి సహకరించడం అని తెలుసుకోండి.
మన శరీరానికి విటమిన్ E ఎంతో అవసరం.ఈ విటమిన్ మన శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.ఈ విటమిన్ లోపం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.విటమిన్ E శరీరంలో బలమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి జీవక్రియ సరిగా జరిగేలా చేస్తుంది.అంతేకాక ఎనిమిది రకాల వ్యర్ధాలను బయటకు పంపటంలో కీలక పాత్రను పోషిస్తుంది.ఇది కణాల చర్మాన్ని రక్షించటం ద్వారా చర్మం, గుండె, రక్తప్రసరణ, నరాలు, కండరాలు, ఎర్రరక్తకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అలాగే చర్మ ఆరోగ్యంలో కూడా కీలకంగా ఉంటుంది.
విటమిన్ E రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది.అనేక చర్మ సమస్యలను సమర్ధవంతంగా పరిష్కారం చేయటం వలన అనేక చర్మ రక్షణ క్రీమ్స్ లో వాడుతున్నారు.విటమిన్ E కణాలు త్వరగా చనిపోకుండా చేస్తుంది.రోగనిరోధక శక్తిని బలపరచి క్యాన్సర్ కారకాలు పెరగకుండా చూడటమే కాకుండా క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది.
కళ్ళ మంటలు,కాటారాక్ట్, అల్జీమర్ వ్యాధి, ఆస్తమా వంటివాటికి విటమిన్ E సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.మధుమేహం ఉన్నవారికి విటమిన్ E చాలా బాగా సహాయపడుతుంది.రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
విటమిన్ E పచ్చని ఆకు కూరలు, బ్రక్కోలి, తోటకూర, పాలకూర, పండ్లులో మామిడిపండు, కమలాపండు వంటి వాటిలో చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ ఆహారాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది.విటమిన్ E కాప్సిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.కానీ విటమిన్ E ని సహజసిద్ధంగా తీసుకుంటేనే మంచిది
కాఫీ టీలు ఉదయాన్నే నిద్ర మత్తు వదిలించటమే కాదు, మెదడు కూడా ఉత్తేజాన్ని ఇస్తాయి. ఈ రెండింటిలోనూ కెఫీన్ అనే ఉత్తేజ కారకం ఉంది. తక్కువ పరిమాణంలో కెఫిన్ ను వాడడం వల్ల ఏకాగ్రత సావధానత పెరుగుతుంది. దృష్టి నిలుస్తుంది. దానివల్ల జ్ఞాపకాలు ఏర్పడడం తేలికగా జరుగుతుంది. రోజుకు రెండు నుంచి ఐదు కప్పుల కాఫీ మధ్య వయస్సు వారు తాగుతూ ఉంటే
వారిలో 66 శాతం వరకు జ్ఞాపకశక్తి తగ్గుదల దూరమైందని జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్ లో ప్రకటించారు. అలాగే వృద్ధుల్లో రోజుకి రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగేవారిలో తాగని వారిలో కంటే మెదడు పనితీరు జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉన్నట్లు మరి కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
ఆకలి వేసినప్పుడు ఏదో ఒకదానితో కడుపు నింపుకొని తరువాత అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం కూడా ఇష్టానికి ఏదో ఒకటి ప్రయత్నిస్తున్నారు. వాటితో రకరకాల ఇతర సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. దీనికి అసలు కారణం, పెరిగిపోతున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్ లో మనిషికి ఆరోగ్యసమస్యలు కూడా అంతకంటే ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అధికబరువుతో చిన్నా, పెద్దా అందరూ అనేక రకాల ఇబ్బందుల పాలవుతున్నారు. అంతేకాదు ఊబకాయం వల్ల గుండె వ్యాధులు కూడా ఎక్కువ అవుతున్నాయి.
ఈ అధికబరువు సమస్య నివారణ కోసం డైట్ చేయడం, చెమట బయటకి వచ్చేలా పరుగులు తీయడం లాంటి పనులు చేస్తూ అలసిపోతున్నారు. ఇంతలా కష్టపడి ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ఉండేందుకు జీలకర్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతీరోజు ఒక చెమ్చాడు జీలకర్రను సేవించడం ద్వారా మూడింతలు త్వరగా ఫ్యాట్ కరుగుతుంది.
జీలకర్ర తినడం వలన శరీరంలోని క్యాలరీలు బర్న్ అవడమే కాకుండా జీర్ణశక్తిని మరింతగా పెంపొందుతుంది. జీలకర్రతో ఫ్యాట్ తగ్గించే విధానం ఎలాగో చూడండి రాత్రిళ్లు రెండు చెమ్చాల జీలకర్రను నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వేడిచేసి తేలిన జీలకర్రను తొలగించాలి.
ఆ నీటిలో ఒక స్పూను నిమ్మరసం కలుపుకొని పరగడుపునే ఖాళీ కడుపుతో తాగాలి. రెండు వారాలు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే జీలకర్రతో పాటు అల్లం, నిమ్మ రసాన్ని కలిపి తీసుకోవచ్చు. తద్వారా మరింత త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది.
అల్లాన్ని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తరువాత కేరెట్‌తో పాటు ఇతర కూరగాయలు ఉడికించుకోవాలి. దీనిలో జీలకర్ర పొడి, నిమ్మరసం, అల్లం ముక్కలు వేసుకుని సూప్ తయారు చేసుకోవాలి. ప్రతీరోజూ రాత్రి దీనిని సేవించడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు.
ఇలా 20 రోజులు మీరు ఎంచుకునే పద్దతిని క్రమం తప్పకుండా పాటిస్తే తప్పకుండా బరువు ఆరోగ్యంగా తగ్గవచ్చు.
వృద్దాప్యం అనేది మనజీవితంలోని అత్యంత చేదు నిజం . జుట్టు తెల్లగా మారడంతో పాటు మీ ముఖంపై ముడుతలు మరియు వయసు పెరుగుతున్నట్లు లేదా మీ వయసు పెరిగినట్లు సూచించే అనేక సంకేతాలు కనబడతాయి .
వయసు పెరిగి ముఖంపై ముడుతలు , జుట్టు తెల్లగా మారడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేరు కానీ ఇది అనివార్యం అందుకే మీరు మీ వయసుకంటే 10 సంవత్సరాలు తక్కువగా కనిపించేందుకు ఈ చిట్కాలను పాటించండి ... మీరు కూడా హీరోల మాదిరిగా తయారుకండి .... అందరికంటే యవ్వనంగా కనిపించండి . ఆనందంగా జీవించండి .
మీరు యవ్వనంగా కనిపించేందుకు ఈ చిట్కాలను పాటించండి ....
1) రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ ..
వృద్దాప్యంతో పోరాడే విషయంలో దినచర్యను రూపొందించుకుని , దానిని అనుసరించడం చేయాలి . అంతేకాదు దానికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం . మంచి ఫేస్ వాష్ తో రోజుకు రెండుసార్లు ముఖాన్ని కడగండి . ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది . మీ ముఖంపై ఉన్న గీతలను తగ్గిస్తుంది . మీ చర్మం ప్రకారం
మంచి ఫేస్ వాష్ ను ఎంచుకోండి .
2) సన్ స్క్రీన్ ను వాడండి ....
అధికంగా సూర్యరశ్మి రావడం వల్ల పరిపక్వ చర్మం , వృద్దాప్యం , మచ్చలు మరియు చర్మ క్యాన్సర్ వంటి సమస్యలకు దారి తీస్తుంది . వృద్దాప్య ప్రక్రియ సూర్యరశ్మి కారణంగా మొదలవుతుంది . ఎందుకంటే అవి కొల్లాదన్ ను విఛ్చిన్నం చేస్తాయి . అలాగే కొత్తకణాలు పెరగకుండా నిరోధిస్తాయి . దీన్ని నివారించడానికి సులభమైన మార్గం
సన్ స్క్రీన్ కనీసం spf 20 లేదా అంతకంటే ఎక్కువ సన్ స్క్రీన్ ను వాడండి .
3) బట్టలపై శ్రధ్ధవహించండి ...
వదులుగా ఉండే బట్టలు ధరించడం మానుకోండి . అలాగే మీకు సరిపోని బట్టలను అస్సలు ధరించవద్దు . మీ వ్యక్తిత్వాన్ని పెంచే షర్ట్స్ ను కొనండి . మీరు ఎక్కువ బరువు ఉంటే మీ బట్టలు ముఖ్యపాత్ర పోషిస్తాయి . మీరు మీ కొవ్వును వదులుగా ఉన్న బట్టలతో దాచి పెట్టాలనుకుంటే అది మీరు చేసే పెద్ద తప్పవుతుంది . ఇది మిమ్మల్ని ఓల్డ్ గా కనిపించేలా చేస్తుంది . అందుకే అందంగా మరియు స్మార్ట్ గా కనిపించేందుకు బిగువైన బట్టలు ధరించడం చాలా ముఖ్యం .
చెక్కెరను తగ్గించండి ...
ఎక్కువ చెక్కెరను తినడం వలన చర్మంపై ముడుతలు రావడం మొదలవుతుంది . సోడా , మిఠాయి, డజెర్ట్స్ ముఖ్యంగా చెక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి . వీటితో పాటు రసాలు , ప్రోటీన్ ,బార్లు ధాన్యాలు మొదలైన వాటితో తయారు చేసిన వాటిలో చెక్కెర శాతం అధికంగా ఉంటుంది . మీరు యవ్వనంగా కనిపించేందుకు ఇలాంటివి తగ్గించుకోండి .
5) చర్మ సంరక్షణ ....
మీ చర్మ సంరక్షణ కోసం ఎలాంటి క్రీమ్ లను ఉపయోగించద్దు , మీ చర్మాన్ని శుభ్రపరచడం , ఎక్స్ ఫోలియేటింగ్ , హైడ్రేటింగ్ మరియు చర్మసంరక్షణకు సంభందించిన దినచర్యను అనుసరించండి . పురుషుల చర్మం మహిళల చర్మం కంటే భిన్నంగా ఉంటుంది . కాబట్టి మీరు మీ చర్మ సమస్యలను అర్థం చేసుకోవాలి .మహిళల చర్మ సంరక్షణ ఉత్పత్తులను అస్సలు ఉపయోగించవద్దు . మీ ముఖం నుండి తేమ చెక్కు చెదరకుండా ఉండటానికి గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి .
6 ) నిద్ర , వ్యాయామం , ఆహారం ....
నిద్ర , వ్యాయామం ,ఆహారం ఈ మూడు విషయాలు మీ చర్మం మరియు ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి . సరైన సమయానికి నిద్రపోకపోవడం లేక నిద్ర లేకపోవడం , వ్యాయామం లేకపోవడం మరియు తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మీ ముఖంలో వృధ్ధాప్య ఛాయలు చాలా వేగంగా వచ్చేస్తాయి . అందుకే మనం తినే ఆహారం మరియు తాగే ప్రతీదీ మనశరీరంలో కనిపిస్తుంది తప్పుడు జీవనశైలి మీ ఆరోగ్యానికి నష్టకయమని రుజువు చేస్తుంది . మధ్యం సేవించడం మరియు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జిడ్డుగల ఆహారం తినడం వలన మీరు త్వరగా వృధ్ధాప్యం పొందవచ్చు . అందుకే వీలైనంత మేరకు వీటిని తగ్గించండి .
సీతాఫలంలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా? అయితే చదవండి మరి. సీతాఫలంలోని ధాతువులు హృదయాన్ని బలపరుస్తాయి. హృద్రోగ సమస్యలను దూరం చేస్తాయి. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులను ఇది నయం చేస్తుంది. టీబీని దరిచేరనివ్వదు. టీబీని ఆరంభదశలోనే సీతాఫలం అరికడుతుంది. సీతాఫల రసం తాగితే.. వేసవి ఏర్పడే దాహార్తి తగ్గుతుంది.
ఇంకా శరీరానికి చలువ చేస్తుంది. వేవిళ్ళను నియంత్రిస్తుంది. శస్త్రచికిత్సకు అనంతరం సీతాఫలాన్ని తీసుకుంటే.. కుట్లు త్వరగా మానిపోవడం.. అనంతరం త్వరలో కోలుకోవడం జరుగుతుంది. కాసింత మెంతుల్ని తీసుకుని నానబెట్టి, సీతాఫలంతో చేర్చి తీసుకుంటే.. పేగు సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. సీతాఫలం కిడ్నీ సంబంధిత రోగాలను నయం చేస్తుంది.
శరీరంలో రక్తాన్ని సీతాఫలం శుద్ధి చేస్తుంది. ఇందులోని గ్లూకోజ్ వుండటంతో శరీరాన్ని అలసిపోనివ్వదు. ఉష్ణ సంబంధిత రోగాలను ఇది దరిచేరనివ్వదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Comments