17, జులై 2020, శుక్రవారం

మొలలు సమస్య పరిష్కారం మార్గం ఆయుర్వేదం లో


పైల్స్/మొలలు-వ్యాధి నివారణ అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

పైల్స్/మొలలు
**********
తెలుగులో వీటిని మొలలు అని అంటారు. కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారికి తరచుగా వచ్చే సమస్య పైల్స్‌. అందుకు కారణం సరియైనా ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటితోనే ఈ సమస్య ఏర్పడుతుంది.

పైల్స్ రావటానికి ముఖ్యంగా నీరు తక్కువగా త్రాగడం, మద్యం అతిగా సేవించుటం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు అతిగా తినడం, మాంసాహరం తరుచుగా తినటం వాటి వల్ల వస్తాయి.

ఇక పైల్స్ వచిన వారిలో ఉండే లక్షణాలు

మల విసర్జన సాఫీగా జరుగదు. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మంట వుంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. విరోచనం కాకపోవడం వీరికి బాధ కలిగిస్తుంది. సుఖ విరోచనం కాకపోవడంతో చిరాకుగా కోపంగా ఉంటారు. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.మనుషులు చురుకుగా ఉండలేరు. ఎక్కడికంటే అక్కడికి ప్రయాణాలు చేయలేరు.

పైల్స్/మొలలు నివారణకు చిట్కాలు (Telugu tips for piles)

దానిమ్మ: హెమరాయిడ్స్ కు మరో చక్కటి హోరెమడీ ఎర్రని పండ్ల తొక్క బాగా సహాయపడుతుంది. కొన్ని నీళ్ళలో దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించి, వడగట్టి రోజుకు ఒకటి రెండు సార్లు తాగుతుండాలి.

అల్లం -నిమ్మరసం జ్యూస్: పైల్స్ కు డీహైడ్రేషన్ కూడా ఒక ప్రధానకారణం. అందువల్ల అల్లం, నిమ్మరసం, తేనె కలిపిన జ్యూస్ ను ప్రతి రోజూ రెండు సార్లు తాగాలి.

ముల్లంగి రసం : పైల్స్ కు ఒక గ్లాసు ముల్లంగి రసం చాలా అద్భుతంగా చేస్తుంది. ముందుగా 1/4కప్పుతో ప్రారంభించి, రోజు రోజుకూ అరకప్పు రసంను పెంచుకుంటూ పోవాలి

పచ్చి ఉల్లిపాయ: పైల్స్, మలంలో రక్తం పడటం వంటి సమస్యలను నివారించడానికి పచ్చి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల రక్తం పడటాన్ని తగ్గించి అనల్ పెయిన్ ను తగ్గిస్తుంది. ఫిగ్(అంజీర పండు): అంజీర పండు రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే మలబద్ధకం పోయి పైల్స్ వ్యాధి నయమైపోతుంది. ఆ నీటిని సగభాగం ఉదయం, సగభాగం సాయంత్రం తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

వ్యాయామం: మలబద్దకం నివారించడానికి మరియు శరరంలో క్రమంగా రక్త ప్రసరణ జరగడానికి రెగ్యులర్ వ్యాయామం బాగా సహాయపడుతుంది. అతిగా వ్యాయామం చేయడం లేదా ఎక్కువ బరువులను మోయడం వల్ల కూడా హెమరాయిడ్స్ అధికంగా కావచ్చు. కాబట్టి సాధారణ వ్యాయమం మరియు వాకింగ్ వంటివి అలవాటు చేసుకోండి.

పసుపు: పసుపుల అనేక వైద్య లక్షణాలు కలిగి ఉంది. మీరు సహజంగా పైల్స్ ను నివారించాలనుకుంటే పసుపుకొమ్మ లేదా పసుపును నీటిలో వేసి ఆ నీటిని బాగా తాగాలి.

అరటి పండు అరటి పండు: అరటిపండు తింటే మలబద్ధకం నివారిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా ప్రతి భోజనం తర్వాత అరటిపండు తినండి.

సోయా బీన్స్ సోయా బీన్స్: బఠాణీ జాతి అయిన బీన్స్, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా వుండే కాయ ధాన్యాలు పైల్స్ రోగులకు మంచివి. ఇవి తేలికగా జీర్ణమై పేగులు శుభ్రపడేలా చేస్తాయి.

టాయిలెట్ పొజిషన్: టాయిలెట్ పొజిషన్ సరిగ్గా ఉండాలి. కూర్చొనే విధానం కరెక్ట్ గా ఉన్నప్పుడు. ఇబ్బంది పడనవసరం లేదు. టాయిలెట్ స్టెప్ మీద కరెక్ట్ గా కాలు(పాదాలు)పెట్టి కూర్చొని ముందుగా వంగడం వల్ల రెక్టమ్ మీద ప్రెజర్ తగ్గుతుంది.

పైల్స్ తగ్గేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు (Home remedies for piles)

పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4నుండి 5లీటర్లు).

ప్రతిరోజు వ్యాయామం చేయాలి. రోజూ మల విసర్జన సాఫీగా జరుగునట్లుగా చూసుకోవాలి.

మద్యం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు, మాంసాహరం, చిరుతిళ్లు మానేయాలి. మానసిక ఒత్తిడి నివారణకు బాగా వివ్రాంతి తీసుకోవడం, నిత్యం యోగా, మెడిటేషన్‌ చేయాలి.

డాక్టర్ ను సంప్రధించి సరైన చికిత్సని తీసుకోవల్సి ఉంటుంది. అంతే కాకుండా కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా సహజ పద్దతుల్లో పైల్స్ ను నివారించుకోవచ్చు.

ఉదాహరణకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణం అయ్యి, పాసేజ్ ను సులభతరం చేస్తుంది. అందుకు ఫైబర్ అధికంగా ఉండే లెగ్యూమ్, అరటి, సిట్రస్ మరియు ఫింగ్ వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా పైల్స్ ను నివారించవచ్చు.
ఆర్షమొలలు
*****
1. అర్శోహర చూర్ణముతో మొలల(molalu) వ్యాధి నివారణ:

తోక మిరియాలు – 20 గ్రాములు
యాలకులు – 4
మెత్తటి పొడిని తయారుచేసి, కొద్దిగా తీసుకొని రెండు పూటలా చన్నీటితో సేవింపవలెను.
గుణము:
మూల వ్యాధి ( పైల్స్) నశించును.
2. మిరియాలుతో మొలల వ్యాధి నివారణ:
మిరియాలు – 10 గ్రాములు
శొంఠి – 20 గ్రాములు
చిత్రమూలము – 80 గ్రాములు
అడవికంద -16 గ్రాములు
తీసుకొని, విడివిడిగా చూర్ణములను తయారుచేసుకొని,
పాతబెల్లము 500 గ్రాములు పాకము బట్టి, అందు పైన తెలిపిన చూర్ణములన్నింటినీ వేసి, బాగుగా కలిపి, కొంచెం నెయ్యి కూడా చేర్చి, లేహ్యముగా తయారు చేసి, ప్రతి దినమూ 2 పూటలా ఉసిరికాయంత తినా

కామెంట్‌లు లేవు: